Intinti Gruhalakshmi: వ్యాపారంలో ఎదగడం కోసం విడాకులు తీసుకున్న తన భార్యని ఒప్పించి ఫ్రెండ్ ని మోసం చేస్తున్న ఓ భర్త, విధి లేని పరిస్థితుల్లో ఆ భర్తకి సాయపడుతున్న భార్య కథ ఈ ఇంటింటి గృహలక్ష్మి. ఈవారం ఈ సీరియల్ లో ఏం జరిగిందో చూద్దాం

మీరే మీ అభిప్రాయాన్ని చెప్పొచ్చు కదా అని పెళ్ళికూతురు అంటే నా తల్లి అభిప్రాయం నాకు ఇష్టం అంటాడు విక్రమ్. ఏదో ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తుంది పెళ్లికూతురు. వాసుదేవ్ తులసిని తెగ పొగుడుతూ ఉంటాడు. లాస్యని చూసి గుర్తుపట్టి ఇతను ఎక్కడ ఎందుకు ఉంది అంటూ లాస్య అని చేదరించుకుంటాడు ఇంట్లో ఉంచినందుకు తులసి అమాయకత్వాన్ని మందలిస్తాడు.

మరోవైపు పెద్దల దగ్గరికి వచ్చిన పెళ్లికూతురు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తుంది. అందుకు ఆ పెద్దలు ఈ పెద్దలు మందలిస్తారు. అయితే విక్రమ్ వాళ్ళ తాతయ్య పెళ్ళికొడుకు లేని స్వేచ్ఛ ఆమెకి ఉంది ఎందుకు ఆమెని నిర్బంధిస్తారు అంటూ కోప్పడతాడు. ఆమెకి అంత ధైర్యాన్ని ఇచ్చింది విక్రమ్ అని తెలుసుకొని షాక్ అవుతారు రాజ్యలక్ష్మి,బసవయ్య.

చదువు లేని నన్ను చేసుకోవటానికి ఎవరో ఇష్టపడరు అందుకని ముందు తమ్ముడు సంగతి చూడండి తర్వాత నా సంగతి చూద్దాం అంటాడు విక్రమ్. మరోవైపు దివ్య ఫోన్ చేసి కలుద్దాం అనటంతో ఆమెని కలవటానికి రెస్టారెంట్ కి దేవుడిని తోడుగా తీసుకొని వెళ్తాడు విక్రమ్. మరోవైపు ఇంట్లో ప్రతి విషయంలోనే కలుగజేసుకుంటున్న లాస్యని కసురుకుంటూ ఉంటాడు వాసుదేవ్.

బిజినెస్ డీలింగ్ కోసం ఊరుకోవలసి వస్తుంది అంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది లాస్య. మరోవైపు రెస్టారెంట్లో విక్రమ్, దివ్యలు కలిసి మాట్లాడుకుంటారు. అన్ని విషయాలు నచ్చితే చదువు పెద్ద ప్రాబ్లం కాదన్న దివ్య అభిప్రాయాన్ని తెలుసుకొని ఆనందపడతాడు విక్రమ్. మరోవైపు భార్యకి సారీ చెప్పడానికి ఆమెతో ఏకాంతంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు నందు.

కానీ రాములమ్మ మధ్యలో దూరిపోతూ నందుని ఒక ఆట ఆడుకుంటుంది. అతని ఇరిటేషన్ చూసి నవ్వుకుంటారు రాములమ్మ, తులసి. మరోవైపు కోమటి కుటుంబాన్ని చూసి సంతోషిస్తుంది వాసుదేవ్ భార్య ఇదంతా నా చెల్లెలు తులసి చలవ అంటూ తులసిని బాగా పొగుడుతాడు వాసుదేవ్. యుఎస్ నుంచి తులసిని పగడటానికి మాత్రమే వచ్చినట్లు ఉన్నాడు అంటూ కుళ్ళుకుంటుంది లాస్య.

మరోవైపు ఏదో మాట్లాడుతున్న లాస్యని అన్నిట్లోని ఎదుర్కోవద్దు అతిధి లాగా ఉండు, కాస్త అప్పుడప్పుడు పనులు కూడా చేస్తూ ఉండు తిన్నది అరగాలి కదా అంటూ ఛీదరించుకుంటాడు వాసుదేవ్. మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ మాత్రం మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వాలి కదా అంటూ లాస్యని వెనకేసుకొస్తుంది తులసి. హాస్పిటల్ నుంచి వచ్చిన దివ్యని వాసుదేవ్ దంపతులకు పరిచయం చేస్తుంది తులసి.

భార్యాభర్తల్లో గా నటిస్తున్నారని ముందు ఆమెకి తెలియదు. అందుకే తల్లి పడ్డ కష్టాల గురించి చెప్తుంది దివ్య. ఏమైంది, తనకి ఏం కష్టం వచ్చింది అంటాడు వాసుదేవ్. దివ్య ఏదో చెప్పేలోపు లాస్య ఆమెని బలవంతంగా ఫ్రెష్ అవుదువు గానివి రా అంటూ తీసుకు వెళ్లిపోతుంది. అది చూసినా వాసుదేవ్ తను మరీ ఎక్కువ చొరవ చూపించి అన్ని విషయాల్లోనే దూరిపోతుంది కంట్రోల్ లో పెట్టు అంటాడు వాసుదేవ్.

అంత బాధపడుతున్న భార్యని నువ్వు ఓదార్చాలి కదా అంటూ నందికి చివాట్లు పెడతాడు. మరోవైపు నీ కొడుకు చేజారి పోతున్నాడు అంటూ రాజ్యలక్ష్మి రెచ్చగొడతాడు బసవయ్య. వాడు అలాంటివాడు కాదు. నేనంటే వాడికి ప్రాణం నిప్పుల్లో దూకమన్నా దూకుతాడు అంటుంది రాజ్యలక్ష్మి. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ ని భోజనం చేయమంటే నాకు ఆకలి లేదు నువ్వు చేసే అని చెప్పి తన గదిలోకి వెళ్లిపోతాడు.

నీ మాట అసలు వినలేదు చూడు, ఇప్పటికైనా మేలుకొని విక్రమ్ విషయంలో జాగ్రత్త పడు అంటూ మరి కొంచెం రెచ్చగొడతాడు బసవయ్య. మా ఇద్దరినీ విడదీసే శక్తి ఏదో మా మధ్యకి వచ్చింది డేంజరబెల్స్ వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు పూజలు వ్రతాలు అని చెప్పి మాయ చేసి గుప్పెట్లో పెట్టుకున్నాను మళ్ళీ అదే పనిని ప్రారంభించాలి అంటూ విక్రం మీద ఒకన్నేసి ఉంచమని బసవయ్యకి చెప్తుంది రాజ్యలక్ష్మి.

మరోవైపు లాస్య ఆంటీ మాట విని నువ్వు నటించడమేంటి అంటూ తల్లిని మందలిస్తుంది దివ్య. నేను లాస్య ఆంటీ కోసం నటించడం లేదు మీ నాన్న కోసమే నటిస్తున్నాను అంటుంది తులసి. మీ ఇద్దరినీ అలా చూస్తే చాలా ఆనందంగా ఉంది జీవితాంతం మీరు ఇలాగే ఉండాలి నా కోరిక తీరుస్తావా అంటుంది దివ్య. మరోవైపు విక్రం, దివ్య మధ్య చాటింగ్ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది.

భోజనాలు అయినా తర్వాత వాసుదేవ్ తులసి వంటలని మెచ్చుకుంటాడు. తన భోజనం కోసమే ప్రత్యేకించి యూఎస్ నుంచి వచ్చాను అంటూ తెగ సంతోష పడిపోతాడు. మీరు వెళ్లి పడుకోండి మేము కాసేపాగి పడుకుంటాము అనటంతో తులసి గదిలోకి తులసి, లాస్య వెనుక నందు వెళ్తుంటే, అనుమానం వచ్చిన వాసుదేవ్ నీ భార్య ఎవరు అని నిలదీస్తాడు. అతనికి అనుమానం రాకూడదని ఇష్టం లేకపోయినా తులసి గదిలో నందు పడుకుంటాడు.

తులసి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. నా ప్రయోజనం కోసం తులసిని ఇబ్బంది పెడుతున్నాను నిజం చెప్పేయాలి అనుకుంటాడు నందు. వాళ్ళిద్దరూ ఒక గదిలో పడుకోడానికి లాస్య. మరుసటి రోజు పొద్దున్నే నందు వాళ్ల తలుపుతట్టి నన్ను మోసం చేశావు అంటూ ఏదేదో మాట్లాడుతాడు నిజం తెలిసిపోయింది అని కంగారు పడతాడు నందు. చాలాసేపు హడావుడి చేసిన తర్వాత ఈరోజు మీ వెడ్డింగ్ అనివర్సరీ పండు బొకే ప్రెసెంట్ చేస్తాడు.

నేనంటే సోషల్ మీడియాలో చూసి చెప్పాను మీ అందరికీ ఏమైంది అంటూ ఫ్యామిలీ మెంబర్స్ ని మందలిస్తాడు వాసుదేవ్. నిజం తెలుసు కాబట్టి ఇంట్లో వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వరు. సాయంత్రం సర్ ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశాను అంటాడు నందు. వాసుదేవ్ దంపతులునందు దంపతులకు బట్టలు పెడతారు అప్పుడే అక్కడికి దీపక్ వస్తాడు.

దంపతుల్లాగా నటిస్తున్న అక్క బావని చూసి షాక్ అవుతాడు ఒంటరిగా ఉన్నప్పుడు తులసిని అడిగి అసలు విషయం తెలుసుకుంటాడు. నువ్వు బావకి సపోర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అంటాడు దీపక్. నేను ఆయన మీద ఇష్టంతో చేయటం లేదు ఆయన కర్మ కాలి నా పిల్లలకి తండ్రి అయ్యాడు అంటుంది తులసి. మరోవైపు దివ్యతో పరిచయం పెంచుకోవడం కోసం దేవుణ్ణి కావాలనే కిందకి తోసేసి అతన్ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తాడు విక్రమ్.

ఒక పని వాడి కోసం తపన పడుతున్న విక్రమ్ ని మరింత మెచ్చుకుంటుంది దివ్య. మరోవైపు రూల్స్ తప్పి దేవుని దర్శించుకోబోతున్న రాజ్యలక్ష్మి బసవయ్యని గొడవపడి క్యూలో నిలబడే లాగా చేస్తుంది తులసి. టైం వచ్చినప్పుడు ఆమె హెల్తు చూస్తాను అనుకుంటూ లైన్లో నిలబడుతుంది రాజ్యలక్ష్మి. మరోవైపు తులసి నందు భార్యాభర్తలుగా తిరుగుతుంటే చూడలేకపోతోంది లాస్య.

రెండు రోజులకే అలా అయిపోతున్నారు మరి ఆవిడ భర్తని మీరు శాశ్వతంగా లాక్కున్నారు ఆవిడెంత బాధపడాలి అంటూ లాస్యకి చివాట్లు పెడుతుంది రాములమ్మ. భార్యతోపాటు గుడికి వెళ్లలేనందుకు నందుని మందలిస్తాడు వాసుదేవ్ తనకి విడాకులు ఇచ్చేయ్ అంటూ కేకలు వేస్తాడు. మరోవైపు హాస్పిటల్ లో జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తుంది దివ్య.

నువ్వు ఎంప్లాయి వి మాత్రమే నీకు అడిగే హక్కు లేదు అంటాడు సంజయ్. ఈ విషయాన్ని ఎండి దృష్టికి తీసుకు వెళ్తాను అంటుంది దివ్య. మరోవైపు ఉపవాసంతో దేవుడికి పూజ చేస్తున్నట్లుగా నటిస్తుంది రాజ్యలక్ష్మి. ఎందుకు ఈ పూజలు అంటే నా కొడుకు మనసు మార్చుకొని నా మాట వినేలాగా చేయమని అంటుంది రాజ్యలక్ష్మి.

Intinti Gruhalakshmi సీరియల్ ని టాప్ రేటింగ్ లో కూర్చో పెడుతున్న ప్రేక్షకులు..

రాజ్యలక్ష్మి నాటకమాడుతుందని తెలియక, ఆమె బాధని చూడలేక మనసులో దివ్య ఉన్నప్పటికీ నువ్వు చెప్పిన అమ్మాయిని చేసుకుంటాను అంటూ తల్లికి మాటిస్తాడు విక్రమ్. మరి విక్రమ్,దివ్య ప్రేమ ఫలిస్తుందా? నందు దంపతులు వాసుదేవ్ కి నిజం చెప్పేస్తారా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మార్చి 19, 2023 at 8:45 ఉద.