Malli January 11 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో రేపు మా చైర్మన్ గారితో కన్ఫర్మ్ చేస్తాను అంటాడు అరవింద్. అంతలోనే వెయిటర్ ఫింగర్ బోల్ తేవటంతో మల్లి చేసిన పిచ్చి పని తలుచుకొని నవ్వుతాడు అరవింద్. ఎందుకు నవ్వుతున్నావు అని మాలిని అడిగితే ఏదో ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది అంటాడు అరవింద్. నేను హర్ట్ అయ్యాను నన్ను ఎదురుగా ఉంచుకొని నువ్వు ఇంకెవరినో గుర్తు తెచ్చుకోవడం ఏంటి అంటుంది మాలిని.
తనకి అలాంటి జ్ఞాపకం కావాలంటున్న మల్లి..
నువ్వు అన్నది నిజమే మాలిని ఏ పని చేస్తున్నా నాకు మల్లి గుర్తొస్తుంది అనుకుంటాడు అరవింద్. బయటికి మాత్రం మాలినీకి సారీ చెప్తాడు. సీన్ కట్ చేస్తే మల్లిని పిలుస్తారు అనుపమ వాళ్లు. ఎందుకమ్మా పిలిచారు అని అడిగితే దీన్ని గోడకు తగిలించాలి అంటుంది అనుపమ. ఏంటమ్మా గారు ఇది అని మల్లి అడిగితే మొన్న మాలిని వాళ్ళ నాన్నమ్మ గారు చెప్పారు తనకి ఇష్టమైన ఫోటో కాలిపోయిందని అందుకే ఆ ఫోటోని ఎంలార్జ్ చేయించి ఫ్రేమ్ కట్టించాను అంటూ వాళ్ళ పెళ్లి ఫోటో చూపించి ఎలా ఉంది అని అడుగుతుంది అనుపమ.
ఆ ఫోటో చూసిన మల్లి షాక్ అయి చూస్తూ ఉండిపోతుంది. ఏమ్మా నచ్చలేదా అలా ఉండి పోయావు అంటుంది సుమిత్ర. అలా ఏం లేదు అమ్మగారు చాలా బాగుంది అంటుంది మల్లి. మల్లికి నచ్చితే మాలిని కి కూడా నచ్చేస్తుంది వెళ్లి గోడకి తగిలించు అంటుంది అనుపమ. గోడకి తగిలిస్తూ నేను బాబు గారు ఇంత ఆనందంగా పెళ్లి చేసుకోలేదు కానీ పెళ్లి మాత్రం అయిపోయింది ఇలాంటి జ్ఞాపకం నాకు కూడా ఒకటి ఉంటే బాగున్ను అనుకుంటుంది. కిందకి దిగిన మల్లి తో మాలినీకి చెప్పొద్దు తను వచ్చిన వెంటనే ఆ ఫ్రేమ్ చూస్తుందో లేదో చూద్దాం అనుకుంటారు ముగ్గురు.
మల్లి ని ఆట పట్టిస్తున్న అరవింద్..
మాలినికి ఏదో స్పెషల్ చేయాలని వంట గదిలోకి వెళ్ళిపోతారు అనుపమ వాళ్ళు. ఆ క్షణం ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించినా మల్లి, పింకీ దగ్గరికి వెళ్లి డ్రాయింగ్ పేపర్ అడుగుతుంది. పేపర్ ఎందుకు బొకే తీసుకో నాకు తర్వాత ఇవ్వు అంటూ తన బుక్ ఇస్తుంది పింకీ. తన గదికి తీసుకొని వెళ్లి వాళ్ళ పెళ్లి ఫోటోని డ్రాయింగ్ గా వేస్తుంది. అంతలోనే అక్కడికి వచ్చిన అరవింద్ ఎం చేస్తున్నావు అని అడుగుతాడు.
డ్రాయింగ్ వేసుకుంటున్నాను అని మల్లి అంటే చూపించమంటాడు అరవింద్. ఇప్పుడు చూపించను సర్ప్రైజ్ అంటుంది మల్లి. నీ వాలకం ఏదో తేడాలాగా ఉంది చూపించు అంటాడు అరవింద్. మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారు వెళ్ళండి అంటుంది మల్లి. నన్ను పిచ్చివాడిని చేస్తున్నావా, పిలిస్తే నాకు వినిపిస్తుంది అయినా అంతలా దాస్తున్నావెందుకు చూపించు అంటాడు అరవింద్. చూపించు అంటూ మల్లి వెనక పడతాడు అరవింద్.
నేను బాడ్ బాయ్ అంటున్న అరవింద్..
ఇలా ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం తప్పు అంటే నేను బ్యాడ్ బాయ్ ని అయినా పర్వాలేదు చూపించు అంటాడు అరవింద్. నేను చూపించను అంటే చూపించను తర్వాత చూపిస్తానంటున్నాను కదా అంటుంది మల్లి. సరే నీ ఇష్టం అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అరవింద్. చూపించమంటే చూపించలేదని చిరాకు వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు అనుకుంటుంది మల్లి. సీన్ కట్ చేస్తే ఆలోచనలో ఉన్న మీరా దగ్గరికి వచ్చిన ప్రకాష్ ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు.
మల్లి గురించే ఆలోచిస్తున్నాను నువ్వు మల్లి ని ఆ ఇంట్లో దిగబెట్టి వచ్చిన దగ్గరనుంచి ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు. చాలా రోజుల తర్వాత అత్తగారింటికి వెళ్ళింది కదా కబుర్లు చెప్తూ ఉండిపోయింది ఏమో అంటాడు ప్రకాష్.అందుకే నేనే ఫోన్ చేశాను ఒకసారి ఏమో మళ్లీ నిద్ర పోయిందని చెప్పారు నేను ఏమో అసలు ఫోనే ఎత్తలేదు అంటుంది మీరా. వాళ్ల దగ్గర ఉంటేనే కదా నీతో మాట్లాడించడానికి సమాధానం చెప్పలేక ఫోన్ ఎత్తడం లేదు అనుకుంటాడు ప్రకాష్.
ప్రకాష్ ని అపార్థం చేసుకున్న మీరా..
రెండు రోజుల్లో తనే ఫోన్ చేస్తుందిలే అంటాడు ప్రకాష్. అమ్మో రెండు రోజులు వరకునా నేను ఆగలేను. అవునా పల్లెటూళ్ళకిసంక్రాంతి అంటే పెద్ద పండుగ మళ్లీ ఉంటే నానా హడావుడి చేసేది, వాళ్లని పండగకి పిలుద్దాము అంటే వాళ్ళు వెళ్లి రెండు రోజులే అయింది అందుకే ఈసారి సంక్రాంతికి మనమే వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటుంది మీరా. వాళ్లు పిలవకుండా వాళ్ళ ఇంటికి వెళ్తే బాగోదేమో అంటాడు ప్రకాష్. వాళ్లు ఏమనుకున్నా పర్వాలేదు మనం వెళ్దాం నాకు మల్లిని చూడాలని ఉంది అంటుంది మీరా.
ప్రకాష్ ఏదో అంటుంటే నువ్వు ఎన్ని చెప్పినా వినను అయినా నేను వెళ్ళేది పరాయి వాళ్ళ ఇంటికి కాదు కదా నా కూతురు ఇంటికే కదా అంటుంది. అసలు మల్లి ఆ ఇంటికి పోలేదు నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అనుకుంటాడు ప్రకాష్. బయటికి మాత్రం ఏదో చెప్పబోతుంటే నాకు అర్థమైంది నీకు రావడం ఇష్టం లేదు మళ్లీ మీద ఇంకా ప్రేమను పెంచుకుంటున్నావా అంటుంది మీరా. అలాంటిదేమీ లేదత్త అంటాడు ప్రకాష్. అయినా నేను ఒక్కదాన్నే వెళ్తాను పోయినసారి బాపూతో వెళ్ళినప్పుడు చూశాను అంటుంది.
కొడుకుని వారిస్తున్న అనుపమ..
నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అదేదో రేపే తెలుస్తుంది అత్త మొండిగా ఉంది ఒక్కతే పెళ్లి ఇబ్బంది పడే బదులు నేను కూడా తోడుగా వెళ్తాను అనుకొని అదే విషయాన్ని మీరా తో చెప్తాడు. సరే అంటూ బట్టలు సర్దడానికి వెళుతుంది మీరా. సీన్ కట్ చేస్తే మాలిని వాళ్ళ ఇంటికి వస్తారు అరవింద్ వాళ్ళు. పలకరింపులు అయిపోయిన తర్వాత పింకీ ని పలకరిస్తాడు శరత్ చంద్ర. ఎప్పుడు ఫోన్ లోనే ఆట్లాడతావా అని అడిగితే, లేదు నేను కూడా మీకులాగే డ్రాయింగ్లు వేస్తున్నాను అంటుంది పింకీ.
నాకు చూపిస్తావా అని అడిగితే వాళ్ల నానమ్మ పర్మిషన్ అడుగుతుంది పింకీ. దానికోసం పర్మిషన్ ఎందుకు చూపించు అంటుంది సుమిత్ర. అదే సమయంలో డ్రాయింగ్ వేస్తున్న మల్లి దగ్గర డ్రాయింగ్ లాగేసుకుంటాడు అరవింద్. నా డ్రైవింగ్ తో నీకేం పని ఇచ్చేయండి అంటే ఇవ్వను కావాలంటే లాక్కో అంటాడు అరవింద్. అంతలోనే అనుపమ, అరవింద్ ని పిలిచి మాలిని వాళ్ళ అమ్మానాన్న వచ్చారు అని చెప్తుంది.
భయంతో వణికిపోతున్న మల్లి..
తర్వాత వచ్చి నీ పని చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అరవింద్. తను డ్రాయింగ్ పేపర్ బుక్ లో పెట్టి రాక్ లో పెట్టేస్తుంది మల్లి. మాలిని తన తల్లిదండ్రులని విష్ చేస్తుంది. మల్లి వచ్చి వాళ్ళ కాళ్ళకి దండం పెడుతుంది. శరత్ చంద్ర బ్లెస్స్ చేస్తాడు, కానీ వసుంధర మాత్రం దూరంగా ఉండు అంటుంది. వెళ్ళిపోతున్న మల్లిని నువ్వు ఆశీర్వచనం తీసుకోవాలనుకునేటప్పుడు ముందు వాళ్లకి ఎదుటి వాళ్ళు బాగోవాలనే మనస్తత్వం ఉందో లేదో తెలుసుకో అంటాడు అరవింద్. నువ్వు నన్ను ఎప్పుడు అపార్థం చేసుకుంటావు అంటుంది వసుంధర.
Malli January 11 Today Episode:
లేదత్తయ్య గారు అర్థం చేసుకున్నాను మీరు డబ్బు ఉంటేనే ఎవరినైనా ఆశీర్వదిస్తారు, మాట్లాడుతారు. డబ్బుంటేనే అన్ని వస్తాయి అని అనుకుంటారు అంటూ ఇంకా ఏదో అనబోతుంటే అనుపమ వారిస్తుంది. ఇంతలో పింకీ తన డ్రాయింగ్ బుక్ ని తీసుకొని వచ్చి శరత్ చంద్ర కి ఇస్తుంది. ఆ బుక్ ని చూసి మల్లి షాక్ అయిపోతుంది. అందులో నేను గీసిన బొమ్మ ఉంది అసలే పక్కన వసుంధర అమ్మగారు ఉన్నారు చూసేస్తారో ఏంటో అని కంగారు పడుతుంది. డ్రాయింగ్స్ చూస్తున్న శరత్ చంద్ర పింకీ ని మెచ్చుకుంటాడు.
ఇప్పుడు అందరూ చూస్తారు ఏమో ఎందుకిలా గీసేవ అని అడిగితే ఏం చెప్పాలి అంటూ టెన్షన్ పడిపోతుంది మల్లి. అంతలోనే టైం చూసిన పింకీ నాకు ఆన్లైన్ క్లాస్ కి టైం అయిపోతుంది మిగతావి తర్వాత చూపిస్తాను అంటూ ఆ బుక్ తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ ఆ బుక్ లోంచి ఆ డ్రాయింగ్ పేపర్ పడిపోతుంది. అది అటు అరవింద్, ఇటు మల్లి ఇద్దరూ గమనించి కంగారు పడతారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.