Janaki Kalaganaledu: తన కుటుంబానికి మంచి చేయాలనుకుని నిలువునా మోసపోయి తన కుటుంబ సభ్యుల చేతే నానా మాటలు పడుతున్న ఒక కొడుకు కథ ఈ జానకి కలగనలేదు.

ఇదంతా చూస్తున్న భాస్కరరావు తన డబ్బు వెంటనే కట్టమంటాడు లేకపోతే ఇంటిని వేలం వేస్తాను అంటాడు. ఆ మాటలకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఉమ్మడి కుటుంబం అని గోలపెట్టారు ఇప్పుడు అనుకున్నదంతా అయింది ఇంటి జోలికొస్తే ఊరుకోను అంటుంది మల్లిక. బావగారు మీద అలా అరవడం తప్పు ఉంటుంది జెస్సి. మా అన్నయ్య ఇదివరకు లాగా లేడు వదిన మార్చేసింది అంటాడు అఖిల్.

తల్లిని క్షమాపణ కోరిన రామ అతనిని క్షమించదు, నువ్వే మారావో,నిన్ను ఎవరైనా మార్చారో తెలియదు కానీ నువ్వు ఇంతకు ముందులాగా లేవు అంటుంది జ్ఞానాంబ. నా కారణంగా మీరు తిట్లు తింటున్నారు అంటూ భార్యకి క్షమాపణలు చెప్తాడు రామ. పర్వాలేదు నేను మీకు కష్టాల్లో కూడా ఉంటాను అంటుంది జానకి. ఇంటిని విడిపించడం కోసం స్వీట్ షాప్ ని తాకట్టు పెడదామనుకుంటాడు రామ.

అదే విషయాన్ని ఇంట్లో చెప్తే ఎవరూ ఒప్పుకోరు సరి కదా రామని నా నా మాటలు అంటారు. అన్నకి సాయం చేద్దామని విష్ణు అంటే మల్లిక భర్తకి చివాట్లు పెడుతుంది. జెస్సీ హెల్ప్ చేస్తానంటే అఖిల్ ఒప్పుకోడు. వీళ్లందరి ప్రవర్తనకి రామ బాధపడతాడు. చివరికి అప్పు కోసం ఎవరెవరికి దగ్గరకో వెళ్తాడు కానీ ఎక్కడా అప్పు పుట్టదు.

అత్తయ్యతో చెప్పి చేయండి అంటుంది జానకి. అదే విషయాన్ని జ్ఞానాంబ తో చెప్తే ఇంటిని తాకట్టు పెట్టి తప్పు చేశావు ఇప్పుడు కొట్టును తాకట్టు పెట్టి మరో తప్పు చేయకు ఆ పేపర్స్ అక్కడ పెట్టు అంటూ కఠినంగా మాట్లాడుతుంది. తప్పు చేయటం మీ బాధ్యత తీర్చడం మాత్రం ఉమ్మడి బాధ్యత అంటూ బావగారిని తోటి కోడల్ని ఆడిపోసుకుంటుంది మల్లిక. భార్యని వారిస్తాడు విష్ణు.

అఖిల్ కూడా రామాదే తప్పు అన్నట్లు మాట్లాడుతాడు. అన్నయ్య చేసింది తప్పు ఒప్పుకో తర్వాత ముందు ఇంటిని కాపాడుకోవాలి అంటూ తన ఫ్రెండ్ ని అప్పుడు అడుగుతాడు విష్ణు. ఆ మాటలు విన్న మల్లికా భర్తకి నానా చీవాట్లు పెడుతుంది. మరోవైపు అఖిల్ చేసింది తప్పు అని జెస్సి అంటే, నువ్వు వాళ్ళని నమ్మకు, వాళ్లు మన ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు అంటూ జెస్సీ మీద కోప్పడతాడు అఖిల్.

తప్పు చేసింది వాళ్లే.. వాళ్లే తీర్చుకుంటారులే నువ్వేమీ మీ నాన్నగారిని డబ్బులు అడగవద్దు అంటాడు. మరోవైపు తల్లి అలా మాట్లాడటంతో చాలా బాధపడతాడు రామ. అవి బాధ నుంచి వచ్చిన మాటలే కానీ కోపం నుంచి వచ్చినవి కాదు, అంటూ ధైర్యం చేస్తుంది జానకి. అంతలో జెస్సి వచ్చి మీరు మీ తమ్ముడు కోసమే అప్పు చేశారని నేను నమ్ముతాను మా నాన్నగారిని డబ్బులు అడగండి అని చెప్తుంది.

నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం కానీ ఈ సమయంలో మీ నాన్నగారిని డబ్బులు అడగడం బాగోదు అంటాడు రామ. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు సాయం చేసి నాకు జీవితాన్ని ఇచ్చావు కానీ నువ్వు కష్టంలో ఉండేటప్పుడు నేను ఏ సాయం చేయలేకపోతున్నాను అంటూ బాధపడుతుంది జెస్సి. మరోవైపు తండ్రికి వీల్ చైర్ తీసుకొస్తాడు రామ. మీ నాన్నగారికి సరి అయిన బహుమతి ఇచ్చావు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది జ్ఞనంబ.

అలా మాట్లాడొద్దు నేను చేసిన దానికి క్షమించు అంటాడు రామ. అది అంత తేలిక కాదు అంటుంది జ్ఞానాంబ. మన కుటుంబానికి అంతా విలువిచ్చే భాస్కర రావు గారు అంత తొందరగా అప్పు తీర్చమంటున్నారు అంటే దీని వెనక ఏదో బలమైన కారణం ఉంది అంటుంది జానకి. అలాంటి కారణాలేవీ నాకు కనిపించడం లేదు ఇది పెద్ద మొత్తం కదా అందుకే భయపడుతున్నారేమో అంటాడు రామా. కానీ జానకి అనుమానమే నిజమై ఇంటి పేపర్స్ కన్నబాబు చేతిలో ఉంటాయి. అప్పు త్వరగా వసూలు చేయమంటూ భాస్కరరావు మీద ఒత్తిడి తెస్తాడు కన్నబాబు. మీరు చెప్పినట్లే చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భాస్కరరావు.

Janaki Kalaganaledu ఎంతకీ కథ ముందుకి కదలడం లేదు.. మా సహనాన్ని పరీక్షిస్తుందంటున్న ప్రేక్షకులు..

నా మీదే ఛాలెంజ్ చేసావు కదా జానకి ఇప్పుడు ఏం చేస్తావ్ అంటూ కసిగా అనుకుంటాడు కన్నబాబు. మరోవైపు రాముడు ఒక్కడే అయిపోయాడు, చాలా టెన్షన్ పడుతున్నాడు నా వంతుగా సాయం చేస్తాను అంటూ గోవిందరాజులు తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి అప్పు అడుగుతాడు. రామ ఆ అప్పు తీర్చి ఇంటిని నిలబెట్టుకుంటాడా? జ్ఞానాంబ తన కొడుకుని క్షమిస్తుందా? అన్నయ్య అప్పు తన కోసమే చేశాడు అని అఖిల్ తెలుసుకుంటాడా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 8, 2023 at 3:00 సా.