Karthika Deepam January 12 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అప్పుడే ఇంటికి వచ్చిన ఇంద్రుడు వాళ్ళని ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది శౌర్య. మీరు బయటకు వెళ్లారు కదా అని నేను పిన్ని పాత ఇంటికి వెళ్లి వచ్చాం అంటాడు ఇంద్రుడు. సరేనా సమయానికి ఇంట్లో లేకుండా పోయారు అని శౌర్య అంటే ఏం జరిగింది అంటాడు ఇంద్రుడు. అమ్మ నాన్న కనిపించారు అని చెప్తుంది శౌర్య.
కన్ఫ్యూజన్లో ఉన్న సౌందర్య..
షాకైన ఇంద్రుడు దంపతులు ఉన్నారా,మళ్ళీ వెళ్ళిపోయారా అని అడుగుతుంది చంద్రమ్మ. అదేంటి పిన్ని అలా అడుగుతావు అమ్మ నాన్న దొరికారు అంటే సంతోషించడం మానేసి అలా అడుగుతున్నావు అంటుంది. అదే మొన్న హిమతి కనిపించి వెళ్ళిపోయారు కదా అలా వెళ్ళిపోయారేమో అని కంగారుగా అంటుంది చంద్రమ్మ. సరే రండి అమ్మ నాన్నకి పరిచయం చేస్తాను అని లోపలికి తీసుకెళ్తుంది శౌర్య.
అప్పుడే మేడ మీద నుంచి దిగుతున్న తల్లిదండ్రులకి ఇంద్రుడు వాళ్లని పరిచయం చేస్తుంది. మా అమ్మాయిని బాగా చూసుకున్నందుకు థాంక్స్ అంటాడు కార్తీక్. నీకు కూడా థాంక్స్ చంద్రమ్మ అని నోరు జారుతుంది దీప. నీకు తన పేరు చంద్రమ్మని ఎలా తెలుసు అంటుంది శౌర్య. నాకు కూడా అదే అనుమానంగా ఉంది నిజం చెప్పు ఇంద్రుడు నీకు వీళ్ళు ముందే తెలుసు కదా అంటుంది సౌందర్య.
మళ్లీ గొడవ పడుతున్న అక్క, చెల్లెలు..
నిజంగానే తెలియదమ్మా పిల్లలు ఇంత బాధపడుతున్నప్పుడు చెప్పకుండా ఎలా ఉంటారు అంటాడు ఇంద్రుడు. మామూలుగానే ఇంద్రుడు చంద్రుడు అంటారు కదా అత్తయ్య అందుకే వరుసటి అలా అనేసాను అంటూ సర్దుకుంటుంది దీప. మీ అమ్మ నాన్న దొరికేసారు కదా ఇంకా మేము ఇంటికి వెళ్లి పోతాము అని ఇంద్రుడు వాళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళిపోతావు బాబాయ్ మన ఒప్పందం ప్రకారం అమ్మ నాన్న దొరికే వరకు నేను మీ దగ్గర ఉంటాను తర్వాత మీరు మా దగ్గర ఉండాలి కదా అంటుంది శౌర్య.
అయినా ఇబ్బంది పడుతున్న ఇంద్రుడిని సౌందర్యతో చెప్పి ఒప్పిస్తుంది శౌర్య. అందరినీ ఇక్కడే ఉన్నాము కదా సంక్రాంతి ఇక్కడే చేసుకుందాం అంటుంది శౌర్య. హైదరాబాదులో చేసుకుందాము అని హిమ అంటే వద్దు ఇక్కడ చేసుకుందాం అంటూ శౌర్య గొడవ పెడుతుంది. ఇంకా ఆపండి మీ అమ్మానాన్న రాకముందు కొట్టుకున్నారు ఇప్పుడు కూడా కొట్టుకుంటున్నారా అయినా ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాం కదా ఈ సంక్రాంతి చేసుకుందాం అంటుంది సౌందర్య. భోగి మంటలు బాధ్యత ఇంద్రుడికి అప్పజెప్తుంది.
దీప ని చూసి షాకైన హేమచంద్ర..
అందరూ కలిపి ఆరుబయట సంక్రాంతి ముగ్గులు వేస్తుంటారు. ఆరుబయట దీప ని చూసి ఆశ్చర్యపోతాడు. నేరుగా వచ్చి ఎప్పుడు వచ్చావు అని అడుగుతాడు. షాక్ అయిపోయిన శౌర్య వాళ్ళు మా అమ్మ మీకు ముందే తెలుసా అని అడుగుతారు. కంగారుపడిన హేమచంద్ర అదే మీరు ఫోటోలో చూపించారు కదా అలా అడిగాను అంటూ సమగప్పుకుంటాడు హేమచంద్ర. పిల్లలు మీకోసం ఇంత కంగారు పడుతుంటే రాకూడదని ఎలా అనుకున్నారు అంటూ మాట మార్చేస్తాడు హేమచంద్ర.
ఇక్కడ ఉంటే ఇంకా ఏం వాగుతానో అంటూ వెళ్ళిపోబోతు దీప ఆరోగ్యం సంగతి చెప్పారు లేదో అని అనుమాన పడతాడు. అదే విషయాన్ని కనుక్కుందామని దీపని పిలుస్తాడు మళ్ళీ ఎక్కడ చిక్కుల్లో పడుతుందో అని అడక్కుండా ఉరుకుంటాడు. ఏంటంకుల్ పిలిచారు అని శౌర్య అడిగితే, లేదమ్మా మీ నాన్నగారిని కూడా కలుద్దాము అనుకున్నాను కానీ ఇప్పుడు వద్దులే ఫ్రెష్ కలుస్తాను అని వెళ్ళిపోతాడు హేమచంద్ర. సడన్ గా నన్ను ఇక్కడ చూసి అన్నయ్య కంగారు పడినట్లుగా ఉన్నారు ఫోన్ చేసి చెప్పవలసింది అనుకుంటుంది దీప.
కార్తీక్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న మోనిత..
మరో వైపు కారులో వెళ్తున్న కార్తీక్ అందరూ కలిశారు బానే ఉంది కానీ రేపు దీప ఆరోగ్యం బాగోలేదు అని తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అని భయపడుతూ ఉంటాడు దీపని బ్రతికించుకునే దారే లేదా అంటూ ఆలోచనలో పడతాడు. అంతలోనే ఎదురుగా ఉన్న మోనితని చూసి కారు ఆపుతాడు. కళ్ళు కనిపించడం లేదా దానికి అడ్డగా నిలబడ్డావ్ అంటాడు కార్తీక్. ఆ కారు పార్క్ చేసి నాతో రా బయటికి వెళ్లి మాట్లాడుకుందాం అంటుంది మోనిత. నాకు నీతో మాట్లాడవలసిన అవసరం లేదు నువ్వు ఇక నుంచి వెళ్ళు అంటాడు కార్తీక్.
మాట్లాడితేనే కదా అవసరం ఉందో లేదో తెలుస్తుంది అంటుంది మోనిత. నా జీవితంలో అనవసరమైన విషయం ఏదైనా ఉంది అంటే అది నువ్వే, నువ్వు కారు పక్కకు తీయకపోతే నేనే తప్పించుకొని వెళ్తాను అంటూ కారు దగ్గరికి వెళ్ళబోతే వెళ్తే వెళ్ళు మీ కోడలు దొరికిందని సంతోష పడుతున్నారు కానీ తను రేపు మాపో పోతుంది అని చెప్తాను అంటుంది మోనిత. నువ్వు అసలు మనిషివేనా ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నావ్ అంటాడు కార్తీక్.
దీపని మందలిస్తున్న చంద్రమ్మ..
నేను ఊరికే చెప్తాను అనలేదు కదా నువ్వు రెస్టారెంట్ కి రాకపోతేనే చెప్తాను అన్నాను, రావచ్చు కదా అంటుంది. నేను ఆంటీ తో చెప్పకూడదు అంటే నువ్వు బుద్ధిగా కారెక్కు అని అంటుంది మోనిత. ఏం చెప్పాలనుకుంటున్నావో ఎక్కడో చెప్పు నేను ఎక్కడికి రాను అంటాడు కార్తీక్. ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడకూడదు దానికంటూ సెపరేట్గా ప్లేస్ ఉంటుంది నాకు ఆకలి వేస్తుంది ఇడ్లియే దోసె తింటూ ప్రశాంతంగా మాట్లాడుకుందాం రెస్టారెంట్ కి వెళ్దాం రమ్మంటుంది.
నువ్వు బుద్ధిగా నాతో వస్తే సరే లేదంటే ఇప్పుడే ఆంటీ ఫోన్ చేస్తాను అంటూ బ్లాక్మెయిల్ చేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెతో వెళతాడు కార్తీక్. సేల్స్ కట్ చేస్తే వంటగదిలో ఉన్న దీప దగ్గర ఎవరూ లేకపోవడం చూసి టాబ్లెట్స్ ఇస్తుంది చంద్రమ్మ. ఎవరు లేనప్పుడు ఈ టాబ్లెట్స్ ఇమ్మన్నారమ్మ మళ్ళీ పెద్దమ్మ గారు వాళ్ళు వచ్చేస్తారు త్వరగా వేసేసుకోండి అంటుంది చంద్రమ్మ. మీ అయ్యగారి పిచ్చిగాని ఈ మందులు ఎన్నాళ్ళు ఆపుతాయి అంటుంది.
కుటుంబం కోసం ఆలోచిస్తున్న దీప..
అలా అనకండి మిమ్మల్ని రక్షించడం కోసం అయ్యగారు ఎంత బాధ పడుతున్నారో తెలుసా? మీరే మీ గురించి పట్టించుకోవట్లేదు అంటుంది చంద్రమ్మ. మీకు వేడి పడదు కానీ పొద్దుటి నుంచి వంటగదిలోనే ఉంటారు అంటుంది. ఉంటే ఏమవుతుంది చంద్రమ్మ నాలుగు రోజులు ముందు పోతాను అంతే కదా, కానీ ఉన్ని కొద్ది రోజులైనా నా పిల్లలకి నా చేత్తో వండి పెట్టుకుంటే తృప్తిగా ఉంటుంది అంటుంది దీప. ఏ పని చేయకుండా ఒక మూలన కూర్చుంటే అత్తయ్య వాళ్ళకి అనుమానం వస్తుంది.
నేను పోయాక ఎలాగూ వాళ్లకి బాధ ఉంటుంది కానీ నా పరిస్థితి తెలిసి వాళ్ళు ఇప్పటినుంచే బాధపడుతుంటే నేను చూడలేను అంటుంది దీప. ఎవరికైనా కొంచెం బాగోకపోయినా ఇంట్లో వాళ్ళందరినీ హడావుడి పెట్టేస్తారు అలాంటిది మీరు మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో కూడా కుటుంబం కోసం ఆలోచిస్తున్నారంటే మీది చాలా గొప్ప మనసు అంటుంది చంద్రమ్మ. ఏం చేస్తాం చెప్పు ఇది మన తలరాత అంటుంది దీప. తల రాత లేదు, ఏమీ లేదు ముందు మీరు ఇలా కష్టపడ్డ మానేయండి అని నేను చూసుకుంటాం ముందు స్టవ్ దగ్గర నుంచి తప్పుకోమంటుంది చంద్రమ్మ.
Karthika Deepam January 12 Today Episode: తన పరిస్థితిని తలుచుకొని బాధపడుతున్న దీప..
మీకు అంత అవసరమైన ఏదైనా ఉంటే మాతో చెప్పి చేయించుకోండి అంటూ దీపని పొయ్యి దగ్గర నుంచి పంపేస్తుంది. నా చుట్టూ ఎంతమంది మంచి వాళ్ళని ఇచ్చావు కానీ ఎందుకు వీళ్ళ నుంచి నన్ను దూరం చేస్తున్నావ్ అంటూ బాధపడుతుంది దీప. మరోవైపు రెస్టారెంట్ కి వచ్చిన కార్తీక్ త్వరగా చెప్పవలసింది చెప్పు 10 నిమిషాల కు మించి నువ్వు చెప్పేది నేను వినలేను అంటాడు. ఎందుకు కార్తీక్ అంత చిరాకు పడతావు నేను నిన్ను ఏమని అడిగాను నాతో ప్రేమగా ఉండమని మాత్రమే కదా అడిగాను.
నువ్వు నన్ను ఎలాగూ దగ్గరికి తీసుకోవు అని అర్థమైంది, ఇప్పుడున్న పరిస్థితులలో అది అసంభవం అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటుంది మోనిత. తరువాయి భాగంలో హేమచంద్ర కార్తీక్ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన దీప నాకు నిండు నూరేళ్లు బ్రతకాలని ఉంది అంటూ ఏడుస్తుంది. అక్కడ రెస్టారెంట్లో మోనిత నా మెడలో తాళికట్టు కార్తీక్ నా గుండెని దీపకి అమర్చు అని కార్తీక్ చేతులు పట్టుకుంటుంది.