Janaki Kalaganaledu July 12 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. అంత్యాక్షరి అద్భుతంగా ముగియడంతో కుటుంబ సభ్యులు సంతోషంగా కనిపిస్తారు. ఆ తర్వాత చికిత ఈ సమయంలో డాన్సులు చేస్తే కూడా బాగుంటుంది అనటంతో దానికి అందరూ సై అంటారు. ఇక మల్లిక మాత్రం సై సై అంటూ మొదట తన భర్తతో వెళ్లి బాగా డాన్స్ చేస్తుంది. ఆ తర్వాత గోవిందరాజులు మల్లిక డాన్స్ ను వెటకారంగా కౌంటర్ వేస్తాడు.
జానకి, రామల ఏకాంతం కోసం ప్లాన్ చేసిన జ్ఞానంబ దంపతులు..
దాంతో మల్లిక ఫీల్ అయినట్లు కనిపించడంతో జ్ఞానంబ అలా ఏమి కాదు బాగా చేశావు అని ప్రశంసిస్తుంది. ఆ తర్వాత జానకి దంపతులు కూడా రొమాంటిక్ పాటతో డాన్స్ చేయగా వారి మధ్య ఉన్న మంచి సానిహిత్యమే ఉందని కానీ వారికి ఏకాంతంగా గడిపేందుకు సమయం లేదు అని జ్ఞానంబ దంపతులు అనుకుంటారు. దాంతో వారికి అందించాలి అని గోవిందరాజులు జ్ఞానంబ ఒక ప్లాన్ చెబుతాడు. ఇక ఆ ప్లాన్ కోసం వాళ్లు ఇంటికి వెళ్లాలని అనుకొని.. ఆ రెండు జంటలను పొలం దగ్గర సాయంత్రం వరకు ఎంజాయ్ చేయమని చెప్పి వాళ్లు ఇంటికి బయలుదేరుతారు.
సీన్ కట్ చేస్తే..
జ్ఞానంబ దంపతులు జానకిల బెడ్ రూమ్ ను పువ్వులతో అలంకరిస్తారు. ఆ సమయంలో గోవిందరాజులు జ్ఞానంబ తో పాత జ్ఞాపకాలను పంచుకుంటూ పాట పాడుతూ ఉంటాడు. ఇక జ్ఞానంబ చాలు సరసాలు అన్నట్లుగా వెటకారంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత జ్ఞానంబ మనసులో వారుసుడు కోసం ఆలోచిస్తున్న విషయాన్ని గోవిందరాజులు మాట్లాడుతాడు.
Janaki Kalaganaledu July 12 Today Episode: జ్ఞానంబతో ఎమోషనల్ గా మాట్లాడుతున్న గోవిందరాజులు..
నువ్వు వారసుడి కోసం బాగా తపన పడుతున్నావు కదూ అంటూ కాసేపు ఎమోషనల్ సీన్ లోకి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత అన్ని ఏర్పాట్లు చేసి బయటికి వెళ్తారు. అప్పుడే పొలం నుండి విష్ణు, రామ దంపతులు వస్తారు. ఇక వాళ్ళు రావడంతోనే జ్ఞానంబ, గోవిందరాజులు వారికి ఎదురుపడతారు.
ఆ సమయంలో జ్ఞానంబ ఈరోజు గుడిలో పడుకుంటే మంచిదని.. అది కూడా పెళ్లి కాని వాళ్లే అని మీరు మాత్రమే ఇక్కడ ఉండండి అని అనటంతో వెంటనే జానకి మేము కూడా వస్తాము అని అంటుంది. ఇక మల్లిక కూడా డ్రామా క్రియేట్ చేస్తుంది. దాంతో గోవిందరాజులు వెంటనే సెటైర్ వేస్తాడు. ఆ తర్వాత జ్ఞానంబ జానకిని పక్కకు తీసుకొని వెళ్లి అసలు విషయం చెబుతుంది.
కార్యానికి నో అంటున్న రామ..
ఇక అందరు వెళ్లాక జానకి రామను గదిలోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ పూలతో అలంకరించిన వాటిని చూసి.. రామ ఆశర్యపోతాడు. జానకి కార్యానికి సపోర్ట్ చేస్తున్న కూడా.. రామ మాత్రం మీ కల తీరినాకే అమ్మ కోరిక తీరుస్దాం అని అంటాడు. దాంతో జానకి కూడా సరే అంటుంది. మరి వీరు చేసిన ప్లాన్ గురించి తరువాయి భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం.