Janaki Kalaganaledu January 23 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఎందుకు ఇంట్లో వాళ్ళందరినీ నీ మాటలతో బాధపడుతున్నావు నువ్వు ఎలాగూ వెళ్ళిపోతావు అనుకుంటున్నావు అలాంటిది ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా ఎందుకు వెళ్లిపోమంటున్నావు. ఈ ఇంటి కోడలు పైన జెర్సీఏ మీ ఇంట్లోంచి వెళ్లిపోవటానికి ఇష్టపడలేదు అలాంటిది వెన్నెల ఎలా వెళ్ళిపోతుంది అనుకుంటున్నావు.
శృతి మించిపోతున్న మల్లిక శాడిజం..
మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడు అంటూ మల్లికకి గడ్డి పెడుతుంది జానకి. పౌరుషానికేవి తక్కువ లేదు పండగ చేస్తారంట, ఈ పండగ ఎలా నేను చూస్తాను వెన్నెల ముందే జానకి పరువు తీస్తాను అనుకుంటుంది మల్లిక. మరోవైపు రాముడు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు గోవిందరాజులు. బయటికి వెళ్లారు ఇంకా రాలేదు అంటుంది జానకి. ఇంటి కోసం వాడు పడుతున్న కష్టం ఎవరికి అర్థం కావట్లేదు.
ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అని బాధపడతాడు గోవిందరాజులు. ఇంటికి పెద్ద కొడుకు అయినప్పుడు ఇంటి బాధ్యత హాయినే కదా చూసుకోవాలి అంటుంది జానకి. అర్థం చేసుకున్న చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకున్నావు అంటాడు గోవిందరాజులు. అన్ని అర్థం చేసుకోబట్టే మనల్ని ఈ పరిస్థితికి తీసుకువచ్చింది అంటూ పుల్లవిరుపుగా మాట్లాడుతుంది మల్లిక. కొంతమందికి అర్థం కావాలంటే జీవితాలు సరిపోవు అంటాడు గోవిందరాజులు.
అయోమయంలో గోవిందరాజులు..
అబ్బో అయినా కాకపోయినా ఆ ఇంటికి నుంచి ఈ ఇంటికి వచ్చేసాం కదా, అయినా అవన్నీ నాకెందుకు అంటూ 1000 రూపాయలు తీసి ఇస్తుంది మల్లిక. ఈ డబ్బులు ఎందుకు అని అయోమయంగా అడుగుతాడు గోవిందరాజులు. పండగ వస్తుంది కదా మావయ్య గారు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే వాళ్ళం కానీ ఈ సంవత్సరం అలాంటి ఆశలు లేవు. మనకి కొత్త బట్ట లేకపోయినా ఇంటికి వచ్చిన ఆడపిల్లకి కొత్త బట్టలు పెట్టాలి కదా అంటుంది మల్లిక. మీ బావగారు బయటకు వెళ్లారు కదా తీసుకొస్తారులే అంటుంది జానకి.
తీసుకువస్తారు తీసుకువస్తారు అనుకుంటూనే ఈ ఇంతవరకు తీసుకొచ్చారు. ఆయన తీసుకొస్తారని నమ్మకం నాకు లేదు. అలా అని ముగ్గురు అన్నదమ్ముల నుండి ఆడపిల్లకి జాకెట్ ముక్క అయినా పెట్టకపోతే ఎలా అందుకే ఆయన్ని వెయ్యి రూపాయలు చేపలు అడిగి తీసుకు రమ్మన్నాను. డబ్బులతో వెన్నెలకి ఏమైనా బట్టలు కొనండి మావయ్య గారు, ఎవరు ఆలోచించినా ఆలోచించక పోయినా,మేమైనా బాధ్యతగా ఆలోచించాలి కదా అంటుంది మల్లిక.
రామని వెనకేసుకొస్తున్న వెన్నెల..
నువ్వు నా ఒక్కదాని కోసమే ఆలోచించావు కానీ మా పెద్దన్నయ్య ఈ ఇంటి అందరికోసం ఆలోచించాడు. అందుకే ఇన్ని సంవత్సరాలు మేము సంతోషంగా ఉన్నావు ఈ నాలుగు రోజులు ఏదో కష్టం వచ్చిందని అన్నయ్య ఏమి చేయలేదు అన్నట్లుగా మాట్లాడొద్దు అంటుంది మల్లిక. మరీ అంతగా వెనకేసుకొరాకు నువ్వు బాధపడకూడదని జరిగిందంతా చెప్పలేదు అత్తయ్య గారు అంటుంది మల్లిక. వెన్నెల మనసు పాడు చేస్తున్నావు అంటాడు గోవిందరాజులు.
రేపు వేరే ఇంటికి వెళ్లి కాపురం చేసుకోవలసిన పిల్ల నిజానిజాలు తెలుసుకోవాలి కదా 20 లక్షలు అప్పు అంటూ నాటకం ఆడారు. మనం విడిపోతేనే గాని ఈ అసలు సంగతి బయటపడదు అంటూ చెప్పకుండానే నిజం చెప్పేస్తుంది మల్లిక. అయ్యో చెప్పేసానా అంటూ పుల్లవిరుపుగా మాట్లాడుతుంది. అంతలోనే అక్కడికి పొత్త చేతులతో వచ్చిన రామను చూసి ఉత్త చేతులతో వచ్చారు ఎందుకు?జానకి మీకోసం ఎదురుచూస్తూ ఉంది ఎప్పటికైనా అర్థమైందా ఉట్టి కేకలేనమ్మ స్వర్గానికి ఎగుతాను అంటే ఇలాగే ఉంటుంది అంటుంది మల్లిక.
భర్త కోసం ఏడుస్తున్న జానకి..
బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జానకి. వెన్నెల అన్నయ్య మీద ఎంత ఆశ పెట్టుకుందో బాధపడొద్దు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. బాధతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తప్పుగా అనుకోకండి అత్తయ్య గారు నిజం మాట్లాడితే ఎవరికి నచ్చదు అందుకే మా మానాన మేము వెళ్ళిపోతాం అంటే మీరు ఒప్పుకోరు. నానూరు ఏమీ మాట్లాడకుండా ఊరుకోదు ఏదో ఒకటి మాట్లాడి మీ అందరిని ఇబ్బంది పెడుతుంది అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది మల్లిక.
మరోవైపు మల్లిక మాటలకి ఏడుస్తుంది జానకి. అనడం తనకి వినడం మనకి అలవాటైపోయింది కదా అంటూ భార్యను ఒధారుస్తాడు రామ. తను నన్ను అన్నందుకు కాదు రామ గారు మిమ్మల్ని అంటే భరించలేకపోతున్నాను అసలు మీరు మీ తమ్ముడు కోసం ఎంత త్యాగం చేశారో తనకేం తెలుసు అంటుంది జానకి. తెలియదు కాబట్టే అలాగా మాట్లాడుతుంది వదిలేయండి అంటాడు రాము. ఎలాగా వదిలేయమంటారు మనం అంతగా అబద్ధం చెప్పి ఏమాస్తులు కూడా పెట్టేసుకున్నామని, మిమ్మల్ని అనటమే పనిగా పెట్టుకుంది అదీ వెన్నెల ముందు.
నేను అంత అమాయకురాల్ని కాదు అంటున్న వెన్నెల..
ఇదంతా వెన్నెలకి తెలియదు మా అన్నయ్య ఏం చేశాడో అని తను మిమ్మల్ని అపార్థం చేసుకుంటే అంటుంది జానకి. అప్పుడే అక్కడికి వచ్చిన వెన్నెల ఎవరు మాటలో విని మా అన్నయ్యని అపార్థం చేసుకునే అంత అమాయకురాలిని కాదు వదిన నేను మా కుటుంబం కోసం మా అన్నయ్య ఎంత తప్పని పడతాడో నాకు తెలుసు అంటుంది వెన్నెల. చూశారా వెన్నెల కూడా నన్ను ఏమీ తప్పు పట్టట్లేదు మీరేమీ బాధపడొద్దు అంటాడు రామ. అసలు మీరు ఎందుకోసం ఇవన్నీ భరిస్తున్నారో తెలియకుండా తను అలా ఎలా అనేస్తుంది అంటుంది జానకి.
చెరువు ప్రశాంతంగా ఉంటే చూస్తూ ఉండడం అందరికీ ఇష్టం అదే చెరువులో రాయి వేసి ఆనందపడటం చిన్నపిల్లలకి ఇష్టం. మల్లి కది అలాంటి చిన్న పిల్లల మనస్తత్వమే వదిలేయండి అంటాడు రామ. మిమ్మల్ని అన్ని మాటలు అన్న తనని చిన్నపిల్ల అంటూ ఎలా అనగలుగుతున్నారు అంటుంది జానకి. అలా అని మన మనసుకి సర్ది చెప్పుకుంటేనే మనం ప్రశాంతంగా ఉంటాం అంటూ భార్యని ఓదారుస్తాడు రామ. మరోవైపు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అంటూ భర్త ను నిలదీస్తుంది మల్లిక. అసలు నీ ప్రవర్తన నాకు అర్థం కావట్లేదు అంటాడు విష్ణు.
ఆనందంతో గంతులు వేస్తున్న మల్లిక..
అర్థమైతే మీరు కూడా నాతో పాటు బయటికి రావడానికి ప్రయత్నం చేసేవారు. ఉన్న ఇంట్లోనే ఉండిపోవడం కాదు మన దారి మనం చూసుకోవాలి కదా అంటుంది మల్లిక. అందుకోసం ఇంట్లో అందరినీ బాధ పెడతావా అని విష్ణు అడిగితే మీ పెళ్ళాం బాధపడితే మీకు అక్కర్లేదు కానీ ఇంట్లో వాళ్ళు బాధ పెడితే చూడలేకపోతున్నారా అంటుంది మల్లిక. అడ్డుపడేది మీ అమ్మగారు ఒక్కరే కాదు ఆ జానకి మీ నాన్నగారు కూడా.
మీ అమ్మగారి ముందు ఎగరలేను కదా అందుకే వీళ్ళ ముందు ఎగిరితే మీ చెల్లి వెళ్లి చెప్తుంది అని చిన్న ఆశ అంటుంది మల్లిక. వెన్నెల ఏం చెప్తుంది అని విష్ణు అడిగితే, మా చిన్న వదినని నన్ను నాన్నని నాన్న మాటలు అంది అని తల్లి దగ్గర బోరు మంటుంది. అప్పుడు మీ అమ్మగారు ఆవేశంతో మనల్ని కోపంతో నాలుగు మాటలు అంటారు అదే సందు అనుకొని మీకే నా పౌరుషం మాకు లేదా అంటూ మనం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు అంటూ సంతోష్ పడిపోతుంది మల్లిక.
అందరి కోసం కొత్త బట్టలు తెచ్చిన జ్ఞానంబ..
బయటనుంచి జ్ఞానాంబ కేకలు వినబడటంతో రియాక్షన్ వెంటనే వచ్చింది చూశారా మనం లేచిన వేల విశేషం బాగుంది అంటూ సరదా పడిపోతుంది. నా ప్లాను ఇంత త్వరగా వర్క్ అవుట్ అయినందుకు కాళ్లు చేతులు ఆడడం లేదు అంటే హాల్లోకి భర్తని తీసుకొని వస్తుంది మల్లిక. అమ్మ అందర్నీ రమ్మన్నది అంటే ఇందాక జరిగిన గొడవ గురించే అయ్యుంటుంది జానకి గారు ప్రతిసారి అమ్మ ముందు తలవంచుకోవటం ఇబ్బందిగా ఉంది అంటాడు రామ. తప్పు చేయలేదని నేను అనుకోవడం కాదు తప్పు చేశాను అని అమ్మ అనుకుంటుంది అంటాడు రామ.
అత్తయ్య గారు మీరు తప్పు చేశారు అని బాధపడటం లేదు మీ వల్ల కుటుంబం అంతా ఈ స్థితికి వచ్చిందని బాధపడుతున్నారు అంటూ భర్తకి నచ్చ చెప్తుంది. అందరూ వచ్చిన అఖిల్ రాకపోవడంతో తన గురించి అడుగుతుంది జ్ఞానంబ. ఫ్రెండ్స్ ని కలవడానికి బయటికి వెళ్లారు అని జెస్సి చెప్తుంది. సరేలే అంటూ ఇంట్లో అందరికీ కొత్త బట్టలు ఇస్తుంది జ్ఞానంబ. ఇంట్లో అందరూ షాక్ అవుతారు. మల్లిక కి బట్టలతోపాటు తను ఇచ్చిన వెయ్యి రూపాయలు కూడా వెనక్కి ఇచ్చేసి ఎవరి దగ్గరో చేబదులు తెచ్చాను అన్నావు కదా ఇచ్చేయి అంటుంది.ఒకరి దగ్గర తీసుకున్న డబ్బులు వాళ్ళకి అంత తొందరగా ఇచ్చేస్తే మంచిది అంటాడు గోవిందరాజులు.
బావగారిని తిట్టుకుంటున్న మల్లిక..
పోలేరమ్మ ఏంటి ఇలా దెబ్బేసింది అనుకుంటూ ప్రతి సంవత్సరం బావగారు కదా బట్టలు తీసుకొస్తారు ఈ సంవత్సరం కూడా బావగారు తీసుకొస్తారని జానకి చెప్పింది మరి మీరు తీసుకొచ్చారు ఏంటి అంటుంది మల్లిక. ఎవరు తీసుకురావాల్సిన అవసరం లేదు ఆడపిల్ల తల్లిని ఆ మాత్రం ముందు జాగ్రత్త లేకుండా ఎలాగ ఉంటాను అంటూ వెన్నెలకి బట్టలు ఇవ్వబోతుంది. ముందు అన్న వదినలకు ఇస్తే బాగుంటుంది అంటుంది వెన్నెల. నీ చేతితో నువ్వే ఇవ్వు అంటుంది జ్ఞానాంబ.
నీ చేత్తోనే ఇవ్వమ్మా అని వెన్నెల అంటే మీ నాన్నగారికి మందులు ఇచ్చే టైం అయింది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్ఞానాంబ. పోనీలే ఈ పండగ పూట మళ్లీ తల్లి కొడుకులు ఎక్కడ కలిసిపోతారు అని బాధపడ్డాను అనుకుంటుంది మల్లిక. అమ్మ ఛీ అన్న ఏదో ఒక కారణం కనిపెట్టి సంతోష పడిపోతూ ఉంటారు బావగారు అనుకుంటుంది మల్లిక. తన గదిలో కూర్చున్న అమ్మ నా గురించే అన్నది జానకి గారు నాకు ముందు చూపు లేకపోవడం వల్లే ఇదంతా జరిగింది, అంత డబ్బు అతని చేతిలో పెట్టేముందు ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే బాగుండేది అనుకుంటాడు రామ.
Janaki Kalaganaledu January 23 Today Episode: గిల్టీ గా ఫీల్ అవుతున్న రామచంద్ర..
తప్పు అనేది ఎప్పుడైనా చేశాకే తెలుస్తుంది అది తప్పు అని, ఎవరూ కావాలని తప్పు చేయరు అంటుంది జానకి. తెలిసేటప్పటికీ నన్ను ప్రాణంగా చూసుకునే అమ్మకి దూరమైపోయాను అంటాడు రామ. అత్తయ్య గారు మాట్లాడట్లేదని మీరు మౌనంగా ఉంటే ఎలా అంటుంది జానకి. తరువాయి భాగంలో అందరూ భోగి సంబరాలు ప్రారంభిస్తారు. రామా కి జానకి, విష్ణు కి మల్లిక తలంటు పోస్తారు.