Janaki Kalaganaledu January 17 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మావయ్య గారికి మందులు తెస్తానని చెప్పాను కానీ డబ్బులు లేవు ఏం చేయటం అని ఆలోచిస్తుంది జానకి. అందులో విష్ణు కనిపించడంతో మావయ్య గారికి మందులు తేవాలి నువ్వు తెచ్చి పెట్టు లేకపోతే డబ్బులు ఇస్తే నేను తెస్తాను అంటుంది జానకి. అప్పుడే అక్కడికి వచ్చిన మల్లిక నీ దగ్గర లేని డబ్బులు మా దగ్గర నుంచి ఎక్కడ వస్తాయి అంటుంది.

నిజం చెప్పి తల్లిదండ్రులకి షాకిచ్చిన విష్ణు..

ఉమ్మడి మీద ఉన్న షాప్ ఉంది కదా అని జానకి అంటే ఆ షాప్ మీద డబ్బులు ఏమి రావటం లేదు అసలు షాపే లేదు అంటుంది మల్లిక. వెనకనుంచి ఆ మాటలు విన్న జ్ఞానాంబ షాపు లేకపోవటం ఏంటి అంటుంది. ఆ షాపు నా ఫ్రెండ్ది అని తీసుకున్నానమ్మా కానీ వ్యాపారం సరిగ్గా సాగకపోవడం వల్ల వాడి దగ్గరే అప్పు తీసుకోవాల్సి వచ్చింది. వ్యాపారం సరిగా లేకపోవడం వల్ల ఆ షాప్ కి నా అప్పుకి లెక్క సరిపోయింది.

లేకపోతే తిరిగి మనమే డబ్బు కట్టాల్సిన పరిస్థితి వచ్చేది అందుకే షాప్ ఇచ్చేసాను అంటాడు విష్ణు. అయితే ఇప్పుడు నీకు సంపాదన లేదా అంటే లేదు నాన్న పని వెతుక్కుంటాను అంటాడు విష్ణు. మీక్కూడా నాకు చెప్పాలనిపించలేదా అంటుంది జ్ఞానంబ. చెప్తే అసలే బాధలో ఉన్న మీరు ఇంకా ఎక్కువ బాధపడతారని చెప్పి ఉండరు అంటూ భర్తని వెనకేసుకొస్తుంది మల్లిక.

మనుషులు మారుతున్నారంటున్న గోవిందరాజులు..

నేను చెప్పాను కదా ముందే చెప్పమని ఇప్పుడు చూడండి మనం ఏదో సంపాదించేస్తున్నానని అనుకుంటారు అయినా శుభమా అని అని బయటకు వెళ్తుంటే అడ్డొచ్చారు, కాసేపు కూర్చొని బయటకు వెళ్దురుగాని అంటూ భర్తని లోపలికి తీసుకెళ్ళి పోతుంది మల్లిక. వాళ్లని గమనించిన గోవిందరాజులు మనుషులు మారుతున్నారు జ్ఞానం అంటాడు. ఏదో ఒకటి ఇచ్చేసి మందులు తీసుకురావాలని బయలుదేరుతుంది జానకి.

మరోవైపు రామ కూడా పని కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఇంట్లో పరిస్థితులు బాగోలేదు భారం మొత్తం రామా గారి మీద పడింది. ఒక్కరే ఏం చేస్తారు, ఆయనకి ఎవరు తోడున్నా లేకపోయినా నేను తోడుంటాను ఇప్పుడున్న పరిస్థితుల్లో మానేసి ఏదైనా పార్ట్ టైం జాబ్ వెతుక్కుంటాను నా భర్తకి తోడుంటాను అనుకుంటుంది జానకి. మరోవైపు పని వెతుక్కుంటున్నా సమయంలో ఇద్దరు వ్యక్తులు కేటరింగ్ వ్యక్తులు మానేయడంతో ఇబ్బంది పడ్డాన్ని గమనించిన రామ తనని తాను పరిచయం చేసుకొని మీరు క్యాటరింగ్ వాళ్ళ దొరికి ఇబ్బంది పడుతున్నారని మీ మాటలు ద్వారా అర్థమైంది.

జాబ్ కోసం ట్రై చేస్తున్న జానకి..

ఆ కేటరింగ్ నాకు ఇప్పించండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పని పూర్తి చేయిస్తాను నన్ను నమ్మండి అంటాడు రామ. తెలుగు ఉందో లేదో తెలియకుండా పనిస్తే మన పని అయిపోతుంది అంటాడు ఒక అతను. జ్ఞాన ప్రసూనాంబ షాపు మాదేనండి నేను జ్ఞానంబ గారి అబ్బాయిని అని చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అయ్యి రేపు పొద్దున పనిలోకి వచ్చేయమంటారు. వాళ్ల దగ్గర అడ్వాన్స్ తీసుకొని బయలుదేరుతాడు రామ. మరోవైపు జానకి స్కూల్ కి వెళ్లి పార్ట్ టైం జాబ్ కోసం అడుగుతుంది.

ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని అడిగితే, ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు నేను సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను అంటుంది జానకి. అలాంటి ప్రిపరేషన్ అవుతూ ఇలాంటి జాబు మీకు ఎందుకు అని ప్రిన్సిపల్ అడిగితే నాకు ఈ జాబ్ చాలా అవసరం ఉంటుంది జానకి. మీ మాటలను బట్టి మీకు ఈ జాబ్ చాలా అవసరమని అర్థమైంది మీలాంటి హై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లు పిల్లలకి టీచింగ్ చేస్తే వాళ్లకి కూడా బాగుంటుంది అందుకని రేపే వచ్చి జాయిన్ అవ్వండి అంటుంది ఆ ప్రిన్సిపల్.

అనుకోని పరిస్థితుల్లో కలిసిన రామ దంపతులు..

సంతోషంగా ప్రిన్సిపాల్ కి థాంక్యూ చెప్పి రేపొద్దున వచ్చి జాయిన్ అవుతాను అంటుంది జానకి. బండి మీదకి వస్తున్న రామా జానకిని చూసి ఎక్కడున్నారు ఏంటి అని బండి ఆపుతాడు. మీరేంటి ఎక్కడ అని జానకి అడిగితే ఆ మాట నేను అడగాలి మీరేంటి ఇక్కడ అంటాడు రామ. నాకు ఇక్కడ జాబ్ వచ్చిందని జానకి చెప్తే జాబ్ ఏంటి అంటాడు రామ. నేను ఏదో ఒక జాబ్ చేయాలని డిసైడ్ అయ్యాను అందుకే ఈ స్కూల్లో టీచర్ పోస్ట్ కోసం ట్రై చేస్తే రేపటి నుంచి వచ్చేయమన్నారు అంటుంది జానకి.

చిన్న చిన్న సమస్యల కోసం మీ లక్ష్యాన్ని వదులుకుంటారా అంటాడు రామ. ఈరోజు చిన్న సమస్యలు రేపు పెద్దవి అవుతాయి అంటుంది జానకి. అయినా కూడా మీరు మీ చదువుని వదిలేసి ఇలా పనులు చేయడం నాకు ఇష్టం లేదు అంటాడు రామ. చదువుని పక్కన పెట్టాను ఇంటి పనులతో పాటు ఇది కూడా ఒక పని అనుకుంటాను అంటుంది జానక. స్కూలు ఇంట్లో పని అని తిరుగుతూ ఉంటే మీ చదువు సాగదు అంటాడు రామ.

నా మాట కాదనొద్దంటున్న జానకి..

ఇంట్లో ఎటు చూసినా డబ్బులు అవసరం కనిపిస్తుంది. సరుకులు తేవడానికి డబ్బులు చానక షాపులో లేవని అబద్ధం చెప్పారు ఎందువల్ల డబ్బులు లేకనే కదా, కానీ డబ్బులు లేక తీసుకు వెళ్ళలేకపోతున్నాను అందుకే ఈ జాబ్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను నా మాట కాదనవద్దు అంటుంది జానకి. ఇంటి అవసరాల గురించి ఇంక ఆలోచించడం మరిచిపోండి, నాకు పని దొరికింది మీరు ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నది ఒకప్పటి మీ కల కాని ఇప్పుడు మా అందరి కల మీరు బుద్ధిగా చదువుకోండి అంటాడు రామ.

మరోవైపు జానకి మాటల్ని తలుచుకొని బాధపడతాడు విష్ణు. మీ అమ్మ వాళ్లతోనే అలాగా మాట్లాడినందుకు బాధపడుతున్నారా అంటూ భర్తని అడుగుతుంది మల్లిక. ఎవరి ఏమనుకున్నా నేను అనుకున్నదే జరగాలి అంటుంది మల్లిక. నాన్నకి మందులు కూడా లేక ఇబ్బంది పడుతున్నారు అని విష్ణు అంటే ఏం చేద్దాం మన దగ్గర ఉన్న డబ్బులు అన్ని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టి ఈ దరిద్రం మనం కూడా అనుభవిద్దామా అంటుంది మల్లిక. నాన్నకి మందులు కావాలి అమ్మకి యాపిల్స్ కావాలి ఇలాంటివి కాదు ఆలోచించవలసింది.

భర్తకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్న మల్లిక..

మనం ఈ ఇంట్లో నుంచి ఎలా బయటపడాలా అని, మనకి షాపు లేదు మన దగ్గర డబ్బులు లేవు అని అందరికీ తెలిసింది కాబట్టి మన జోలికి ఎవరు రారు. మన దగ్గర ఉన్న డబ్బులతో సొంతంగా షాప్ పెట్టుకుందాం ఆ ఏర్పాట్లు చూడండి అంటుంది మల్లిక. షాపు పెట్టుకుంటే ఆ విషయం ఇంట్లో తెలియకుండా ఉంటుందా అంటాడు విష్ణు. ఎక్కడ పెట్టాలని మాత్రమే ఆలోచించండి మిగతావన్నీ నేను ఆలోచిస్తాను. పొరపాటున మీరు ఈ విషయం ఎవరితోని చెప్పకండి.

ఇలాగా ఈ ఇంట్లోంచి ఎలా బయటపడాలో అనేదానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటూ భర్తకి చెప్తుంది మల్లిక. మరోవైపు బాధ్యత లేకుండా గేమ్ ఆడుకుంటున్న అఖిల్ దగ్గరికి వచ్చిన జెస్సి ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం అవుతుందా అని అడుగుతుంది. ఏంటి నీ గోల అని అఖిల్ అంటే ఇంట్లో పరిస్థితి నీకు గోల లాగా ఉందా అంటుంది జెస్సి. అవన్నీ ఆలోచించడానికి ఇంట్లో చాలామంది ఉన్నారు అంటాడు అఖిల్.

భర్తకి చివాట్లు పెడుతున్న జెస్సి..

ఉన్న నలుగురు నాలుగు రకాలుగా కష్టపడితేనే ఆ కష్టం తీరుతుంది. ఇలా ఆడుకుంటూ కూర్చుంటే ఇంటికి భారం అవ్వడం తప్పితే ప్రయోజనం ఏమి ఉండదు ఉంటుంది జెస్సి. మంచి జాబు దొరకాలి కదా అంటాడు అఖిల్. మనకి నచ్చిన జాబ్ రావాలని ఖాళీగా కూర్చుంటే కుదరదు. అక్క బావ గారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో కనిపిస్తుందా? ఇలాంటి సమయంలో కూడా నువ్వలా లా కూర్చోవడం పద్ధతి కాదు అంటుంది జెస్సి. వాళ్లు కష్టపడితే నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు మా వదినగారు నిన్ను బాగా ట్రైన్ చేసినట్టున్నారు అంటాడు అఖిల్.

నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను అని అఖిల్ అంటే అలాంటి వాళ్ళు మనుషుల మధ్యలో ఉండకూడదు అంటుంది జెస్సి. అంటే నేను మనిషిని కాదా అంటాడు అఖిల్. కన్నవాళ్ళు తోడబుట్టిన వాళ్ళు అంత కష్టపడుతున్న మీరు ఏమి పట్టించుకోవట్లేదు అంటే నువ్వు ఏమనుకోవాలో నువ్వే ఆలోచించుకో అంటుంది. చికిత వచ్చి మీ మావయ్య గారు వచ్చారు అమ్మగారు రమ్మంటున్నారు అంటూ పిలుస్తుంది.

Janaki Kalaganaledu January 17 Today Episode:  అయోమయంలో అఖిల్..

మీ నాన్నగారిని రమ్మని నువ్వు ఫోన్ చేసావా మరి ఎందుకు వచ్చారు అంటాడు అఖిల్. ఏమో తెలియదు అంటుంది జెస్సి. తరువాయి భాగంలో బట్టలు సర్దుకో మన ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు జెస్సీ తండ్రి. మా అత్తయ్య గారు వెళ్ళమంటే వస్తాను అంటుంది జెస్సి. నువ్వే కదా ఈ పెళ్లి చేసింది నువ్వు చేస్తే మంచి పని చేశావు అనుకున్నాను కానీ ఇలా నమ్మించి గొంతుకు వస్తావు అనుకోలేదు నువ్వు చల్లగా ఉండు అంటూ నానా మాటలు అంటాడు జెస్సి తండ్రి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 17, 2023 at 11:55 ఉద.