Karthika Deepam December 28 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో దీపా ఆరోగ్యం పాడైపోయిందని హాస్పిటల్ తీసుకొస్తున్నానని ఫోన్లో చెప్తాడు కార్తీక్. తీసుకొని వచ్చే ఇక్కడ నేను అన్ని సిద్ధంగా ఉంచుతాను. తన పథకం పారినందుకు సంతోషిస్తుంది చారుశీల. మోనిత మేడం కొన్ని సంవత్సరాలుగా చేయలేదు నేను రెండు రోజుల్లో చేసేసాను ఈ విషయం తెలిస్తే ఆవిడ జైల్లో పండగ చేసుకుంటారు.
అయోమయంలో కార్తీక్..
దీపని హాస్పిటల్కి తీసుకువచ్చిన కార్తీక్ సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది ట్రీట్మెంట్ కి అంతా రెడీనే కదా అంటాడు. అంతా రెడీనే కార్తిక్ నువ్వేం కంగారు పడకు అంటుంది చారుశీల. దీపకి ట్రీట్ చేస్తున్న చారుశీల ఒక టాబ్లెట్ తోనో ఇంజక్షన్ తోనో బైక్ కంపెనీ చేయొచ్చు కానీ మీ ఆయన కూడా డాక్టర్ కదా అందుకే స్లోగా పంపిస్తున్నాను, నీ ప్రాణాలు ప్రశాంతంగా పోవాలని మీ ఆయన అనుకుంటున్నాడు కానీ నా ఆనందం కూడా ఉండనివ్వను చూడు అని మనసులోనే అనుకుంటుంది చారుశీల.
అంతలోనే అక్కడికి వచ్చిన కార్తీక్ ఎలా ఉంది అని అడుగుతాడు. నీకు తెలియనిది ఏముంది అంటుంది చారుశీల. నేను తీసుకెళ్లా ట్రీట్మెంట్ కి అసలు ఇప్పట్లో హార్ట్ స్ట్రోక్ రాకూడదు కానీ ఎందుకు వచ్చింది అర్థం కావట్లేదు అంటాడు కార్తీక్. కానీ నాకు తెలుసు అని మనసులోనే అనుకుంటుంది చారుశీల. నేను కూడా అదే అనుకుంటున్నాను కార్తీక్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం హార్ట్ దొరుకుతుంది, ఈ పని చేయొచ్చు అనుకున్నాను కానీ ఇంతలోనే ఇలా అయింది అంటూ బాధపడుతుంది.
భార్య కోసం కన్నీరు పెడుతున్న కార్తీక్..
గట్టిగా మాట్లాడకు దీప వింటుంది అని అంటే తను స్పృహలో లేదు అందుకే ఇలా మాట్లాడుతున్నాను అంటుంది. తన ప్రాణాలకు ప్రమాదమని దీపకీ తెలియకూడదు అంటాడు కార్తీక్. దీప జబ్బు ని నీ మీద వేసుకున్న తర్వాత మాత్రమే ఆ జబ్బు నీకు రాదు కదా కార్తీక్ అంటుంది చారుశీల. అలా అయితే ఎప్పుడు నా ఐషు తనకిచ్చేసి నిండు నూరేళ్లు బ్రతకాలని కోరుకునేవాడిని అంటూ ఏడుస్తాడు కార్తీక్. నీకు భార్య మీద మరీ ఇంత ఎక్కువ ప్రేమ ఉండబట్టే మోనిత తట్టుకోలేకపోయింది.
అందుకే నన్ను ప్రయోగించింది అని మనసులోనే అనుకుంటుంది చారుశీల. దీప చాలా కష్టాలు అనుభవించింది. నేను ఒక డాక్టర్ అయి ఉండి కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా మోనిత ఇచ్చిన రిపోర్ట్స్ని పట్టుకొని దీపని చాలా అవమానించాను అంటూ ఏడుస్తాడు కార్తీక్. ఇప్పుడు చేస్తున్నది కూడా అదే కార్తీక్ నేను ఇచ్చిన రిపోర్ట్ ని నమ్ముతున్నావు కానీ క్రాస్ చెక్ చేయట్లేదు నీ నమ్మకమే మా ఆయుధం అనుకుంటుంది చారుశీల. అనుమానం తీరి రెండు నెలలు సుఖంగా ఉండేసరికి యాక్సిడెంట్ తర్వాత మతి పోవడం.
మితిమీరిన చారుశీల పైశాచికం..
ఒక దాని మీద ఒకటి దీపకి కష్టాలు వస్తునే ఉన్నాయి అలా నా కోసం పోరాడుతున్న తనకోసం నా ప్రాణాలు ఇచ్చేసిన తప్పులేదు అంటూ ఏడుస్తాడు. కార్తీక్ ని బాధపడొద్దు అని చెప్పి ధైర్యం చెబుతుంది చారుశీల. కానీ అతను వెళ్ళిపోయిన తర్వాత దీప స్పృహలో లేదని చాలా మాటలు మాట్లాడేసావ్ కానీ దీప మత్తులో లేదు తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసిపోయింది అని నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది చారుశీల.
సౌందర్య దగ్గరికి తనకి రాసిన ప్రిస్క్రిప్షన్ పట్టుకొని వస్తుంది శౌర్య. ఇది నాన్న చేతిరాత లాగా ఉంది కదా అంటుంది శౌర్య. ఇది మీ నాన్న చేతిరాతే ఎక్కడిది నీకు అంటుంది సౌందర్య. నాకు తలకు దెబ్బ తగిలినప్పుడు చారుశీల మేడం రాశారు అంట తనది కూడా నాన్న హ్యాండ్ రైటింగ్ లాగే ఉంది కదా అంటుంది శౌర్య. అప్పుడే అక్కడికి వచ్చిన హిమ ఆపరిస్క్రిప్షన్ చూసి ఇది కచ్చితంగా నాన్న చేతిరాతే అంటుంది. చారుశీల మేడమ్ ది అంటే నాన్నదంటావ్ ఏంటి అంటుంది శౌర్య.
ఈ హ్యాండ్ రైటింగ్ నాన్నదే అంటున్న హిమ..
మీ గొడవ ఆపండి అంటూ పిలిచి ఇది ఎవరు రాసిచ్చారు అని అడుగుతుంది. చారుశీల మేడం రాసిచ్చారు అని చెప్పాను కదమ్మా అంటాడు ఇంద్రుడు. నేను కూడా అదే చెప్తున్నాను బాబాయ్ కానీ నానమ్మ వాళ్ళు నమ్మట్లేదు అంటుంది శౌర్య. ఇంద్రుడు నీతో పని ఉంది కాస్త బయటకు వెళ్దాం రా అంటుంది సౌందర్య. ఏమమ్మా ఏమైనా కావాలా అంటే అలాంటిదేమీ కాదు బయటికి వెళ్దాం రా అంటుంది. బయటికి వెళ్తున్న ఇంద్రుడిని పిలుస్తుంది చంద్రమ్మ.
తనకు ఏమైనా కావాలేమో చూడు నేను బయట వెయిట్ చేస్తాను అంటుంది సౌందర్య. భర్తని పిలిచి వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు తెలుసా అంటుంది చంద్రమ్మ. నీకు తెలిసిన నిజాన్ని గట్టిగా వాళ్లు తెలుసుకోవడం కోసం తీసుకెళ్తున్నారు అంటే ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసులే అంటాడు ఇంద్రుడు. మరోవైపు ఇంటికి తీసుకువచ్చిన దీప ఇలా పడిపోవడం కూడా మొన్న ఆపరేషన్ చేసిన తాలూకా ప్రభావమేనా అంటుంది.
అసలు నిజం తెలిసి బాధపడుతున్న దీప..
ఆపరేషన్ చేస్తే నయం కావాలి కానీ మళ్ళీ నొప్పి ఎందుకు వచ్చింది అంటే నువ్వు ఎక్కువ టెన్షన్ పడుతున్నావ్ అందుకే వచ్చింది నాకు ఆరోగ్యం బాగోకపోయినా మొన్నటి వరకు అందుకే చెప్పలేదు అంటాడు కార్తీక్. మీకు ఆరోగ్యం బాగోలేదు అంటే నా గుండె కొట్టుకుంది కానీ నా ఆరోగ్యం బాగోలేదు అని నా మనసు కుదుటపడింది కానీ మిగిలింది మాత్రం బాధ, మీ అందరిని వదిలి పోతున్నానన్న బాధ నేను లేకపోతే మీ అందరిని ఎవరు చూసుకుంటారు అన్న బాధ అంటూ తనలో తానే బాధపడుతుంది.
ఇంకా ఏమీ ఆలోచిస్తున్నావు నాకు ఏమీ కాదులే ఉన్నంతకాలం ఇద్దరం కలిసి బ్రతుకుదాం అంటాడు. నాదొక కోరిక కాదనొద్దు అంటుంది దీప. ఏంటది అని అడిగితే నేనే వంట చేస్తాను మీకు తినిపిస్తాను అంటుంది దీప. నువ్వు వంట చేయకూడదు కావాలంటే ఎలా చేయాలో పండక్కి దగ్గరుండి చెప్పి చేయించు అంటాడు కార్తీక్. నా చేతులతో నేనే వండాలి అని మొండికేస్తుంది దీప. ఎన్నిసార్లు చెప్పాను నువ్వు చేయకూడదని అని కసరుకుంటాడు కార్తీక్.
దీపకి సర్ది చెప్తున్న పండరి..
చేయనివ్వండి బాబు ఏ హారికైనా భర్తకి వండుకోవాలని అనిపిస్తుంది కదా అంటాడు పండరి. వండనీయండి సారు ఏ భార్య పైన తన భర్తకి వంట చేసి తినిపించాలని అనుకుంటుంది కదా అంటుంది పండరి. వండి, వండి ఆ పొగకే తన ఆరోగ్యం పాడయింది నేను చెప్పిన మాట వినండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. సార్ చెప్పింది కూడా వినమ్మ అంటుంది పండరి. ఆయన ఒప్పుకోరని తెలుసు కానీ నా ఆశ నాది ఈ అవకాశం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కదా అంటుంది దీప.
అలా అనకమ్మ ఆశతోనే బ్రతకాలి, ఆశ ఉండాలి సార్ కి ఏమి కాదు. నువ్వు బాధపడి ఆయనని బాధ పెట్టొద్దు అంటుంది పండరి. డాక్టర్ బాబుకి ఏమీ కాదు పండు లేకుండా పోయేది నేనే, నన్ను బ్రతికించాలని చాలా ప్రయత్నిస్తున్నారు, మీ ప్రయత్నం వృధా కాదు ఉన్నన్నాళ్ళు నా కళ్ళముందు ఉండండి అంతే చాలు అనుకుంటుంది దీప. మరోవైపు ఇంద్రుడు ఏదో దాస్తున్నాడు చీకట్లో బాణం వేయాలి అని మనసులో అనుకుంటుంది సౌందర్య. అంతలోనే అక్కడికి వచ్చిన ఇంద్రుడు ఎందుకమ్మా పిలిచారు అని అడుగుతాడు.
చీకట్లో బాణం వేసిన సౌందర్య..
ప్రిస్క్రిప్షన్ గురించే అది కచ్చితంగా నా కొడుకు రాసిందే, కాకపోతే నా డౌట్ ఒక్కటే ఎందుకు వాడు మమ్మల్ని తప్పించుకొని తిరుగుతున్నాడు అంత అవసరం ఏమి వచ్చింది అంటూ అనుమానంగా అడుగుతుంది. ఈవిడకి నిజం తెలిసి అడుగుతుందా తెలుసుకోవాలని అడుగుతుందా? నిజం తెలిస్తే దీపమ్మ వాళ్ళని వెతుక్కొని వెళ్లేవారు కదా అంటే శివుడికి నిజం తెలియదు చీకట్లో బాణం వేస్తుంది అంతే అనుకుంటాడు ఇంద్రుడు. ఆలోచనలో ఉన్న ఇంద్రుడిని కాలర్ పట్టుకుని నిలదీస్తుంది సౌందర్య.
Karthika Deepam December 28 Today Episode:
నాటకాలు ఆపి నిజం చెప్పు అంటే నేను నాటకాలు ఆడ్డం ఏంటి అంటాడు ఇంద్రుడు. నీకు అంతా తెలుసు అని నాకు తెలుసు కానీ ఎందుకు నిజం చెప్పడం లేదు అంటుంది సౌందర్య. మీరు చొక్కా పట్టుకున్నంత మాత్రాన చనిపోయిన వాళ్ళని బ్రతికున్నారని చెప్పలేను కదా అంటాడు ఇంద్రుడు. చనిపోవడం ఏమిటి వాళ్ళు బ్రతికే ఉన్నారు. ఇన్నాళ్లు శౌర్య చెప్తే నమ్మలేదు కానీ ఇప్పుడు హిమ కూడా చూసింది అంటుంది సౌందర్య.
తరువాయి భాగంలో అత్తగారిని, పిల్లల్ని చూసిన దీప ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అంటుంది. నన్ను వదిలేసి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటుంది. పోయేది నా ప్రాణాలు నన్నేలా వెళ్ళమంటావు అంటే డాక్టర్ బాబు ఇంకా చాలు నాకు నిజం తెలుసు అంటుంది దీప.