Janaki Kalaganaledu January 16 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో బాత్రూం కోసం బయటికి వచ్చిన మల్లిక కి బాత్రూం ఖాళీగా ఉండకపోవటంతో చిరాకు పడిపోతుంది. లోపల జెస్సీ ఉందని తెలుసుకొని వెళ్ళిపోబోతుంది మళ్లీ ఎవరైనా దూరేస్తారు అని అక్కడే కాపలా కాస్తుంది. అంతలోనే అక్కడికి వచ్చిన చికిత ఇక్కడైతే వచ్చాడు ఇది బాత్రూం వాక్ ఆ అని అడుగుతుంది.
చికిత మీద కోప్పడుతున్న మల్లిక..
అవన్నీ నీకెందుకే అని కోప్పడుతుంది మల్లి. పొద్దు పొద్దున్నే నన్నేమైనా అన్నారంటే బాత్రూంలోకి వెళ్లగా నీళ్లు ఆగిపోతాయని శపిస్తుంది సరదాగా. పొద్దు పొద్దున్నే పరాచకాలు ఆడుకు లోపల ఉన్న రమ్మని చెప్పు అంటుంది మల్లిక. మనిషిని పిలవడానికి కూడా మీకు పనిమనిషి కావాలా తనే వస్తుంది లెండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చికిత. దీనికి ఎప్పుడో ఒకరోజు ఇస్తాను బండకేసి చీరని బాధనట్టు బాదుతాను అనుకుంటుంది మల్లిక.
సీన్ కట్ చేస్తే షాప్ కి టైం అయిపోతుంది టిఫిన్ కి ఇంకా పిలవలేదు ఏంటి అని ప్లేట్ పెట్టక కూర్చుంటాడు రామ. ఏ షాప్ కి అంటుంది జానకి. ఏ షాప్ ఏంటండీ మన షాపే అంటాడు రామ. మళ్లీ ఏదో గుర్తొచ్చినట్లుగా సంవత్సరాలు తరబడి అలవాటయిపోయింది అండి షాపు లేదు అని ఇంకా అలవాటు పడలేకపోతున్నాను అని బాధపడతాడు రామ. పని పోయిందని పని వెతుక్కోవాలని బుర్రకి తోచలేదు అనుకుంటూ ఇప్పుడే వచ్చేస్తాను అని గబగబా వెళ్ళిపోతాడు రామ.
అత్తగారిని బ్రతిమాలుకుంటున్న జానకి..
టిఫిన్ చేసి వెళ్ళండి అంటూ అతని వెంట గుమ్మం వరకు వస్తుంది జానకి. కానీ వినిపించుకోకుండా వెళ్లిపోవడంతో అయ్యో వెళ్లిపోయారు అని బాధతో మళ్లీ ఇంట్లోకి వెళ్ళిపోతుండగా అక్కడ కూర్చున్న జ్ఞానంబని చూసి ఒక్కరే కూర్చున్నారు ఏమి అని అడుగుతుంది జానకి. ఆమెతో ఏమీ మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోతున్న జ్ఞానం పని ఆపి మీకు మా మీద కోపం ఉంటే కొట్టండి తిట్టండి అంతేగాని మాట్లాడటం మానేయకండి.
నీ ఫోను నాకు ఇంకా నరకంగా ఉంది, కోడలు కూతురితో సమానమని మీరే అనేవారు కూతురు తప్పు చేస్తే ఇలాగే దూరంగా పెడతారా అని నిలదీస్తుంది. అమ్మ కోపం పిల్లలకి ఆశీర్వచనం కావాలి కానీ శాపం కాకూడదు. మేము మిమ్మల్ని చూసుకుని ధైర్యంగా ఉంటావు అలాంటిది మీరు మమ్మల్ని దూరంగా పెడుతుంటే మా బాధ ఎవరితో చెప్పుకోమంటారు అంటూ ఏడుస్తుంది.
మీరే ఆయన బలం, బలహీనత అంటున్న జానకి..
తమ్ముడు జీవితం బాగోవాలని రామ గారు ఒక మంచి ప్రయత్నం చేశారు. కానీ ఆయన మోసపోయారు ఆ విషయం నాకు తెలిసిన అప్పటినుంచి మీకు చెప్పటానికి అవకాశం రాలేదు. నష్టం జరిగింది కుటుంబం అంతా బాధపడుతుంది దానికి కారణం ఆయనే కావచ్చు కానీ ఆయన మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడరు. తప్పుని శిక్షించాలి కానీ పొరపాటును కాదు. నిజానికి ఆయన పోయిన డబ్బు కోసం కాకుండా మీరు ఆయనతో మాట్లాడటం లేదని చాలా బాధపడుతున్నారు.
మీరు నవ్వుతూ ఏమి కాదు నాన్న అని ఆయన భుజం మీద చేయి వేయండి చాలు రెట్టింపు సంపాదిస్తారు అంటుంది జానకి. రామా గారికి బలము బలహీనత రెండు మీరే అర్థం చేసుకోండి అంటూ చేతులు జోడించి బ్రతిమాలుతుంది. జానకి ఏమి మాట్లాడకపోవటంతో చికిత గోవిందరాజులు కి కాఫీ ఇచ్చి ఎంత వేసినా పంచదార చాలట్లేదు అంటున్నారు మీరే వెయ్యండి అంటూ పంచదార డబ్బా జానకికి ఇస్తుంది.
జ్ఞానాంబను నవ్వించిన చికిత..
ఇది పంచదార కాదు గోధుమ నూక అంటుంది జానకి. పంచదార ఏమంటే గోధుమ నూక వేస్తావా అంటూ చికితని మందలిస్తాడు గోవిందరాజులు. అది చూసి నవ్వుతుంది జ్ఞానంబ. మీరు నవ్వితే చాలా బాగున్నారు మీ నవ్వే మాకు ధైర్యం అంటుంది జానకి. అంతలోనే అక్కడికి వచ్చిన మల్లికా పంచదార వేయమంటే వేయకుండా ఎక్కడ ఏం చేస్తున్నావు ఆ డబ్బా నాకు ఇవ్వు అని చెంచాలు చెంచాలు వేసుకుంటుంది.
జానకి చెప్తున్నా వినిపించుకోదు. తర్వాత విషయం తెలుసుకొని ముందే ఎందుకు చెప్పలేదు అంటూ చికితని కొట్టడానికి పరిగెడుతుంది. అది చూసి మళ్లీ నవ్వుతుంది జ్ఞానంబ. అది చూసిన గోవిందరాజులు మీ అత్తయ్య నవ్వింది అంటే కోపం పోయినట్లే అని కోడల్ని ఓదారుస్తాడు. బండిమీద వెళ్తున్న రామా అమ్మకి నామీద కోపం పోయేలాగా చూడాలి ముందు ఇంటి ఖర్చులకి తడుముకోకుండా పని వెతుక్కోవాలి అనుకుంటాడు.
భాస్కర రావు ని బ్రతిమాలుకుంటున్న రామ..
అంతలోనే వాళ్ళ స్వీట్ షాప్ నేమ్ బోర్డు పక్కన పడేస్తుంటే, ఎంతో ఇష్టంగా ఆ షాప్ కి మా అమ్మ పేరు పెట్టుకున్నాను దాన్ని దయచేసి పక్కనపడేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తాడు ఆ షాప్ అతన్ని. నాకు నచ్చిన పేరు పెట్టుకుంటాను అంటాడు ఆ షాప్ అతను. మేము డబ్బులు సర్దుబాటు కాక షాప్ వదిలేసాను అంతేగాని షాపు అమ్ముకోలేదు అంటాడు రామ. అంతలోనే అక్కడికి వచ్చిన భాస్కరరావుని, నువ్వైనా చెప్పు బాబాయ్.
మా అమ్మని ఈ షాప్ ని వేరువేరుగా ఎప్పుడు చూడలేదు బాబా ఈ షాపు ఒక వెలుగు వెలిగింది నేను చేసిన చిన్న తప్పు వల్ల షాపు వదులుకోవలసి వచ్చింది అని రిక్వెస్ట్ చేస్తాడు రామ. నువ్విలా అడ్డుపడడం ఏమీ బాగోలేదు అంటాడు భాస్కర్ రావు. షాపులో మా అమ్మ లేకపోయినా ఎటువైపు వచ్చినప్పుడు ఈ షాపింగ్ చూసినా ప్రతిసారి మా అమ్మని చూసినట్లుగా ఉంటుంది ఇది మీకు కేవలం షాప్ కానీ ఇది మా అందరి కష్టం,కొన్నేళ్ళ జ్ఞాపకం.
గిల్టీగా ఫీల్ అవుతున్న గోవిందరాజులు..
మీరైనా అర్థం చేసుకోండి అని అంటే వాళ్లు ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే వంట చేస్తూ చదువుకుంటుంది జానకి. మరోవైపు శూన్యంలోకి చూస్తూ కూర్చున్న గోవిందరాజుల దగ్గరికి ఏమి ఆలోచిస్తున్నారు అంటూ వస్తుంది జ్ఞానాంబ. మొదలయ్యేమో అక్కడికే వచ్చి చేరుకున్నాము అంటాడు గోవిందరాజులు. ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎందుకు ఆలోచిస్తారు అంటుంది జ్ఞానంబ.
చేతకాని వాడి లాగా కుర్చీలో కూర్చున్నప్పుడు ఆలోచన తప్పితే ఇంకేం చేయగలం అని బాధపడతాడు గోవిందరాజులు. మీరు అలా ఎందుకు అనుకుంటారు నీలో సకాన్ని నేను బ్రతికే ఉన్నాను మీ ఆలోచనకి నేను రూపాన్ని అవుతాను అంటుంది జ్ఞానంబ. మనిషికి మంచితనం ఎక్కువైతే కష్టాలు కన్నీళ్లు చుట్టాలు అవుతాయట. పాప వాడి వల్లే మనం ఇలా అయ్యామని వాడు చాలా బాధపడుతున్నాడు అని అంటాడు గోవిందరాజులు.
భార్యను నిలదీసిన గోవిందరాజులు..
నా మాటలు వినడం ఇష్టం లేని జ్ఞానంబ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే వాడి పేరు ఎత్తితేనే నువ్వు అదుపు లాగా అయిపోతున్నావు అది కోపమా ద్వేషమా అని అడుగుతాడు గోవిందరాజులు. అవసరం లేని విషయాలు మాట్లాడుకోవడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటుంది జ్ఞానాంబ. గోవిందరాజులు వేసుకోవలసిన మందులు అయిపోతాయి అది గమనించిన జ్ఞానం మందులు అయిపోయాయి చూసుకోలేదు ఇప్పుడే తెప్పిస్తాను అంటూ చికిత ని పిలుస్తుంది.
తను బయటికి వెళ్లింది మీకేం కావాలో నాకు చెప్పండి అంటుంది జానకి. మందులు అయిపోయాయి అని జ్ఞానాంబ అంటే మెడికల్ షాప్ పక్కనే ఉంది నేనే వెళ్లి తీసుకొని వస్తాను చీటి ఇవ్వండి అంటుంది. చేతికి ఇవ్వడం ఇష్టం లేని జ్ఞానంబ టేబుల్ మీద పెట్టేస్తుంది. చీటీ తీసుకుని వెళ్ళిపోతుంది జానకి. రాముడితో మాట్లాడట్లేదు ఈ అమ్మాయి ఏం చేసింది అని అడుగుతాడు గోవిందరాజులు.
Janaki Kalaganaledu January 16 Today Episode: ఆలోచనలో పడ్డ జానకి..
కొమ్మకి తెలియకుండా ఆకులు రాలవు, అలాగే వాడు చేసిన తప్పులో సగం ఆమెకి కూడా చెందుతుంది అంటుంది జానకి. గదిలోకి వెళ్లి మామయ్య గారికి మందులు తెస్తానని చెప్పాను కానీ డబ్బులు లేవు రామా గారి దగ్గర కూడా లేవు ఎలా అని ఆలోచనలో పడుతుంది జానకి. తరువాయి భాగంలో నీ దగ్గర డబ్బులు ఉంటే కొంచెం ఈ మందులు తెచ్చి పెట్టు అని విష్ణుని అడుగుతుంది జానకి.
మీ దగ్గర లేని డబ్బులు మా దగ్గర ఎలా వస్తాయి అంటుంది మల్లిక. అదేంటి ఉమ్మడి లో ఉన్న షాప్ ఉంది కదా అంటే దానివల్ల ఆదాయం ఏమీ లేదు అసలు షాపే లేదు అంటుంది మల్లిక. వెనకనుంచి ఆ మాటలు విన్న జ్ఞానంబ షాప్ లేకపోవడం ఏంటి అని అడుగుతుంది.