Malli December 26 Today Episode: ఈ రోజు ఎపిసోడ్ లో ఊరికి బయలుదేరుతున్న మల్లికి జాగ్రత్తలు చెప్తుంది మీరా. మీ అత్తగారు వాళ్ళకి చెప్పకుండా వచ్చేసావు వాళ్ళు ఏమంటారు అంటూ భయపడుతుంది. వాడు ఏమీ అనరమ్మ నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం నేను వెళ్ళిన తర్వాత పిండి వంటలన్నీ చేసి తినిపిస్తారు.
తల్లితో అబద్ధం చెప్పిన మల్లి..
మావయ్య వాళ్ళు నా చేత బోలెడన్ని కబుర్లు చెప్పించుకుంటారు అంటూ అబద్ధం చెప్పేస్తుంది మల్లి. సరే అంటూ కూతురి చేతిలో డబ్బులు పెడుతుంది మీరా. ఇదంతా ఎందుకమ్మా అంటే నువ్వు అప్పటికప్పుడు ప్రయాణమయ్యావు లేకపోతే పిండి వంటలు చేసేదాన్ని అంటుంది మీరా. అలాంటిది వద్దమ్మా ఈ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో అంటుంది మల్లి.
మీరు ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ ఉంటే బస్సు వెళ్ళిపోతుంది అంటాడు ప్రకాష్. బయటికి వచ్చిన ప్రకాష్ నువ్వు చాలా సులువుగా అబద్ధాలు లేస్తున్నావు మల్లి అంటాడు. జీవితం అన్ని నేర్పిస్తుంది ప్రకాష్ నేను పెళ్లయ్యాక చాలా నేర్చుకున్నాను మనం సంతోషంగా ఉండడం కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని సంతోషంగా ఉంచడమే జీవితం అని తెలుసుకున్నాను.
నేను ఇప్పుడు చెప్పిన అబద్ధంతో నేను మళ్ళీ తిరిగి వచ్చేవరకు మా అమ్మ ఆనందంగా ఉంటుంది అంటూ ఆనందంగా ఉన్న తన తల్లిని చూసి వీడ్కోలు చెప్తుంది. నిండుగా నవ్వుతున్న తల్లిని చూసి చూసావా మా అమ్మ ఎంత ప్రశాంతంగా నవ్వుతుందో నా జీవితం ఇలా అయిందని తెలిస్తే జీవితంలో మళ్ళీ ఇంత బాగా నవ్వదు అంటూ ప్రకాష్ తో చెప్తుంది మల్లి. మరోవైపు మల్లి కోసం ఆలోచిస్తూ ఉంటాడు అరవింద్. బస్సులో ఉన్న మల్లి కూడా అరవింద్ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది.
అరవింద్ ని రిక్వెస్ట్ చేస్తున్న మాలిని..
అంతలోనే అక్కడికి వచ్చిన మాలిని నేను అరవింద్ ఇంతకుముందు లాగా ఉండాలంటే తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అంటూ ఆనందని షాపింగ్ కి తీసుకెళ్లమంటుంది. ఇప్పుడా అని అరవింద్ అంటే ప్లీజ్ అరవింద్ నాకోసం అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత నన్ను కోరిక కోరింది ఈ కోరిక తీరిస్తే తను కొంచెం రిలాక్స్ అవుతుంది షాపింగ్ తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు అరవింద్.
ఆ మాత్రానికే చాలా సంతోష పడిపోయి రెడీ అయ్యి వస్తాను అని వెళ్ళిపోతుంది మాలిని. ఇంత చిన్న విషయానికే ఎంత ఆనంద పడిపోతున్నావ్ మాలిని మళ్లీ కూడా అంతే చిన్న చిన్న విషయాలకే ఆనంద పడిపోతుంది అంటూ మళ్లీ ని తలుచుకుంటాడు. మళ్లీ అక్కడ ఎలా ఉందో ఏం చేస్తుందో తన గురించి తెలుసుకోవాలనుకుని ప్రకాష్ కి ఫోన్ చేస్తాడు అరవింద్. కాల్ని కట్ చేసేస్తాడు ప్రకాష్.
ప్రకాష్ మాటలకి షాక్ అయిన మల్లి..
మల్లి జీవితం చాలా గొప్పగా ఊహించుకున్నాను తను నాతో ఉంటే దేవతలాగా చూసుకునేవాడిని ఎప్పటికైనా అవకాశం మించిపోయింది లేదు కానీ మల్లి అర్థం చేసుకోవట్లేదు అనుకుంటాడు ప్రకాష్. అంతలోనే వేషం మార్చుకువచ్చిన మల్లి ని చూసి ఏంటిది నీ మెడలో తాడేది అని అడుగుతాడు. పట్నంలో నా అవతారం ఇదే ప్రకాష్, పట్నంలో నేను పెళ్లయినట్లుగా ఉండకూడదు ఎందుకంటే బాబు గారికి తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఆయనకి ఇబ్బంది అవుతుంది మల్లి. ఇలాంటి బ్రతుకు అవసరమా మల్లి, నీకు తోడుగా నేనుంటాను అరవింద్ గారి లాగా మధ్యలో వదిలేయను అంటాడు ప్రకాష్.
అర్థం కాని మళ్లీ ఏమంటున్నావ్ ప్రకాష్ అంటుంది. నీ నుదుటన సింధూరం పెట్టే అవకాశం నాకు ఇవ్వమంటున్నాను, నువ్వు అరవింద్ గారిని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకో అంటాడు ప్రకాష్. ఆ మాటలకి షాక్ అయిపోతుంది మల్లి. ఎన్నిసార్లు అరవింద్ ఫోన్ చేసినా ప్రకాష్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎందుకు ప్రకాష్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అక్కడ ఏం జరుగుతుంది అనుకుంటూ వాళ్ళ ఊరికి ఫోన్ చేస్తాడు అరవింద్. నేను మళ్ళీ వాళ్ళ హస్బెండ్ ని వాళ్ళతో మాట్లాడాలి కొంచెం పిలవండి అని చెప్తాడు.
అత్తగారి ద్వారా అసలు నిజాన్ని తెలుసుకున్న అరవింద్..
అతను విషయాన్ని మీరా చెప్తే మీరా పరిగెత్తుకుంటూ వచ్చి ఫోను ఎత్తి అరవింద్ తో మాట్లాడుతుంది.అక్కడ అందరూ బానే ఉన్నారు కదా అంటాడు అరవింద్. మల్లి బస్సులో ఉండి ఉంటుంది, మీరు లేకపోవడంతో బాగా దిగులు పెట్టుకుంది అందుకే పొద్దున్న బయలుదేరి వచ్చేసింది మీరేమీ కంగారు పడకండి పక్కనే ప్రకాష్ ఉన్నాడు అంటుంది మీరా. మళ్లీ బస్సులో ఉంది పక్కన ప్రకాష్ ఉన్న ఫోన్ ఎత్తటం లేదు అంటే ఏదో జరుగుతుంది అని అనుమాన పడతాడు అరవింద్.
బస్సు ఎన్ని గంటలకు వస్తుందో అని మీరా ని అడిగి తెలుసుకుంటాడు. మరోవైపు ప్రకాష్ తన ప్రేమ విషయం మల్లి తో చెప్తాడు. చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమించాను ఆ విషయం చెబుదామనుకునే లోపే నీకు పెళ్లి అయిపోయింది. నేను ఎంత ఆలస్యం చేశాను నీ బ్రతుకు చూశాకే అర్థమైంది. నిన్ను ఇంద్ర భవనంలో పెడతానని మాట ఇవ్వలేను కానీ ఉన్నంతలో బాగా చూసుకుంటాను నా ప్రేమని అర్థం చేసుకో అంటాడు ప్రకాష్.
ఈ జన్మకి దొరబాబే నా భర్త అంటున్న మల్లి..
అరవింద్ బాబుని చూశావు కదా నిన్ను వదిలేసి పట్నం వెళ్లిపోయాడు వాళ్ళ భార్యతో హాయిగా ఉండి ఉంటాడు నువ్వేమో అతని కోసం ఆరాటపడుతున్నావ్ అంటాడు ప్రకాష్. మన మనసులో ఉన్న వాళ్ళు మన పక్కన లేకపోతే జీవితం శూన్యం అనిపిస్తుంది ఇప్పుడు నేను అదే పరిస్థితుల్లో ఉన్నాను. నీకు అర్థం అవ్వాలని నేను ఈ విషయం చెప్తున్నాను నేను ఎప్పటికీ నిన్ను ప్రేమించలేను.
నాకు దొరబాబు గారి భార్యగా సమాజంలో గుర్తింపు ఉండదు, నాక్కూడా అలాంటి గుర్తింపే కావాలని అనిపించిన అలా కోరుకోను ఎందుకంటే బాబు గారు ఇబ్బంది పడేది ఏది నేను కోరుకోను. ఆయన కట్టిన తాళిని దాచుకున్నట్లే ఆయన మీద ప్రేమను కూడా గుండెల్లో దాచుకుంటాను. ఈ జీవితానికి దొరబాబు గారే నా భర్త అంటుంది మల్లి. నీకు నేను నా ప్రతిబింబంలో కనిపిస్తున్నాను కదా నా ఎదురుగుండా నువ్వుంటే నన్ను మర్చిపోలేవు ఇక్కడినుంచి వెళ్ళిపో అంటుంది మల్లి.
మాలినిని నిర్లక్ష్యం చేస్తున్న అరవింద్..
నేను నా ఆనందం కోసం రావడం లేదు మల్లి నీ ఆనందం కోసం వస్తున్నాను అంటాడు ప్రకాష్. నిజం చెప్తున్నాను ప్రకాష్ నేనెప్పుడూ నిన్ను ఒక స్నేహితుడు లాగానే చూశాను. సర్లే వదిలేయ్ ఇంక నువ్వు బయల్దేరు మన ఊరు వెళ్లేసరికి లేట్ అవుతుంది అంటుంది మల్లి. నువ్వే అన్నావు కదా నేను నీ స్నేహితుడిని నా స్నేహితులని ఒంటరిగా వదిలేసి నేను ఎలా వెళ్ళగలను పదా బస్సు బయలుదేరుతుంది అంటూ బస్సు ఎక్కుతారు ప్రకాష్ వాళ్ళు. మరోవైపు టైం చూసుకున్న అరవింద్ ఈపాటికి బస్సు వచ్చేసి ఉంటుంది.
అర్జెంటుగా బయలుదేరాలి అని బయలుదేరబోతుంటే మాలిని ఎదురవుతుంది నేను రెడీ వెళ్దాం అంటుంది. నాకు అర్జెంటు పని ఉంది ఇప్పుడే వచ్చేస్తాను అంటూ మాలిని పిలిచిన పట్టించుకోకుండా వచ్చేస్తాడు అరవింద్. బస్సు దిగిన ప్రకాష్ నువ్వు ఆకలితో ఉండి ఉంటావు భోజనం చేద్దువు గానివి రా అంటాడు. నేను హాస్టల్ లోకి వెళ్లేకే భోం చేస్తాను అంటుంది మల్లి. సరే అయితే దగ్గర్లో ఏవైనా హాస్టల్ గా ఉన్నాయేమో చూసి వస్తాను అని వెళ్తాడు ప్రకాష్. అందుకే పెద్ద వాళ్ళు చెప్పినట్లు వినాలి, అమ్మ తినమంటే తినలేదు ఇప్పుడేమో ఆకలి వేస్తుంది ఎప్పుడు హాస్టల్ దొరుకుతుందో ఎప్పుడు అన్నం తింటానో అనుకుంటుంది మల్లి.
Malli December 26 Today Episode: మల్లి కి సర్ప్రైజ్ ఇచ్చిన అరవింద్..
అప్పటివరకు నువ్వు ఆకలితో ఉండవలసిన అవసరం లేదు అంటూ అరవింద్ టిఫిన్ తీసుకొని వస్తాడు. సడన్ గా అక్కడ అరవింద్ ను చూసి షాక్ అవుతుంది మల్లి. నేను వస్తున్నట్టు మీకు ఎలా తెలుసు అంటుంది. ఆ విషయం పక్కన పెట్టి నువ్వు వస్తున్నట్లు నాకెందుకు ఫోన్ చేసి చెప్పలేదు అంటాడు అరవింద్. నువ్వు నన్ను వదిలి ఉండలేకపోయావు నా కోసమే వచ్చావు కదా అంటాడు అరవింద్. అలా ఏమి కాదు మంచి కాలేజీ మెలకువటం కోసం ముందుగానే వచ్చాను ఇంకా మీరు వెళ్ళండి అంటుంది మల్లి.
తరువాయి భాగంలో అక్కడికి వచ్చిన ప్రకాష్ మీతో వస్తానంటే తీసుకొని వెళ్ళండి అని అరవింద్ తో అంటాడు. మా భార్యాభర్తల మధ్యలో మాట్లాడడానికి నువ్వు ఎవరు అంటాడు అరవింద్. ఏ భార్య గురించి మాట్లాడుతున్నారు మాలినీ గారి గురించా,మల్లి గురించా,అంటాడు ప్రకాష్. మాటలకి షాక్ అవుతాడు అరవింద్. అంతలోనే వాళ్ళని అరవింద్ వాళ్ళ పెదనాన్న చూస్తాడు. ఆనందంగా మల్లిని పలకరిస్తాడు.