Janaki Kalaganaledu April 10 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అంతకంటే అదృష్టమా.. ఈ కళ్యాణం వాళ్ళ జీవితంలో కూడా మంచినే తీసుకురావాలని ఆశ అంటుంది జ్ఞానాంబ. రేపు ఎట్టి పరిస్థితుల్లోని పీటల మీద కూర్చోవాలి అని రామా కి చెప్తారు సర్పంచ్ గారు. నేను మాట ఇస్తున్నాను జ్ఞానాంబ. రేపు నేను ఎస్ఐ గారితో కలిపి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి అత్తయ్య గారికి చెప్తే ఫీలవుతారేమో అనుకుంటుంది జానకి.

ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో జానకి..

మనకి ఉన్న చిన్నచిన్న మనస్పర్ధలు ఈ నాలుగు గోడలు మధ్యలోనే వదిలేసి అందరం కలిసి రాములవారి కల్యాణానికి వెళ్దాము అంటుంది జ్ఞానాంబ. మరోవైపు గదిలో మూడిగా కూర్చుంటుంది జానకి ఆ విషయం గమనించని రామ రాముల వారి కళ్యాణం గురించి మాట్లాడుతూ ఉంటాడు. భార్య మొహం అదోలా ఉండడం గమనించి ఏమైంది అని అడుగుతాడు.

రేపు మర్డర్ కేస్ విషయంగా బయటికి వెళ్ళాలి అంటుంది జానకి. ఎల్లుండి వెళ్లొచ్చు కదా అంటాడు రామ. ఈ కేసులో ప్రతిక్షణం విలువైనది నేను నిర్లక్ష్యం వహిస్తే మొదటికే మోసం వస్తుంది అంటుంది జానకి. ఎస్సై గారిని వెళ్ళమనుండి అంటాడు రామ. హత్యకి ప్రత్యక్ష సాక్షిని నేను వెళ్లకపోతే బాగోదు అంటుంది జానకి. ఒకసారి బయటికి వెళ్ళటం అంటూ జరిగితే రావడం మీ చేతుల్లో ఉండదు అంటాడు రామ.

భార్య కోసం రిస్క్ చేస్తానంటున్న రామ..

కానీ అనుకున్న సమయానికి నేను కచ్చితంగా వస్తాను అంటుంది జానకి. అమ్మ ఒప్పుకోదు తనకి నచ్చిన చెప్పటం నావల్ల కాదు ఏమాత్రం పొరపాటు జరిగినా అందరి ముందు తలవంచుకోవాల్సి వస్తుంది అంటాడు రామ. అలాంటి పరిస్థితి రాకుండా నేను చూసుకుంటాను. చెప్పిన మాట ప్రకారం వెళ్లకపోతే ఎస్ఐ గారి దగ్గర నాకు విలువ ఉండదు అంటూ చేతులు జోడించి బ్రతిమాలు ఉంటుంది జానకి.

ఏమాత్రం తేడా జరిగిన సరే జీవితాంతం మా అమ్మ నన్ను నమ్మదు అయినా సరే మీ కోసం ఒక అవకాశం తీసుకుంటాను. నాకు అమ్మ కావాలి మీరు కావాలి అంటాడు రామ. రాముని కళ్యాణం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు దంపతులు. పానకం నాకు గ్లాస్ తో సరిపోదు అంటూ నవ్వుతాడు గోవిందరాజులు. మీకు పానకం అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు అంటుంది జ్ఞానాంబ.

అత్తగారి దగ్గర నేను మేనేజ్ చేస్తానంటున్న జెస్సి..

అటుగా వెళ్తున్న జెస్సీ ని పిలిచి జానకిని రమ్మనమని చెప్తుంది జ్ఞానంబ. జానకిని పిలవడానికి వెళ్లిన జెస్సి తో తను లేదు స్టేషన్ కి వెళ్ళింది అని చెప్తాడు రామ. అదే విషయాన్ని అత్తయ్యతో చెప్తే కోపంతో మండిపడతారు సౌభాగ్య వ్రతం రోజు జరిగింది గుర్తులేదా అంటుంది జెస్సి. స్నానం చేస్తుందని చెప్పి నేను మేనేజ్ చేస్తాను అంటుంది జెస్సి.

ఈ మాటలు వింటున్న మల్లిక మొత్తం నేను వినేశాక ఇంకా నువ్వు మేనేజ్ చేసేది ఏంటి ఇప్పుడు నేను చూసుకుంటాను అని అత్తగారి దగ్గరికి వెళ్లి ఆవిడ చుట్టూనే తిరుగుతుంది. అలా ఊరికే తిరిగే బదులు వచ్చి పూలమాల కట్టొచ్చు కదా అంటాడు గోవిందరాజులు. అలా మాటల్లో జానకి మిమ్మల్ని మామూలుగా ఏడిపించడం లేదు అంటుంది మల్లిక. ఏమైంది అంటుంది జ్ఞానాంబ.

అసలు విషయం అత్తగారికి చెప్పి షాకిచ్చిన మల్లిక..

జానకి ఇంట్లో లేదు అని చెప్తుంది మల్లిక. ఒక్కసారిగా షాక్ అవుతారు జ్ఞానాంబ దంపతులు. సరిగ్గా చూడు ఇంట్లోనే ఉంటుంది అసలే కళ్యాణం చేయించవలసింది వాళ్లే అంటుంది జ్ఞానంబ. తను పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది ఏదో పని ఉందంట కావాలంటే మీరే ఎంక్వయిరీ చేసుకోండి అంటుంది మల్లిక. ఇప్పుడే వెళ్లి రామాని అడుగుతాను.

నువ్వు చెప్పింది నిజమైతే అప్పుడు చెప్తాను నీ పని అంటూ రామా దగ్గరికి వెళ్తారు జ్ఞానాంబ దంపతులు. లోపల జరగబోయే దాన్ని తలుచుకొని ఆనందంతో గంతులు వేస్తుంది మల్లిక. మరోవైపు రాశి ఫలాల్లో ఆడదానివల్ల జీవితం సంకనాకిపోతుందని రాశాడు అప్పటినుంచి టెన్షన్ పట్టుకుంది అనుకుంటాడు ఎస్సై. ఇంటికి వెళ్తే ఇంకా పెళ్ళాంతో ప్రశాంతత లేదు పోలీస్ స్టేషన్లో జానకితో ప్రశాంతత లేదు అనుకుంటాడు.

Janaki Kalaganaledu April 10 Today Episode ఆడవాళ్ళకి పట్టు విడుపులు ఉండవంటున్న ఎస్ఐ..

అదే సమయానికి ఎస్పి ఫోన్ చేయటంతో జానకి అక్కడికి వెళ్ళిపోయిందేమో అనుకొని ఏదేదో మాట్లాడుతాడు ఎస్ఐ. జానకి ఎవరు నా దగ్గరికి ఎందుకు వస్తుంది ఈమధ్య నీకు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది అంటూ చివాట్లు పెడతాడు ఎస్పీ. అంతలోనే జానకి వచ్చి ఇంట్లో పూజ ఉంది త్వరగా వెళ్లాలి అని చెప్తుంది. పూజ ఉంచుకొని డ్యూటీకి రావడం ఏంటి రామా కి కాల్ చేసి ఇవ్వు నేను మాట్లాడుతాను అంటాడు ఎస్ఐ.

మాట్లాడవలసింది రామా గారితో కాదు ఎస్పీ గారితో అంటుంది జానకి. ఈ ఆడవాళ్ళకి పట్టు విడుపులు ఉండవు అంటే తిట్టుకుంటాడు ఎస్సై. నేను ఎస్పీ గారికి కాల్ చేస్తాను అంటూ బయటికి వెళ్తాడు ఎస్సై. ఇంట్లో పూజ పెట్టుకొని ఎందుకు స్టేషన్ కు వచ్చావు మొన్న జరిగిన గొడవ మర్చిపోయావా అంటూ మరో లేడీ కానిస్టేబుల్ వచ్చి చెప్తుంది. అలా అని డ్యూటీని నిర్లక్ష్యం చేయలేము కదా అంటుంది జానకి.

మరోవైపు జానకి ఎక్కడ అని కొడుకుని అడుగుతుంది జ్ఞానాంబ. చిన్న పని ఉంది స్టేషన్ కి వెళ్తాను అంటే నేనే వెళ్ళమన్నాను అంటాడు రామ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 10, 2023 at 2:11 సా.