Karthika Deepam January 4 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో బ్రతికినంత కాలం నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి, జాలి చూపులు కూడా నామీద చూపించొద్దు అంటుంది దీప. సరే నీ ఇష్టం ఇంతకీ ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు కార్తీక్. దోసకాయ పచ్చడి చేస్తాను హిమకి ఇది చాలా ఇష్టం కదా అంటుంది. అక్కడక్కడ హిమవుంటే ఇక్కడ చేస్తే ఏం లాభం అంటాడు కార్తీక్.
త్రుటిలో తప్పించుకున్న కార్తీక్ దంపతులు..
ఎదురింట్లో ఉండేది హేమచంద్ర అన్నయ్య, ఆయనకి చేరిస్తే హిమకి చేరిపోతుంది అంటుంది దీప. మనం దొరికిపోతాం దీప అంటాడు కార్తీక్. దొరక్కుండా నేను చేసుకుంటాను అయినా ఇప్పుడే కదా నాకు నచ్చినట్లుగా బ్రతకమన్నారు అంటుంది దీప. సరే నీ ఇష్టం అంటూ బ్రష్ చేసుకోవటానికి బయటకు వస్తాడు కార్తీక్. అంతలో వాళ్ళని వెతుక్కుంటూ వస్తున్న సౌందర్య, అంజి కనిపిస్తారు.
వాళ్లు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నట్లున్నారు అంటూ కంగారుపడిన కార్తీక్ బయటి వస్తువులన్నీ ఇంట్లో పెట్టేసి బయటికి తాళం వేసేస్తాడు. ఆ ఇంటికి వచ్చిన సౌందర్య వాళ్ళు ఇంటికి తాళం వేసి ఉండటంతో చేసేదేమీ లేక వెనక్కి వెళ్ళిపోతారు. కంగారులో దీపకి విషయం చెప్పడం మర్చిపోయాను తనగాని తలుపు తడితే ప్రమాదం అని కంగారు పడతాడు కార్తీక్.
అసలు నిజం చెప్పి దీపకు షాక్ ఇచ్చిన కార్తీక్..
కార్ దగ్గరికి వచ్చిన సౌందర్య ఈ ఏరియాలో ఇల్లు అన్ని అయిపోయాయి ఆ ఒక్క ఇల్లు మాత్రం ఉండిపోయింది అంటుంది. ఆ ఇంట్లో కూడా ఎవరూ లేరటండీ పక్కింటి వాళ్ళని అడిగితే చెప్పారు అంటాడు అంజి. కార్తీక్ ఏం చేస్తున్నాడో చూద్దామని వచ్చిన దీప తలుపు తాళం వేసి ఉండడంతో కార్తీక్ వచ్చి తాళం తీసి జరిగిందంతా చెప్తాడు. సమయానికి పండరి కూడా ఇంట్లో లేదు అంటాడు కార్తీక్.
తనకి కూడా నిజం చెప్పకూడదని తెలుసు అంటుంది. కానీ అంజి పండరి కొడుకు అంటాడు కార్తీక్. షాక్ అయినా దీప అదేంటి అని అడుగుతుంది. అవును తన వాళ్ల గురించి ఎప్పుడు అడిగినా చెప్పటం లేదని నిలదీస్తే ఒక రోజు చెప్పింది. అంజి తన కొడుకుని తన వల్ల కుటుంబానికి చాలా నష్టం జరిగిందని అందుకే కొడుకు మీద చాలా కోపంగా ఉంది అంటాడు. పండరికీ ఈ విషయం చెబుదాము, కొడుకు మారేడు అంటే సంతోషిస్తుంది అంటుంది దీప.
ఈ ఏరియా ని వదిలేయండి అంటున్న చారుశీల..
అంతలోనే అక్కడికి వచ్చిన చారుశీల వాళ్ళిద్దర్నీ చూసి షాక్ అవుతుంది. వీళ్ళు కార్తీక్ వాళ్ళని వెతుక్కుంటూ వచ్చినట్లున్నారు ఇప్పుడు దొరికితే అంతే సంగతులు ముందు ఈవిడని ఇక్కడి నుంచి పంపించేయాలి అనుకుంటూ సౌందర్య ని విష్ చేస్తుంది చారుశీల. నువ్వేంటమ్మా ఇక్కడ అని అంటుంది సౌందర్య. నేను ఉండేది ఇక్కడే ఆంటీ, మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది.
నా కొడుకు కోడల్ని వెతుక్కుంటూ వచ్చాను సౌందర్య.మా పనమ్మాయి చెప్పింది ఎవరో వెతుక్కుంటూ వచ్చారు అది మీరేనా అని అంటుంది. అవునమ్మా మేమే కానీ మా దురదృష్టం కొద్దీ ఈ ఏరియాలో కూడా లేరు, నువ్వు ఉండేది హి ఏరియాలోనే అంటున్నావ్ కాబట్టి నా కొడుకు కోడలు కనిపిస్తే నాకు చెప్పమ్మా అంటుంది సౌందర్య. తప్పకుండా అంటే ఈ నేనుండేది ఇక్కడే కాబట్టి మీరు ఊరంతా వెతకండి ఈ ఏరియా నాకు వదిలేయండి అంటుంది చారుశీల.
హేమచంద్ర ని రిక్వెస్ట్ చేస్తున్న దీప..
సరే అంటూ అక్కడి నుంచి బయలుదేరుతారు సౌందర్య వాళ్ళు. మరోవైపు హేమచంద్ర వాళ్ళ ఇంటికి వెళ్లిన దీప, అత్తయ్యని ఒకసారి ఇక్కడికి తీసుకురా అన్నయ్య ఆవిడతో మాట్లాడాలి అంటుంది. అదేంటి నిన్న వద్దనుకున్నారు కదా అంటాడు హేమచంద్ర. కానీ మాట్లాడడమే కరెక్ట్ అన్నయ్య నాకు ఏమైనా అయితే ఆయన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళమంటే మాట వినిపించుకోవడం లేదు అంటుంది దీప. అయితే నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడొచ్చు కదా అంటాడు హేమచంద్ర.
అక్కడికి వెళ్తే పిల్లలకి కనిపిస్తాను అందుకే ఆవిడని ఇక్కడికి రమ్మని చెప్పి, జరిగిందంతా చెప్పి నేను బ్రతికి లేనని పిల్లలకి చెప్పమంటాను ఆవిడ అర్థం చేసుకుంటుంది అంటుంది దీప. కానీ ఇలా చేస్తే కార్తీక్ ఏమంటాడో అంటాడు హేమచంద్ర. ఏమీ పర్వాలేదు అన్నయ్య నన్ను కొట్టిన తిట్టినా పర్వాలేదు కానీ ఇలా చేయకపోతే ఆయన సంతోషంగా ఉండరు నా మాట విని పిలుచుకురా అంటుంది దీప.
రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన హేమచంద్ర, దీప..
సరే అంటూ బయలుదేరబోతుంటే ఎదురుగా కార్తీక్ కనిపిస్తాడు. ఎక్కడికి బయలుదేరారు అంటూ నిలదీస్తాడు. దీప ఏదో చెప్పబోతుంటే నాకు దోసకాయ పచ్చడి అన్నప్పుడే అర్థమైంది ఎందుకు చెప్పింది అర్థం చేసుకోవట్లేదు చావైనా బతుకైనా నీతోనే ఇంటికి వెళ్దాం పద అంటూ దీపని తీసుకొని వెళ్లబోతాడు. దీప చెప్పింది కూడా కరెక్టే కదా అంటాడు హేమచంద్ర. నిన్నే అని చెప్పాను కదా కన్విన్ చేయవు కదా మళ్ళీ చెప్పేస్తాను అంటావేంటి మీ అందరికంటే నాకు ఎక్కువ బాధ్యత ఉంది.
అయినా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అంటే మీరే అర్థం చేసుకోండి అంటాడు కార్తీక్. వాళ్ల ఇంటికి బయలుదేరి పోతుంటే ఎదురుగా హేమ వస్తూ కనిపిస్తుంది. హేమచంద్ర ని రిక్వెస్ట్ చేసి మా గురించి ఏమీ చెప్పొద్దు అంటూ రూమ్ లోకి వెళ్ళి దాకుంటారు కార్తీక్ వాళ్ళు. హేమచంద్ర దగ్గరికి వచ్చిన హిమ అమ్మ నాన్నల్ని వెతకటానికి తీసుకెళ్తాను అన్నారు అంట కదా నన్ను తీసుకెళ్లండి అని అడుగుతుంది. సరే కానీ టిఫిన్ చేసావా అని అడుగుతాడు హేమచంద్ర.
హైదరాబాద్ వెళ్ళిపోదామా అంటున్న సౌందర్య..
లేదు అంటుంది హిమ. సరే అయితే నేను దోసెలు దోసకాయ పచ్చడి చేశాను తిందువు గాని రా అంటాడు హేమచంద్ర. దోసకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ నా కోసం స్పెషల్ గా చేసేది అంటూ దోసలు తినడానికి హేమచంద్ర వెనుక వెళ్తుంది. సీన్ కట్ చేస్తే ఏం చేద్దాం అండి, ఎంత వెతికినా ప్రయోజనం ఉండటం లేదు, హైదరాబాద్ వెళ్ళిపోదామా అని అడుగుతుంది. ఆశ వదులుకున్నట్లేనా అంటాడు ఆనందరావు.
ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోతే ఇక్కడ ఉండి ప్రయోజనం లేదనిపిస్తుంది అంటుంది సౌందర్య. ఆ ఏరియా అంతా వెతికి ఒక ఇల్లు తప్ప, రేపటి రోజున ఆ ఇల్లు కూడా నిలికితే బాగుండును అని అనిపించకుండా రెండు రోజులు ఉండి అయినా సరే ఆ ఇంట్లో ఎవరు ఉన్నారో కనుక్కొని వెళ్దాం అంటుంది సౌందర్య. మన కొడుకు కోడలు దొరికినట్లే దొరికి దొరక్కుండా పోతున్నారు అంటూ బాధపడుతుంది సౌందర్య.
తన కుటుంబాన్ని తలుచుకొని బాధపడుతున్న హిమ..
మరోవైపు టిఫిన్ తింటున్న హిమ ఈ పచ్చడి అచ్చు మా అమ్మ చేసినట్లే ఉంది అంటుంది. మీ అమ్మ చేసిందనుకొని తిను అంటాడు హేమచంద్ర. నిజంగా అలాగే అనుకోవాలి అంకుల్, ఆవిడ చేత్తో తినే రోజు ఎప్పుడు వస్తుందో అంటుంది హిమ. తప్పకుండా దొరుకుతుంది అని హేమచంద్ర అంటే మా ఇంట్లో అందరూ కలిసి కూర్చొని తింటే ఆ సంతోషమే వేరు, మళ్లీ అలాంటి రోజు రావాలి అంటుంది హిమ.
Karthika Deepam January 4 Today Episode:
తప్పకుండా వస్తుంది మీ నాన్నని ఇలా దిక్కులేని వాళ్ళగా వదిలేయను, అందరూ సంతోషంగా ఉండేలాగా చేస్తాను అనుకుంటుంది దీప. టిఫిన్ చేసినా హేమ నన్ను ఎప్పుడు బయటకు తీసుకెళ్తారు అని అడిగితే రేపు అని చెప్తాడు హేమచంద్ర. హిమా వెళ్లిపోయిన తర్వాత పాపా వెళ్ళిపోయింది మీరు బయటకు రండి అంటాడు హేమచంద్ర. చూసావా ఎంత టెన్షన్ పడాల్సి వచ్చిందో ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అంటాడు కార్తీక్.
సరే అండి ఇంకెప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను,అన్నయ్య గొడుగుంటే ఇవ్వు అత్తయ్య వాళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోతాం అంటుంది. దీపని ఆశ్చర్యంగా చూస్తున్న కార్తీక్తో మీరు విన్నది నిజమే ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను వునన్నాళ్ళు సంతోషంగా ఉందాం అంటుంది దీప. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.