Malli December 27 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఇంకా మీరు వెళ్ళండి నా దారిన నేను వెళ్తాను అంటుంది మల్లి. ఇక్కడ నీకు ఎవరు తెలుసు అని ఎక్కడ ఉంటావు? ఏం చేస్తావ్ అని అడుగుతాడు అరవింద్. హాస్టల్ లో ఉంటాను మాత్రం చెప్పకు. ఎన్ని రోజులు హాస్టల్లో ఉంటావు అన్ని డబ్బులు నీకు ఎక్కడి నుంచి వస్తాయి అంటాడు అరవింద్.
అరవింద్ ని నిలదీసిన ప్రకాష్..
మల్లి అనాధ కాదు తన ఖర్చులకి నేను సంపాదిస్తాను అంటాడు ప్రకాష్. అంటే తన బాధ్యత నువ్వు తీసుకుంటానంటున్నావా అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావ్ ప్రకాష్. కాస్త దూరంగా ఉన్నంత మాత్రాన నా స్థానంలోకి నువ్వు రావాలనుకుంటున్నావా? నా స్థానంలోకి రావడానికి నీకు ఏం అర్హత ఉంది అని అడుగుతాడు అరవింద్. నేను తనకి తోడుగా వచ్చాను తను మీతో వస్తానంటే హ్యాపీగా తీసుకెళ్లండి లేదంటే ఇక్కడినుంచి దయచేయండి అంటాడు ప్రకాష్.
నేను ఇది నాకు నా భార్యకి సంబంధించిన విషయం మా మధ్యలో నీ ఇన్వాల్వ్మెంట్ అనవసరం అంటాడు అరవింద్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మాలిని గురించా, మల్లి గురించ అని అడుగుతాడు ప్రకాష్. అనుమానంగా మల్లి వైపు చూస్తాడు అరవింద్. ప్రమాణ పూర్తిగా నేను ప్రకాష్ కి ఏమి చెప్పలేదు అంటుంది మల్లి. కనీసం నీకైనా నిజం తెలిసింది అందుకు చాలా సంతోషం.
ప్రకాష్ ని అవమానించిన అరవింద్..
నన్ను ఎలాంటి ప్రశ్న అడగాలన్న మళ్ళీకి అధికారం ఉంటుంది ఎందుకంటే తను నా భార్య. నువ్వు కేవలం తనకి ఫ్రెండ్వి మాత్రమే నా భార్య సంగతి నేను చూసుకుంటాను అంటాడు అరవింద్. అంతలోనే అక్కడికి వచ్చిన అరవింద్ వల్ల పెదనాన్న మల్లిని చూసేస్తాడు. అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి బాగున్నారా అని పలకరిస్తుంది మల్లి. ముందు నీ సంగతి చెప్పు ఎందుకలా చెప్పకుండా వెళ్ళిపోయావు. నీ మనసు ఎంతో బాధ పడితేనే కానీ నువ్వు చెప్పకుండా వెళ్ళవు అంటాడు అతను.
అలాంటిదేమీ లేదు బాబు గారు మా అమ్మని చూడాలనిపించింది, పరీక్షలు కూడా ఉన్నాయి కదా అందుకే వెళ్ళిపోయాను అంటుంది మల్లి. పరీక్షలు బాగా రాసావా అని అడిగితే మీ గుడ్ స్టూడెంట్ ని కదా బాగానే రాశాను అంటుంది మల్లి. ఇంతకీ మీ సంగతి చెప్పండి మీరందరూ బానే ఉన్నారు కదా నేను లేనని చెప్పి మీరు మళ్ళీ సిగరెట్లు తాగడం మొదలుపెట్టలేదు కదా అంటుంది మల్లి. లేదమ్మా నువ్వు ఎప్పుడైతే మాన్పించేసావో అప్పటినుంచి తాగట్లేదు నా ఆరోగ్యం కుదురు పడింది అంటాడు అతను.
పెద్దయ్య గారి కాళ్లు పట్టుకున్న మల్లి..
నువ్వు ఎప్పుడైతే ఇల్లు వదిలి వెళ్ళిపోయావు అప్పుడే మా ఇంట్లో అందరివి నవ్వడం మర్చిపోయాం నువ్వు మళ్ళీ మా ఇంటికి రా అంటాడు. అంతలోనే అక్కడికి వచ్చిన ప్రకాష్ ని పరిచయం చేస్తుంది మల్లి. మీ ఇంటికి రావడం కుదరదు అంటుంది మల్లి. ఏ ఎందుకు రావు అని అడిగితే నేను చదువుకోడానికి వచ్చాను హాస్టల్లో ఉంటాను అంటుంది మల్లి. ఇంట్లో ఉండి కూడా చదువుకోవచ్చు కదా నేను మాలిని హెల్ప్ చేస్తాం కదా అంటాడు అతను.
ప్రకాష్ నువ్వు కూడా రా ఎన్నాళ్ళు కావాలంటే ఎన్నాళ్ళు ఉండి అప్పుడు వెళ్ళిపోదువు గాని అంటాడు. నాకు రావడం ఇష్టం లేదు బాబు దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటూ అతని కాళ్లు పట్టుకుంటుంది మల్లి. చెప్పు ఇంటికి రాను అంటున్నావ్ అని అడుగుతాడు అరవింద్ వాళ్ళ పెదనాన్న. కారణం ఏమీ లేదంటుంది మల్లి. నువ్వు ఆనందంగా ఉండడమే మాకు కావాలి నీకు ఇష్టం వచ్చినట్లే చెయ్యి అంటాడు అతను. బాగా లేట్ అయిపోయిందండి అని చెప్పి మల్లి ని తీసుకొని వెళ్ళిపోతాడు ప్రకాష్.
సీన్ కట్ చేస్తే హాస్టల్ కి వెళ్తే వాళ్ళు ఐడెంటిటీ ప్రూఫ్ లు అడుగుతారు. తను ఐడెంటిటీ ప్రూఫ్లన్ని ఊర్లో మర్చిపోయి వచ్చింది మేడం అంటాడు ప్రకాష్. కనీసం ఉద్యోగం చేసే ఆఫీస్ ఐడెంటిటీ అయినా చూపించు అని అంటే నేను ఎక్కడికి వచ్చిందే చదువుకోటానికి నావల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక మూలనే ముడుచుకుంటాను అంటుంది మల్లి. నీ మాటలు వింటుంటే నువ్వు పక్క పల్లెటూరు నుంచి వచ్చినట్లు ఉన్నావు నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అంటుంది ఆ వార్డెన్.
వార్డెన్ ని రిక్వెస్ట్ చేస్తున్న మల్లి..
ఈ సార్ కి తనకి రూమ్ ఇస్తాను నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు తన ప్రూఫ్స్ అన్ని తీసుకొని రా అంటూ ప్రకాష్ కి చెప్తుంది ఆ వార్డెన్. మరోవైపు మాలిని అరవిందుల మధ్య వదిన మనస్పర్ధలు తొలగిపోయినందుకు చాలా సంతోషపడుతారు అనుపమ దంపతులు. అంతలోనే అక్కడికి వచ్చిన అరవింద్ వల్ల పెదనాన్నని ఎందుకు అన్నయ్య డల్ గా ఉన్నావు అని అడుగుతాడు రామకృష్ణ. ఏమీ లేదు అంటాడు అతను. ఏమీ లేకపోతే ఎందుకు అలా ఉంటారు నిజం చెప్పండి అంటుంది సుమిత్ర.
అప్పుడు తను జరిగిందంతా చెప్తాడు. మల్లి కనిపించిందా తను హైదరాబాదులోనే ఉందా అంటుంది రూప. తను వాళ్ళ ఊర్లో ఉంది కదా అంటుంది అనుపమ. ఊర్లో ఉండి మన ఇంటికి ఎందుకు రాలేదు మీరు రమ్మని చెప్పలేదా అంటుంది సుమిత్ర. రమ్మని బ్రతిమిలాడను కానీ రానుంది అంటాడు అతను. రాకుండా ఎక్కడ ఉంటుంది ఈ ఊర్లో తనకి తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అంటుంది అనుపమ. తను ఇక్కడే ఉండి మన ఇంటికి రానంటుంది అంటే నాకు ఎందుకో అనుమానంగా ఉంది అంటుంది అనుపమ.
ఏదో జరిగిందని అనుమానిస్తున్న సుమిత్ర..
తను రాను అంది అంటే ఏదో జరిగే ఉంటుంది అంటుంది సుమిత్ర. మీరు కారణం అడగలేదా అని భర్తని అడుగుతుంది సుమిత్ర. అడిగాను మనం అనుకుంటున్నట్టు ఏమీ కాలేదని మనందరి మీద ప్రేమ కురిపిస్తూ అందరి యోగక్షేమాల గురించి అడిగింది అంటాడు అతను. మరి తను ఎందుకు రావటం లేదు అని అనుమాన పడుతూ అక్క మనం వెళ్లి తనని ఒప్పించి తీసుకువద్దాం అని సుమిత్రతో అంటుంది అనుపమ. తను ఎక్కడ ఉందో చెప్పండి అంటుంది సుమిత్ర. ఆ ఛాన్స్ మనకు ఇవ్వలేదు తను ఎక్కడ ఉంటుందో కూడా చెప్పలేదు అంటాడు అరవింద్ వాళ్ళ పెదనాన్న.
అప్పుడే వచ్చిన అరవింద్ ని చూసి జరిగిందంతా చెప్తుంది అనుపమ. నువ్వు ఒక పని చెయ్యి వాళ్ళింట్లో వాళ్లకి ఫోన్ చేసి తను ఎక్కడుందో కనుక్కొని నువ్వు వెళ్లి పిలువు అంటుంది అనుపమ. పెదనాన్న పిలిస్తేనే రాలేదు నేను పిలిస్తే ఎందుకు వస్తుంది అంటాడు అరవింద్. తను మొండిది తనకు ఏది నచ్చితే అదే చేస్తుంది. తనని బలవంతంగా రమ్మనటానికి తన మీద ఏమైనా రైట్స్ ఉన్నాయా లేవు కదా అంటూ తల్లి మీద చిరాకు పడిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అరవింద్.
తమ్ముడిని తిట్టుకుంటున్న రూప..
వీడికి ప్రతి దానికి కోపమే మనుషులతో ప్రేమగా మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటాడో అంటుంది రూప. వాళ్లు ఇంతకుముందు బానే ఉండేవారు కదా ఇప్పుడు మల్లి మీద ఎందుకు అంత కోపం చూపిస్తున్నాడు. తను అలా ఉండడానికి కారణం నేనా,మల్లి ఆ అని ఆలోచించుకుంటుంది మాలిని. గదిలోకి వెళ్ళిన అరవింద్ నువ్వు పరిచయం అవ్వకముందు నేను వేరు ఇప్పుడు నేను వేరు నన్ను నువ్వు పూర్తిగా మార్చేసావు.
నువ్వు నాతో లేవని ఎవరు గుర్తు చేసిన భరించలేనంత కోపం వచ్చేస్తుంది ఈ పరిస్థితుల నుంచి నన్ను నేను ఎలా బయటపడేసుకోవాలో అర్థం కావట్లేదు అని తనలో తానే బాధపడతాడు అరవింద్. మరోవైపు ప్రకాష్ కి జాగ్రత్తలు చెప్పి అమ్మని జాగ్రత్తగా చూసుకోమంటుంది మల్లి. నువ్వు జాగ్రత్త మల్లి అరవింద్ బాబు నిన్ను కలవాలని చూసినా నువ్వు దూరంగా ఉండు అంటాడు ప్రకాష్. ఈరోజు నావల్ల అనవసరంగా నువ్వు మాటలు పడ్డావు.
జాలికి, ప్రేమకి తేడా తెలుసుకోమంటున్న ప్రకాష్..
బాబు గారు నా మీద కోపాన్ని నీ మీద చూపించారు అంటుంది మల్లి. సమాజం దృష్టిలో మాలిని ఆయన భార్య నువ్వు వాళ్ళ ఇంట్లో పనిమనిషి అంటాడు ప్రకాష్. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నావ్ అంటుంది మల్లి. మీ పెళ్లి తుపాకుల మధ్య జరిగింది, వాళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.పొరపాటున ఆయనే నీ భర్తని చెప్పిన ఎవరు నమ్మరు వాళ్ళందరూ స్వార్ధపరులు అంటాడు ప్రకాష్.ఇంకా ఆపు ప్రకాష్ వాళ్ల గురించి నీకేం తెలుసు, వాళ్లు స్వార్థపరులైతే నన్ను ఇంటికి రమ్మని ఎందుకు బ్రతిమాలుతారు అంటుంది మల్లి.
వాళ్ళు రమ్మన్నది నిజమే కానీ ఏ స్థానంలో రమ్మన్నారో తెలుసా పనిమనిషి స్థానంలో అంటాడు ప్రకాష్. పనిమనిషిని అంత ప్రేమగా చూస్తారా అంటుంది మల్లి. అది జాలను తెలుసుకో మల్లి. నిన్ను అంత ప్రేమగా రమ్మన్నవాళ్లే నువ్వు ఆ ఇంటి కోడలు అని తెలిస్తే మెడ పట్టి బయటకు గెంటేస్తారు ఈ మాట నేను మా వాళ్ళ మీద కోపంతోనో నిన్ను బాధ పెట్టడం కోసమో చెప్పడం లేదు నిన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను అంతే ఈరోజు ఎంత బాధ పడాలో, ఎంత ఏడవలో అన్ని ఈరోజే చేసే రేపటి నుంచి నీలో కొత్త మల్లి కనిపించాలి.
మల్లి లో స్ఫూర్తి నింపుతున్న ప్రకాష్..
ఇకపై నువ్వు వేసే ప్రతి అడుగు నీ ప్రతి ఆలోచన నీ గుర్తింపు కోసం అవ్వాలి గుర్తుపెట్టుకో, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రకాష్. నేను నా గుర్తింపు కోసమే ఈ ఊర్లో అడుగు పెట్టాను ప్రకాష్ మాలిని యొక్క అరవింద్ బాబుల మధ్యన ఉండాలని కాదు అనుకుంటుంది మల్లి. మరోవైపు గదిలోకి వచ్చిన మాలినీ ని చూసి తనని షాపింగ్ కి తీసుకెళ్తానని మర్చిపోయిన విషయం గుర్తు తెచ్చుకుంటాడు అరవింద్. తనిఖీ సారీ చెప్పబోతే ప్రతి దానికి సారీ చెప్పడం అలవాటు చేసుకోకు అంటుంది మాలిని.
సరే షాపింగ్ కి వెళ్దాం పద అంటాడు అరవింద్. ఇప్పుడు నాకు మూడు లేదు అంటుంది మాలిని. నువ్వు లేకపోవడం కాదు నేను సడన్గా వెళ్ళిపోయినందుకు మీకు కోపం వచ్చింది అంటాడు అరవింద్. థాంక్యూ అరవింద్ చాలా రోజుల తర్వాత నన్ను అర్థం చేసుకోవడం మొదలుపెట్టావ్ అంటుంది మాలిని. నా జీవితంలో అమ్మానాన్న నువ్వు ముగ్గురు మాత్రమే ఉండేవారు మీరు ముగ్గురే నా ప్రపంచం. అమ్మానాన్న గొడవ పడుతున్నప్పుడు చాలా భయం వేసేది అప్పుడు నీ మాటలే నాకు ధైర్యం ఇచ్చేవి.
Malli December 27 Today Episode: భర్తతో తన బాధను చెప్పుకుంటున్న మాలిని..
నువ్వు చూపించే కేరింగ్ మా నాన్నకి ఈక్వల్ గా ఉండేవి. అందుకే మా మామ్ నన్ను ఎన్నిసార్లు తిట్టినా కోప్పడినా నేను నీకు దూరంగా ఉండడానికి ట్రై చేయలేదు. డే బై డే నీ మీద ప్రేమ పెరుగుతూనే వచ్చింది ఇప్పటికి కూడా పెరుగుతూనే ఉంది అందుకే చెప్పకుండా ఊరు వెళ్లినప్పుడు కోపం కన్నా బాధ ఎక్కువ వేసింది అంటుంది మాలిని. అప్పుడు కూడా నేనేమైనా తప్పు చేశానా అని ఆలోచించాను కానీ నిన్ను అనుమానించలేదు.
చాలా రోజుల తర్వాత నువ్వు ఇంటికి వచ్చిన నిన్ను అనుమానించకుండా నీ గుండెల మీద వాలిపోయాను. నేను ఇప్పుడు నీ గురించి ఒకటే ఆలోచిస్తాను నా అరవింద్ నాకు మాత్రమే సొంతం. అలాగే నా అరవింద్ కూడా నేనే లోకమని అనుకోవాలి అని కానీ అంటూ మధ్యలోనే ఆపేస్తుంది మాలిని. కానీ అంటే ఏంటి అంటాడు అరవింద్ ఆ మాట నేను నోటితో చెప్పలేను ఎందుకంటే నా కన్నీళ్లే సమాధానంగా మారి బయటికి వచ్చేస్తాయి అంటూ బాధపడుతుంది మాలిని.
తరువాయి భాగంలో మళ్లీ ఊరు వచ్చినట్లుగా తల్లికి చెప్తుంది మాలిని. షాక్ అయినా వసుంధర నువ్వు జాగ్రత్తగా ఉండు లేకపోతే ఏదో ఒక వంకతో తనని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు అంటుంది వసుంధర.