Janaki Kalaganaledu December 26 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో చరణ్ ఫోన్ చేసి అఖిల్ కి ఉద్యోగం వచ్చిందని చెప్తాడు. వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుందని తొందర్లోనే అగ్రిమెంట్ అవుతుందని చెప్తాడు చరణ్. ఆ మాటలకి ఆనందంతో ఎగిరి గంతేస్తాడు అఖిల్. అదే విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్తాడు అఖిల్. ఎక్కడ వచ్చింది అని తల్లి అడిగితే కొత్త కంపెనీ అమ్మ శాలరీ పాతికవేలు అని చెప్తాడు.
ఇంట్లో అందరికీ శుభవార్త చెప్పిన అఖిల్..
మంచి ఉద్యోగమేనా అని అడుగుతాడు విష్ణు. మంచిదే అన్నయ్య అంటాడు అఖిల్. పోనీలేరా నేను అన్నయ్య సరిగ్గా చదువుకోలేకపోయాను నువ్వేనా మంచి స్థాయికి వెళ్ళాలి అంటూ ఆనందంగా చెప్తాడు విష్ణు. అంతలోని అక్కడికి వచ్చిన జానకితో అఖిల్ కి ఉద్యోగం ఇచ్చింది అని చెప్తాడు గోవిందరాజులు. జానకి అఖిల్ కి కంగ్రాట్స్ చెప్పి ఏం జాబు అని అడుగుతుంది. ప్రాజెక్ట్ మేనేజర్ అని అఖిల్ చెప్తే నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా ఎలా ఇచ్చారు అంటుంది.
వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది వదిన అయినా టాలెంట్ ఉంటే ఎక్స్పీరియన్స్ తో ఏం పని అంటాడు అఖిల్. వీడికి ఉద్యోగం ఇచ్చిన ఆ తలకు మాసినోడు ఎవడో అనుకుంటుంది మల్లిక. అంతలోనే అక్కడికి వచ్చిన రామకి సంతోషంగా విషయాన్ని చెప్తాడు అఖిల్. మంచి ఉద్యోగమేనా అంటే అవునన్నయ్య మంచిదే నువ్వు కార్డు ఇచ్చావు కదా ఆ కంపెనీ లోనే అంటాడు అఖిల్. పోనీలేరా ఆనందంతో గుండె అంత నిండిపోయింది అంటాడు రామ.
ఆనందంతో పండగ చేసుకుంటున్న అఖిల్ కుటుంబ సభ్యులు..
అఖిల్ కి ఉద్యోగం వస్తే దేవుడికి కొబ్బరికాయ్ కొడతానని మొక్కుకున్నాను, వెళ్లి మొక్కు తీర్చుకోవాలి అంటుంది జ్ఞానంబ. ఒరేయ్ రాముడు నా ఫ్రెండు సుబ్బారావుకి ఫోన్ చేసావ్ రా మొన్న ఇంకా అఖిల్ ఉద్యోగం రాలేదు అని వెటకారంగా మాట్లాడాడు, ఇప్పుడు వాడి కొడుకు కంటే నా కొడుక్కి జీతం ఎక్కువ అంటూ అతనికి ఫోన్ చేసి విషయాన్ని గొప్పగా చెప్తాడు గోవిందరాజులు. ఇప్పుడు సంతోషంగా ఉందా నాన్న అని రామ అంటే ఏనుగు ఎక్కినంత సంతోషంగా ఉంది అంటాడు గోవిందరాజులు.
ఈ సంతోష సమయంలో అఖిల్ నోరు తీపి చేయాలి అంటూ చికితని స్వీట్స్ తీసుకు రమ్మంటుంది జ్ఞానంబ. ఆనందంగా ఒకరికి ఒకరు స్వీట్స్ తినిపించుకుంటారు. గదిలోకి వచ్చిన రామ తన భార్యతో చూశారా అఖిల్కి ఉద్యోగం వచ్చినందుకు ఇంట్లో అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు అంటాడు. ఈ ఉద్యోగం వచ్చినందుకు నాకు కూడా ఆనందంగానే ఉంది కానీ ఇందులో మీ ప్రమేయం ఏమీ లేదు కదా అంటుంది జానకి. అదేంటి అలా అడిగారు అంటాడు రామ.
అసలు విషయం చెప్పి జానకి కి షాక్ ఇచ్చిన రామ..
ఆబ్దికానికి ఎందుకు రాలేదు మీరు ఏదో దాస్తున్నారు, మీరు మనిషి ఎక్కడ ఉన్నా మనసు మాత్రం ఎక్కడో ఉంది. అమ్మ నాన్న ఆబ్దికం విషయం చెప్తే వినకపోగా ఏదో విషయం చెప్పాలి అన్నారు. మీరు అక్కడికి ఎందుకు రాలేదు ఆ ముఖ్యమైన విషయం ఏంటి అని అడుగుతుంది జానకి. మీకు ఫోన్లోనే చెబుదాం అనుకున్నాను కానీ మీరే నా మాట వినకుండా ఫోన్ పెట్టేశారు అంటూ తలుపులు వేసి జరిగిందంతా చెప్పాడు రామ. తమ్ముడు భవిష్యత్తు కోసం చరణ్ కి 20 లక్షలు కట్టాను అంటాడు రామ.
ఆ మాటలుకి షాక్ అయిన జానకి అంత డబ్బు మీకు ఎక్కడిది అని అడుగుతుంది. ఇంటిని తాకట్టు పెట్టాను అంటాడు రామ. ఏం మాట్లాడుతున్నారు రామ గారు జోక్ చేస్తున్నారు కదా అంటుంది జానకి. లేదు నిజమే చెప్తున్నాను అంటాడు రామ. అఖిల్ తన టాలెంట్ వల్లే జాబు వచ్చిందని చెప్తున్నాడు అంటుంది జానకి. వాడికే కాదు ఇంట్లో ఎవరికీ ఈ విషయం తెలియదు అంటాడు రామ. మీరు మోసపోయారు రామ గారు అంటుంది జానకి.
భర్త చేసిన పనికి కంగారుపడుతున్న జానకి..
లేదండి వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్ నాతో పాటు చాలామంది పెట్టుబడి పెట్టారు అంటాడు రామ. కంపెనీ పెట్టిన వాడే పెట్టుబడి సంగతి చూసుకుంటాడు అంతేగాని మన దగ్గర ఎందుకు తీసుకుంటాడు ఆ మాత్రం ఆలోచించలేకపోయారా అంటుంది జానకి. వాడు నాకు మంచి స్నేహితుడు నన్ను ఎందుకు మోసం చేస్తాడు అంటాడు రామ. ఈరోజు రేపు స్నేహాన్ని అడ్డం పెట్టుకొని మోసం చేస్తున్నారు, ఇన్నాళ్లు లేని వాడు సడన్ గా కనిపించి పెట్టుబడి పెట్టమన్నాడు అంటేనే మోసం కనిపిస్తుంది కదా అంటుంది జానకి.
అలాంటిదేమీ జరగదు మీరు కంగారు పడకండి అంటాడు రామ. అత్తయ్య గారు అడిగితే ఏం చెప్తారు అంటే మన డబ్బు మూడు నెలల్లో వచ్చేస్తుంది కదా అప్పుడు ఆ ఇంటిని విడిపించేస్తాను అంటాడు రామ. మీరు తప్పు చేశారు ఈ విషయం ఇప్పుడే అత్తయ్య గారికి చెప్తాను అంటూ డ్రామా చెప్తున్నా వినిపించుకోకుండా జ్ఞానాంబ దగ్గరికి వస్తుంది జానకి. ఏమిటి రామ,జానకిని ఏటి చెప్పొద్దు అంటున్నావ్ అంటుంది జ్ఞానాంబ.
తోటి కోడల్ని, బావగారిని అనుమానిస్తున్న మల్లిక..
అలాంటిదేమీ లేదమ్మా నువ్వు అఖిల్ కి ఇష్టమైన వంటకాలు చేయించు అంటూ జానకిని అక్కడినుంచి తీసుకొని వెళ్ళిపోతాడు రామ. వీలైన గూడుపుఠాణి చేస్తున్నారు అని అనుకుంటుంది మల్లిక. మరోవైపు ఉద్యోగం వచ్చిందని మనం ఇంకెవరి దగ్గర డబ్బులు కోసం చెయ్యి చాచవలసిన పనిలేదని అఖిల్ జెస్సీలు ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటారు.
అంతలోనే అక్కడికి వచ్చిన మల్లిక అఖిల్ కి కంగ్రాట్స్ చెప్పి నీకు ఉద్యోగం వచ్చినందుకు ఇంటిలో అందరికీ సంతోషంగా ఉంది ఒక్క మీ జానకి వదినకి తప్ప అంటుంది మల్లిక. నీకు ఉద్యోగం వచ్చిందని తెలియగానే మీ వదిన ముఖం ఎలా మారిపోయింది చూసావా? తనమీద నువ్వు పై చేయి సాధించావు నాకు ఆనందంగా ఉంది అంటుంది మల్లిక. ఈ కంపెనీ మీ అన్నయ్యకి సంబంధించినదే కదా ఇందులో వాళ్ళ రికమండేషన్ ఏమీ లేదు కదా అంటుంది మల్లిక.
అఖిల్ ని పొల్యూట్ చేస్తున్న మల్లిక..
అలాంటిదేమీ లేదు అంటాడు అఖిల్. పోనీలే లేకపోతే ఈ ఉద్యోగం మా ఆయన వల్లే వచ్చింది అంటూ మీ పెద్ద వదిన ఇంకా రెచ్చిపోతుంది తను నిన్ను చేసిన అవమానాలకి సమాధానం చెప్పే రోజు వచ్చింది అంటుంది మల్లిక. ఎందుకు మల్లిక అక్క అలా అంటారు జానకి అక్కకి కూడా మేము బాగుపడితే సంతోషమే అంటుంది జెస్సి. ఇప్పుడు అలాగే ఉంటుంది నీదాకా వస్తేనే తెలుస్తుంది తన నిజ స్వరూపం ఏంటో అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మల్లిక.
మరోవైపు మీరు ఎన్ని చెప్పినా వినను, తమ్ముడు మీద ప్రేమతో తప్పుటడుగు వేసారని అర్థమవుతుంది. మీ తమ్ముడు ఈ ఉద్యోగం తన వల్లే వచ్చింది అనుకుంటున్నాడు రేపు ఎప్పుడైనా ఈ ఇంటిని తాకట్టు కొట్టారని ఇంట్లో వాళ్లకి తెలిస్తే అందరి ముందు మీరే తల ఉంచుకోవాలి అంటుంది జానకి. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు జానకి గారు నా ఫ్రెండ్ అలాంటివాడు కాదు.
భార్య దగ్గర బలవంతంగా మాట తీసుకున్న రామ..
అయినా తమ్ముడికి ఉద్యోగం వచ్చేసరికి అమ్మానాన్న ఎంత సంతోష పడిపోతున్నారు చూశారు కదా, వాడికి ఉద్యోగం రాకపోయి ఉంటే అమ్మానాన్న బాధతో కుమిలిపోతూ ఉండేవారు. మనుషుల్ని బ్రతికించేది మందులు కాదు మానసిక సంతోషం అంటాడు రామ. భయపడుతున్న జానకి కి మీరేమీ కంగారు పడకండి మూడు నెలల్లో డబ్బులు రావడం ఖాయం అప్పుడు ఇంటి పేపర్లు విడిపించి కామ్ గా కాగితాలు అక్కడ పెట్టేస్తాను అంతవరకు ఇంట్లో ఎవరికి ఈ విషయం చెప్పొద్దు అంటూ ఆమె చేత బలవంతంగా మాట తీసుకుంటాడు రామ.
Janaki Kalaganaledu December 26 Today Episode
మీరు ఎన్ని చెప్పినా నా మనసు ఒప్పుకోవట్లేదు అని జానకి అంటే, అలాంటిదేమీ లేదు అందరూ బయట ఉన్నారు మనం ఇంట్లో ఉంటే బాగోదు అంటూ రామ బయటికి వెళ్లిపోతాడు. తొందరపడ్డారేమో రామా గారు కుటుంబ సభ్యులకు ఈ పని చేశాను అని మీరు అనుకుంటున్నారు కానీ రేపు ఏదైనా తేడా జరిగితే నింద మీరే మోయాలి అని తనలో తానే బాధపడుతుంది జానకి.
తరువాయి భాగంలో కొడుక్కి ఉద్యోగం వచ్చినందుకు అతని పేరు మీద పూజ చేయిస్తుంది జ్ఞానంబ. మొదటి కొబ్బరికాయ కుళ్ళిపోవటంతో కంగారు పడిపోతారు గోవిందరాజు దంపతులు.