Malli: తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నా, ఆ భార్య భవిష్యత్తు కోసం తపన పడుతున్న ఒక భర్త కథ మల్లి.

మల్లిని ఇంటికి తీసుకువచ్చిన అరవింద్ ని చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. తను ఇంట్లోకి వస్తే ఊరుకోను అంటుంది వసంధర. నేనుండగా నిన్ను ఎవరూ టచ్ చేయలేరు లోపలికి రా అని కేకలు వేస్తాడు అరవింద్. తను ఉంటే నా కూతురు ఈ ఇంట్లో ఉండదు బట్టలు సర్దుకోమంటుంది అరవింద.

అయినా హాస్టల్లో ఉండవలసిన దాన్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు అంటూ నిలదీస్తుంది. జరిగిన విషయం అంతా చెప్పి మాలిని కోసమే తను ఈ త్యాగం చేసింది అని అరవింద్ అంటే ఆ మాటల్ని నమ్మదు వసుంధర. అరవింద్ చెప్పేది నిజం ఎందుకంటే, ఎక్కడ జరిగిన ఏ సంఘటన నేను అరవింద్ కి చెప్పలేదు అయినా అరవింద్ ది అంత చీప్ క్యారెక్టర్ కాదు అంటూ అరవింద్ ని మల్లి ని వెనకేసుకొచ్చి తల్లికి షాక్ ఇస్తుంది మాలిని.

బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుంధర. బయటికి వచ్చిన శరత్ చంద్ర మంచి పని చేసావ్ అంటూ అరవింద్ ని హగ్ చేసుకుంటాడు. అది గమనించిన వసుంధర ఇంటికి వెళ్లిన వెంటనే భర్తని నిలదీస్తుంది. అలాంటిదేమీ లేదు అంటూ తప్పించుకుంటాడు శరత్ చంద్ర. మరోవైపు మాలిని వాళ్ళ పెళ్లి ఫోటో చూసి తనకి అలాంటిదే కావాలి అనుకుంటుంది మల్లి.

మరోవైపు మల్లిని చూడ్డానికి పట్నం వెళ్దాము అని ప్రకాష్ ని ఒప్పిస్తుంది మీరా. ముందు కంగారుపడిన నిజం ఎన్నాళ్లు దాగుతుంది అని ఒప్పుకుంటాడు ప్రకాష్. విషయం తెలుసుకున్న నకిలీ చెప్పకుండా వెళ్ళు అప్పుడే దాని బండారం బయటపడుతుంది. నిజం తెలిస్తే మీ అక్క గుండె ఆగిపోతుంది అక్కడ ఏమైనా అయితే నాకు కబురు పెట్టు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి కదా అని వెటకారంగా మాట్లాడుతుంది నకిలీ.

పింకిని డ్రాయింగ్ పేపర్ అడిగి దాని మీద డ్రాయింగ్ చేస్తుంది. అయితే అది ఎవరూ చూడకుండా దాచుకుంటుంది కానీ పింకీ తన డ్రాయింగ్స్ శరత్ చంద్ర కి చూపించడం కోసం ఆ పెయింటింగ్ తో సహా బుక్ ని తీసుకొచ్చేస్తుంది. ఆ డ్రాయింగ్ ఎవరు చూసేస్తారో అని కంగారు పడతారు మల్లి, అరవింద్. కానీ ఎవరు చూడకుండా దాన్ని నలిపి డస్ట్ బిన్ లో వేసేస్తుంది మాలిని.

అరవింద వాళ్ళు పండగ వాళ్ళ గెస్ట్ హౌస్ లో చేసుకుందాము అని ఇన్వైట్ చేస్తారు. శరత్ చంద్ర, మల్లిని కూడా రమ్మంటే అరవింద్ అభ్యంతరం చెప్తాడు. కానీ తనకి ఎక్కడ ఎలాంటి అవమానం జరగదు అని మాటిస్తాడు శరత్ చంద్ర. బావగారు పరిస్థితిని అర్థం చేసుకున్న శరత్ చంద్ర అందుకు ఒప్పుకుంటాడు. మరోవైపు భోగి ఎందుకు చేసుకుంటారు ఎలా చేసుకుంటారు వివరిస్తుంది మల్లి.

ఆమె ఇచ్చిన వివరణకి ఇంట్లో అందరూ ఇంప్రెస్ అయిపోతారు. మరి మీ ఊర్లో పండగ చేసుకోవడం అవ్వదు కదా అందుకే మీ అమ్మగారు వాళ్ళని పిలుద్దాం అంటూ ఫోన్ చేయమంటుంది అనుపమ. కంగారుపడిన అరవింద్ ఫోన్ కలవట్లేదని అబద్ధం చెప్పేస్తాడు. పెద్ద పండుగ రోజు వాళ్ళు ఎవరు ఊరు దాటరు అంటుంది మల్లి. మరోవైపు పట్నానికి వచ్చిన ప్రకాష్ అత్తకి నిజం ఎలాగా చెప్పటమో అర్థం కావట్లేదు.

ముందు మల్లి దగ్గరికి వెళ్తే తనే సలహా ఇస్తుంది అనుకొని హాస్టల్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత జరిగిన కథంతా వార్డెన్ చెప్తుంది. విషయం తెలుసుకున్న ప్రకాష్ మళ్లీ అరవింద్ ఇంట్లో మల్లి పనిమనిషిగా మారిపోయింది అనమాట అని బాధపడతాడు. ఆటోలో ఉన్న మీరాకి అటువైపుగా కారులో వెళ్తున్న మల్లి కనిపిస్తుంది. మల్లిని పిలిచినా పలకకపోవడంతో ఆ కారుని వెంబడిస్తూ వెళ్ళిపోతుంది మీరా. బయటికి వచ్చిన ప్రకాష్ కి మీరా కనిపించకపోవడంతో టెన్షన్ గా వెతుకుతూ ఉంటాడు.

మరోవైపు గెస్ట్ హౌస్ కి వచ్చిన అరవింద్ వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తారు వసుంధర వాళ్ళు. అన్ని బాగానే ఉన్నాయి కానీ సాంప్రదాయాన్ని మర్చిపోయారు అంటూ, గుమ్మంలో ఆవుపేడతో కల్లాపు ఎందుకు వేయాలి ఎలా వేయాలి అంటూ ఆ స్టోరీ అంతా చెప్పి అక్కడ వాళ్ళని ఇంప్రెస్ చేస్తుంది మల్లి. ఆ మాటలకి ఇంప్రెస్ అయిన మాలిని మనం కూడా అలాగే చేద్దాం అంటే పేడ కంపు వద్దు అంటుంది వసుంధర. తల్లిని బ్రతిమాలి అనుపమ వాళ్ళతో కలిసి మొత్తం కళ్ళాపి జల్లి ముగ్గులు వేస్తారు అందరూ.

Malli కథలో పెద్దగా మార్పులు లేకపోవడం వల్ల సీరియల్ డల్ గా ఉంది అంటున్న ప్రేక్షకులు..

ఇంక అందరూ లోపలికి రండి. మాలిని మీ ఆయనకి నలుగు పెట్టి స్నానం చేయించు అంటుంది వాళ్ళ నానమ్మ. ఎందుకు అని అడిగితే గురువుగారు వస్తారు ఆయన ఏదైనా చెప్తే అది జరిగి తీరుతుంది మాలిని పెళ్లప్పుడు కూడా ఆయన లేరు అందుకే ఇప్పుడు ఆయనకి చూపిద్దాం అంటుంది మాలిని వాళ్ళ నానమ్మ. జాతకాలు చూసిన గురువుగారు ఏమని చెప్తారు?మాలిని అసలు నిజాన్ని తెలుసుకుంటుందా? పట్నంలో దారి తప్పిన అత్తని ప్రకాష్ పట్టుకుంటాడా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 15, 2023 at 1:00 సా.