Janaki Kalaganaledu March 25 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో రామ చూసుకోకుండా ఒక వ్యక్తిని గుద్దేస్తాడు. అతను ఇంగ్లీషులో తిడతాడు. రామ కూడా వచ్చిరాని ఇంగ్లీషులో సారీ చెప్తాడు అయినా కూడా అతను ఊరుకోడు. అంతలోనే అక్కడికి వచ్చిన జానకి జరిగింది తెలుసుకొని అతన్ని ఇంగ్లీషులో దుమ్ము దులుపుతుంది. ఎదుటి వ్యక్తి తలదించుకొని వెళ్ళిపోతాడు.

రూమ్ చూసి ఆశ్చర్యపోతున్న రామ..

మీరు ఏమన్నారో నాకు అర్థం కాలేదు కానీ వాడి మొహం మాడిపోవడం మాత్రం అర్థం అయింది అదరగొట్టేసారు అంటూ జానకిని మెచ్చుకుంటాడు రామ. తన రూమ్ కి వెళ్తున్న దారిలో కిందన నడవాలంటే భయం వేస్తుంది ఎక్కడ బండలు మాసిపోతాయో అని అంత బాగున్నాయి అంటాడు రామ. వెయిటర్ వాళ్ళ రూమ్ కీ ఇవ్వడంతో లోపలికి వెళ్లిన రామ గదిని చూసి ఆశ్చర్యపోతాడు.

ఈ గదికి అద్దే ఎంత ఉంటుంది ఒక 500 ఉంటుందా అని అడుగుతాడు రామ. డబ్బులు గురించి ఆలోచించడం మానేసి ఎంజాయ్ చేయండి అంటుంది జానకి. అంతేనంటారా అంటాడు రామ. అంతేనా అంటే ఇంకా బోలెడు ఉన్నాయి ఈ రిసార్ట్ లో కాసేపట్లో లక్కీ కపుల్ గేమ్స్ స్టార్ట్ చేస్తున్నారు మన పేర్లు కూడా ఇచ్చాను ఆ పోటీలో గెలవాలంటే చాలా గేమ్స్ ఆడాలి అంటుంది జానకి.

భర్తకి ధైర్యం చెబుతున్న జానకి..

చెడుగుడు, దాగుడుమూతలు కదా అదరగొట్టేస్తాను అంటాడు రామ. ఈ ఆటలు వాళ్లు ఆడించరు అంటుంది జానకి . నాకు అవే వచ్చు అంటాడు రామ. అవన్నీ నేను చూసుకుంటాను మిమ్మల్ని గెలిపించడానికి నేనున్నాను కదా అంటుంది జానకి. తర్వాత ఇద్దరూ రెడీ అయ్యి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు ఇందాక రామ డాష్ ఇచ్చిన వ్యక్తి అక్కడ ఉంటాడు.

రామని కోపంగా చూస్తూ ఉంటాడు. వీడు ఇక్కడ కూడా తగులుకున్నాడా అని తిట్టుకుంటాడు రామ. జానకి కి కూడా చూపిస్తాడు. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే జంట ఎప్పుడు లక్కీ కపులే ఇప్పుడు ఏ జెంట కి హై లెవెల్ అండర్స్టాండింగ్ ఉన్నాయో కొన్ని అండర్స్టాండింగ్ గేమ్స్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఒకరోజు ఫ్రీ అంటుంది యాంకర్.

భర్తని ఆవేశపడొద్దు అంటున్న జానకి..

ఫస్ట్ గేమ్ అంటూ ఇద్దరి మధ్యలో బాల్ పెట్టి చుట్టూ తిరగమంటుంది యాంకర్. ఇది భార్యాభర్తల మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ ని ప్రతిబింబిస్తుంది అంటూ గేమ్ స్టార్ట్ చేస్తుంది. ఇందాక రామని కోపంగా చూసిన వ్యక్తి గేమ్ లో ఓడిద్దామని చూస్తాడు కానీ తనే గేమ్ లో ఓడిపోతాడు. గేమ్ లో రామ వాళ్లు గెలుస్తారు. ఆ ఎస్ఐ నుంచి తప్పించుకుని వస్తే వీడు మరో ఎస్ఐ లాగా తగులుకున్నాడేంటి ఒక చూపు చూడమంటారా అని అడుగుతాడు రామ.

అన్యాయం బెదిరిస్తుందేమో కానీ గెలవదు ఆవేశం వద్దు అంటుంది జానకి. రెండో రౌండు కాంపిటీషన్ కి స్మాల్ బ్రేక్ అంటుంది యాంకర్. మరోవైపు ఇంట్లో ఉన్న మల్లికఇంట్లో జానకి లేకపోవడం కాదుగానీ ఈ పోలేరమ్మ ప్రతిదానికి నన్ను పీకు తింటుంది ఇకపై నా జీవితం ఎలా ఉండబోతుందో ఏంటో జాతకం చెప్పించుకోవాలి అనుకుంటుంది.

జ్యోతిష్యుడు మాటలకి కంగారుపడ్డ మల్లిక..

అంతలోనే జాతకాలు చెప్పేవాడు వీధిలో వెళుతుంటే పిలిపిస్తుంది. లోపలికి వచ్చిన అతనితో జాతకాలు బానే చెప్తావా అని అడుగుతుంది మల్లిక. పోయిన వారం వచ్చినప్పుడు పక్కింటి ఆయనకి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుందని చెప్పాను ఇప్పుడు ఆయనకి పెద్ద కర్మ జరుగుతుంది అంటాడు జాతకం చెప్పే వ్యక్తి. ఆ మాటలకి కంగారుపడుతుంది మల్లిక. కంగారు పడకండి ఎవరి జాతకం వాళ్ళది అంటాడు జ్యోతిష్యుడు.

ముందు నా జాతకం కాదు జానకి జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటుంది మల్లిక. పేరు చెప్పండి అని జ్యోతిష్యుడు అడిగితే ముందు ఇంటి పెద్ద కోడలు జానకి జోష్యం చెప్పండి అంటుంది మల్లిక. గవ్వలు వేసి ఆమెది రాజయోగము కష్టాల సముద్రం ఈదినా ఒడ్డుకు చేరుకుంటుంది అంటాడు జ్యోతిష్యుడు. సరే ఇంటి రెండో కోడలు జాతకం చెప్పు అంటుంది మల్లిక.

రామ దంపతులని అనుమానిస్తున్న మల్లిక..

ఆమెని పిలవండి అంటే తను కూడా ఇంట్లో లేదు అంటుంది. మలయాళం ఆవిడ వైపు అనుమానంగా చూస్తాడు. ఊరుకో అన్నట్లుగా సైగ చేస్తుంది మల్లిక. మళ్లీ గవ్వలు వేసిన జ్యోతిష్యుడు. ఈ జాతకం దరిద్ర కొట్టు జాతకం తను ప్రశాంతంగా ఉండదు పక్క వాళ్ళని ప్రశాంతంగా ఉంచదు ఈ మనిషిని ఇంటికి ఎంత దూరంగా ఉంచితే ఇంట్లో వాళ్ళు అంత ప్రశాంతంగా ఉంటారు అంటాడు జ్యోతిష్యుడు. ఆ మాటలకి నవ్వుతాడు మలయాళం.

అంత దరిద్ర కొట్టు జాతకం ఈవిడదే అంటూ మల్లికని చూపిస్తాడు. మలయాళాన్ని చితకబాదుతుంది మల్లిక. వాళ్ళ జాతకం అంత బాగుంటుందా, అన్యోన్య దాంపత్యం అంటున్నాడు కొంపదీసి వీళ్ళు హనీమూన్ కి గాని చెక్కెయ్యలేదు కదా ఇప్పుడు ఏం చేయడం అనుకుంటుంది మల్లిక. మరోవైపు గేమ్ లో ఆకరి రౌండ్ స్టార్ట్ చేస్తుంది యాంకర్. ఈ రౌండ్ లో భర్త భార్యని ఎత్తుకొని నిలబడాలి.

ఎక్కువసేపు ఎవరు ఎత్తుకొని నిలబడితే వాళ్లే గెలిచినట్లు. ఈ ఆటలో కూడా పరమార్ధం ఉంది. పెళ్లయిన కొత్తలో దంపతుల మధ్య ప్రేమ అధికంగా ఉంటుంది తరువాత ఒత్తిళ్ల వలన ఆ ప్రేమ తగ్గుతూ వస్తుంది.ఈ ఒత్తిళ్ళని ఆటుపోట్లని తట్టుకుంటూ ఎవరి ప్రేమ ఎక్కువసేపు నిలబడుతుందో అనేదే ముఖ్యం. భార్యని ఎత్తుకున్న కొద్ది క్షణాల్లో ప్రేమ లాగానే ఓపిక కూడ పూర్తి సామర్థ్యంతో ఉంటుంది.

Janaki Kalaganaledu March 25 Today Episode విజయాన్ని చేజిక్కించుకున్న రామదంపతులు..

కాసేపటి తర్వాత భార్య బరువుగా అనిపిస్తుంది. ఎవరైతే ఓపికని కూడగట్టుకుంటారో వాళ్లకే గెలిచే అవకాశాలు ఉంటాయి అంటూ గేమ్ స్టార్ట్ చేస్తుంది యాంకర్. అందులో కూడా జానకి వాళ్ళు గెలుస్తారు. అయినా రామ జానకిని కిందకు దించడు. రామా గారు గేమ్ అయిపోయి చాలా సేపు అయింది ఇంకా మీరు జానకి గారిని కిందకి దించండి. ట్రాన్స్లోంచి బయటికి రండి అంటుంది యాంకర్.

వాళ్ళిద్దరి మధ్య ప్రేమ జీవితకాలం ఒకే లాగా ఉంటుందని నిరూపించారు అంటూ చప్పట్లు కొడుతుంది. ఆమెతోపాటు మిగతా వాళ్ళందరూ కూడా చేతులు కలుపుతారు. వాళ్ళిద్దరికీ మెడలో దండ వేసి సత్కరిస్తుంది యాంకర్. జానకి రామకి మోకాలు మీద కూర్చొని రెడ్ హార్ట్ ఇస్తుంది తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మార్చి 25, 2023 at 12:58 సా.