Janaki Kalaganaledu January 12 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో బట్టలు సర్దుకుంటున్న అఖిల్ ఆ చిన్న గదిని చూసి చిరాకు పడిపోతాడు. ఈ గది ఇచ్చేసి అందరూ మహారాజా ప్యాలెస్ ఫీడ్ చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు అంటాడు. తప్పు చేసింది వాళ్ళు శిక్ష అనుభవిస్తుంది మనము అంటాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ అంటుంది జెస్సి. ఇంకెవరి గురించి మా పెద్ద వదిన గురించి వచ్చిన దగ్గరనుంచి తను ఏదో ఒక విధంగా నన్ను బాధ పెడుతూనే ఉంది అంటాడు అఖిల్.
జానకిని వెనకేసుకొస్తున్న జెస్సి..
వదినకి ఏమి తెలియకుండానే అన్నయ్య ఇదంతా చేశాడా నువ్వు కూడా నాన్న లాగే మాట్లాడుతున్నావ్ ఏంటి అంటాడు అఖిల్. ఇంట్లో ఏదైనా సమస్య వస్తే అందరూ కలిసి పరిష్కరించాలి అంతేగాని ఇంట్లో వాళ్ళని మనమే ఇన్సెల్ట్ చేయకూడదు అంటుంది జెస్సీ. అన్నయ్య అప్పు చేయటానికి కారణం నేనే అని అని అందరూ అనుకుంటున్నారు. అప్పు చేసి అన్నయ్య హీరో అయితే నేను జీరో అవుతున్నాను అంటూ ప్రెస్టేట్ అయిపోతాడు అఖిల్.
మరోవైపు ఇంట్లో వాళ్ళందరూ పిల్లి సర్దుతుంటే అప్పుడే గదిలోంచి వచ్చిన మల్లిక నన్ను కూడా సర్దుమంటారేమో అనుకొని మళ్లీ లోపలికి వెళ్ళిపోబోతుంది. అది గమనించిన గోవిందరాజులు నువ్వు కూడా కొంచెం సాయం చేయమ్మా అంటాడు. చెయ్యాలని ఉంది మావయ్య గారు కానీ ఒంట్లో నీరసం చేయనివ్వడం లేదు. ఇంకా ఎక్కువ కష్టపడితే మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ గారు మరీ మరీ హెచ్చరించాడు.
వేరు కాపురం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న మల్లిక..
అలా అని మీరు కష్టపడుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను అందుకే విడిగా వెళ్ళిపోతాను అంటే మీరు వినిపించుకోవడం లేదు అంటుంది. నువ్వు ఏ పని చేయక్కర్లేదు అలాగే విడిగా వెళ్లవలసిన అవసరము లేదు. నీకు బాగోలేదు కాబట్టి వాళ్లు చేస్తున్నారు అలాగే వాళ్లకి ఆరోగ్యం బాగోలేనప్పుడు నువ్వు చేద్దువు గానివి అంటుంది. అంతేగాని వేరు కాపురం ఊసెత్తరు అంటూ చిరాకు పడిపోతూ వెళ్ళిపోతుంది మల్లిక.
లోపలికి వెళ్లిన మల్లిక మళ్ళీ బయటికి వచ్చి నా గది కూడా దుమ్ము దుమ్ముగా ఉంది కొంచెం దులుపు అని చికితకి చెప్తుంది. నేను ఈ పని చూస్తాను నువ్వు వెళ్లి ఆ పని చెయ్యు అని చికితకి చెప్తుంది జానకి. చేస్తుంది కదా అని జానకికే పనులన్నీ చెప్తున్నారు అంటూ బాధపడతాడు గోవిందరాజులు. మరోవైపు సామాను తీసుకొని లేటుగా వచ్చిన భర్తని ఎందుకు లేటుగా వచ్చారు టైం అయిపోతుంది కదా అంటుంది జానకి.
ఎక్కడెక్కడికో వెళ్లి తెచ్చాను అని రామ అంటే ఎందుకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా అంటుంది జానకి. దొరుకుతాయి కానీ చవగ్గా దొరకవు కదా అంటాడు రామ. ఇంకా కొన్ని సామాన్లు తీసుకురాలేదు మర్చిపోయారా అని అడుగుతుంది జానకి. అంటే కొంచెం డబ్బులు తక్కువ అయ్యాయి మరీ అవసరమైతే చెప్పండి వెళ్లి తెచ్చేస్తాను అంటాడు. ఉంటాయని చెప్పాను అంతే అంత ఇంపార్టెంట్ కాదు అంటుంది జానకి.
కుటుంబం కోసం బాధపడుతున్న జెస్సి..
అమ్మ వాళ్ళు కాఫీ తాగుతారేమో అంటాడు రామ. పాలు పొంగించకుండా ఏ పని చేయకూడదు ముందు వెళ్లి స్నానం చేసి రండి అని భర్తని పంపిస్తుంది జానకి. వాళ్ళ మాటల్ని వింటున్న జెస్సి ఒకరు ఒకరు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు, అయినా ఎప్పటికీ తేరుకుంటాం. ఎలా ఉండే కుటుంబం ఎలా అయిపోయింది. ఈ కష్టాలు తీరేది ఎప్పుడు మళ్లీ సంతోషంతో కళకళలాడేది ఎప్పుడు అంటూ బాధపడుతుంది జెస్సి. మరోవైపు పాలు పొంగించమని అత్తగారిని అడుగుతుంది జానకి.
అలాంటి మంచి పనులు నీ చేతితోనే చెయ్ అమ్మ అంటుంది జ్ఞానాంబ . మీరు పెద్దవారు కదా అత్తయ్య అంటుంది జానకి. పెద్దింటితోనే పెద్దరికం పోయింది చిన్నవాళ్ళు కూడా ఇప్పుడు పెద్దపెద్ద పనులు చేస్తున్నారు అంటుంది జ్ఞానాంబ. అయిపోయిందని గురించి ఎందుకు మాట్లాడుకోవడం అయినా ఇంట్లో ఏ శుభకార్యమైనా నీతో ప్రారంభించడమే అలవాటు కదా అంటాడు గోవిందరాజులు.
అత్తగారిని బ్రతిమాలుతున్న కోడళ్ళు..
పెద్ద కోడలు ఇంట్లోకి వస్తే అత్తగారి అధికారాలు పోయినట్లే అంటుంది జ్ఞానంబ. నీ చేతితో పాలు పొంగిస్తే శుభం జరుగుతుంది అంటాడు రామ. రాముడు అంతలా అడుగుతున్నాడు కదా సుభాని కాదనటం కూడా అశుభమే అంటాడు గోవిందరాజులు. జరగాల్సిన అవసరం ఎప్పుడు జరిగిపోయింది నా చేతులతో పాలు పొంగించినంత మాత్రాన పోయిన పరువు రాదు అంటుంది జ్ఞానాంబ. నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే అద్భుతాలు జరుగుతాయి అంటాడు రామ.
ఆ నమ్మకం నిజంగా మీకు ఉంటే ఈ కుటుంబం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండేది కాదు అంటుంది జ్ఞానంబ. పాలు పొంగించమని జెస్సి కూడా అత్తగారిని బ్రతిమాలుతుంది. నా అవసరం ఉండాల్సిన దగ్గర లేనప్పుడు ఇక్కడ ఉన్న లేనట్టే అంటూ దేవుడి దగ్గర దీపం వెలిగించి ఇప్పుడు కొత్తగా నా పెద్దరికం ని గుర్తించి ఎవరు గౌరవం ఇవ్వాల్సిన పనిలేదు అని బాధపడుతూ వెళ్ళిపోతుంది జ్ఞానంబ.
సరికొత్త ఉపాయంతో పాలు పొంగించిన జానకి..
అత్తయ్య గారు చూడండి ఎంత బాధ పడుతున్నారో, ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుందని మేము విడిగా వెళ్లిపోతాం అన్నది అంటుంది మల్లిక. అమ్మ జానకి మంచి మనసుతో ఏ పని చేసినా మంచిదే నువ్వే పాలు పొంగించు అంటాడు గోవిందరాజులు. అత్తయ్య గారి కన్నా మంచి మనసు ఎవరుకుంటుంది అంటూ జ్ఞానాంబ వెలిగించిన దీపంతోనే స్టవ్ వెలిగించి పాలు పొంగిస్తుంది జానకి. అమ్మ చేతితోనే పాలు పొంగించినట్లుగా ఉంది అని సంతోష పడిపోతాడు రామ.
అదంతా పక్క నుంచి గమనిస్తుంది జ్ఞానంబ. పాలు పొంగించడం అయిపోయింది ఇంక వంట మొదలు పెట్టాలి అని చికితతో చెప్పింది జానకి. నాకు తలనొప్పిగా ఉంది కొంచెం పాలు తీసుకొస్తావా అంటుంది మల్లిక. ఇంత రాలేదేంట అనుకుంటున్నాను వచ్చేసిందా అంటూ మల్లికని ఆట పట్టిస్తుంది చికిత. మల్లికా మరి ఓవరాక్షన్ చేస్తుంది చూస్తాను అనుకుంటుంది జానకి. నేను వెళ్లి ఇస్తాను అని జెస్సి అంటే వద్దులే నువ్వు రెస్ట్ తీసుకో నేను ఇస్తాను అంటుంది జానకి.
ఆనందాన్ని పట్టలేకపోతున్న రామచంద్ర..
అందరూ వెళ్ళిపోయిన తర్వాత సంతోషం పట్టలేక జానకిని హత్తుకుని ముద్దు పెడతాడు రామ. మా అమ్మ చేతితో పాలు పొంగించలేదన్న బాధ లేకుండా చేశారు అని పొంగిపోతాడు. మళ్లీ ఏమి తెలియని చిన్న పిల్లాడి లాగా తల ఒంచుకొనివెళ్ళిపోతాడు. భర్తని చూసి నవ్వుకుంటుంది జానకి. భార్య దగ్గరికి వచ్చిన విష్ణు ఎందుకే లేని తలనొప్పిని నటిస్తున్నావు అంటాడు. నాకు తలనొప్పి లేదని మీకు తెలుసా అంటుంది మల్లిక. నీ నాటకానికి నాకు బయటి పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు విష్ణు.
Janaki Kalaganaledu January 12 Today Episode:
కడుపు వచ్చిందని నాటకం నాకు మంచిదే అయింది లేకపోతే ఈ ఇంటి పని అంతా నాతోనే చేయించేసేవారు అనుకుంటుంది మల్లిక. అంతలోనే లోపలికి వచ్చిన జానకిని చూసి మళ్ళీ యాక్టింగ్ మొదలుపెడుతుంది. అమ్మో కాళ్ళు నొప్పులు అని గోల పెడుతున్న మల్లికని పనిచేయని శరీరాన్ని మోస్తున్నాయి కదా ఆ మాత్రం నొప్పులు ఉంటాయి అంటుంది జానకి. అంటే ఏంటి నేను పని చేయట్లేదని వెటకారమా అంటుంది మల్లిక. అసలు నీకు కడుపు రావటమే అబద్ధం అలాంటిది ఎందుకీ ఓవరాక్షన్ అంటుంది జానకి.
ఆ విషయం నీకు నాకు తెలుసు కానీ మిగతా వాళ్ళకి తెలియదు కదా నువ్వు వెళ్లి చెప్తావా, చెప్పవు కదా అంటుంది మల్లిక. తరువాయి భాగంలో కొడుకు చేసిన పనికి బాధపడుతుంది జ్ఞానంబ. వాడు కావాలని చేయలేదు కదా అంటూ కొడుకుని వెనకేసుకొస్తాడు గోవిందరాజులు. మరోవైపు తను చేసిన పనికి గిల్టీగా ఫీల్ అవుతాడు రామచంద్ర.