Karthika Deepam January 20 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పోయేదానివి ప్రశాంతంగా పోవడం మానేసి నీకెందుకే తాపత్రయం అంటుంది మోనిత. నేను పోతే పోతాను అంతేకానీ నీలాంటి రాక్షసుల నీడ నా భర్త మీద పడనివ్వను అంటుంది దీప. నేను రాక్షసిని కానీ ప్రేమికురాలిని అని మోనిత అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు బుర్రలోకి రానీయద్దు అంటుంది దీప.
పదిమంది ముందు పరువు పోగొట్టుకున్న మోనిత..
నువ్వు బ్రతికున్నప్పుడే ఏమీ చేయలేకపోయావు చచ్చాక ఏం చేస్తావు నువ్వు చావటానికి కొద్ది క్షణాల ముందైనా నన్ను పెళ్లి చేసుకుని లాగా చేస్తాను అంటుంది మోనిత. నీకు అంత అవకాశాన్ని ఇవ్వను పోయేముందు నా భర్త జీవితాన్ని చక్కపెట్టుకొని పోతాను అంటుంది దీప. అంటే కార్తీక్ కి ఇంకొక పెళ్లి చేస్తావా నిన్నే కార్తీక సరిగా కాపీ చేయనివ్వలేదు అలాంటిదే దాన్ని వదులుతానా, నిన్ను ఆ దేవుడు తీసుకెళ్ళి పోతుంటే నేను దాన్ని తీసుకుపోతాను అంటుంది మోనిత.
చూద్దాం ఎవరిని ఎవరు ఎక్కడికి పంపిస్తారో ? ఈరోజు నడిరోడ్డు మీద కళ్ళు తెరిచావు రేపు రోజున నరకంలో కళ్ళు తెరుస్తావు జాగ్రత్త అంటూ వారణాసిని తీసుకొని వెళ్ళిపోతుంది దీప. అక్కడ ఉన్న వాళ్ళందరూ మోనితని నానా మాటలు అంటారు. నలుగురిలో నన్ను అవమానిస్తావా, ఆ దేవుడు తీసుకుపోయేదాకా ఎదురుచూద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు నిన్ను బైక్ పంపిస్తాను అని కసిగా అనుకుంటుంది.
కోపంతో ఫ్రెస్టేట్ అయిపోతున్న మోనిత..
ఇంట్లోకి వెళ్లిన తర్వాత కూడా తన కోపం చల్లారదు. నన్ను పదిమందిలోని అవమానిస్తావా, నిన్ను వదలను ఎలాగో నీ ప్రాణాలు పోతున్నాయి. నీ ప్రాణాలు పోయేముందు ప్రతిక్షణం నరకం చూపిస్తాను. పోయాక కూడా ఆత్మ శాంతి కలగనివ్వను అంటూ పిచ్చిపిచ్చిగా కేకలు వేస్తూ ఉంటుంది. మరోవైపు దీపని కాపాడుకునే మార్గం కోసం ఆలోచిస్తూ ఉంటుంది సౌందర్య. తన గురించి ఏమీ ఆలోచించుకోవట్లేదు దీప.
తను చెప్పినట్లు కార్తీక్ తో రెండో పెళ్లి గురించి మాట్లాడితే నా పెద్దరికం నిలబడదు. ఎంత ఖర్చైనా దీపని కాపాడుకుంటాను దీప కార్తిక్ కల కాలం నా కళ్ళ ముందుఉండేలా చూసుకుంటాను అనుకుంటుంది సౌందర్య. ఇంతలో అక్కడికి వచ్చిన భాగ్యం అన్నయ్యగారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం కుదురు పడిందా దీప,కార్తీక్ వాళ్ళు ఏరి అంటూ లొడలోడా మాట్లాడేస్తుంది. నీ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్తాను గాని కాఫీ తాగుతావా అని అడుగుతుంది సౌందర్య.
హిమ గురించి కంగారు పడుతున్న దీప..
ఏసీ కార్లో ఎండన పడొచ్చాను మీరు ఏది ఇచ్చిన తాగుతాను అంటుంది భాగ్యం. ఇంతలో వచ్చిన దీపని ఎక్కడినుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావ్ చెప్పకుండా ఏవేవో పని చేస్తున్నావు అంటూ మందలిస్తుంది సౌందర్య. నా జోలికి నా కుటుంబం జోలికి వస్తే ఏమవుతుందో అర్థం అయ్యేలా చెప్పటానికి ఆ మోనిత దగ్గరికి వెళ్లాను అంటుంది దీప. అది మారుతుందని నీకు నమ్మకం ఉందా అని సౌందర్య అడిగితే మారకపోతే అదే తనకి చివరి రోజు అంటుంది దీప.
ఇంతలో శౌర్య,హిమని పిలుస్తూ ఉంటే హిమ బయటకు వెళ్ళినట్టుంది అంటుంది భాగ్యం. నీకు ఎలా తెలుసు అని సౌందర్య అంటే నేను వచ్చేటప్పుడు గుమ్మంలో అటు ఇటు తిరుగుతుంది నా ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసి అడ్రస్ అడిగింది అంటుంది భాగ్యం. సౌందర్య ఫోన్ తో ఆ నెంబర్ కి ఫోన్ చేస్తుంది దీప. అది మోనితది అని తెలుసుకొని ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. కంగారు పడి కార్తీక్ కి ఫోన్ చేస్తుంది దీప.
హిమని అడ్డం పెట్టుకొని గేమ్ ప్లే చేస్తున్న మోనిత..
అందరూ కలిసి మోనిత ఇంటికి వస్తే ఆ ఇల్లు తాళం వేసి ఉంటుంది. టులెట్ బోర్డ్ చూసి ఇప్పటికిప్పుడే ఇది ఇల్లు ఖాళీ చేసేసింది ఏంటి అంటాడు కార్తీక్. పొద్దున్న తనని మంచంతో సహా వీధిలో పడుకో పెట్టాను ఆ అవమానం తట్టుకోలేక ఎటో పోయి ఉంటుంది నా బిడ్డని ఏం చేసిందో ఏంటో అంటూ కంగారు పడుతుంది దీప. దానికి అంతా సిగ్గు శరం ఏమీ లేదు మనం వస్తామని తెలుసు అందుకే వెళ్ళిపోయింది అంటుంది సౌందర్య.
తను హిమని ఏమీ చేయదు తనని అడ్డం పెట్టుకొని తను అనుకున్న పని చేయాలని చూస్తుంది ఎట్టి పరిస్థితుల్లోని తను అనుకున్నది జరగదు అంటాడు కార్తీక్. ఈ మాటలన్నీ లోపటి నుంచి వింటుంటారు మోనిత, హిమ. చూసావా ఇంత జరిగిన మీ నాన్న నేను చెప్పిన పని చేయను అంటున్నాడు మీ అమ్మ బ్రతకడం మీ నాన్నకి ఇష్టం లేదు అంటూ హిమని పొల్యూట్ చేస్తుంది మోనిత. ఇప్పుడే వెళ్లి అడుగుతాను అంటుంది హిమ.
మోనిత అంతు చూస్తాను అంటున్న సౌందర్య..
మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నా బిడ్డ ఒక గంటలో నా దగ్గర ఉండాలి అని దీప అంటే ఎక్కడ ఉన్నా తనని లాక్కొని వస్తాను. నా మనవరాలిని ఎత్తుకొస్తుందా దాని అంతు చూస్తాను ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదండి అని వెళ్ళిపోతారు. ఇదంతా లోపల నుంచి చూస్తున్న మౌనిక చూసావా వాళ్ళందరూ నా మీద ఎంత కోపంగా ఉన్నారో అంటుంది మోనిత. నన్ను ఎందుకు ఆపారు ఆంటీ అని హేమ అడిగితే నిన్ను తీసుకువచ్చినందుకు నన్ను చంపేసేవారు నేను చనిపోతానని భయం లేదు కానీ మీ అమ్మని కాపాడుకుండా పోతానేమో అని నా బాధ అంటుంది మోనిత.
అయితే ఏం చేద్దాం ఆంటీ అని అంటే, మీ డాడీని ఒప్పించేంతవరకు మనం ఎక్కడున్నది వాళ్ళకి తెలియకూడదు అందుకే బయట టూ లెట్ బోర్డు పెట్టాను అంటుంది మోనిత. నువ్వు నా మాట వింటే డాడీ నొప్పించటం కాదు నా మాట వింటావా అంటుంది మోనిత. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను మా అమ్మ ప్రాణాలతో ఉంటే చాలు అంటూ బాధపడుతుంది హిమ. మరోవైపు కార్తీక్ కి ఫోన్ చేసి హిమని గట్టిగా వెతుకు, అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అంటుంది సౌందర్య.
దీప ని బ్లాక్ మెయిల్ చేస్తున్న మోనిత..
నా కూతుర్నే దాచేసింది దాని అంతు చూస్తాను అంటూ ఆవేశ పడిపోతుంది దీప. నువ్వు ఆవేశ పడకూడదు దాన్ని సంగతి నేను చూసుకుంటాను అంటుంది సౌందర్య. మోనిత ఇంత జరిగినా మిమ్మల్ని వదలటం లేదేంటి దానికి రోజులు దగ్గర పడినట్లు ఉన్నాయి అంటుంది భాగ్యం. ఇంతలో మోనిత ఫోన్ ఫోన్ చేస్తే హిమ ఎలా ఉంది అని అడుగుతుంది. ప్రశాంతంగా ఉంది రేపు నువ్వు పోయాక కాని నేను చూసుకోవాలి కదా అంటుంది మోనిత. పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దు, ఈ మాటలు విని ఓపిక నాకు లేదు అంటుంది దీప.
అవును నిజమే పాపం ఎప్పుడు పోతావు నీకే తెలియదు అంటుంది మోనిత. నేను పోయేలోపు నిన్ను కూడా తీసుకుపోతాను అంటుంది దీప. అదంతా కాదు గాని నువ్వు నా దగ్గరికి వచ్చి కార్తీక్ ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే అప్పుడు నీ ముద్దుల కూతుర్ని మీ ఇంటికి పంపిస్తాను అంటుంది మోనిత. పిచ్చి ఇప్పుడే లేపన చేయొద్దు నీ టైం దగ్గర పడింది అంటుంది దీప. సరే గంట టైము ఇస్తాను.ఎలాగూ కార్తీక్ నా గురించి వెతుకుతున్నాడు కదా తనకి అంత శ్రమ లేకుండా నేను తనతో మాట్లాడుతాను అంటుంది మోనిత.
దానికి ఇదే చివరి రోజు అంటున్న భాగ్యం..
నీ నాటకాలు ఆపు అని దీప అంటే, నీకు నేను మంచి ఆఫర్ ఇచ్చాను కార్తీక్ కి నాకంటే మంచి భార్య ఎక్కడ దొరుకుతుంది. నువ్వు పోయాక కార్తీక్ కి తోడుగా లేడుగా నేను ఉంటాను అయినా నీకు సువర్ణ అవకాశం ఇస్తున్నాను నీ చేతుల మీదుగానే మా పెళ్లి చేయు. నీ చివరి రోజుల్లో ప్రశాంతంగా మా ఇద్దరినీ చూసుకొని స్వర్గానికి వెల్దువు గానిలే అంటూ ఫోన్ పెట్టేస్తుంది మోనిత. ఇది ఇంతకు తెగింగించింది ఏంటి అని సౌందర్య అంటే, దానికి ఈ రోజే చివరి రోజు అంటుంది భాగ్యం.
నువ్వు చెప్పింది నిజమే ఇకమీదట నేనే కాదు తన్ని ఎవరు క్షమించరు అంటుంది దీప. నేను వస్తున్నాను నాకు అంతా తెలుసు దీప జాగ్రత్త అంటూ అందరికీ మెసేజ్ పెడతాడు కార్తీక్. మరోవైపు ఏమని భోజనం చేయమంటే వద్దు నాకు భయంగా ఉంది అంటుంది హిమ. ఎందుకు భయం నువ్వే కదా నాకు ఫోన్ చేసి నా దగ్గరకు వచ్చావు. మరి ఎందుకు భయం అని మోనిత అంటే అమ్మకి ఏమైనా అవుతుందేమో అని భయంగా ఉంది అంటుంది హిమ. అమ్మకి ఏమి కాకూడదని కదా ఇదంతా చేస్తున్నది.
తప్పు చేశానేమో అంటున్న హిమ..
అమ్మ ప్రాణానికి ఏ ప్రమాదం ఉండదు అంటుంది మోనిత. నేను ఎక్కడికి వెళ్ళిపోయాను అని అమ్మ చాలా కంగారుపడుతుంది కదా అమ్మ వాళ్లు కనిపించలేనప్పుడు మేము ఎంత కంగారు పడ్డాము మాకే తెలుసు ఇప్పుడు అమ్మ కూడా అలాగే బాధపడుతూ ఉంటుంది, అసలే అమ్మకి బాగోలేదు తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదేమో నేను వెళ్ళిపోతాను అంటుంది హిమ. వెళ్ళిపోతే వెళ్ళిపో కానీ మీ అమ్మ ప్రాణాలతో ఉండదు అని మోనిత అంటే లేదు అమ్మకి ఏమీ కాకూడదు అంటుంది హిమ.
ఒక్క రోజు కోసం మీ అమ్మ కోసం ఆలోచిస్తే ప్రాణంతో ఉండదు అదే మీ అమ్మ కోసం ఆలోచించి ఈ ఒక్కరోజు ఇక్కడ ఉంటే మీ అమ్మ ప్రాణాలతో ఉంటుంది అంటుంది మోనిత. ఒకరోజు బాధపడిన పర్వాలేదు కానీ మా అమ్మ జీవితకాలం నాతోనే ఉండాలి అంటుంది హిమ. అయితే నేను చెప్పినట్లు చేయు ఈ రోజంతా ఇక్కడే ఉండి రేపు పొద్దున్నే వెళ్లేవనుకో భయంతో నువ్వు ఏది చెప్తే అదే చేస్తారు అంటుంది మోనిత.
తప్పుడు సలహాలు ఇస్తున్న మోనిత..
నిజంగానే అప్పుడు నాన్న ఒప్పుకుంటారా అని హిమ అడిగితే తప్పకుండా ఒప్పుకుంటారు లేకపోతే మళ్లీ నువ్వు ఎక్కడికి వెళ్లి పోతావో అని భయపడతారు అంటుంది మోనిత. అర్థమైంది ఆంటీ అని హిమ అంటే మనం ఏం చేసినా అమ్మని కాపాడుకోవడం కోసమే అంటూ హిమ చేత భోజనం తినిపిస్తుంది మోనిత. మరోవైపు హిమ కనిపించకపోవడంతో నాకు మోనిత మీదే అనుమానం వచ్చింది, అది హిమనీ అడ్డం పెట్టుకోవాలని తను అనుకున్న పని చేయాలని చూస్తుంది అంటుంది దీప.
మోనిత,హిమని ఏమీ చేయదు అంటాడు కార్తీక్. అది అనుకున్నది జరగకపోతే ఎంతకైనా తెలుస్తుంది ముందు అది ఎక్కడుందో తెలుసుకోవాలి. దాన్నుంచి హిమని కాపాడుకోవాలి అంటుంది సౌందర్య. అయినా ఇప్పటికిప్పుడే ఇల్లు ఖాళీ చేసి ఇటువంటి నాకు ఏదో అనుమానంగా ఉంది తను ఇప్పటికీ ఏదో నాటకం ఆడుతుంది అంటుంది దీప. తను ఎన్ని నాటకాలు ఆడిన తను అనుకున్నది జరగదు. అసలు హేమ నా మాట విని ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు, నా గురించి తప్పుగా అనుకొని మోనిత దగ్గరికి వెళ్ళింది అంటాడు కార్తీక్.
Karthika Deepam January 20 Today Episode: హిమని అసహ్యించుకుంటున్న శౌర్య..
అప్పుడే వచ్చిన శౌర్య, హిమ,మోనిత దగ్గర ఉందా అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదు నువ్వు వెళ్లి పడుకో అంటాడు కార్తీక్. నేను అంతా విన్నాను మీరు మోనిత ఆంటీ ని పెళ్లి చేసుకుంటే హిమని ఇస్తానంటుందా అంటుంది శౌర్య. ఇవన్నీ పెద్ద వాళ్ళ విషయాలు చిన్నపిల్లవి నీకెందుకు అని దీప అంటే కానీ తప్పు చేసింది చిన్నపిల్లనే కదా, అప్పుడు వద్దు వద్దు అంటుంటే కారు డ్రైవింగ్ చేసి ఇంతవరకు తెచ్చింది ఇప్పుడు చెప్పిన మాట వినకుండా మోనిత దగ్గరికి వెళ్ళింది దానివల్ల అన్ని సమస్యలే అందుకే అదంటే నాకు అసలు ఇష్టం ఉండదు అంటుంది శౌర్య.
మళ్లీ మొదటికి వచ్చావా అదేమీ కావాలని చేయలేదు మోనిత మాయమాటలు చెప్పి ఉంటుంది సౌందర్య. ఏదైతేనేమి దాని వల్లే కదా ఈ సమస్య ఎంత అని శౌర్య అంటే తప్పు అలా ఆలోచించకూడదు ఇప్పుడు మనం హిమని ఎలాగైనా కాపాడుకోవాలి అంటుంది దీప. ఇంతలో వారణాసి ఫోన్ చేసి నీ అనుమానం నిజమే దీపక్క మోనిత ఇంట్లోనే ఉంది అని చెప్తాడు. అదే విషయాన్ని దీప కార్తీక్ కి చెప్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.