Janaki Kalaganaledu January 4 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అమ్మా నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు రామ. ఎవరికోసం చేసిన నావల్ల అయితే తప్పు జరిగింది, ఈ తప్పు నుంచి బయటపడడానికి నాకు ఒకటే దారి కనిపిస్తుంది స్వీట్ షాప్ ని తాకట్టు పెడదామనుకుంటున్నాను అంటాడు రామ. కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు.
భార్యని మందలిస్తున్న విష్ణు..
ఇంటిని విడిపించడం కోసం స్వీట్స్ షాప్ ని తాకట్టు పెడతారు. ఆ స్వీట్ షాప్ ని విడిపించడం కోసం మళ్లీ ఇంటిని తాకట్టు పెడతారా అంటుంది మల్లిక. ప్రస్తుతం ఉన్న సమస్యల నుంచి బయట పడాలి కదా అంటాడు గోవిందరాజులు. ఆ బాధ తప్పు చేసిన వాళ్ళకి ఉండాలి. జీవనాధారంగా ఉన్న షాప్ ని తాకట్టు పెడతానంటే ఎలా కుదురుతుంది అంటుంది మల్లిక. సైలెంట్ గా ఉండు అంటాడు విష్ణు.
మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అవుతుందని వాళ్ల సంతోషానికి అప్పులు చేసి మనకి తిప్పలు తీసుకొచ్చి పెట్టారు ఎందుకు సైలెంట్ గా ఉండాలి అంటుంది మల్లిక. ఎందుకక్కా ప్రతి దానికి అపార్థం చేసుకొని మాట్లాడుతావు బావ గారు ఏమీ కావాలని చేయలేదు కదా, కుటుంబం అన్నాక కష్టాల్లో పాలుపంచుకోవాలి అంతేగాని ఏ సంబంధం లేనట్లు వేరుచేసి మాట్లాడడామేంటి అంటుంది జెస్సి. సమస్యల గురించి వాళ్లు మాట్లాడుకుంటారు మధ్యలో నీకెందుకు అంటూ భార్యని మందలిస్తాడు అఖిల్.
కుటుంబ సభ్యుల్ని బ్రతిమాలుకుంటున్న రామచంద్ర..
ఇంటి మీదికి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఆలోచించాలి కదా ముందు ఇంటి అప్పు తీరుస్తే తర్వాత షాపు గురించి ఆలోచించడానికి మనకి టైం దొరుకుతుంది అంటుంది జానకి.ఇంటి పేపర్లు తాకట్లు పెట్టినప్పుడు పరువు గురించి ఉమ్మడి కుటుంబం గురించి నీకు గుర్తు రాలేదా జానకి అంటూ నిలదీస్తుంది మల్లిక. అయినా ఆపు దేనికి తీసుకున్నారు దేవుడికే తెలియాలి అంటుంది.
నేను తప్పు చేశాను కరెక్టే కానీ దాని కోసం ఇంటిని పోగొట్టుకోలేము కదా, నన్ను అర్థం చేసుకొని కొట్టుని తాకట్టు పెట్టడానికి అందరూ ఒప్పుకోండి అని రిక్వెస్ట్ చేస్తాడు రామ. ఈ ఇంటిని మళ్లీ తాకట్టు పెట్టను నా కష్టంతోనే స్వీట్ కొట్టు అప్పు తీరుస్తాను అంటాడు రామ. ఇలాగే ఏదో ఒకటి చెప్పి ఉమ్మడి ఆస్తిని ఉమ్మడిగానే పోగొట్టేలాగా ఉన్నారు ఎవరికి ఏమి మిగిల్చేలాగా లేరు అంటుంది మల్లిక. మాకు తెలియకుండా ఒక తప్పు చేశావు ఇంట్లో వాళ్లకి రాకూడని ఆలోచనలు వచ్చేలాగా చేసావ్.
రామని మాటలతో బాధపెడుతున్న జ్ఞానంబ..
ఇప్పుడు కొట్టు తాకట్టు పెట్టి ఇంకొక తప్పు చేయకు ఆ కాగితాలు అక్కడ పెట్టు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్ఞానంబ. మరోవైపు తల్లి మాటలు మల్లిక మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు రామ. చేయని దానికి తోడుగా ఉండకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు నేను ఏనాడు నా సుఖం కోసం సంతోషం కోసం ఆలోచించలేదు అనుకుంటాడు రామ. మీరు ఇలా ఎందుకు బాధపడుతున్నారు స్కూల్లో చదువుకోకపోయినా జీవితంలో చదువుకున్నారు.
అవి అన్ని కోపంలో వచ్చిన మాటలు కాదు బాధలోనూ, బయం తోని వచ్చిన మాటలు అందుకని ఒకరికి ఒకరు కాకుండా పోతామా కుటుంబ అన్నాక కొన్నిసార్లు ఇలాంటి సందర్భాలు వస్తాయి, కాస్త ఓపిక పడితే మళ్లీ మంచి రోజులు వస్తాయి అంటుంది జానకి. మీరు అన్నది నిజమే కానీ అందరూ నేను చేసిన తప్పుని చూస్తున్నారు కానీ దాని వెనుక కారణాన్ని చూడటం లేదు, ఆఖరికి అమ్మ కూడా నా ప్రయత్నాన్ని వెనక్కి లాగడం నాకు ఏదోలాగా ఉంది అంటాడు రామ.
భర్తకి ధైర్యం చెబుతున్న జానకి..
ఆవిడ మాత్రం ఏం చేస్తారు చెప్పండి ఎంత ఇంటి పెద్ద అయినా అందరి మాటలకి ఒక్కొక్కసారి తలవంచక తప్పదు. ఇది కాకపోతే ఇంకేదైనా అవకాశం దొరుకుతుంది గట్టిగా ప్రయత్నం చేయండి అంటూ ధైర్యం నూరు పోస్తుంది జానకి. సరేనండి ఏం చేసినా సరే ఈ ఇంటిని కాపాడుకోవాలి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి డబ్బు అప్పడుగుతాను అంటూ బయలుదేరుతాడు రామచంద్ర.
అనుకున్నవన్నీ జరిగేలా చూడమని దేవుడికి దండం పెట్టుకుంటుంది జానకి. మరోవైపు రామ అన్న మాటల్ని ఆలోచిస్తూ ఉంటాడు విష్ణు. అన్నయ్య చేసింది తప్పు ఒప్పో తర్వాత విషయం కానీ అన్నయ్య కళ్ళలో బాధ కనిపిస్తుంది ఈ ఇల్లు రోడ్డున పడకుండా ఏదో ఒక సాయం చేయాలి అనుకుంటూ తను ఫ్రెండ్ కి ఫోన్ చేసి అప్పు అడుగుతాడు విష్ణు. అప్పుడే అక్కడికి వచ్చిన మల్లిక అంత డబ్బుతో మీకేం అవసరం అని అడుగుతుంది.
భర్తకి చివాట్లు పెట్టిన మల్లిక..
వచ్చిన కష్టం గురించి తెలుసు కదా, ఇప్పుడు అన్నయ్యకి తోడుగా ఉండడం నా బాధ్యత నాన్నకి పక్షవాతం వచ్చింది నేను కూడా ఎంతో కొంత సాయం చేయాలి అంటాడు విష్ణు. వాళ్లు చేసిన తప్పుకి మనం అప్పు కట్టడం ఏంటి అంటుంది మల్లిక. అలా అంటావేంటి మల్లికా తప్పు ఎవరు చేసినా ఇల్లు మనది కూడా రేపు ఇల్లు పోతే రోడ్డున పడాల్సింది మనమే అంటాడు విష్ణు.
మీరు అన్నది మరీ బాగుంది, వాళ్లు నిజంగా మోసపోలేదు ఆ డబ్బుతో ఎక్కడో ఏదో కొనుక్కున్నారు. అది అడ్డుపెట్టుకొని బావ గారే మనల్ని మోసం చేస్తున్నారు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ అన్నయ్య కి తోడుగా ఉండాలని అప్పు చేస్తే అది మన మెడకి చుట్టుకుంటుంది, రేపు వాళ్ళు మాకు ఏ సంబంధం లేదు అని చెప్తే అప్పుడు వాళ్ళు మనల్ని పీక్కు తింటారు.
మన ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారన్న అఖిల్..
అలా కాకపోయినా నువ్వు తెచ్చిన డబ్బంతా ఈ అప్పు తీర్చడానికే అయిపోతే రేపు మనం ఏమి బ్రతుకుతాము మన పిల్లల్ని ఎలా పోషిస్తాము ఇటువైపు మీ తమ్ముడు వాళ్ళు బాగా చదువుకున్నారు ఉద్యోగాలు తెచ్చుకుంటారు అటువైపు జానకి ఇంకా బాగా చదువుకుంది అటు ఇటు కాకుండా పోయేది మనమే అర్థం చేసుకోండి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మల్లిక. అదే సమయంలో బావగారి విషయంలో నువ్వు తప్పు చేశావు అంటుంది జెస్సి.
అంటే నా జాబ్ కోసమే అన్నయ్య అప్పు చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా అంటాడు అఖిల్. గ్యారెంటీగా నమ్ముతాను అందరం బాగోవాలని కోరుకునే వాళ్ళకి స్వార్థం ఉండదు ప్రేమ తప్ప అంటుంది జెస్సి. బావగారు వాళ్ళకి మనం అందరం బాగోవాలన్న స్వార్థం తప్పితే, కాళ్లు బాగోవాలన్న ఆశ లేదు అంటుంది జెస్సి. వాడు మన ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు అంటాడు అఖిల్.
భర్తకి నచ్చ చెప్తున్న జెస్సి..
నేనంటే నిన్న మొన్న వచ్చాను కానీ చిన్నప్పటి నుంచి మీ అన్నయ్యని నువ్వు చూస్తున్నావు అలాంటిది నువ్వే మీ అన్నయ్యని నమ్మకపోతే ఎలా అంటుంది జెస్సి. నువ్వు నన్ను ఎంత కన్విన్స్ చేయాలని చూసినా నాకోసం అన్నయ్య అప్పు చేసాడు అన్నది అబద్ధం, ఇదంతా వదిన ప్లాన్ తన తెలివితేటలతోనే అన్నయ్యని మోటివేట్ చేసి వాళ్ళ జీవితం బాగోవాలని ఆశపడుతుంది అంటాడు అఖిల్. జానకి అక్క అలాంటిది కాదు అంటుంది జెస్సి.
వదిన వల్ల ఎంత టార్చర్ అనుభవించానో నాకు తెలుసు, అయినా నా ఖర్చులకే నేను ఇంట్లో డబ్బులు అడుగుతాను అలాంటిది నాకెవడప్పిస్తాడు అంటాడు అఖిల్. నువ్వు తీసుకున్నట్టుగా నేను లైట్ తీసుకోలేను నా వంతు సహాయంగా నేను మా నాన్నని కొంచెం డబ్బులు అడుగుతాను అంటుంది జెస్సి. ఇప్పటివరకు పోయిన పరువు చాలు, నామీద రెస్పెక్ట్ ఉంటే సైలెంట్ గా ఉండు అంటే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అఖిల్.
అప్పు కోసం ప్రయత్నిస్తున్న రామచంద్ర..
మరోవైపు అప్పు కోసం వెళ్ళిన రామ జరిగిందంతా ఆ వ్యక్తికి చెప్పి ఇన్నాళ్లు మా అమ్మ నిలబెట్టిన గౌరవం పోయేలాగా ఉంది ఇప్పుడు ఆ బాధ్యత నా మీద పడింది బాబాయ్ అంటాడు రామ. డబ్బులు ఇవ్వడానికి నాకు ఏ ఇబ్బంది లేదు కాకపోతే పెద్ద మొత్తం కదా ఐదు రోజులు టైం కావాలి అని అడుగుతాడు అతను. అంతా సమయం లేదు బాబాయ్ అంటాడు రామ. తప్పుగా అనుకోకు ఇప్పటికిప్పుడు అంటే సర్దలేను అంటాడు అతను.
Janaki Kalaganaledu January 4 Today Episode:
పర్వాలేదులే బాబాయ్ అంటూ బాధగా వెనక్కి వచ్చేస్తాడు రామ. అదే సమయంలో గోవిందరాజులు కి పరీక్ష చేస్తున్న డాక్టర్ కాలు ఎలా ఉంది అని అడుగుతాడు. ఏమి మార్పు లేదని చెప్తాడు గోవిందరాజులు. నేను ఇప్పటివరకు ఇచ్చిన టాబ్లెట్స్ మళ్ళీ వాడండి ఆయిల్ కూడా మర్దనా చేయండి ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి అంటూ వెళ్ళిపోతాడు ఆ డాక్టర్.
తరువాత మామగారికి జానకి సపర్యలు చేయబోతే అడ్డుకుంటుంది జ్ఞానంబ. తరువాయి భాగంలో వీల్ చైర్ తెచ్చిన రామని ఆయనకి ఇవ్వాల్సిన బహుమతి ఇచ్చావు అంటూ చులకనగా మాట్లాడుతుంది జ్ఞానాంబ. నన్ను క్షమించమని రామ అడిగితే నువ్వు అడిగినంత సులభం కాదు క్షమించడం అంటుంది.