Krishna Mukunda Murari January 2 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పెద్ద చిన్న తేడా తెలీదా అత్తగారిని గౌరవం లేదా అంటూ ముకుందని మందలిస్తుంది భవాని. మీరు కూడా నన్నే అంటున్నారా అంటుంది ముకుంద. నిన్ను కాక మరెవరినమంటావ్? పిచ్చిదో మంచిదో వాడికొక పెళ్ళాం ఉంది వాడు ఎదురుగుండా నువ్వు వెళ్లి వాడి పక్కన కూర్చుంటే తను ఫీల్ అవ్వదా? ఇక్కడ ఎంతమంది ఉంటుండగా మీకు మీ కోడలు అంటేనే ఇష్టము అని అంటావేంటి? ఇంటి కోడలు ఏడుపు ఇంటికి మంచిది కాదు.

ముకుంద కి చివాట్లు పెడుతున్న భవాని..

ముకుంద నిన్ను ఇక్కడ ఎవరూ తక్కువ చేసి చూడట్లేదు, అందరికీ ఒక విషయం చెప్తున్నాను ఈ ఇంట్లో ఎవరి మీద ఎవరికీ ఫిర్యాదులు చేయకూడదు పెద్దవాళ్ళకి చిన్నవాళ్లు గౌరవం ఇవ్వాలి అంటూ ఆర్డర్ వేస్తుంది భవాని. భర్త బయటకు వెళ్తుంటే తను ఇంట్లో ఏం చేస్తుంది కృష్ణ ని పిలవండి అంటుంది భవాని. కృష్ణ వాళ్ళ అత్తగారు కృష్ణని పిలిచి భర్తకి ఎదురెళ్ళమంటుంది. ఈ పద్ధతి అలవాటు లేని కృష్ణ తెల్ల మొహం వేస్తుంది.

ఆ మాత్రం తెలియక పోవడం ఏంటి వచ్చేస్తారు అడవి నుంచి అంటూ చులకనగా మాట్లాడుతుంది భవాని. కృష్ణ వాళ్ళ అత్తగారు ఏం చేయాలో, ఎలా చేయాలో చెప్తుంది. మా ప్రాణాలు తీయడానికి వచ్చేస్తారు అంటూ కసురుకుంటూ వెళ్ళిపోతుంది భవాని. గదిలో ఆలోచిస్తున్న కృష్ణ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడాలి అంటుంది ఆమె అత్తగారు. భార్యగా నువ్వు చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి కానీ వాటి గురించి నువ్వు పట్టించుకోవట్లేదు.

కోడలికి పద్ధతులు చెప్తున్న మధు..

భర్త బయటకు వెళ్తున్నప్పుడు నవ్వుతూ ఎదురు రావాలి అంటుంది కృష్ణ అత్తగారు. ఎందుకు అని అడుగుతుంది కృష్ణ. ఎందుకంటే ఆ చిరునవ్వు కోసమే భర్త ఇంటికి తొందరగా రావాలని అనుకుంటాడు. అంతేగాని నీకు నచ్చినప్పుడు వెళ్ళు వచ్చినప్పుడు రా అంటే ఆ మగవాడికి ఇంటికి రావాలని ధ్యాస తగ్గిపోతుంది. మగవాడు ఇంటికి వచ్చేటప్పుడు ఆడది అందంగా ముస్తాబై ఎదురు వెళ్ళాలి.

అప్పుడే తను బయటపడిన కష్టమంతా మర్చిపోయి ఆ బట్ట రిలాక్స్ అవుతాడు అంటూ భార్యకి ఉండవలసిన పద్ధతులన్నీ చెప్తుంది ఆమె అత్తగారు. నిజంగా ఇవన్నీ నాకు తెలియటండీ అంటుంది కృష్ణ. అందుకే నేను చెప్తున్నాను నీకు తెలియకపోతే నన్ను అడుగు, అంతేగాని నువ్వు ఆ పెద్దావిడతో మాటలు పడితే నాకు బాధగా ఉంటుంది. ఇప్పుడు చూసావా నువ్వు ఎదురు రాకపోవడం వల్ల ఇంట్లో ఎంత గలాటాయింది ఆ ముకుందా ఏడవడం వల్ల ఎవరికి మంచిది చెప్పు అంటుంది కృష్ణ అత్తగారు.

అసలు నిజం చెప్పి అత్తగారికి షాప్ ఇచ్చిన కృష్ణ..

అవునండి తను మా కోసం ఆలోచించి ఆలోచించి తలనొప్పి తెచ్చుకుంటుంది రాత్రి కూడా తలనొప్పి అని మా రూమ్ కి వచ్చి టాబ్లెట్స్ అడిగింది. ఆ మాటలకి షాక్ అయిన కృష్ణ అత్తగారు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అవునండి ఆవిడ రాత్రి మా టాబ్లెట్స్ అడిగి తీసుకువెళ్లారు అంటుంది. అదేంటి మీ శోభనం అని తెలిసి కూడా చిన్ని గది తలుపు కొట్టిందా అంటూ ముకుందని అనుమాన పడుతుంది కృష్ణ అత్తగారు.

ఆమెకి ముకుందా పెళ్లయిన దగ్గర నుంచి ముకుంద ప్రవర్తన తలుచుకొని ఆమెని అనుమాన పడుతుంది. ఈ మాటలన్నీ పక్కనుంచి విన్న అలేఖ్య హమ్మ ముకుందా అనుకుంటూ తను రూమ్ లోకి వెళ్ళి తను వి.న్నదంతా భర్తకు చెప్పాలని చూస్తుంది. కానీ కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె భర్త వినడానికి ఇష్టపడడు. నేను చెప్పింది వింటే ఎగిరి గంతేస్తారు అంటూ బలవంతంగా ముకుందా మురారిలా వ్యవహారం చూస్తుంటే నాకు బాగా డౌట్ వస్తుంది ఉంటుంది అలేఖ్య.

ముకుందని అనుమానిస్తున్న అలేఖ్య..

బాత్రూం నుంచి వచ్చాక వెంటనే అని భర్త ఎంత గోల పెడుతున్నా వినిపించుకోకుండా ముకుంద శోభనం గది తలుపు కొట్టి మరి తలనొప్పిగా ఉంది టాబ్లెట్లు కావాలని అడిగిందట, కృష్ణ మురారిలా పెళ్లయిన దగ్గర నుంచి చూస్తున్నాను ముకుందా మురారిని మింగేసేలాగా చూస్తుంది. అసలు శోభనం అది తలుపు ఎవరైనా కొడతారా ఇంట్లో ఇంతమందిమి అందరి దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి కదా వాళ్లు డోర్ కొట్టవలసిన అవసరం ఏముంది అంటూ అనుమాన పడుతుంది.

బాధ భరించలేని ఆమె భర్త, పెద్దమ్మ అంటాడు కంగారుపడిన అలేఖ్య భర్తని వదిలేసి తను వెళ్లి బాత్రూం లో దాక్కుంటుంది. దాంతో మరింత కంగారుపడిన ఆమె భర్త ఒసేయ్ పెద్దమ్మ లేదు ఏం లేదు నువ్వు బయటికి రా నేను బాత్రూంకి వెళ్ళాలి అంటాడు. సీన్ కట్ చేస్తే డాబా మీదకి చూస్తున్న అలేఖ్య దగ్గరికి వచ్చి ఆమె భర్త ఎందుకు తలెత్తి అలాగ చూస్తున్నావు మెడ పట్టేసిందా? కరాటే కిక్కు ఒకటి ఇస్తే సెట్ అయిపోతుంది అంటాడు.

మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దంటున్న అలేఖ్య భర్త..

నేను కూడా డొక్కలో ఒకటి ఇచ్చాను అంటే అన్ని సెట్ అయిపోతాయి అంటుంది అలేఖ్య. మ్యాన్ హాండ్లింగ్ లవి మనకెందుకులే అంటాడు అతను. అది సరేగాని అక్కడ ముకుందా ఏం చేస్తుంది అని అడుగుతుంది అలేఖ్య. ఏ ఐస్క్రీము ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి ఉంటది దాని కోసమే వెయిట్ చేస్తూ ఉండి ఉంటుంది అంటాడు అలేఖ్య భర్త. నీది డబ్బా బ్రెయిన్ అని మళ్ళీ ప్రూవ్ చేసావ్ అక్కడ ముకుందా వెయిట్ చేస్తున్నది మురారి కోసం టైం 6:00 అయింది ఇంకా రాలేదా ఏంటి రాలేదేంటో అని ఎదురు చూస్తుంది అంటుంది అలేఖ్య.

ఆ చూపులో అంతా స్క్రిప్ట్ ఉందా అంటాడు ఆమె భర్త. ముకుంద తన భర్త ఆదర్శ్ గురించి అసలు పట్టించుకోవడం మానేసింది పెళ్లయిన మురారి గురించి మాత్రం ఎదురుచూస్తూ ఉంది అంటుంది అలేఖ్య. ఈవిడే ఇంతలా ఎదురుచూస్తుందంటే కట్టుకున్న పెళ్ళాం కృష్ణ ఇంకెంత బాగా ఎదురు చూస్తుందో అంటూ ఈమెజింగ్ చేసుకుంటాడు అలేఖ్య భర్త. నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావ్ అమ్మ ఒకసారి అటు చూడు అంటే కృష్ణని చూపిస్తుంది అలేఖ్య. అక్కడ కృష్ణ గచ్చకాయలు ఆడుతుంది. ఎదురు చూడవలసిన పెళ్ళాం గచ్చకాయలు ఆడుతుంది.

కన్ఫ్యూజన్లో బుర్ర బద్దలు కొట్టుకుంటున్న అలేఖ్య భర్త..

గదిలో ఉండవలసిన ముకుంద మురారి కోసం ఎదురుచూస్తుంది ఇది ఎక్కడ వ్యవహారం అనుకుంటారు అలేఖ్య దంపతులు. గచ్చకాయలు ఆడుతున్న కృష్ణ గెలిచినందుకు నందు కి చాక్లెట్ ఇస్తుంది. నువ్వు ఇక్కడ చాక్లెట్లు ఇస్తున్నావు కానీ అక్కడ నీకు ఆఫర్ బిస్కెట్ అయ్యేలాగా ఉంది అంటాడు అలేఖ్య భర్త. ఈ చాక్లెట్ తింటే లావు అయిపోతానని మా అమ్మ తిడుతుంది అంటుంది నందు. నువ్వు నేను ఫ్రెండ్స్ కదా నీకేం కావాలన్నా నన్ను అడుగు అంటుంది కృష్ణ.

నీకేం కావాలన్నా నన్ను అడుగు అంటుంది నందు. డాక్టర్ బూచాడు మళ్ళీ వస్తాడా ఇంజక్షన్ పొడుస్తాడా అంటూ భయంగా అడుగుతుంది నందు . నేనుండగా రానిస్తానా? ఎవరు రాలే భయపడకు అంటూ ధైర్యం చెబుతుంది కృష్ణ. ఆటలో ఓడిపోయిన కృష్ణ నేను ఓడిపోయాను అని బుంగ మూతి పెడుతుంది. కృష్ణ ఓడిపోకూడదు అంటూ కృష్ణ గెలిచింది అంటుంది నందు. ఎంత స్వచ్ఛమైన మనసు నీది అంటూ ఆమెని హత్తుకుంటుంది కృష్ణ.

Krishna Mukunda Murari January 2 Today Episode భార్యను చూసి నవ్వుకుంటున్న మురారి..

అంతలోనే ఇంటికి వచ్చిన మురారిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది ముకుంద. కానీ అక్కడే ఉన్న కృష్ణ మాత్రం మురారిని పట్టించుకోదు. చిన్నపిల్లలాగా ఆడుతున్న కృష్ణ ని చూసి నవ్వుకుంటాడు మురారి. తల తిప్పి ముకుందని కూడా చూస్తాడు. వీళ్ళ ముగ్గురిని గమనిస్తున్న అలేఖ్య భర్త ఇది ఎక్కడ వింతేబాబు అంటాడు. నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను ముకుందా కి మురారి కి ముందే ఏదో ఉందని కానీ ఎవరు పట్టించుకోలేదు అంటుంది అలేఖ్య.

నేను కూడా కొట్టి పడేసాను, కానీ పండంటి కాపురం లో పుచ్చ పడిపోయింది అంటాడు అలేఖ్య భర్త. ఈ సీన్ చూసిన తర్వాత నీకు ఏం అర్థమైంది అని భర్తని అడుగుతుంది అలేఖ్య. అంటాడు అతను. నీకేమనిపిస్తుంది అని భార్యని అడిగితే ఈసారి మనతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా చూపించాలనిపిస్తుంది అంటుంది. ఐడియా బానే ఉంది వర్క్ అవుట్ అవుతుందో లేదో అంటూ ఆలోచించుకుంటుంది అలేఖ్య. తరువాయి భాగంలో తండ్రి పటానికి పూలదండ వెయ్యబోయి ముకుంద మీద తోలు పడిపోతుంది కృష్ణ. వాళ్ళిద్దర్నీ అంత క్లోజ్ గా చూసి భరించలేక పోతుంది ముకుంద.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 2, 2023 at 2:57 సా.