Karthika Deepam January 3 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ దేవుడికి దండం పెట్టుకుంటూ ఎప్పుడు నిన్ను అది కావాలి ఇది కావాలి అని వేధించలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు తప్పితే వేరే దిక్కులేదు, దయచేసి మా అందరిని కలిసి సంతోషంగా ఉండేలాగా దీవించు దీప ఎన్నో వ్రతాలు పూజలు చేసింది కానీ ఆమెకి ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు అంటూ గంట మోగించి దేవుడికి హారతి ఇస్తాడు.
పూర్తిగా పాడైన దీప ఆరోగ్యం..
ఆ సౌండ్ కి నిద్ర లేచిన దీప ఈ సమయంలో ఎవరు పూజ చేస్తున్నారు అంటూ లేవబోతుంది కానీ ఆరోగ్యం సహకరించక మంచం మీద ఉండిపోతుంది. ఎందుకు ఇలా అవుతుంది నాకు రోజులు దగ్గర పడుతున్నాయా భగవంతుడా నా భర్త పరిస్థితి ఏంటి ఆయన్ని ఎలాగైనా నా అత్త, మామల దగ్గరికి చేర్చు అనుకుంటుంది. అంతలోనే హారతి తీసుకొని కార్తీక్ అక్కడికి వస్తాడు.
నీ ఆరోగ్యం కోసం నేను దేవుని దండం పెట్టేసుకున్నాను ఇంకేమీ పర్వాలేదులే అంటాడు కార్తీక్. నాకోసం మీరు పూజ చేశారా అంటుంది దీప. అవును ప్రార్ధించాను అయితే దీప ని బ్రతికించు లేకపోతే మా ఇద్దరినీ కలిపి తీసుకెళ్లి పో అని అడిగాను అంటాడు కార్తీక్. మళ్లీ అదే మాట నేను అదే వద్దంటున్నాను అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్ళండి అంటుంది దీప. నేను వెళ్లొద్దు అనట్లేదు ఇద్దరినీ కలిసి వెళ్దాం అంటున్నాను అంటాడు కార్తీక్.
కాబోయే అత్తగారిని కాకా పడుతున్న చారుశీల..
అది కాదు డాక్టర్ బాబు అంటుంది దీప. ఇంకేమీ మాట్లాడకు నేను దేవుణ్ణి అడిగాను మనిద్దరినీ జీవితాంతం దేవుడు ఇలాగే ఉంచుతాడు అంటాడు కార్తీక్. మరోవైపు సౌందర్య, చారుశీల దగ్గరికి వస్తుంది. ఈవిడేంటి ఇప్పుడొచ్చింది కార్తీక్ హాస్పిటల్ లో లేడు కాబట్టి సరిపోయింది అనుకుంటుంది చారుశీల. ప్లీజ్ ఫోన్ నెంబరు ఫోటోలు ఇచ్చారు కదా అమ్మ నేను వెతుకుతున్నాను దొరికితే మీకు ఫోన్ చేస్తాను అంటుంది చారుశీల. నేను అందుకోసం రాలేదమ్మా అంటూ కార్తీక్ రాసిన రిస్క్రిప్షన్ చారుశీలకి చూపించి ఇది నువ్వే రాశావని ఇంద్రుడు చెప్పాడు అంటుంది.
విషయాన్ని అర్థం చేసుకున్న చారుశీల ఇంద్రుడు కార్తీక్ పేరు చెప్పలేక నా పేరు చెప్పి ఉంటాడు అనుకుంటూ ఈ ప్రిస్క్రిప్షన్ నేనే రాసానాంటీ అంటుంది. కావాలంటే చూడండి కిందన రౌడీ అని రాసాను సడన్గా తన పేరు గుర్తుకు రాలేదు అందుకే ఇలా రాసాను అంటుంది చారుశీల. నా కొడుకు హ్యాండ్ రైటింగ్ ఇలాగే ఉంటుంది దొరికేసాడని అనుకున్నాను అంతలోనే నిరాశ అంటూ బాధపడుతుంది సౌందర్య. ఈవిడికి కాబోయే కోడల్ని ఈవిడని మంచి చేసుకుంటే మంచిది అంటూ మిమ్మల్ని ఆంటీ అని పిలుస్తున్నందుకు ఇబ్బంది లేదు కదా అంటుంది చారుశీల.
కరెక్ట్ గా పోల్చారంటున్న చారుశీల..
అభిమానంతో ఎలా పిలిచినా పర్వాలేదు కానీ ఇంతకుముందు మోనిత అని ఒకర్తి ఉండేది అది ఆంటీ, ఆంటీ అని పిలుస్తూనే కొంపముంచింది. అయినా నా కొడుకు కోడలు ఎక్కడున్నారో తెలియదు ఇంక అలా ఎవరు మోసం చేస్తారు చెప్పు అంటు బయటికి వెళ్ళిపోతుంది సౌందర్య. మీరు పోల్చకూడదు అంటూ మోనిత తో కరెక్టుగా పోల్చారు కాకపోతే తను కార్తీక్ ని సాధించలేకపోయింది నేను సాధిస్తాను అంతే అనుకుంటుంది చారుశీల. ఇంటికి వచ్చిన సౌందర్య ఈ రోజైనా కొడుకు కోడలు దొరకాలని దేవునికి దండం పెట్టుకోండి అంటుంది.
నేను కూడా వచ్చేదా అంటాడు ఆనందరావు. మీరు వస్తే పిల్లలు కొట్టుకున్న కొట్టుకుంటారు అందుకే మీరు ఇక్కడే ఉండండి అంటుంది సౌందర్య. నేను ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళు కొట్టుకోరా అంటాడు ఆనందరావు.కార్తీక్, దీప కనిపిస్తేనే గాని వాళ్లు కలవరండి అంటుంది సౌందర్య. కార్తీక్ వాళ్ళని బ్రతకడానికి వెళ్తున్నాను నువ్వు కూడా తోడురా అని ఇంద్రుడిని పిలుస్తుంది సౌందర్య. కంగారుపడి నేనెందుకు అమ్మ నాకు వేరే పని ఉంది అంటాడు ఇంద్రుడు.
ఇంద్రుడిని ఇరకాటంలో పెట్టిన సౌందర్య..
వెంటనే సౌందర్య చంద్రమ్మ ని పిలుస్తుంది. ఇంద్రుడ్ని చంద్రమ్మ తల మీద ఒట్టేసి ఇప్పుడు నిజం చెప్పు నా కొడుకు గురించి అడగ్గానే నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు. మొన్న నా కొడుకు హ్యాండ్ రైటింగ్ గురించి అడిగినప్పుడు కూడా అలాగే కంగారు పడ్డావు ఇప్పుడు అలాగే కంగారు పడుతున్నావ్, నా మొహం లో కూడా చూసి మాట్లాడలేకపోతున్నావు నిజం చెప్పు, నేను నిన్ను ఏమీ అనను మీకు ఎందుకంత భయం మిమ్మల్ని మా ఇంట్లో మనిషిలాగే అనుకుంటున్నాం మరి ఎందుకు నిజాన్ని దాస్తున్నారు.
మేము ఎన్ని పాట్లు పడుతున్నామో తెలుసు కదా, దయచేసి నిజం చెప్పు అని బ్రతిమాలుతుంది సౌందర్య. నిజం చెప్పడానికి భయమెందుకు గండ నీకు ఏమీ తెలియదు అని నిజాన్ని చెప్పడానికి ఎందుకు అంత కంగారు అంటుంది చంద్రమ్మ. నిజంగానే చెప్తున్నాను అమ్మ నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను నాకు ఏమీ తెలియదు నేను వాళ్ళని చూసిందే లేదు అంటాడు ఇంద్రుడు. ఆ మాటకి బాధపడుతూ వెళ్ళిపోతుంది సౌందర్య.
చాలా నమ్మకంతో ఉన్న ఆనందరావు దంపతులు..
ఆ తరువాత కారులో వెళ్తున్న సౌందర్యని ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అమ్మ అంటాడు అంజి. మనం ఊరంతా కవర్ చేసామా అంటుంది సౌందర్య.ఊరి శివార్లలో కొత్తపేట అని ఏరియా ఉంది అక్కడికి వెళ్ళలేదు అంటాడు అంజి. అయితే అక్కడికి తీసుకు వెళ్ళు అంటుంది సౌందర్య. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా నా కొడుకు కోడలు కనిపించాలి అంటుంది సౌందర్య. అంతలోనే ఆనందరావు ఫోన్ చేసి కొడుకు కోడలు కనిపించారా అని అడుగుతాడు.
దొరికితే మీకు ఈపాటికి మీకు ఫోన్ చేసేదాన్ని కదా అంటుంది సౌందర్య. నాకు ఎందుకో దొరికారేమో అనిపించింది అందుకే నీకు ఫోన్ చేశాను అంటాడు ఆనందరావు. అదే నిజం ఇవ్వాలని కోరుకోండి అంటుంది సౌందర్య. కార్తీక్ వాళ్ళ ఫోటోలు చూపిస్తూ ఒకవైపు అంజి మరొకవైపు సౌందర్య వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో కార్తీక్ నిద్రలేచి వంట గదిలో పనిచేస్తున్న దీపని మందలిస్తాడు. నిన్ను వంటగదిలోకి రావద్దన్నాను కదా పండరి ఏది అంటూ హడావిడి చేస్తాడు.
Karthika Deepam January 3 Today Episode: నా రెక్కలు కట్టేయొద్దు అంటున్న దీప..
ఊరుకొండి డాక్టర్ బాబు నాకు వచ్చిన జబ్బు కన్నా మీ నడవడికే ఎక్కువ భయం వేస్తుంది. కట్ చెయ్యొద్దు ఇది చేయొద్దు అంటూ నన్ను ఒక రోగిష్టిని చూసినట్టు చూస్తుంటే, పోయేటట్లుగా ఉన్నాను అంటుంది దీప. ఇప్పటివరకు ఎలా ఉండాలి ఏం చేయాలి అని మీరు చెప్పారు కానీ ఇప్పుడు నేను చెప్తాను అంటుంది. ఎప్పుడో ఒకప్పుడు అందరమూ పోయే వాళ్ళమే కాకపోతే నేను నాలుగు రోజులు ముందు పోతాను అంతే కదా అంటుంది దీప. అలా ఏమీ జరగదు అంటాడు కార్తీక్.
జరిగినా ఏమీ చేయలేం అంటుంది దీప. ఈరోజు నుంచి నన్ను విశ్రాంతి తీసుకో అంటూ నా రెక్కల్ని కట్ చెయ్యొద్దు నాకు నచ్చినట్లుగా నడుచుకోనివ్వండి, ఈరోజు నుంచి ఏ జబ్బు లేనట్టుగా ప్రవర్తించాలి ఏదో ఒక రోజు ప్రశాంతంగా కన్ను మూయాలి అంతే నేను కోరుకునేది అంటుంది దీప. ఆ మాటలకి జాలిగా చూస్తాడు కార్తీక్. జాలి చూపులు కూడా వద్దు అవి కూడా నన్ను పేషెంట్ ని అని గుర్తు చేస్తున్నాయి అంటుంది దీప. ఆ ఏరియాలో ఉన్న అన్ని ఇల్లులు వెతుక్కుంటూ కార్తీక్ ఉన్న ఇంటి ముందుకు వస్తారు సౌందర్య వాళ్ళు. తర్వాత ఏం జరిగిందో రేపు ఎపిసోడ్లో చూద్దాం.