Malli December 28 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నా అరవింద్ నేనే లోకం అనుకోవాలి అంటుంది మాలిని. బాధపడుతున్న భార్యని ఓదార్చబోతాడు అరవింద్ కానీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాలిని. నా జీవితం ఎటువైపు వెళుతుంది ప్రాణంగా ప్రేమించే భాగస్వామి దొరికితే చాలు అనుకుంటారు ఎవరైనా కానీ నాకు ఇద్దరు దొరికారు.
అయోమయంలో అరవింద్..
ఒకరి వైపు కొంచెం పాజిటివ్గా ఆలోచించే లోపు ఇంకొకరి జీవితం అన్యాయమౌతూ కళ్ళ ముందు కనిపిస్తుంది. అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, కళ్ళ ముందు ఉండే మాలిని ఎలా సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. కళ్ళముందులేని మల్లి జీవితానికి ఎలా న్యాయం చేయాలి అనుకుంటాడు. మల్లి అంటే గుర్తు వచ్చింది తను ఏ హాస్టల్లో జాయిన్ అయింది ఎలా ప్రకాష్ కి ఫోన్ చేద్దాం అనుకుంటాడు కానీ చెప్తాడు లేదో అని అనుమాన పడతాడు అరవింద్.
మరోవైపు మల్లి పరిస్థితి తలుచుకొని బాధపడతాడు అరవింద్. మళ్లీ జీవితం ఇలా అయిపోతుందని అస్సలు ఊహించలేదు.మెడలో ఉన్న పసుపు తాడు చూసుకొని మురిసిపోతుంది. ఎన్ని రోజులు ఇలా నాటకం ఆడుతుంది. ఏదో ఒక రోజు నిజం తెలిస్తే అప్పుడు మీరా అత్తయ్య పరిస్థితి ఏంటి, ఎందుకు మల్లి దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు అనుకుంటాడు ప్రకాష్. అంతలోనే అరవింద్ ఫోన్ చేయటంతో ఎందుకు ఫోన్ చేశారు అని అడుగుతాడు. మల్లి ని ఏ హాస్టల్లో జాయిన్ చేసావ్ అని అడుగుతాడు అరవింద్.
అరవింద్ కి చివాట్లు పెట్టిన ప్రకాష్..
తను ఎక్కడ ఉంటే నీకెందుకు తనకి మీరు చేసిన అన్యాయం చాలుఅని ప్రకాష్ అంటే తనకి ఏదో ఒకరకంగా న్యాయం చేస్తాను అంటాడు అరవింద్. తనకోసమే ఫోన్ చేసేటట్లయితే మరి ఇప్పుడు నాకు ఫోన్ చేయకండి అంటూ ఫోన్ కట్ చేసేస్తాడు ప్రకాష్. వెనక్కి తిరిగేసరికి మీరాని చూసి షాక్ అయిపోతాడు ప్రకాష్. ఫోన్ చేయొద్దు అంటున్నావు ఏం జరిగింది అంటుంది మీరా. ఎక్కడ తను అంతా వినేసిందో అని కంగారు పడిపోతాడు ప్రకాష్. నీకు ఎవరి వల్ల అయినా ఇబ్బంది అయితే బాబుకు చెప్పు అతనే చూసుకుంటాడు అంటుంది మీరా.
అంటే అత్తయ్య ఏమి వినలేదు అన్నమాట అని మనసులోనే అనుకొని నా ఫ్రెండ్ అత్తయ్య ఊరికే సతాయిస్తున్నాడు అందుకే ఫోన్ చేయొద్దు అన్నాను అంటాడు ప్రకాష్. ఇంతకీ మల్లిని వాళ్ళ అత్తారింట్లో దింపేసావా? వాళ్లు మల్లి చెప్పకుండా వచ్చినందుకు ఏమైనా అన్నారా అంటూ అనరులే వాళ్ళు నా కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. పట్నం వెళ్తే చాలు మళ్ళీ ఆనందంతో నన్ను కూడా మరిచిపోతుంది అంటుంది మీరా. నువ్వు చాలా కలలు కంటున్నావు అది నిజాలు కావు అని తెలిస్తే ఏమైపోతారో ఏంటో అనుకుంటాడు ప్రకాష్.
కానీ మల్లి మాత్రం చాలా మొండిగా ఉంటుంది ఎలాగో ఏంటో అర్థం కావట్లేదు అనుకుంటాడు ప్రకాష్. సరే ఎప్పుడు తిన్నావో ఏంటో నీకు పరమాన్నం చేసి పెడతాను రా అని మేనల్లుడిని ఇంట్లోకి తీసుకెళ్ళిపోతుంది మీరా. మరోవైపు మల్లిని చూసి ఈ అమ్మాయి పల్లెటూరి అమ్మాయి లాగా ఉంది మన రూమ్ లో పెట్టింది ఏంటి వార్డెన్ త్వరగా షిఫ్ట్ చేయమని చెప్పాలి అని అనుకుంటారు మల్లి రూమ్మేట్స్. బట్టలు సర్దుతున్న మల్లికి, అరవింద్ షర్ట్ కనిపిస్తుంది.
ఊహల్లో విహరిస్తున్న మల్లి..
షర్ట్ ని పట్టుకొని ఊహల్లోకి వెళ్ళిపోతుంది మల్లి. షర్టు నాకోసమే తెచ్చి ఇవ్వకుండా దాచుకుంటావా అంటాడు అరవింద్. అమ్మ మీకు ఇవ్వమని ఇచ్చింది ఒకసారి వేసుకోండి అంటుంది మల్లి. షర్ట్ వేసుకున్న అరవింద్ ని చూసి చాలా బాగుంది బాబు అంటుంది మల్లి. ప్రేమతో తెచ్చావు కదా బాగోకుండా ఎలా ఉంటుంది అంటాడు అరవింద్. అరవింద్ కి బటన్ పెడుతున్న మల్లిని దగ్గరికి తీసుకొని కవిత్వం చెప్తాడు అరవింద్. ఆ మాటలకి అతన్ని హత్తుకుంటుంది మల్లి.
ఆ షర్ట్ పట్టుకొని ఎందుకలా ఎమోషనల్ అవుతున్నావు అని అడుగుతారు రూమ్మేట్స్. ఊహల్లోంచి బయటకు వచ్చిన మల్లి తన చేతిలో ఉన్న షర్ట్ ని చూసుకుంటుంది. అంతలోనే ఒక అమ్మాయి ఏంటి లవ్వా అని అడుగుతుంది. దీని మొహానికి లవ్వా?నెవర్ అంటుంది మరో అమ్మాయి. ఈ షర్ట్ మహా అయితే 500 ఉంటుంది దీన్ని షర్ట్ అనరు మసి గుడ్డ అంటారు అంటూ ఆ షర్ట్ మళ్లీ దగ్గర లాక్కొని ఆమెకి ఇవ్వకుండా ఏడిపిస్తారు. ఇస్తారా ఇవ్వరా అంటూ కర్ర పట్టుకుంటుంది మల్లి.
గతాన్ని తలుచుకుంటున్న అరవింద్..
ఏంటి కొడతావా అని అడుగుతారు వాళ్లు. అనుమానం అవసరం లేదు మర్యాదగా ఇవ్వండి అది నాకు చాలా అవసరం అంటుంది మల్లి. ఇచ్చేయవే, ఇవ్వకపోతే కొట్టేలాగా ఉంది అంటుంది ఒక అమ్మాయి అంటే షర్ట్ ని తిరిగి ఇచ్చేస్తుంది మరొక అమ్మాయి. మరోవైపు బ్యాగ్ సర్దుకుంటున్న అరవింద్ కి వైట్ షర్ట్ కనిపిస్తుంది. షర్ట్ ని చూసి గతంలోకి వెళ్తాడు అరవింద్. బాబు గారు మీకు ఇష్టమేనా రంగు తెలుపు కదా అని అరవింద్ ని అడుగుతుంది మల్లి.
ఏం మచ్చ లేకుండా బ్రతకమని చెప్తుంది తెలుపు అంటాడు అరవింద్. దేవుడు నిజంగా ఉన్నాడా అని అరవింద్ అడిగితే అదేం ప్రశ్న కచ్చితంగా ఉన్నాడు అంటుంది మల్లి. నిజంగా దేవుడు ఉండి ఉంటే ప్రపంచంలో మనుషులందరూ ఆనందంగా ఉండి ఉండాలి కదా అంటాడు అరవింద్. మనం అందరిలో దేవుని చూస్తాం. నిజానికి దేవుడంటే నమ్మకము, ధైర్యము. మన కోరిక నిస్వార్ధంగా ఉంటే పంచభూతాలే మన కోరికని తీరుస్తాయి అంతేగాని పిచ్చిపిచ్చి కోరికలు కోరుకుంటే అవి ఎప్పటికీ నెరవేరవు అంటుంది మల్లి.
తన కోరిక చెప్పిన అరవింద్..
బాగా చెప్పావు ఇంతకీ నువ్వేం కోరుకున్నావు అంటాడు అరవింద్. ముందు మీరేం కోరుకున్నారో చెప్పండి అంటుంది మల్లి. నా గురించి ఏమీ కోరుకోలేదు నీ గురించే కోరుకున్నాను అరవింద్. ఏమని అని మళ్లీ అడిగితే నాకు పరిచయమైన కొత్తల్లో అల్లరిగా ఉండే మళ్లీ చూడాలని అంటాడు అరవింద్. అది సాధ్యపడదు బాబు, జీవితం ఒక మలుపు తీసుకున్నాక వేరే మలుపు కోరుకోవడం జరగని పని అంటుంది మల్లి. ఇంతకీ నువ్వేం కోరుకున్నావు అని అరవింద్ అంటే కోరుకున్న కోరికలు బయటికి చెప్తే నెరవేరవంట అంటుంది మల్లి.
అదేంటి నేను చెప్పాను కదా నువ్వు చెప్పాలి అంటూ ఆమెని లాగుతాడు అరవింద్. ఆ దెబ్బకి ఆమె అరవింద్ మీద పడుతుంది. ఆమె బొట్టు అరవింద్ షర్ట్ కి అంటుకొని మరకవుతుంది. మీరు ఏ మచ్చ లేని ఈ తెల్లచొకాల బ్రతకాలనుకుంటే నేనేమో ఈ మచ్చలా మీ జీవితంలోకి వచ్చాను అంటూ ఆ మచ్చని తుడిచేయబోతుంది మల్లి. వద్దు రేపు నేను సిటీకి వెళ్ళిపోతే నీ జ్ఞాపకంగా ఉంటుంది అంటాడు అరవింద్. నా పర్మిషన్ లేకుండా నా లైఫ్ లోకి వచ్చావు కానీ నా పర్మిషన్ లేకుండా నా లైఫ్ లో నుంచి వెళ్ళిపోవు అంటాడు అరవింద్.
కూతురు కోసం బాధపడుతున్న వసుంధర..
అదంతా తలుచుకుంటూ నా మనసులో నీకు ఎప్పుడు స్పెషల్ ప్లేస్ ఉంటుంది మల్లి అనుకుంటాడు అరవింద్. సీన్ కట్ చేస్తే కూతురి ఆరోగ్యం కోసం ఆలోచిస్తుంది వసుంధర. మాలిని అరవింద్ ని చేసుకుంటాను అన్నప్పుడు వద్దు అని గట్టిగా నిలబడాల్సింది. మహా అయితే నెల రోజులు ఏడ్చి ఆ తర్వాత నార్మల్ అయ్యేది. అప్పుడు తను ఎక్కడ బాధ పడుతుందో అని తన ప్రేమకి తలవంచాను కానీ ఇప్పుడు అరవింద్ వల్ల తను రోజు బాధపడుతుంది.
భార్యని ప్రేమించలేని వాళ్ళు అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఆడది అంటే అలుసైపోయింది అందుకే ఆట బొమ్మను చేసి ఆడిస్తున్నారు అని కూతురు కోసం బాధపడుతుంది వసుంధర.మాలిని ఆరోగ్యం ఎప్పటికైనా కుదిరిపడిందో లేదో కనుక్కుందామని ఆమెకి ఫోన్ చేస్తుంది వసుంధర. ఫోను లిఫ్ట్ చేసిన మాలినీతో నీ ఆరోగ్యం బాగుందా అని అడుగుతుంది వసుంధర. అంతా బానే ఉంది మామ్ అంటుంది మాలిని. అరవింద్ కనిపించాడు కదా తనని చూస్తే చాలు నీ కడుపు నిండిపోతుంది.
అసలు విషయాన్ని చెప్పి తల్లికి షాక్ ఇచ్చిన మాలిని..
నీకు వేరే లోకం గుర్తు రాదు కదా అలాగే నీ భర్తకి కూడా వేరే లోకంలో లేకుండా చూసుకో నీ భర్తని ఇప్పటికైనా గ్రిప్ లో పెట్టుకో మీ మధ్య గొడవలు పెట్టడానికి ఇప్పుడు మళ్ళీ కూడా లేదు కదా అంటుంది వసుంధర. మల్లి హైదరాబాద్ వచ్చిందంట మామ్ అంటుంది మాలిని. షాకైన వసుంధర మీ ఇంటికి వచ్చిందా అని అడుగుతుంది.
Malli December 28 Today Episode:
లేదు మామ్ పెద్ద మామయ్యకి బస్టాండ్ లో కనిపించిందట ఆయన ఇంటికి రమ్మన్నా రాను అన్నదంట అంటుంది మాలిని. మరి అరవింద్ ఏమన్నాడు అని అడిగితే జరిగిందంతా చెప్తుంది మాలిని. జాగ్రత్త మాలిని,మల్లి మళ్లీ హైదరాబాద్ వచ్చిందంటే నాకెందుకో అనుమానంగా ఉంది. వాళ్లు ఏదో ఒక విధంగా మళ్లీ ని తీసుకొచ్చి ఇంట్లో పెడతారేమో అలాంటి పరిస్థితి వస్తే తను ఇంట్లో ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లోని ఒప్పుకోవద్దు అంటూ కూతురికి సలహా ఇస్తుంది వసుంధర.
అలాగే అంటుంది మాలిని. మరో వైపు మీరా అన్న మాటలని తలుచుకుంటూ బాధపడతాడు శరత్ చంద్ర. తరువాయి భాగంలో అనుకోకుండా రోడ్డుమీద కనిపించిన మల్లి ని ఫాలో అయి తను ఎక్కడ ఉందో తెలుసుకుంటాడు అరవింద్.