Intinti Gruhalakshmi August 3 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో తులసి బయట కూర్చుని సంగీతం పాడుతూ ఉండగా అక్కడికి నందు వస్తాడు. ఇక పిల్లల కోసం వచ్చావా అని తులసి అడగటంతో కాదు అని నీతో మాట్లాడటానికి వచ్చాను అని అంటాడు. మన మధ్య మాట్లాడే కావాల్సిన విషయాలు ఇప్పుడైతే ఏమీ లేవు అని కాసేపు తన డైలాగులు వదులుతుంది.
తులసి మాటలకు నందుకు బాగా మండుతుంది కానీ తులసి తో సామ్రాట్ కు నేను నీ మాజీ భర్త అని తెలియకూడదు అని అనడంతో ఒకప్పుడు నాకు అలాంటి పరిస్థితి వచ్చింది అని ఇప్పుడు నువ్వు నన్ను అడిగే పరిస్థితి వచ్చింది అని అంటుంది. నేను మాత్రం ఈ విషయం గురించి చెప్పను అని.. కానీ ఆయనకు తెలిస్తే మాత్రం నేను ఏమీ చేయలేను అని అంటుంది.
సీన్ కట్ చేస్తే..
సామ్రాట్ షర్ట్ వేసుకొని రెడీ అయ్యి ఎలా ఉంది అని తన బాబాయ్ ను, తన కూతుర్ని అడుగుతాడు. దాంతో హనీకి తన డాడీ వేసుకున్న డ్రెస్ బాగున్న కూడా టీ షర్ట్ వేసుకోమని సలహా ఇస్తుంది. కానీ సామ్రాట్ ఇప్పుడు టీ షర్ట్ ఏంటి అని.. కావాలంటే వేరే షర్ట్లు చూపిస్తానని వేరే షర్ట్ లు చూపిస్తాడు. కానీ హనీ కి అవేవీ నచ్చకపోవటంతో తానే వెళ్లి ఒక టీ షర్టు తీసుకొని వస్తుంది.
తండ్రిని యంగ్ గా మార్చిన హనీ..
ఇక సామ్రాట్ హనీ కోసం ఆ టీషర్ట్ వేసుకోగా హనీ కి బాగా నచ్చుతుంది. ఆ తర్వాత సామ్రాట్ తన కూతురితో సెల్ఫీ కూడా దిగుతాడు. అదే సమయంలో తులసి కుటుంబం సామ్రాట్ ఇంటి దగ్గరికి వస్తారు. తులసి అందర్నీ ఆపి నందు తండ్రి అని, తన భర్త అని సామ్రాట్ కు తెలియకుండా ఉండాలి అని అనటంతో దివ్య కాస్త బాధపడినట్లు కనిపిస్తుంది.
ఇంట్లోకి వెళ్ళగా అంకిత, దివ్య సామ్రాట్ ఇల్లు చూసి ఫీదా అవుతారు. తులసి ఆలస్యంగా వచ్చినందుకు హాని కాస్త అలిగినట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత సామ్రాట్ అందరినీ పలకరిస్తాడు. ఆ సమయంలో మగవారి గురించిటాపిక్ రావటంతో తులసి ఒక కామెంట్ చేస్తుంది. అప్పుడే వచ్చిన లాస్య మగవాళ్ళ గురించి ఏం తెలుసు అని కామెంట్ చేస్తున్నావు అని ప్రశ్నిస్తుంది.
Intinti Gruhalakshmi August 3 Today Episode: అందరి ముందు నందుని బుక్ చేసిన లాస్య..
ఆ తర్వాత సామ్రాట్ ఆ విషయం గురించి ఎందుకులే అనటంతో ప్రేమ్ మాత్రం ఆ టాపిక్ గురించి చెప్పాలి అని అంటాడు. నందుకి తెగ కోపం వస్తుంది. ఆ తర్వాత టాపిక్ అక్కడికి ఆగిపోతుంది. ఇక సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ వంటలు బాగా చేస్తాడు అని అనటంతో.. లాస్య కూడా నందు బాగా వంటలు చేస్తాడు అని నందుని బుక్ చేస్తుంది. తర్వాత నందు, సామ్రాట్ వంటలు చేయడానికి రెండు భాగాలుగా చేరి వంటలు చేస్తారు. తరువాయి భాగంలో తులసి సామ్రాట్ తో క్లోజ్ గా మాట్లాడటంతో.. అది చూసి నందు తట్టుకోలేక పోతాడు.