Karthika Deepam: భార్య ఆరోగ్యం కోసం తపన పడుతున్న ఒక భర్త కథ ఈ కార్తీకదీపం.

కొత్త ఇంటికి వచ్చిన సౌందర్య వాళ్లని ఇల్లు ఎలా ఉంది అని అడుగుతాడు అంజి. నాకు అమ్మ నాన్న లేని ఇల్లు నచ్చలేదు అన్న శౌర్య మీద కేకలు వేస్తాడు ఆనందరావు. ఎందుకంత కోపం అని సౌందర్య అడిగితే బయటి వాళ్లు నచ్చుతున్నారు ఇంట్లో వాళ్ళు నచ్చటం లేదు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మరోవైపు పండక్కి టాబ్లెట్స్ ఇచ్చి దీపకి తెలియకుండా ఫుడ్ లో కలిపి ఇమ్మంటుంది చారుశీల. దీపమ్మ మంచి కోసమే అని నమ్మిన పండరి అదే పని చేస్తుంది. మరోవైపు కార్తీక్ తో శౌర్యని చూపించమని మొండికేస్తుంది దీప. సరే తీసుకు వెళ్తాను కానీ నేరుగా కాదు ఇంద్రుని తీసుకు రమ్మంటానులే రాత్రి వెళ్దాం అప్పుడైతే మనల్ని ఎవరు గమనించరు అంటాడు కార్తీక్.

ఇంద్రుడు అరటిపండ్లు కొనడానికి అనే నెపంతో శౌర్యని తీసుకొని వస్తాడు. దూరం నుంచే శౌర్య ని చూసిన దీప, దుఃఖాన్ని ఆపుకోలేక శౌర్యని తెచ్చుకుంటాను అంటూ కారు దిగి ఆమె దగ్గరికి వెళ్ళబోతుంది. కానీ కార్తీక్ గురించి ఆమెని తిరిగి కార్లో కూర్చోబెడతాడు. ఇక్కడే ఉంటే ఆవేశాన్ని ఆపుకోలేను తీసుకెళ్ళిపోండి అంటూ ఏడుస్తుంది. శౌర్య ని పిలుస్తున్న సౌందర్యతో పాప లేదు అంటుంది చంద్రమ్మ. తను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు అని సౌందర్య అంటే మేము కూడా ఎంతో చెప్పాము కానీ వినిపించుకోలేదు అంటుంది చంద్రమ్మ.

అది ముందు నుంచి అంతే అందుకే వాళ్ళ డాడీ దాన్ని రౌడీ అనే వాడు అంటుంది చంద్రమ్మ. మరోవైపు గుండెల్లో మంటగా ఉంది అని భర్తతో చెప్తుంది దీప. ఎసిడిటీ అయి ఉంటుంది అని లైట్ తీసుకుంటాడు కార్తీక్. మరోవైపు ఇంద్రుడి ద్వారా తన తల్లిదండ్రులు ఊర్లోకి వచ్చారు అని తెలుసుకుంటారు కార్తీక్ దంపతులు. వాళ్లని ఎలాగైనా దూరం నుంచి చూపించమని ఇంద్రుని కోరుకుంటుంది దీప. అంతలోనే అక్కడికి హిమ రావటంతో అందరూ తప్పించుకుంటారు.

కానీ హిమ వాళ్ళని చూసేస్తుంది. అదే విషయాన్ని ఇంట్లో చెప్తే శౌర్య నమ్మకుండా హిమని అసహ్యించుకుంటుంది. మరోవైపు కార్తీక్ వాళ్ళని వెతుకుతున్న సౌందర్య వాళ్ళు మనం చుట్టూ ఉన్నవాళ్ళకి నిజం తెలిసిన చెప్పడం లేదేమో రేపు శివలత ని వెళ్లి కనుక్కుందాం అనుకుంటారు. మరోవైపు చారుశీల ఇచ్చిన టాబ్లెట్లు పనిచేసి స్పృహతప్పి పడిపోతుంది దీప. ట్రీట్మెంట్ ఇచ్చిన చారుశీల, దీప ఆరోగ్యం బాగోలేదని దీపకి తెలిసేలాగా చేస్తుంది.

భార్య కోసం ఏడుస్తున్న కార్తీక్ ని చూసి మోనిత అందుకే జలస్ ఫీల్ అయి ఉంటుంది తను చేయలేని పనిని నేను చాలా తక్కువ టైంలో చేశాను. ఇంకొద్ది రోజుల్లో దీప ప్రాణం పోవడం ఖాయం అనుకుంటుంది. ఇంటికి వచ్చిన దీప భర్తకి వంట చేయాలనుకుంటుంది. ఆ పొగకే నీకు ఆరోగ్యం పాడైంది వండొద్దు అంటాడు కార్తీక్. మరోవైపు ప్రిస్క్రిప్షన్ చూపించి ఈ హ్యాండ్ రైటింగ్ నాన్నదే కదా అంటుంది శౌర్య.

ఇది కచ్చితంగా కార్తీకదీపం ఇంద్రుడికి నిజం తెలుసేమో చీకట్లో రాయి వేద్దాం అనుకుని అతన్ని నిలదీస్తుంది. కానీ అతను నిజం చెప్పకపోవడంతో నిరాశ చెందుతుంది. మరోవైపు దీపని పలకరించడానికి వస్తాడు హేమచంద్ర. అతనికి జరిగిందంతా చెప్తుంది దీప. కష్టాలన్నీ మీకే వస్తున్నాయి అయినా కష్ట సమయంలో అయిన వాళ్ళ దగ్గర ఉండాలి కదా అంటాడు హేమచంద్ర. నేను అలాగే అనుకున్నాను కానీ చాలా రోజుల తర్వాత కనిపించి మళ్లీ నేను చనిపోతాను అంటే వాళ్ళు భరించలేరు అందుకే నిర్ణయం తీసుకున్నాం అంటుంది దీప.

పూల కోసం వెళ్లి హేమచంద్రతో పరిచయం చేసుకుంటుంది శౌర్య. తను చెప్పిన వివరాలను బట్టి కార్తీక్ కూతురేమో అని అనుమానిస్తాడు హేమచంద్ర. ఇంటికి వచ్చిన శౌర్య ని ఎక్కడికి వెళ్లావు అంటే ఎదురింటి హేమచంద్ర అంకుల్ ఇంటికి వెళ్లాను అంటుంది. అతను నాకు నేనే పరిచయం అయ్యాడు అంటాడు ఆనందరావు. మన అబ్బాయి విషయం చెప్పవలసింది కదా అంటే ఎందుకో చెప్పాలనిపించలేదు అంటాడు ఆనందరావు. చెప్పకపోతే మన పిల్లల్ని ఎలా కనుక్కుంటాం అంటుంది సౌందర్య. మరోవైపు టెస్టుల కోసం దీప ని హాస్పిటల్ కి తీసుకు వస్తారు. అక్కడ తన ఆరోగ్యం పాడైనట్లు తెలియనట్లు నటిస్తుంది దీప.

దీప ప్రవర్తనకి ఆశ్చర్య పోతుంది చారుశీల. తనకి నిజం తెలుసో లేదో కనుక్కోవడం ఎలా అనుకుంటుంది. మరోవైపు సౌందర్య, హేమచంద్ర ఇంటికి వెళ్లి తన కథనంతా చెప్పి కార్తీక్ వాళ్ళ ఫోటో చూపిస్తుంది. అది చూసిన హేమచంద్ర నేను అనుమానించింది నిజమైంది అనుకుంటాడు. అంతలోనే దీప వాళ్ళు వస్తున్నట్లు ఫోన్ చేస్తారు. ముందు కంగారుపడిన ఎప్పటికైనా కలవవలసిన వాళ్లే కదా రాని అనుకుంటాడు.

కార్తీక్ వాళ్ళని చూసిన ఇంద్రుడు మీరేంటి ఇక్కడికి వచ్చారు, మీ అమ్మానాన్న అద్దెకి తీసుకునే ఇల్లు ఇదే అంటూ హేమచంద్ర పక్కిల్లుని చూపిస్తారు. ఈ పక్కిల్లు మాకు తెలిసిన వాళ్ళదే మేము త్వరగా లోపలికి వెళ్ళిపోతాం అంటూ హేమచంద్ర ఇంట్లోకి వెళ్లి పోతారు. సౌందర్య ఇంట్లో ఉన్నట్టు చెప్తాడు హేమచంద్ర. ముందే ఎందుకు చెప్పలేదు అంటే హేమచంద్రని మందలిస్తాడు కార్తీక్. అవునా మీకోసం చాలా బాధపడుతుంది నేను ఎలాగైనా ఈరోజు చెప్పేస్తాను అంటాడు హేమచంద్ర.

వద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తాడు కార్తీక్. అత్తగారిని చూసిన దీప నన్ను వదిలేసి మీరైనా వెళ్ళండి అంటుంది. చనిపోయేది నేను ఎలా వెళ్తాను అంటాడు కార్తీక్. నాకు అంతా నిజం తెలుసు అంటుంది దీప. మరోవైపు తల్లిదండ్రులు కారణం అవటానికి కారణం హిమ అని తనని అసహ్యించుకుంటుంది శౌర్య. ఎప్పటికైనా మీ ఇద్దరూ కలిసి ఉండవలసిన వాళ్ళు అంటే అదే జరగని పని అంటుంది. కింద కూర్చుని భోజనం చేస్తున్న ఇంద్రుడి వాళ్ళని టేబుల్ మీద కూర్చొని భోజనం చేయమంటుంది శౌర్య.

అమ్మ నాన్నల్ని వెతక్కుండా మనం ఇలా భోజనం చేయడం నాకేమీ బాలేదు అంటుంది. మా బాబాయ్ వాళ్ళు టేబుల్ మీద కూర్చున్నారనే కదా నీ బాధంతా అంటూ పౌరుషంగా మాట్లాడి ఇంద్రుడి వాళ్ళని తనతో పాటు వేరే గదిలోకి తీసుకెళ్ళి పోతుంది శౌర్య. ఆనందరావు ఎంత బతిమాలినా వినిపించుకోదు. బాబు బాధపడుతున్న దీప దగ్గరికి వచ్చి నా తెలివితేటలు అన్నీ ఉపయోగించి నిన్ను బ్రతికించుకుంటాను అంటాడు కార్తీక్. నాకేమైనా అయితే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్లిపోండి అంటుంది దీప.

 

Deepam:ఇన్నాళ్ళు దీప ఒక్కతే ఏడ్చేది ఇప్పుడు కార్తీక్ కూడా తోడయ్యాడు అంటున్న ప్రేక్షకులు..

చస్తే ఇద్దరం కలిసే చద్దాం అంటాడు కార్తీక్. మరోవైపు చారిశీల కన్ను కార్తీక్ ఆస్తి మీద పడుతుంది. దానిని దక్కించుకోవడం ఎలా అని ప్లాన్ చేస్తుంది. మరి చారుశీల ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా? కార్తీక్ దీపని రక్షించుకుంటాడా? సౌందర్య కొడుకు కోడల్ని కలుస్తుందా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 1, 2023 at 8:16 ఉద.