Karthika Deepam January 24 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో గన్ చేత్తో పట్టుకున్న దీప, సౌందర్యని, కార్తీక్ వాళ్ళని వెళ్లిపోమంటుంది.తనతో నువ్వు పడలేవు వచ్చేయి అని సౌందర్య అంటే చెప్పేది వినండి ముందు వెళ్లిపోండి అంటూ పంపించేస్తుంది. ఎందుకు వెళ్ళినా కార్తీక్ తల్లిని పిల్లల్ని పంపించేసి తను మాత్రం బయట వెయిట్ చేస్తుంటాడు. గరిట పట్టుకొని చేత్తో రివాల్వర్ పట్టుకొని ఏం చేయగలవు చెప్పు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది మోనిత.
దీపని బ్రతిమాలుతున్న మోనిత..
దానికి ఏ చెయ్యి అని తేడా తెలీదు ఏ చేత్తో నొక్కినా పేలుతుంది పేల్చమంటావా అంటుంది దీప. ఈ పని ముందే చేయవలసింది అందరూ సుఖపడేవాళ్ళం అయినా డాక్టర్ బాబు నిన్ను పట్టించుకోకుండా తిరుగుతుంటే నువ్వెందుకు ఆయన వెంట తిరుగుతున్నావు అంటుంది దీప. నిన్ను పట్టించుకోకుండా తిరుగుతున్నప్పుడు నువ్వెందుకు అతని వెనుక తిరిగావు ప్రేమ కాబట్టి నాది కూడా ప్రేమే కదా అంటుంది మోనిత.
కానీ నువ్వు ప్రేమ కోసం అంతకరాలు వేయవు అని దీప అంటే ప్రేమ కోసం ఏమైనా చేయొచ్చు అంటుంది మోనిత. నన్ను నా భర్తని విడదీయాలని చూసావు అంటే తప్పు నాది కాదు కార్తీక్ ది, నా మాటలు నమ్మాడు. ఇంతకుముందు కూడా నామీద నన్ను గురి పెట్టావు కానీ పేల్చలేకపోయావు అని మోనిత అంటే నేను తెగించాను తెగింపుకి బలం ఎక్కువ అంటుంది దీప.
మోనితని షూట్ చేసిన దీప..
నన్ను చంపొద్దు నేను దూరం నుంచి అయినా కార్తీక్ ని దూరం నుంచి అయినా చూసే అదృష్టాన్ని చంపొద్దు, నువ్వు చనిపోయాక కార్తీక్ జోలికి రాను దూరంగా చూస్తూ గడిపేస్తాను నన్ను చంపొద్దు అంటూ బ్రతిమాలుచుంది మోనిత. నీ మాటలు ఎవరు నమ్ముతారు, దేవుడు నాకు అన్యాయం చేశాడు దేవుడు లేడు అనుకున్నాను కానీ నీలాంటి వాళ్ళని చంపడానికే ఆ దేవుడు నన్ను పుట్టించాడు అంటుంది దీప. లోపల నుంచి గన్ సౌండ్ వినిపించడంతో కంగారుగా పరిగెత్తుకొస్తాడు కార్తీక్.
ఎంత పని చేసావు దీప నన్ను గుండెల మీద కాల్చావు అంటే కార్తీక్ ని కాల్చావు అంటూ కుప్పకూలిపోతుంది మోనిత. చచ్చి పడి ఉన్న మోనితని చూసి షాక్ అవుతాడు కార్తీక్. ఇదంతా ఎందుకు చేసావు నీ గురించి నిజం తెలుసుకునేసరికి నాకు సగం జీవితం అయిపోయింది. ఏమన్యాయం చేశాను నీకు, నా స్నేహితురాలు అనుకోవటం తప్పా? నీది ప్రేమ కాదు శాడిజం నీ పిచ్చి ప్రేమ నీకు ఏమి మిగిల్చింది, ఇలా దిక్కు దిక్కులేని దానిలాగా ఎవ్వరూ కోరుకొని చావుని కొని తెచ్చుకున్నావు అంటూ బాధపడతాడు కార్తీక్.
చనిపోతూ కూడా శాడిజం చూపించిన మోనిత..
దీపని తీసుకొని వచ్చి కార్లో కూర్చోబెడతాడు కార్తీక్. స్పృహలోకి వచ్చిన మోనిత, కార్తీక్ వాళ్ళ కారులోకి బాంబు విసిరేస్తుంది. నాకు దక్కని కార్తీక్ వేరే ఎవరికీ దక్కకూడదు నిన్ను స్వర్గంలోనైనా కలుస్తాను అంటూ కన్నుమూస్తుంది. మరోవైపు కారులో వెళ్తున్న శౌర్య కారు ఆపమని కిందికి దిగుతుంది. ఏమైంది అని సౌందర్య అడిగితే నేను హిమతో రాను అంటుంది. అమ్మ చెప్పిన మాటలు మర్చిపోయావా అని సౌందర్య అడిగితే అన్ని గుర్తున్నాయి అలాగే హిమా చేసిన తప్పును కూడా కళ్ళకు కనిపిస్తున్నాయి, నాకు అమ్మానాన్న కావాలి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంటుంది శౌర్య.
వాళ్లే వస్తారు అని సౌందర్య అంటే అమ్మానాన్న ఇక్కడికి రారని నీకు తెలుసు కదా, కానీ చెప్పటం లేదు. నీకు అన్నీ తెలుసు కానీ ఏమీ చెప్పవు డాక్టర్ బాబు మా నాన్నని నీకు తెలుసు కానీ చెప్పలేదు. ఇప్పుడు పాత జ్ఞాపకాలన్నీ ఎందుకు చదువుతున్నావు అని సౌందర్య అంటే నేను రాను ఈ హిమతో నేను ఉండను అంటుంది శౌర్య. సారీ నాదే తప్పు అంటుంది హిమ. నువ్వు నాతో మాట్లాడొద్దు అంటూ హిమని కసురుకుంటుంది శౌర్య. మీ ఇద్దరినీ కలిసి ఉండమని అమ్మ చెప్పింది కదా అంటే నావల్ల కాదు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నేను వాళ్లకి హిమతో కలిసి ఉండలేను అన్న విషయం చెప్తాను అంటూ అక్కడి నుంచి పారిపోతుంది శౌర్య.
విడిపోయిన శౌర్య, హిమ..
ఇదంతా నా వల్లే అని హిమ బాధపడుతుంటే కాదు ఇదంతా మన తలరాత అంటుంది సౌందర్య. మళ్లీ మనం సౌర్యని కలవలేమా అని హిమ అంటే తను వద్దనుకున్నా మనం వద్దనుకోలేం కదా, మీ రక్తసంబంధమే మీ ఇద్దరిని ఒకటి చేస్తుంది అంటుంది సౌందర్య. మరోవైపు ఆవేశపడుతున్న దీప చివరి క్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటుంది. అలా మాట్లాడొద్దు అంటాడు కార్తీక్. అందర్నీ పంపించేసాను కానీ మీరు మాత్రం నాతో ఉండిపోయారు ఎందుకంటే నా చివరి కోరిక తీర్చడానికి అంటుంది దీప. నీకు ఏమీ కాదు నోరు మూసేయ్ అంటూ కసురుకుంటాడు కార్తీక్.
నాకు ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది, నరకం లాగా ఉంది అంటుంది దీప. నువ్వు లేని లోకంతో నాకు పని లేదు అంటాడు కార్తీక్. ఈ చివరి క్షణాల్లో మీ భార్యగా గడిపే ఈ అద్భుత క్షణాలు చాలు నేను ప్రశాంతంగా కన్నుమూయడానికి అంటుంది దీప. నీకు దండం పెడతాను పదేపదే చావు గురించి మాట్లాడకు ఉంటే ఇద్దరమే ఉంటాము లేకపోతే ఇద్దరం పోతాము అంటాడు కార్తీక్.
కార్తీక్, దీపని కాపాడిన సప్తపది..
ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని దీప అడిగితే నిన్ను కాపాడుకోడానికే తీసుకువెళ్తున్నాను అంటాడు కార్తీక్. నా డాక్టర్ బాబుకి అబద్ధం చెప్పడం రాదు నన్ను బ్రతికించే శక్తి ఎవరికీ లేదు అంటుంది దీప. ఒకసారి కారు ఆపండి మళ్లీ మళ్లీ మిమ్మల్ని కారు ఆపమని అవకాశం నాకు రాదు అంటూ కార్ ఆపమంటుంది దీప. తనకి ఇష్టం లేకపోయినా కారు ఆపుతాడు కార్తీక్. నాకు మీతో ఏడు అడుగులు నడవాలని ఉంది ఇక నడవలేనేమో అంటూ అతని చిటికెన వేలు పట్టుకుని ఏడు అడుగులు వేస్తుంది దీప.
వాళ్లు అలా ముందుకు వచ్చేసరికి కారు పేలిపోతుంది. నీ చివరి కోరిక నిన్ను నన్ను ఇద్దరినీ రక్షించింది అంటాడు కార్తీక్. మీకు ఏమీ కాలేదు కదా అని దీప అంటే నీ తో వేసిన ఏడు అడుగులు నన్ను కాపాడాయి. ఇప్పుడు చెప్పు బ్రతుకుదామన్న ఆశ నీకు లేదా అంటాడు కార్తీక్. మరోవైపు ముసలి అయిపోయినా కార్తీక్ వాళ్ళని వెతుకుతూనే ఉంటారు వారణాసి వాళ్లు. ఎందుకు వాళ్లు మనల్నించి దూరంగా వెళ్లిపోయారు అంటుంది సౌందర్య. దూరంగా వెళ్లిపోయిన వాళ్ళు మన మనసుకి దగ్గరలోనే ఉంటారు అంటాడు వారణాసి.
పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్న దీప దంపతులు..
వాళ్లు ఎక్కడ ఉన్నారు సంతోషంగా ఉంటే చాలు అంటుంది సౌందర్య. దగ్గుతున్న దీప ని ఇక్కడే ఉండు వాటర్ తెస్తాను అని లేకపోతే అతని చేయి పట్టుకొని మీ చేయి పట్టుకునే సరికి నా దగ్గిపోయింది చూసారా అంటుంది దీప. అందుకే నేను చెప్పేది నీతో పాటే నేను అని అంటాడు కార్తీక్. మన పిల్లలిద్దరూ కలిసే ఉంటారు కదా అని దీప అంటే వాళ్ళ నానమ్మ ఉంటుంది కదా చూసుకుంటుంది అంటాడు కార్తీక్. నాకు చావు కనిపిస్తుంది మిమ్మల్ని వెళ్ళిపోమని ఎలా చెప్పాలి అనుకుంటుంది దీప.
పెళ్లి అయిన రోజుల దగ్గర్నుంచి కబుర్లన్నీ చెప్పుకుంటారు దీప, కార్తీక్. దీప కి కార్తీక్ క్షమాపణ చెప్తే ఇప్పుడు క్షమాపణలు వద్దు మీరు ఉన్నందుకు సంతోషంగా ఉంది అంటుంది దీప. నాకు ఇలా కలిసి ఉండాలని ఉంది కానీ మీతో కలిసి నడవడం లేదు, అది ఇంకో పది అడుగుల్లో ఆగిపోయేలాగా ఉంది అంటుంది దీప. ఆగదు దీప నా ప్రాణాలు అడ్డెసి ఆపుతాను పద హాస్పిటల్ కి వెళ్దాము అంటే వద్దు మిమ్మల్ని మించిన డాక్టర్ మమ్మల్ని మించిన దేవుడు అంటుంది దీప.
Karthika Deepam January 24 Today Episode: మళ్లీ కలుద్దాం అంటూ ప్రేక్షకులకి వీడ్కోలు పలికిన దీప దంపతులు..
నేనే దేవున్ని అయితే నిన్ను ఇక్కడి వరకు తీసుకు వస్తాను అంటూ ఏడుస్తాడు కార్తీక్. రెప్పలు వాలిపోతున్న దీపని ఏదైనా మాట్లాడు నీ కనుబొమ్మలు పైకెత్తి ఏదైనా అను అప్పట్లో నాపై కోపంతో మాట్లాడేటప్పుడు అలాగే చేసేదానివి కదా అంటాడు కార్తీక్. తను కూడా తన పాత జ్ఞాపకాల్లోకి వెళుతుంది దీప. కారు లోయలో పడినప్పుడు మనం చనిపోలేదు ఇందాక బాంబు బ్లాస్ట్ అయినప్పుడు కూడా చనిపోలేదు, మౌనిక దగ్గర ఉన్నప్పుడు తను నేను షూట్ చేయొచ్చు కానీ అలా జరగలేదు మనం వేసిన ఏడు అడుగులే మన ఇద్దరినీ కాపాడాయి అంటాడు కార్తీక్. మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది అంటుంది దీప.
దేవుడు నాలాగా చెడ్డవాడు కాదు నీకు ఆ దేవుడు దీవెనలతో పాటు ఎంతోమంది ఆదరణ అభిమానాలు ఉన్నాయి. అవే మనల్ని తిరిగి వాళ్ళకి దగ్గర అయ్యేలాగా చేస్తాయి అంటాడు కార్తీక్. మళ్లీ అందరివీ కలుస్తాము వాళ్ళ ఆదరణ మళ్లీ పొందుతాము అంటూ దీపని తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్లిపోవడంతో సీరియల్ ముగుస్తుంది. సీరియల్ హిట్ అయిన క్లైమాక్స్ బాగోలేదు అంటున్న ప్రేక్షకులు. క్లైమాక్స్ కోసం మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిల్చిన కార్తీకదీపం.
శుభం పలికిన కార్తీకదీపం..