Janaki Kalaganaledu: ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ తన పిల్లలందరూ కలిసే ఉండాలని కోరుకునే తల్లిదండ్రుల కథ ఈ జానకి కలగనలేదు.
అఖిల్ కి ఉద్యోగం వచ్చిన ఆనందంలో కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉంటారు. అఖిల్ కి అందరూ కంగ్రాట్స్ చెప్తారు. ఈ ఉద్యోగం రావడంలో మీ పాత్ర లేదు కదా అని భర్తని నిలదీస్తే ఇంటిని తాకట్టు పెట్టిన విషయం చెప్తాడు రామ. మీరు మోసపోయారు అంటూ వాపోతోంది జానకి. అలాంటిదేమీ లేదు మీరు భయపడకండి ఇంట్లో ఎవరికీ చెప్పకండి అంటూ బలవంతంగా ఆమె దగ్గర మాట తీసుకుంటాడు.
సంతోషంలో ఉన్న జ్ఞానం బారుబయట భోజనాలు ఏర్పాటు చేస్తుంది. అందరూ సంతోషంగా ఉన్న జానకి మాత్రం ముభావంగా ఉంటుంది. మొత్తానికి ఉద్యోగం రావడం ఇష్టం లేదు అని అపార్థం చేసుకుంటాడు అఖిల్. గుడికి వెళ్లి కొడుకు పేరు మీద అర్థం చేయించిన జ్ఞానంబ దంపతులు కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోతుంది. కంగారుపడిన ఆ దంపతులకు పంతులుగారు ధైర్యం చెప్పి పరిష్కారం కూడా చెప్తారు. పూజ చేసిన కలశాన్ని ఇచ్చి తొమ్మిది రోజులు పూజ చేయమంటారు.
కలశాన్ని ఇంటికి తెచ్చి హాల్లోనే ప్రతిష్టిస్తుంది జ్ఞానాంబ. వాకిట్లో కూర్చుని చీర కుట్టుకుంటున్న మల్లికాకి ఒక వ్యక్తి రావడం చూసి స్వీట్స్ ఆర్డర్ కోసం వచ్చారేమో అనుకొని అతన్ని పలకరిస్తుంది. కానీ తను స్వీటు ఆర్డర్స్ ఇవ్వటం కోసం కాదని రామ చేత సంతకాలు తీసుకోవడానికి వచ్చాడు అని తెలుసుకొని నివ్వెర పోతుంది. రామా 20 లక్షలు అప్పు తీసుకున్నాడని అతని ద్వారా తెలుసుకున్న మల్లికా గుండెలు బాదుకుంటుంది.
రామ లేకపోతే తర్వాత వస్తాను అని అతను ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇంట్లోకి తీసుకెళ్లి విషయం అంతా అతని చేతే వాళ్ళ అత్తగారు వాళ్ళకి తెలుసేలాగా చేస్తుంది. 20 లక్షలు అప్పు తీసుకున్నాడు అని తెలిసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఉమ్మడి కుటుంబంలో ఆస్తిని సంతానికి వాడుకుంటున్నారు అంటూ అఖిల్, మల్లికలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతారు. ఇది నిజమేనా అంటూ అప్పుడే వచ్చిన రామని నిలదీస్తారు. ముందు నిజం చెప్తే తమ్ముడు బాధపడతాడని ఆలోచిస్తాడు కానీ అదే తమ్ముడు రామని, జానకిని నానా మాటలు అంటుంటే విని భరించలేక నిజం చెప్తాడు.
అఖిల్ ఉద్యోగం కోసం 20 లక్షలు తీసుకున్నానని తెలిస్తే తను బాధపడతాడని అంటూ మొత్తం చెప్తాడు. డబ్బు నువ్వు తీసుకొని నింద నామీద వేస్తున్నావా అంటాడు అఖిల్. ఎంత అమాయకంగా ఉండేవాడివి వదిన ట్రైనింగ్ లో ఇలా తయారయ్యావు అంటాడు అఖిల్. ఇదే అవకాశం ఉందా మల్లిక వేరే కాపురం ప్రపోజల్ మళ్ళీ తెస్తుంది. నేను చెప్పింది నిజం కావాలంటే మీకు నిరూపిస్తాను రండి అని తండ్రిని, తమ్ముళ్ళని తీసుకొని వెళ్తాడు రామ.
అక్కడికి వెళ్లిన తరువాత ఆఫీస్ ఖాళీగా ఉండటం చూసి నివ్వే రపోతారు. తాము మోసపోయామని తెలుసుకొని గోవిందరాజులు చాలా బాధపడతాడు. మొహాలు వేలాడేసుకుని ఇంటికి వచ్చిన రామ వాళ్ళని గుమ్మంలోనే ప్రశ్నిస్తుంది జానకి. కానీ బాధతో సమాధానం చెప్పలేకపోతాడు రామ. కానీ జరిగిందంతా చెప్పి గోవిందరాజులు చాలా బాధపడతాడు.
మల్లిక మాత్రం చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు మీ దంపతులిద్దరూ సినిమాల్లోకి బాగా పనికొస్తారు అంటూ బావగారిని తోటి కోడల్ని నానా మాటలు అంటుంది. మేము అఖిల్ కోసమే డబ్బు కట్టాము అంటే అఖిల్ కూడా నమ్మడు. ఉమ్మడి కుటుంబంలో ఎంత ఖర్చు పెట్టినా లెక్క ఉండదు కాబట్టి సొంతంగా ఆస్తులు కొనుక్కున్నారు. ఆరోజు ఆస్తులు పంచమంటే నానా మాటలు అన్నారు ఈరోజు మాకు బూడిద మిగిలింది.
Janaki Kalaganaledu: కథలో కొత్తదనాన్ని కోరుకుంటున్న ప్రేక్షకులు.. మరీ ఇంత సాగదీతా?
ఈరోజు లెక్కలు వేసి ఆస్తులు పని చేయండి మా మటుకు మేము వెళ్లిపోతాం అంటుంది మల్లిక. అఖిల్ కూడా అదే మాట మీద ఉంటాడు. రామ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాడా? మల్లికా నోరు మూయిస్తాడా? జానకి భర్తకి ఏ విధంగా సహాయ పడగలుగుతుంది? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు వేచి చూడాల్సిందే.