Malli: బలవంతంగా పెళ్లి జరిగినా ఆ వ్యక్తి జీవితంలో తను అడ్డు కాకూడదని తన కాళ్ళ మీద తను నిలబడాలనుకునే ఒక స్వచ్ఛమైన పల్లెటూరి పిల్ల కథ ఈ మల్లి.
కూతుర్ని అత్తారింటికి పంపిస్తూ జాగ్రత్తలు అన్ని చెప్తుంది మీరా. అత్తవారింట్లో నేను చాలా సుఖంగా ఉంటానంటే అబద్ధం చెప్పి తల్లిని సంతోషపరుస్తుంది మల్లి. నువ్వు అబద్దాలు చాలా సులువుగా చెప్పేస్తున్నావు అని ప్రకాష్ అంటే నాకు జీవితం చాలా నేర్పింది అంటుంది మల్లి. అరవింద్ ప్రకాష్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మీరాకి ఫోన్ చేసి తను పట్నం వస్తున్న విషయం తెలుసుకుంటాడు.
మరోవైపు తన రూపాన్ని మార్చేసుకున్న మల్లి నిచూసి ఆశ్చర్యపోతాడు ప్రకాష్. పట్నంలో నా రూపం ఇదే ప్రకాష్. నేను పట్నం వెళ్ళినా బాబు గారికి ఇబ్బంది లేకుండా హాస్టల్లో చేరుతాను నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటుంది. అనవసరంగా అతని వల్ల మీ జీవితాన్ని నాశనం చేసుకోకు నేను బొట్టు పెట్టే అవకాశం నాకు ఇవ్వు అంటాడు ప్రకాష్. ఈ జన్మకి బాబుగారి నా భర్త అంటుంది. మరోవైపు భర్త తో టైం స్పెండ్ చేయాలనుకున్న మాలిని షాపింగ్ తీసుకెళ్లమంటుంది.
కానీ అరవింద్ మాలినిని పట్టించుకోకుండా మల్లి కోసం బయలుదేరుతాడు.మల్లి బస్సు దిగే సమయానికి అక్కడికి వెళ్లి తనని వాళ్ళ ఇంటికి రమ్మంటాడు. రావడం కుదరదు ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటుంది మల్లి. అక్కడే పెద్దయ్య గారు కనిపించి ఇంటికి పిలిచినా రాదు. ప్రకాష్, అరవింద్ ని ప్రకాష్, మల్లికి చేసిన అన్యాయం గురించి చివాట్లు పెడతాడు. మల్లి ఊర్లోకి వచ్చిందన్న విషయం తెలుసుకొని ఏదో జరిగింది లేకపోతే మన ఇంటికి రాకుండా ఉండదు అనుకుంటారు అరవింద్ కుటుంబ సభ్యులు.
అరవింద్ ప్రవర్తనకి మాలిని బాధపడుతుంది. మాలిని హైదరాబాద్ వచ్చిందని తెలుసుకున్న వసుంధర ప్రాణం పోయినా మల్లిని ఇంటికి తీసుకురాకు అంటూ కూతురికి సలహా ఇస్తుంది. మరోవైపు మల్లి కోసం బాధపడుతూ ఉంటాడు శరత్ చంద్ర. అంతలోనే అక్కడికి వచ్చిన తల్లి ఎందుకు బాధ పడుతున్నావు అంటే మీరా నేనే తండ్రిని మల్లికి ఎప్పటికీ చెప్పదు, ఇక తను నన్ను నాన్న అని పిలిచే యోగం లేదు అంటూ తల్లికి చెప్పుకొని బాధపడతాడు.
నీకు మంచి రోజులు వస్తాయి బాధపడొద్దు అని తల్లి ఓదారిస్తుంది. అంతలోనే అక్కడికి వచ్చిన మాలిని ఆ మల్లి ఊర్లోకి వచ్చిందట, మళ్లీ నా కూతురికి సీడ తాపురించింది అంటూ భర్తకి చెప్తుంది. ఆ మాటకి మళ్లీ ఊర్లోకి వచ్చిందా ఎప్పుడు వచ్చింది ఎక్కడ ఉంది అని అడుగుతాడు శరత్ చంద్ర. ఏం తెలిస్తే మీరే తీసుకెళ్లి అరవింద్ వాళ్ళింట్లో దిగబెడతారా అంటూ మొగుడికి చివాట్లు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. తనని కాలేజీలో డ్రాప్ చేయమని అరవింద్ ని రిక్వెస్ట్ చేస్తుంది మాలిని.
అలాగే అని మాలిని కాలేజీలో దింపుతాడు ప్రకాష్. కాలేజీకి వస్తున్న దారిలో మల్లిని చూస్తాడు కానీ కరెక్ట్ అడ్రస్ పట్టుకోలేక పోతాడు. అరవింద్ మాలినీల జంటని రాధాకృష్ణులతో పోలుస్తారు కొలీగ్స్. మాలినిని కాలేజీలో డ్రాప్ చేసి రిటర్న్ లో మల్లి అడ్రస్ కనుక్కుంటాడు అరవింద్. హాస్టల్ ఫీజు కోసం వేరే వాళ్ళ బట్టలు ఉతకడం చూసి చాలా బాధపడతాడు. ప్రకాశం చూసిన మల్లి ఆశ్చర్యపోయి మీకు నేను ఇక్కడ ఉన్నాను అని ఎలా తెలుసు అని అడుగుతుంది.
మనల్ని కలిపిన సీతారాములే నీ జాడ చూపించారు అంటాడు. ఇంటికి రమ్మంటే మీకు మాలిని అక్కకి మధ్యలో రాలేను మీరు కూడా దయచేసి నా దగ్గరికి రాకండి అని పంపించేస్తుంది. మరోవైపు ఇంట్లో అందరికీ మంచి డిన్నర్ ఏర్పాటు చేస్తుంది. ఏంటి అకేషన్ అని రూప అడిగితే, ఈరోజు అరవింద్ చాలా రోజుల తర్వాత నన్ను కాలేజీలో డ్రాప్ చేశాడు అని చెప్తుంది. అందరూ భోజనాలు చేస్తుండగా మీరా ఫోన్ చేసి మల్లి ని అడుగుతుంది.
తను పడుకుందని అబద్ధం చెప్పేస్తాడు ప్రకాష్. వెనక్కి తిరిగేసరికి మాలిని కనిపిస్తుంది. ఫోన్లో మాట్లాడిందంతా విన్నాదేమో తను అడక్కు ముందే నిజం చెప్పేయాలి అనుకుంటాడు ప్రకాష్. తను ఏదో చెప్పబోతుంటే నువ్వు ఏమి చెప్పక్కర్లేదు నాకు నిజం తెలుసు నేను ప్రకాష్ తో మాట్లాడాను అంటుంది. నేనే నిన్ను అనవసరంగా అనుమానించను క్షమించు అంటూ అరవింద్ ని హగ్ చేసుకుంటుంది. తన స్వచ్ఛమైన ప్రేమకి గిల్టీగా ఫీల్ అవుతాడు అరవింద్.
Malli: ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్న మల్లి, కథలో ట్విస్టులు లేవంటున్న ప్రేక్షకులు..
నేను నీ అంత నిజాయితీగా ప్రేమించడం లేదు అంటూ మనసులోనే బాధపడతాడు. అరవింద్ ఎవరికి న్యాయం చేస్తాడు? మాలిని నిజం తెలుసుకుంటుందా? మల్లి,అరవింద్ ని దగ్గరికి రానిస్తుందా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు వేచి చూడాల్సిందే?