Malli February 7 Today Episode: ఈరోజు ఎపిసోడ్లో మళ్లీ నీ ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడటమే కాదు మీ ఇద్దరికీ పెళ్లి అయిందా అని అడగటం కూడా నాకు చాలా బాధనిపించింది అంటుంది మాలిని. ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ పాజిటివ్ గా తీసుకుంటారని నమ్మకం లేదు కదా మీకు.

గుమ్మంలోనే మల్లిని నిలదీసిన
మాలిని..

ఈరోజు మల్లి చేసిన పనికి ఫ్యామిలీ పరువు పోయినట్లుగా అయింది అని మాలిని అంటే ఎందుకు చిన్న మేటర్ ని పెద్దది చేస్తున్నావ్ అంటాడు అరవింద్. ఒక ఆడపిల్లకి ఇది చాలా పెద్ద మేటర్ అంటుంది. అక్కడ జర్నలిస్టులు వాళ్లతో పాటు నిన్ను కూడా టార్గెట్ చేశారు మీకు అర్థం కావట్లేదా అంటూ భర్తని నిలదీస్తుంది. సిద్ధాంతి గారు చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకొని నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను, మల్లికి మీకు పెళ్లి అయిందా అన్న ప్రశ్న నాకు ఇంకా చెవుల్లో వినబడుతుంది.

దానికి నిదర్శనం నీ నుదుటి మీద ఉన్న సింధూరం అందుకే దాన్ని తుడిచేయి అంటుంది మాలిని.మల్లి ఆ పని చేయకుండా ఆలోచనలో ఉంటే మాలినియే నాప్కిన్ ని తీసుకొచ్చి తుడుచుకోమంటూ చేతికి ఇస్తుంది. ఇప్పుడు వద్దు తర్వాత తుడుస్తాను అని మల్లి అంటే ఎందుకు అని అడుగుతుంది మాలిని. నువ్వు ఏమీ లేదు అనటం లోనే ఏదో ఉంది అని తెలుస్తుంది లేకపోతే కుంకుమ తీయటానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు అంటూ నిలదీస్తుంది.

మాలినికి తోడైన అరవింద్ తల్లి..

మాలిని అడిగినదానికి సమాధానం చెప్పు తను అన్నట్టు నిజంగానే నువ్వు మా దగ్గర ఏమైనా దాస్తున్నావా? మీ ఊరు వచ్చినప్పుడు కూడా నీ నుదుటన సింధూరం ఏంటి అని అడిగితే పూజ చేశాను అదే ఈ కుంకుమ అన్నావు మరి ఈరోజు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ నిలదీస్తుంది అరవింద్ తల్లి. ఆ ఒక్కటే కాదు అత్తయ్య తన రూమ్ లో తాళిబొట్టు దొరికినప్పుడు కూడా ఇలాగే సాంప్రదాయం అంటూ ఏదో చెప్పింది ఇలాంటి సాంప్రదాయాన్ని నేను ఎక్కడ చూడలేదు అంటుంది మాలిని.

ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది అందుకని మనం తప్పు పట్టకూడదు అంటుంది అరవింద్ వాళ్ళ పెద్దమ్మ. నేను తప్పు పట్టడం లేదు అంటే బయట వాళ్ళు ఎవరైనా ఇలాగే చూస్తే నిజంగానే తప్పుగా అనుకుంటారు అంటుంది మాలిని. నువ్వు ఇలా సైలెంట్ గా ఉంటే అర్థం ఏంటి మేము ఏమనుకోవాలి అంటూ గట్టిగా నిలదీస్తుంది. అత్తయ్య వాళ్ళు కూడా చెప్తున్నారు కదా పెళ్లి కాకుండా సింధూరం పెట్టుకోకూడదు అని అయినా సాంప్రదాయాలు పాటిస్తాను అంటే కుదరదు.

మల్లి నుదుట సింధూరాన్ని తుడిచేసిన మాలిని..

నీకు సింధూరం తుడుచుకోడానికి ఇబ్బందిగా ఉంటే నేను తుడుస్తాను అంటూ సింధూరన్ని తుడిచేస్తుంది మాలిని. నేను చేసిన పనికి నీకు బాధగా ఉండొచ్చు కానీ ఇలా చేయటమే నీకు, నాకు ఈ కుటుంబానికి కూడా చాలా మంచిది. నీ వైపు వీలైతే చూపించారు అంటే ఈ కుటుంబంలో ఉన్న అందరూ వైపు వేలెత్తి చూపించినట్లే ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు అంటూ వార్నింగ్ ఇస్తుంది మాలిని. ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది మల్లి. నన్ను క్షమించు తప్పు చేసింది నేనైతే నువ్వు బాధపడుతున్నావు అంటూ మల్లి ని క్షమాపణ అడుగుతాడు అరవింద్.

నావల్ల ఈ ఇంట్లో గొడవలు జరుగుతాయని నాకు తెలుసు అందుకే పోలీస్ స్టేషన్లో గొడవలు జరిగిన రోజు రాను అన్నాను. నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చారు, ఈరోజు కూడా బలవంతంగా మీరే సింధూరం పెట్టారు. అందరి ముందు నేను దోషుగా నిలబడితే మాలిని అక్క నా సింధూరని తుడిచేసింది ఇందులో మాలిన తప్పేమీ లేదు నా మంచి కోరుకుంటూనే సింధూరాన్ని తుడిచేసింది. ఇప్పుడు నాకు ఇంకొక భయం పట్టుకుంది.

నా చావే పరిష్కారం అంటున్న మల్లి..

సింధూరంని చూస్తేనే నన్ను అందరూ ఇలా మాట్లాడారు అలాంటిది మీరు నా మెడలో దాని కట్టారని తెలిస్తే ఇంకేమైనా ఉందా, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నేను ఎలాంటి సమాధానం చెప్పను, నా మెడలో తాళి తీయనివ్వును నా చావుతోనే ఈ సమస్యకి పరిష్కారం ఇస్తాను అంటుంది. అలా అనొద్దు అంటూ ఆమె నోరు మూసేస్తాడు అరవింద్. అలా జరగకూడదు అంటే ఒకటే దారి ఉంది నీ చేతులతో మీరే నా మెడలో తాళిని తీసేయండి అంటూ తాళిని చూపిస్తుంది.

ఆ మాటలకి షాక్ అయిన అరవింద్ నేను తీయను అంటాడు. ఇప్పుడు మీరు తీయకపోతే కొన్ని రోజుల తర్వాత అయినా కూడా ఇదే జరుగుతుంది తర్వాత మీ ఇష్టం అంటుంది మల్లి. మెడలో తాళి తీయడానికి ప్రయత్నించినప్పటికీ తీయలేక ఆమెని గట్టిగా హత్తుకొని అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు ఏం చేయాలో నేను ఆలోచిస్తాను మనల్ని కలిపిన సీతారాములే మన కథని ఎటువైపు తిప్పాలో దారి చూపిస్తారు అంటాడు అరవింద్.

మల్లిని ఇబ్బంది పెట్టిన సుందర్..

మరోవైపు సుందర్ వచ్చి నీతో మాట్లాడాలి అని మల్లి ని అడుగుతాడు. ఏం మాట్లాడాలి కానీ అడిగితే నీ పెళ్లి గురించి నువ్వు చాలా విషయాలు దాస్తున్నావు అంటాడు సుందర్. నాకు పెళ్లి అయిన విషయం అందరికీ ఎలా తెలుసు ఇప్పుడు ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తాడా అంటూ టెన్షన్ పడుతుంది మల్లి. నాకెలా అనుమానం వచ్చింది అని ఆలోచిస్తున్నావా ఇంటర్వ్యూలో పెళ్లయిందా అని నిన్ను అడిగినప్పుడు నువ్వు టెన్షన్ పడ్డావు నాకు అప్పుడే అనుమానం వచ్చింది నిజం చెప్పు నీకు పెళ్లయింది కదా అంటాడు.

నాకు పెళ్లి అయితే నీకెందుకు కాకపోతే నీకెందుకు అంటూ కోప్పడుతుంది మల్లి. ఈ రెండు వేళలో ఒక వేలు పట్టుకో నీకు పెళ్లి అయ్యిందో లేదో నేను చెప్పేస్తాను ఇలా నేను చెప్పింది ఏదీ తప్పు అవలేదు అంటాడు సుందర్. ఆ వేళ్ళని పట్టుకొని గట్టిగా తిప్పేస్తాడు అరవింద్. సార్ నొప్పిగా ఉంది వదిలేయండి అంటూ గోల పెడతాడు సుందర్. వేళ్ళు మెలి తిప్పితేనే ఎంత బాధ పడుతున్నావు అలాంటిది ఎదుటి వాళ్ళ జీవితంలో ఇంటర్ ఫియర్ అయితే వాళ్లకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది.

Malli February 7 Today Episodeసుందర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అరవింద్..

అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను తన జోలికి రావద్దని అయినా మళ్ళీ మళ్ళీ వస్తున్నావు ఇంకొకసారి మళ్లీ జోలికి వస్తే చంపేస్తాను అంటూ హెచ్చరించి వదిలేస్తాడు. అరవింద్ కి మల్లికి సారీ చెప్పి మరి ఎప్పుడు ఇంటర్ ఫియర్ కాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుందర్. మరోవైపు కింద అంత జరుగుతున్న అరవింద్ ఏమీ మాట్లాడకుండా చూస్తూనే ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు అంటూ ఆలోచనలో పడుతుంది మాలిని.

అంతలోనే అక్కడికి వచ్చిన అరవింద్ కామ్ గా పడుకుండిపోతాడు. నువ్వు ఎందుకిలాగా బిహేవ్ చేస్తున్నావు మళ్ళీ చేసింది తప్పు అని అందరూ తప్పుపట్టారు ఒక్క నువ్వు తప్ప, మళ్లీ మీ బాధ్యత అని చెప్తావు కదా మరి మళ్లీ ముగిటి మీద సింధూరంతో కనబడితే అందరికంటే ముందుగా నువ్వే కదా తప్పని చెప్పాలి ఎందుకు చెప్పలేదు అంటూ నిలదీస్తుంది.

తరువాయి భాగంలో అరవింద్ బాబు ఎదురుగానే మాలిని అక్క సింధూరాన్ని తుడిచేసింది ఈ ఇంట్లో ఉన్నాను నేను సింధూరాన్ని పెట్టుకొని అని అనుకుంటుంది మల్లి. అది చూసిన అరవింద్ ఇలా ఇంకెన్నాళ్లు ఇప్పుడు మీకు కావలసింది ధైర్యము సింధూరం నీ నుదుటను ఉంటే అది నీ దగ్గర ఉన్నట్టే అంటూ మళ్లీ ఆమె నుదుటన సింధూరం పెడతాడు.