Karthika Deepam: తన భార్య చావు బతుకులో ఉందని తెలుసుకొని తనని ఎలా అయినా బ్రతికించాలి లేదా ఆమెతోపాటు చనిపోవాలి అంటూ చావు కూడా సిద్ధమైన ఒక భర్త కథ ఈ కార్తీకదీపం.
మళ్లీ వాళ్ల జీవితాల్లోకి వచ్చిన మోనితని తలుచుకుంటూ బాధపడతారు కార్తీక్ దంపతులు. నేను చనిపోయిన మోనిత మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుదు అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లిపోండి అంటూ దీప సలహా ఇస్తుంది. అంతదాకా వస్తే నేను కూడా చనిపోతాను అంటాడు కార్తీక్ ఇక భర్తతో లాభం లేదని అత్తగారికి కనిపించి తను కనిపించినట్లు పిల్లలకి చెప్పొద్దని చెప్తుంది.
సౌందర్య అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం చెప్పదు. మరోవైపు కార్తీ కుటుంబ సభ్యులందరూ ఒకటైపోయారు కార్తీక్ ని ఎలా తగ్గించుకోవడం అని ఆలోచనలో పడుతుంది మోనిత. కార్తీక్ కనిపిస్తే ఏం చేయాలో చారుశీల కి ప్లాన్ చెప్తుంది. మరోవైపు అనుకోని పరిస్థితుల్లో కూతుర్లుద్దరిని కలుస్తాడు కార్తీక్. వెంటనే చూసిన కూతుర్లు ఇద్దరు షాక్ అయి చాలా ప్రశ్నలు వేస్తారు. తల్లిని చూపించమని పేజీ పెడితే వాళ్ళ ఇంటి వైపు తీసుకెళ్తూ ఉంటాడు.
దారిలో దీపని,సౌందర్యని కలుస్తారు ముగ్గురు. ఒకరిని ఒకరు కలుసుకొని అందరూ సంతోషంతో మునిగిపోతారు. అసలు మీరు ఎక్కడ ఉంటున్నారు పదండి అంటూ కార్తీక్ ఇంటికి వెళ్తారు అందరూ. అంతకుముందే మౌనిక ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి దోశలు తింటూ ఉంటుంది. అక్కడ అనుకోకుండా మౌనికని చూసిన వాళ్ళందరూ షాక్ అయిపోతారు. నీవల్లేనా వీళ్ళు మా ఇంటికి రావట్లేదు అంటే వీళ్ళు మీకు నిజం చెప్పట్లేదా అంటూ సౌందర్యని కన్ఫ్యూజ్ చేస్తుంది మోనిత.
కార్తీక్ వాళ్ళని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతుంది సౌందర్య. నిజం చెప్పొద్దు అంటూ కార్తీక్ కళ్ళతోనే సైగ చేస్తాడు.కానీ వాళ్ళు ఏదో దాస్తున్నారని నిజం చెప్పట్లేదని అనుమాన పడుతుంది. అంజి కి నిజం తెలిసినా చెప్పలేదని మందలిస్తుంది సౌందర్య. వీళ్ళు ఎంత అడిగినా నిజం చెప్పట్లేదు, వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో తెలిస్తే వాళ్ళు ఏం దాస్తున్నారు తెలుస్తుంది అంటూ దొంగ చాటుగా వాళ్ళ మాటలు వింటుంది.
కానీ సౌందర్యని గమనించిన కార్తీక్ దంపతులు ఆమె ఏమి వినకుండా జాగ్రత్త పడతారు. మరోవైపు లేటుగా ఇంటికి వచ్చిన ఇంద్రుడు వాళ్ళకి తల్లిదండ్రులని పరిచయం చేస్తుంది శౌర్య. దీపవాళ్లు తెలిసినట్లుగా మాట్లాడటంతో వీళ్ళు మీకు ముందే తెలుసా అని పిల్లలు సౌందర్య అనుమాన పడతారు. కానీ ఏవో మాటలతో టాపిక్ మార్చేస్తుంది దీప. ఇంటి బయట ముగ్గులు వేస్తున్న దీప ని చూసిన హేమచంద్ర షాక్ అయి తెలిసినట్లుగా మాట్లాడేస్తాడు.
అప్పుడు కూడా పిల్లలు అనుమాన్ పడతారు. హేమచంద్ర కూడా మాట మార్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు కార్తీక్ ని మోనిత తనతో రమ్మంటుంది రాను అంటే దీప విషయం ఆంటీ చెప్పేస్తాను అంటూ బెదిరిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో తనతో పాటు రెస్టారెంట్ కి వెళ్తాడు కార్తీక్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చనిపోతాను నా గుండెకాయ దీపక్ పెట్టు అని చెప్తుంది. కానీ ఆ మాటలు నమ్మడు కార్తీక్.
నీకు స్వార్థం ఎక్కువ స్వార్థం లేకుండా ఏ పని చేయవు అంటే అవును నిజంగా నేను నాకు స్వార్థం నేను నీకు గుండు కాయలు ఇవ్వాలి అంటే నువ్వు నా మెడలో తాళి కట్టాలి అంటూ ఒక రిక్వెస్ట్ చేస్తుంది. ఆ ప్రపోజల్ నచ్చని కార్తీక్ మోనితని నాలుగు తిట్టి అక్కడినుంచి వచ్చేస్తాడు. మరోవైపు ఇంటికి వచ్చినా హేమచంద్ర ని సౌందర్య కి పరిచయం చేస్తుంది దీప. ఆరోజు నేను అడిగితే వీళ్ళు నాకు తెలియదని చెప్పారు ఎంత బాగా నటించారు అందరూ అని సౌందర్య బాధపడుతుంది.
భోగి మంటలు వేద్దాము అని పిల్లలు అడిగితే వద్దు వేడి అంటాడు కార్తీక్. వేడి కోసం వద్దండం ఎందుకు అంటుంది అసలు విషయం తెలియని సౌందర్య. నిజం చెప్పేయొచ్చు కదా అని కార్తీక్ తో అంటాడు హేమచంద్ర. వాళ్ళు భరించలేరు అంటాడు కార్తీక్. నిజానికి చెప్పేయటమే మంచిది వాళ్ళు అన్నింటికీ సిద్ధపడి ఉంటారు అని చెప్తాడు హేమచంద్ర. మరోవైపు పండగ పిండివంటల ప్రిపరేషన్ లో ఉంటుంది దీప.
మీరు ఎందుకమ్మా నేను చేస్తాను అని చంద్రమ్మ అంటే నా కోడలు వంటలు చాలా బాగా చేస్తుంది చేయని అంటుంది సౌందర్య. వచ్చే సంవత్సరం చేస్తారులెండి ఈ సంవత్సరం నాకు ఆ అవకాశం ఇవ్వండి అని దీపని అక్కడినుంచి పంపేస్తుంది చంద్రమ్మ. హేమచంద్ర కార్తీక్ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వెళ్లిన దీప నాకు నిండు నూరేళ్లు బ్రతకాలని ఉంది అవకాశం లేదా అంటూ ఏడుస్తుంది.
మీ అత్తగారు వాళ్ళకి నిజం చెప్పేయమంటే వద్దు అన్నయ్య నేను ఉన్నన్నాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉండాలి తగ్గిపోయే జబ్బు అయితే చెప్పేదాన్ని కానీ ఇప్పుడు చెప్పలేను అంటుంది దీప. మరోవైపు పిల్లలు ఇద్దరు వచ్చి పిన్ని ఇవేవో చేసేస్తుంది కానీ మాకు నువ్వు చేసిన వెంటనే కావాలి అనడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు భోగిమంట వేసుకొని ఆనంద పడుతుంటే అక్కడికి వచ్చిన మోనిత బకెట్ తో నీళ్లు వంపేసి భోగి మంటని ఆర్పేస్తుంది.
మీ ఇంట్లో ఈ ప్లేస్ లో నేను ఉండి భోగి మంట దొరుకు పోవాల్సింది మీరు జరుపుకుంటున్నారు, నా మెడలో తాళికట్టు అంటూ గొడవ పెడుతుంది. మోనితకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపేస్తారు దీప దంపతులు. ఎన్ని రోజులైనా ఈ సీడ వదిలే లాగా లేదు అని తిట్టుకుంటారు దీప వాళ్ళు. కార్తీకం కలిసిన మౌనిక నీకు మంచే చేశాను వేడి దీపకీ పడదు అలాగని తను మంట దగ్గరికి రాకుండా ఉండలేదు అందుకే నేను అలా చేశాను అని చెప్పి కార్తీక్ కి షాక్ ఇస్తుంది.జరిగినదంతా హేమచంద్రకి చెప్తాడు కార్తీక్.
Karthika Deepamముగింపుకి వచ్చిందని తెలుసుకొని ఆశ్చర్యం లో మునిగిపోతున్న ప్రేక్షకులు..
తనది స్వచ్ఛమైన ప్రేమ అంటాడు హేమచంద్ర. కానీ నా భార్య ని బ్రతికించడం కోసం తన ప్రాణాలు తీయలేను నేను ఒక డాక్టర్ ని అలా చేయలేను అంటాడు కార్తీక్. నువ్వు కావాలంటే తను నిన్ను ప్రేమించలేదు అలాగని నువ్వు వద్దు అంటే తన ప్రాణాలు ఇవ్వటం మానేయదు తను ఏది చేయాలంటే అదే చేస్తుంది అంటాడు హేమచంద్ర. నిజంగానే మోనిత, దీప కోసం ప్రాణాలిస్తుందా? దీప నిండు నూరేళ్లు బ్రతుకుతుందా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.