Karthika Deepam December 27 Today Episode: ఈరోజు ఎపిసోడ్లో పండరి టాబ్లెట్ సరిగ్గా ఇస్తుందో లేదో అని ఆమె కి ఫోన్ చేయబోతుంది, అంతలోనే అక్కడికి వచ్చిన పండరి అమ్మ పొద్దున్న మీరు ఇచ్చిన టాబ్లెట్స్ ఇచ్చాను కానీ గుండెల్లో మంట అంటుంది ఏంటమ్మా అని కంగారుపడుతుంది. మందులు పనిచేయడం ప్రారంభిస్తుంది నువ్వేమీ కంగారు పడకు అంటుంది చారుశీల.
పండరిని ఎంక్వయిరీ చేస్తున్న చారుశీల..
పండరి వెళ్ళిపోయిన తర్వాత అందులో ప్రారంభిస్తున్నాయి అంటే నాకు తెలిసి ఇవాళ రేపో తనకి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది అని ఆనందపడుతుంది చారుశీల. మరోవైపు కార్తీక్ వాళ్ళని వెతుకుతున్న సౌందర్య అన్ని హాస్పిటల్స్, దేవాలయాలు వెతికాను కానీ ఎక్కడా కనిపించడం లేదు ఏంటండీ అని భర్తతో చెప్పి బాధపడుతుంది. అంటే వాళ్లకి మన దగ్గరికి రావడం ఇష్టం లేదు ఏమో అంటాడు ఆనందరావు.
అలా అనకండి అలా అంటే నా గుండె ఆగిపోతుంది వాళ్ళిద్దరికీ పిల్లలు అంటే చాలా ఇష్టం. దీపకి నా మాట అంటే వేదం,తను మనల్ని వదిలేసి ఉండలేదు. మీరు అన్నట్టు జరిగే అవకాశం లేదు అంటుంది సౌందర్య. అనుకున్నది జరగనప్పుడు దానికి వ్యతిరేకంగా ఆలోచించాలి అంటాడు ఆనందరావు. వాళ్ళ ఫోటోలు చూపించు మరి అడుగుతున్నాం కదా కనీసం చూసినవాళ్ళైనా చెప్పాలి కదా అంటుంది సౌందర్య. జరిగిన పరిస్థితులను బట్టి దీప సంగతి ఏమో కానీ కార్తీక్ మాత్రం మోనిత దగ్గరే ఉండాలి.
నిజం తెలిసిన వాళ్ళు మన చుట్టూనే ఉన్నారంటున్న ఆనందరావు..
ఇప్పుడు తను జైల్లో ఉంది. కార్తీక్ ఫోటో చూపించి శివలత అడిగినా కూడా తెలియదనే చెప్పింది అంటుంది సౌందర్య. తను అబద్ధం చెప్పిందేమో, అసలు నిజం తెలిసిన వాళ్ళు మన చుట్టూనే ఉన్నారేమో అంటాడు ఆనందరావు. అయితే నేను వెళ్లి కనుక్కుంటాను అంటుంది సౌందర్య. మనం నిజం తెలుసుకోవాలంటే వెళ్లి నేరుగా అడగడం కాదు, వాళ్ల చేత నిజం చెప్పించే ప్రయత్నం చేయాలి. నాక్కూడా అలాగే అనిపిస్తుంది కానీ ఎవరన్నది తెలియటం లేదు.
ముందైతే రేపు శివలతని అడుగుదాం అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతారు ఆ దంపతులు ఇద్దరు. మరోవైపు ఇంద్రుడికి క్షమాపణలు చెప్పుకుంటుంది దీప నీ గురించి ఏం తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ మా అబద్దం చాలా బాగా పెంచుతున్నావు అంటుంది. అలా అనకండి అమ్మ జోలమ్మ మా దగ్గర ఉండడం అదృష్టం అదే మాకు దేవుడు ఇచ్చిన వరం అంటాడు ఇంద్రుడు. కానీ మీ గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది దేవుడికి దయ లేదు.
ఇంద్రుడి రుణం తీర్చుకోలేమంటున్న దీప..
అంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడి మళ్ళీ ప్రాణాల మీదకు వచ్చిందంటే అంతకంటే దురదృష్టం ఏముంది అంటాడు. ఇంద్రుడు ఎక్కడ నిజం చెప్పేస్తాడో అని ఏంచేస్తాం ఇంద్రుడు నా ప్రాణాలకే ప్రమాదం లేకపోయి ఉంటే అందరం కలిసే ఉండేవాళ్ళం నావల్ల దీప కష్టపడుతుంది అంటాడు కార్తీక్. ఆవిడ ప్రాణానికి ప్రమాదం అని చెప్తే బాధపడుతున్నాను ఆయన ప్రాణాలు మీరు వేసుకున్నట్టు ఉన్నారు అనుకుంటాడు ఇంద్రుడు.
నా బాధంతా శౌర్య మాతో లేకపోయినా పర్వాలేదు వాళ్ళ నాన్నమ్మ వాళ్లతో ఉన్నా నాకు అంత బాధ అనిపించేది కాదు అంటుంది దీప. ఇప్పుడు వాళ్లతోనే ఉన్నారమ్మ అంటాడు ఇంద్రుడు. అదేంటి రాత్రే కదా పాపని చూపించావు అప్పుడే ఎప్పుడు తీసుకెళ్లావ్ అంటుంది దీప. నేను తీసుకెళ్లటం కాదమ్మా వాళ్లే వచ్చారు పెద్ద ఇల్లు కూడా తీసుకున్నారు ఇప్పుడు పాప చిన్న ఇంట్లో ఉంటుందన్న ఇబ్బంది లేదు అంటాడు ఇంద్రుడు. మీకు చెబుదాం అనుకున్నాను కానీ అందరూ పక్కనే ఉండటంతో మీకు ఫోన్ చేయలేకపోయాను అంటాడు ఇంద్రుడు.
కార్తీక్ వాళ్ళని అలర్ట్ చేసిన ఇంద్రుడు..
అత్తయ్య మామయ్యలతో పాటు హిమ కూడా వచ్చిందా అని అడుగుతుంది దీప. వచ్చిందని చెప్తాడు ఇంద్రుడు. వాళ్లని ఎలాగైనా నువ్వే చూపించాలి ఇంద్రుడు అంటూ ఇంద్రుని రిక్వెస్ట్ చేస్తుంది దీప. అలాగేనమ్మ అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి హిమ వస్తుంది. దూరం నుంచి హిమని గమనించిన ఇంద్రుడు కార్తీక్ వాళ్ళని అలెర్ట్ చేస్తాడు. హిమ వస్తుంది మీరు తప్పించుకోండి అంటే హిమ వస్తుందా నేను వెళ్లి కలుస్తాను అంటూ హిమ దగ్గరికి వెళ్ళబోతుంది.
కానీ ఒకసారి కలిస్తే కలిసినట్లుగా ఉండదు దీప నేను చెప్పిన మాట విను అంటూ ఆమెని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు కార్తీక్. అందులోనే హిమ వాళ్ళని చూసేస్తుంది. మమ్మీ డాడీ అంటూ పిలిచినా వాళ్ళు వినిపించుకోకుండా పరిగెట్టి దాక్కుంటారు. హిమ పడుతున్న కంగారు చూసి దీప ఏడ్చేస్తుంది. కన్న బిడ్డ కళ్ళ ముందు అంత బాధపడుతుంటే తనని దగ్గరికి తీసుకోలేకపోతున్నాను ఆ భగవంతుడు నాకే ఎందుకు ఇంత శిక్ష వేశాడు అంటుంది.
హిమ చెప్పింది విని ఆనందపడిన సౌందర్య దంపతులు..
నీకు శిక్ష వేసింది భగవంతుడు కాదు నేను అనుకుంటూ బాధపడతాడు కార్తీక్. బాధపడకు దీప మనమందరం కలిసి ఉండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటాడు కార్తీక్. మరోవైపు పండరికి ఫోన్ చేసిన చారుశీల టాబ్లెట్లు సరిగ్గా ఇస్తున్నావా లేదా మళ్లీ గుండెల్లో మంట అని ఏమైనా అంటుందా అంటుంది. లేదు చాలమ్మా ఇప్పుడు బానే ఉందంట నువ్వు ఇచ్చిన మందులు పనిచేస్తున్నాయేమో అంటుంది పండరి. సరే అని ఫోన్ పెట్టేసిన చారుశీల నా లెక్క ప్రకారం మందులు పనిచేసి వాటికి హార్ట్ ఎటాక్ రావాలి, కానీ ఇంతవరకు ఏమీ కాలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.
రెండు రోజుల్లో పని అయిపోతుంది అని మౌనిక కి చెప్పాను ఎంత ఎదురు చూస్తుందో ఏంటో, రెండు రోజులు చూసి ఏ రిజల్ట్ లేకపోతే డోస్ పెంచమని చెప్పాలి అనుకుంటుంది చారుశీల. మరోవైపు ఇంటికి వచ్చిన హిమ ఆనందంగా ఇంట్లో వాళ్ళందరిని పిలిచి నేను నాన్న వాళ్ళని చూశాను అని చెప్తుంది. మరి వాళ్ళు ఏరి అంటే రాలేదు తాతయ్య అంటుంది హిమ. అమ్మానాన్నలని పిలుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళాను కానీ అప్పటికే వాళ్ళు కనిపించకుండా పోయారు అంటుంది హిమ.
హిమ ని అసహ్యించుకుంటున్న శౌర్య..
అంతా అబద్ధం చెప్తుంది నానమ్మ,అప్పుడే కనిపించి అంతలోనే ఎలా మాయమైపోతారు అంటుంది శౌర్య. నిజంగానే చూసాను శౌర్య అంటుంది హిమ. ఎన్నాళ్ళ నుంచి నేను వెతుకుతున్నాను నాకు దొరకలేదు ఒక్కరోజుకే నీకు దొరికేసారా అంటుంది శౌర్య. ఒక్కరోజు వెతుకునంత మాత్రాన దొరకకూడదని రూల్ లేదు కదా అంటుంది సౌందర్య. తను చెప్పిందే నిజం అనుకుందాము హిమ పిలిస్తే పట్టించుకోకుండా వెళ్ళిపోతారా తను చెప్పింది అబద్ధం అంటుంది శౌర్య.
నేను పిలిచింది వాళ్ళకి వినబడలేదు ఏమో అంటుంది హిమ. తనకి అబద్దం చెప్పవలసిన అవసరం ఏముంది అంటాడు ఆనందరావు. ఎందుకంటే అలా చెప్తే నేను తనతో మాట్లాడుతాను అని తన ఉద్దేశం కానీ నిజంగా అమ్మా నాన్నల్ని వెతికి తీసుకొచ్చిన కూడా నేను తనతో మాట్లాడను అసలు ఇదంతా జరగడానికి కారణం హిమనే అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు నిజంగానే అమ్మానాన్నలని చూసావా అని అడుగుతుంది సౌందర్య.
Karthika Deepam December 27 Today Episode: పూర్తిగా క్షీణించిన దీప ఆరోగ్యం..
నిజమే నానమ్మ నా కళ్ళతో చూశాను చీకటి పడే వరకు వెతికాను ఎంతకీ కనిపించకపోతే వచ్చేసాను అంటూ ఏడుస్తుంది హిమ. ఏడవద్దు అంటూ మనవరాల్ని ఓదార్చుతుంది సౌందర్య. మరోవైపు స్పృహ తప్పి పడిపోయిన దీపని కంగారుగా హాస్పిటల్ తీసుకొని వెళ్తుంటాడు కార్తీక్. అప్పటివరకు బానే మాట్లాడింది బాబు ఉన్నట్టుండి పడిపోయింది త్వరగా తీసుకెళ్లండి బాబు అంటూ కంగారుపడుతుంది పండరి.
పొద్దున్న గుండెల్లో మంట అన్నప్పుడే ఆలోచించవలసింది అంటాడు కార్తీక్. తరువాయి భాగంలో హాస్పిటల్ జాయిన్ చేసిన దీపకి తన ఆరోగ్యం నిలకడగానే ఉంది హార్ట్ తొందరలోనే దొరుకుతుంది అంటుంది చారుశీల. గట్టిగా మాట్లాడొద్దు అని కార్తీక్ అంటే తను స్పృహలో లేదు అంటుంది. తనకి ఆరోగ్యం బాగోలేదని తనకి తెలియకూడదు చారుశీల అంటూ బాధపడతాడు కార్తీక్.నువ్వు అనుకున్నట్లు ఆమె స్పృహలో లేకపోలేదు అన్ని వింటుంది అనుకుంటుంది చారుశీల.