Janaki Kalaganaledu January 5 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మామ గారికి సేవ చేయబోతున్న జానకిని అడ్డుకుంటుంది జ్ఞానంబ. డాక్టర్ గారు చెప్పిన ఆయిల్ అయ్యగారికి మర్దన చేయు అంటూ చికితకి చెప్తుంది. నేను వెళ్లి రాగి జావా తీసుకువస్తాను అని జ్ఞానం అంటే మీరు ఎందుకు అత్తయ్య నేను చేసి తీసుకు వస్తాను అంటుంది జానకి. వద్దు నేనే చేసి తీసుకు వస్తాను అంటుంది జ్ఞానాంబ. ఆయిల్ మసాజ్ చేయబోతున్న చికితని ఆపి నేను మసాజ్ చేస్తాను అంటుంది మల్లిక.
తోటి కోడల్ని ఆడిపోసుకుంటున్న మల్లిక..
వద్దమ్మా నువ్వు మసాజ్ చేస్తే నరాలకి రక్తప్రసరణ జరగడం కాదు ఆ నరాలు తెగిపోయి జీవిత కాలం మంచం మీద ఉంటాను అంటాడు గోవిందరాజులు. చూశారా అమ్మగారు మీరు పని చేస్తానంటేనే భయపడిపోతున్నారు అంటుంది చికిత. నీవల్లే బంగారం లాంటి మావయ్య గారికి ఇలాంటి పరిస్థితి వచ్చింది, అత్తయ్య గారు ఏమి కొట్టాను అత్తయ్య గారు ఇంటి బాధ్యత నీకు అప్పచెప్పారో గాని వెళ్లిపోయే పరిస్థితి ఇంట్లో వాళ్ళందరూ బాధపడే పరిస్థితి వచ్చింది అంటుంది మల్లిక.
మల్లికని వారిస్తాడు గోవిందరాజులు. బాధ్యతలు మీద ఉంటే నిందలు కూడా తప్పవు అంటూ జానకిని చూసి బాధపడతాడు గోవిందరాజులు. మరోవైపు వంట చేసుకుంటున్న జ్ఞానాంబ దగ్గరికి వచ్చిన మల్లిక మీరు ఎందుకు వంట చేయటం నేను చేస్తాను అంటుంది. ఎందుకులే మల్లిక అంటుంది జ్ఞానాంబ. మీరు కష్టపడితే నేను చూడలేను అత్తయ్య అంటూ వగలు పోతుంది. అంతలోనే గోవిందరాజులు దగ్గుతో బాధపడుతూ భార్యని పిలుస్తాడు.
గోవిందరాజులు కి తృటిలో తప్పిన ప్రమాదం..
తను అందుబాటులో లేకపోవడంతో పక్కనే ఉన్న మంచినీళ్లు తీసుకోబోతు మంచం మీద నుంచి పడిపోతాడు. ఇదంతా గమనించిన జానకి దంపతులు పరిగెత్తుకుంటూ వెళ్లి, ఆయనకి సపర్యలు చేస్తారు. జ్ఞానంబ వాళ్ళు పరిగెత్తుకొని వస్తారు. ఏం జరిగింది అంటే జరిగింది చెప్తుంది జానకి. మీకు ఇలాంటి పరిస్థితి రాకూడదని మీకోసం వీల్ చైర్ తీసుకొచ్చాను. అంటూ గోవిందరాజులు చూపిస్తాడు రామ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటూ కోపంగా అడుగుతుంది జ్ఞానంబ.
వీల్ చైరుంటే నాన్నకి ఇలాంటి ఇబ్బంది ఉండదు అంటాడు రామ. మంచి పని చేసావ్ ఈ వయసులో మీ నాన్నకి ఇవ్వవలసిన బహుమతి ఇచ్చావు అంటుంది కోపంగా. కావాలంటే నన్ను కొట్టు అంతేకానీ ఇలా ద్వేషించొద్దు అంటూ చేతులు పట్టుకొని బ్రతిమాలితాడు రామ. నువ్వు మీ తమ్ముడు కోసం అప్పు చేసి ఉండొచ్చు కానీ నాకు చెప్పకుండా మోసం చేశావు, నువ్వు అడిగినంత తేలిక కాదు నిన్ను క్షమించడం అంటుంది జ్ఞానంబ.
ఆనందంతో గంతులు వేస్తున్న మల్లిక..
అత్తగారు బావగారిని అలా తిట్టడం మల్లిక కి ఎంతో సంతోషం అనిపిస్తుంది. నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తామని అలా అనకుండా ఉండాల్సింది అంటూ భార్యని మందలిస్తాడు గోవిందరాజులు. మరవైపు తన గదిలోకి వచ్చి ఆనందంతో గంతులు వేస్తుంది మల్లిక బావగారు చేసిన పని వల్ల వేరేగా కాపురం వెళ్లాలన్న కోరిక తీరిపోతుంది అనుకుంటూ ఆనందపడిపోతుంది. అదే విషయాన్ని లీలావతికి ఫోన్ చేసి చెప్తుంది. ఆశ్చర్యపోయిన లీలావతి అదెలా సాధ్యమైంది అని అడుగుతుంది.
అప్పుడు జరిగిందంతా చెప్పి ఉండడానికి ఒక ఇల్లు చూడమంటుంది మల్లిక. నా ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీగా ఉంది అంటూ ఆశగా చెప్తుంది లీలావతి. నాకున్న లెవెల్ కి నీ ఇల్లు సరిపోదు అంటూ తనకు ఎలాంటి ఇల్లు కావాలో విడమరిచి చెప్తుంది. అలాంటి ఇల్లులు ఆత్రేయపురంలో ఎందుకు ఉంటాయి అంటుంది లీలావతి. లేకపోతే కట్టిద్దాం అంటుంది మల్లిక. అసలే అప్పుల్లో ఉన్నారు ఎలా కడతావే అంటుంది లీలావతి.
కొత్త ఇంటి కోసం ప్లాన్ చేస్తున్న మల్లిక..
అప్పు మా బావగారిది అంతేగాని నాది కాదు మాకు రావలసిన వాటాలో నుంచి డబ్బులు తీసుకొని ఇల్లు కడతాను ముందా సంగతి చూడు అంటూ ఫోన్ పెట్టేస్తుంది మల్లిక. దీనికొన్న ఆవేశానికి ఆలకించేంతకి ఆకాశం అంత యాక్టింగ్ చేస్తుంది అంటూ తిట్టుకొని ఫోన్ పెట్టేస్తుంది లీలావతి. మరోవైపు అప్పు ఎలా తీర్చాలో అంటూ ఆలోచిస్తుంటారు రామ దంపతులు.
అప్పు తీర్చడం ఎలాగో అర్థం కావటం లేదు చాలామందిని అడిగాను కానీ పెద్ద మొత్తం కదా ఇప్పటికిప్పుడు అందుబాటులో లేదు అంటున్నారు అంటాడు రామ. వాళ్ళు చెప్పింది నిజమే మనం అడిగినప్పుడు చాలా పెద్ద మొత్తం కదా అంటుంది జానకి. అయినా ఆ చరణ్ గాడు ఇలా నమ్మించి మోసం చేస్తాడు అనుకోలేదు వాడి మాటల్లో ఎక్కడ అనుమానం కనిపించలేదండి అంటాడు రామ. మోసం చేసే వాళ్ళు అలాగే ఉంటారు. మన నమ్మకంతోనే వాళ్ళ వ్యాపారం సాగుతుంది అంటుంది జానకి.
ఏదో బలమైన కారణం ఉందంటున్న జానకి..
అయినా వాడు చేసిన తప్పుకి మనం ఎందుకు శిక్ష అనుభవించాలి మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్లే వెతుకుతారు కదా అంటాడు రామ. ఏమని కంప్లైంట్ ఇస్తాం, మన దగ్గర ఏం సాక్ష్యం ఉందని కంప్లైంట్ ఇస్తాం ఒకవేళ మనం కంప్లైంట్ ఇచ్చిన తీసుకుంటారు ఏమో కానీ తనని వెతకటానికి పట్టుకోడానికి కొన్ని రోజులు నెలలు పట్టొచ్చు కానీ మనకున్న సమయం చాలా తక్కువ అంటుంది జానకి. భాస్కరరావు బాబాయ్ మా అమ్మ వాళ్ళతో చాలా చనువుగా ఉండేవారు అలాంటి ఆయన కూడా అంత కఠినంగా మాట్లాడడం చాలా బాధగా ఉంది అంటాడు రామ.
Janaki Kalaganaledu January 5 Today Episode:
ఆలోచనలో పడ్డ జానకి మీరంటే నాకు ఒక అనుమానం వస్తుంది, ఆయనకి మనం అంటే చాలా గౌరవం ఉంది అందుకే విష్ణు కి 500000 కి వడ్డీ కట్టకపోయినా అడగలేదు, అదే నమ్మకంతో మీరు 20 లక్షలు అడిగినప్పుడు చిన్న సంతకంతో అంత డబ్బు అప్పుగా ఇచ్చారు. మన మీద అంత అభిమానం చూపించే ఆ వ్యక్తి, ఇంతకట్టుగా మాట్లాడారు అంటే దీని వెనుక ఏదో బలమైన కారణం ఉందనిపిస్తుంది అంటుంది.
అదే సమయంలో ఆ ఇంటి పేపర్స్ కన్నబాబు రిఫర్ చేస్తూ ఉంటాడు. తరువాయి భాగంలో డబ్బు కోసం బాధపడుతున్న రామా దంపతులు దగ్గరికి వచ్చిన జెస్సి ఈ డబ్బులు మీ తమ్ముడు కోసమే అప్పు చేశారంటే నేను నమ్ముతాను ఒకసారి మా నాన్నకి ఫోన్ చేసి డబ్బులు అడగండి అంటుంది.