Krishna Mukundha Murari December 31 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అలేఖ్య, అవంతి కృష్ణ ని సోఫాలో కూర్చోబెట్టించారు. నిన్న రాత్రి ఏం జరిగింది అని సరదాగా అడిగారు. కృష్ణ వాళ్ళ మాటని మారుస్తూ నాకు మీ గురించి పూర్తిగా తెలుసు అని అవంతిని అంటుంది. నన్ను నువ్వు ఈ రోజే కలిసావు కదా నీకు నేను ఎలా తెలుసు అని అవంతి అడగగా నేను డాక్టర్ని నాకు ఫేస్ రీడింగ్ కూడా వచ్చు అని కృష్ణ అంటుంది.
కుటుంబ సభ్యుల గురించి వివరిస్తున్న కృష్ణ..
అయితే నా గురించి చెప్పు అని అడగగా నువ్వు ఫ్రీ బర్డ్ వి అని అంటుంది మరి అత్తయ్య గురించి చెప్పు అని అడిగితే అత్తయ్య నాకు దేవత లాంటివారు ఇంట్లో పనులన్నీ ఆవిడే చూస్తారు చాలా మంచి మనసు అని చెప్తుంది. మరి చిన్న వదిన గురించి చెప్పు అని అనగా ఈవిడ పెద్దావిడ పార్టీ ఉన్నవి లేనివి అన్ని కలిపి చెప్తారు పుల్లలు పెట్టే రకం అని అనగా పక్కన ఉన్న మిగిలిన వాళ్ళందరూ నవ్వుకుంటారు.
మరి అలేఖ్య గురించి చెప్పు అని అడగగా పెద్ద డిటెక్టివ్ టైపు ఇంట్లో ఉన్నవన్నీ వాళ్ళ ఆయనకి చెప్పే వరకు ఆగలేదు అని చెప్తుంది. మరి పెద్దావిడ గురించి చెప్పమని అడగగా ఏదో చెప్తుండగా భవాని ఈ పిల్ల అడవి పిల్ల అనుకున్నాను కంచులా ఉన్నది అనుకొని పని పాట లేదా ముచ్చట్లు పెడుతున్నారు ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని అంటుంది.
మురారి పక్కన కూర్చున్న ముకుంద..
ఆ మాటలకి అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సీన్లో రేవతి అందరినీ టిఫిన్ చేయడానికి రమ్మంటుంది అప్పుడు ముకుంద వచ్చి మురారి పక్కన కూర్చుంటుంది. దాన్ని చూసిన కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు రేవతి మురారి పక్కనే ఎందుకు కూర్చున్నావు అని అడగగా భవాని తన మరిదిని తిడుతూ కోడలితో అలాగేనా మాట్లాడేది అని అడుగుతుంది.
రేవతి మీద మాట పడనివ్వని భవాని..
అప్పుడు తన భర్త రేవతిని తిడుతూ ఉండగా రేవతి మీద ఒక మాట అనడానికి కూడా నేను ఒప్పుకోను ఇద్దరి మధ్య మాటలు లేవు అన్న వంకతో ఎవరైనా ఏమైనా అనడానికి చూస్తే సహించెను అని చెప్పి తను ఒక్కతే ఇంట్లో వంట అంత చేస్తుంది. ఇంట్లో మనుషులు పెరుగుతున్నారు వంటగదిలోకి కొన్ని మందు వెళ్ళాలని కూడా తెలీదా అని తన చిన్న తోటి కోడల్ని చూస్తూ అంటుంది భవాని. అప్పుడు తన చిన్న మరిది మీరే అన్నారు కదా వదినా తోటి కోడల మీద మాట రానివ్వకూడదు అని అందుకే చెప్పట్లేదు అని అంటాడు.
రేవతికి తిరకి పోలిక కట్టొద్దు. రేవతి ఎన్ని పనులు చేస్తుంది నీ భార్య లాగా కాదు ఎప్పుడు పెడితే అప్పుడు నిప్పులు పెట్టడానికి అని అంటుంది. నువ్వు నా పక్కకి ఎందుకు వచ్చి కూర్చున్నావు అని మురారి అంటూ లెగుస్తూ ఉండగా ఇప్పుడు నువ్వు లెగిస్తే నేను నా మాట తప్పాల్సి వస్తుంది మురారి అని అంటుంది ముకుందా.అప్పుడే వచ్చిన కృష్ణ తానే ముందు వచ్చింది కదా కూర్చొని ఇవ్వండి నేను అలేఖ్య పక్కన కూర్చుంటాను అని కూర్చుంటుంది.
మురారి కి ఎదురొచ్చిన ముకుంద..
ఆ తర్వాత సీన్లో కృష్ణ ఆఫీస్ కి వెళ్తుండగా ముకుందా ఎదురు వస్తుంది దాన్ని చూసిన రేవతి అరుస్తూ ఏం చేస్తున్నావు మురారి కి ఎదురు ఎందుకు వస్తున్నావు అని అడగగా కోపంతో ముకుందా భవాని దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్తుంది. అప్పుడు భవాని ఎందుకు ముకుందని అంటున్నావు బయట నుంచి లోపలికి రావడానికి ఎదురు రావడానికి తేడా ఉన్నది కదా అని అనగా అలా చెప్పండి అత్తయ్య ఇందాకటి నుంచి నన్నే అంటున్నారు.
ముకుందని తిట్టిన రేవతి..
నన్నే వేలెత్తి చూపుతున్నారు అని అంటుంది. భవాని కోప్పడుతూ రేవతికి అలాగా తేడాలు చూపడానికి తెలీదు తను ఎప్పుడూ అందరి ఒకేలా చూస్తుంది తన భర్త తనని మాటంటేనే సహించలేదు నేను అలాంటిది నువ్వంటే సహిస్తాను అనుకుంటున్నావా. ఈ ఇంటికి నువ్వే పెద్ద కోడలివి కానీ రేవతిని ఒక మాట అనడానికి కూడా నీకు హక్కు లేదు అని అంటుంది.
Krishna Mukundha Murari December 31 Today Episode:
అప్పుడు రేవతి నాకు ఆదర్ష్ ఎంతో నువ్వు కూడా అంతేనమ్మా నువ్వే ఇంటి పెద్ద కోడలు వి నాకు అందరూ సమానమే నేను మా ఆయనకి ఎదురు వస్తాను కానీ ఎప్పుడూ మా మరిది వెళ్తున్నప్పుడు ఎదురు రాను. నీ తప్పు నువ్వు తెలుసుకుంటే మంచిది అని అంటుంది. అప్పుడు భవాని మాట్లాడుతూ ఏది ఏమైనా అది అడవి మనిషి అయినా తన భర్త పక్కన తనే ఉండాలి తన భర్త బయటికి వెళ్తున్నప్పుడు తనే ఎదురు రావాలి ఇంకెవరు ఎదురు వచ్చినా సహించలేదు అని అంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపుటి ఎపిసోడ్ లో చూద్దాం.