Malli January 16 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పిల్లల జాతకాల్ని ఆయనకి చూపిద్దాం ఏమంటారో చూద్దాం అంటుంది వసుంధర. సరే అంటూ అందరూ లోపలికి వెళ్ళిపోతారు. మరోవైపు మల్లిని వెతుక్కుంటూ మీరా, మీరా ని వెతుక్కుంటూ ప్రకాష్ బయలుదేరుతారు. మల్లి వెళ్లిన కారు ఇటువైపే కదా వచ్చింది, సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి నాకు మల్లి వాళ్ళు కనిపించేలాగా చూడు.

మల్లి కోసం వెతుకుతున్న మీరా..

మల్లి మహారాణి లాగా ఆనందంగా ఉండడం నేను చూడాలి వాళ్లకి నా చేతులతో బట్టలు ఇవ్వాలి. వాళ్లని కలవకుండా నేను ఊరు వెళ్ళేది లేదు, క్రితం సారి కూడా వాళ్లని కలవకుండా కుదరలేదు అనుకుంటూ మల్లి ని వెతకటానికి వెళ్ళిపోతుంది మీరా, మల్లి ని వెతుక్కుంటూ ఎటో వెళ్లిపోయింది అత్త,ఎటు వెళ్లిందో అని కంగారుగా ఆమెని వెతుకుతుంటాడు ప్రకాష్.

సీన్ కట్ చేస్తే నీ భర్తకి నువ్వే స్నానం చేయించు, ఈరోజు నీకు ఎవరు సాయం చేయకూడదు, ప్రతిదీ భార్య చేతుల మీదుగానే జరగాలి అంటుంది బామ్మ. అలాగే నానమ్మ మా ఆయనకి నేనే చేస్తాను అంటూ అరవింద్ కి స్నానం చేస్తుంటే అరవింద్ మల్లి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడు. అలా వాళ్లని అలా చూసినా మల్లి కాస్త బాధ పడుతుంది. అది గమనించిన వసుంధర ఇదేంటి ఉన్నట్టుండి మాడు మొహం పెట్టుకుంది అంటూ వేడి నీళ్లు తెమ్మని పంపించేస్తుంది.

బాబు గారిని ఎలాగైనా నమ్మించాలి అనుకుంటున్న మల్లి..

ఆ నీళ్లు తెచ్చిన మల్లి అనుకోకుండా అరవింద్ మీద నీళ్లు ఒంపేస్తుంది. ప్రతిదీ భార్య చేతుల మీదుగానే జరగాలి అన్న బామ్మ మాటలు గుర్తు తెచ్చుకుంటాడు అరవింద్. చాలా రోజుల తర్వాత మాలిని అక్క చాలా సంతోషంగా ఉంది వాళ్ళ మధ్యలో నేను ఎప్పుడు రాకూడదు బాబు గారు కూడా కలవలే నా జీవితం నాశనం అయిందని బాధపడుతున్నారు. అలా కాదు నేను బానే ఉన్నానని బాబు గారిని నమ్మించాలి అనుకుంటుంది మల్లి.

ఈ వాతావరణం చూస్తుంటే మన ఇంటి దగ్గర ఉన్నట్టుగానే ఉంది అదే అక్కడ ఉండి ఉంటే కొత్త బట్టలు తెచ్చి నానా హడావిడి చేసే దానివి అంటూ తల్లిని తలుచుకుంటుంది మల్లి. అంతలోనే అక్కడికి వచ్చిన అరవింద్ ఏం చేస్తున్నావని అడుగుతాడు. నీ బట్టల్లో మీరు చాలా బాగున్నారు ఇవేనా వసుంధర అమ్మగారు పెట్టినవి అని అడుగుతుంది మల్లి.

జరగని వాటి గురించి ఆలోచించను అంటున్న మల్లి..

మీ ఊర్లో ఉండి ఉంటే మీ అమ్మగారు కూడా పెట్టేవారు కదా అని అరవింద్ అంటే ఇంత ఖరీదైనవి పెట్టి ఉండరు లేండి బాబు అంటుంది మల్లి. అభిమానం ముఖ్యం ఖరీదు కాదు అంటాడు అరవింద్. నీతో పాటు మీ ఊర్లో పండగ చేసుకోలేను ఎందుకు బాధగా ఉన్నావు కదా అంటాడు అరవింద్. లేకుండా ఎలా ఉంటుంది బాబు కానీ అది మీకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడతాను అనుకుంటుంది మల్లి.

మౌనంగా ఉన్నావేమి అని అరవింద్ అడిగితే జరగని దాని గురించి ఆలోచించను పూజకు టైం అయిపోతుంది రండి అని లోపలకి తీసుకెళ్ళి పోతుంది. మరోవైపు గురువుగారికి దంపతులు ఇద్దరి చేత నమస్కరించి చేయించి మీరు లేనప్పుడు వీళ్ళకి వెళ్లి చేయవలసి వచ్చింది గురువుగారు ఇప్పటివరకు మీరు చెప్పి నేను చెప్పినట్లుగా జరిగాయి ఇప్పుడు వాళ్ళ జాతకాలు చెప్పండి అంటుంది వసుంధర.

కన్ఫ్యూజన్లో వసుంధర..

అరవింద్ చేతిలో మాలిని చేయి పెట్టి పూజ చేయిస్తారు పంతులుగారు. మల్లి మంగళహారతి పాడటంతో ఇంతటితో పూజ ముగిసింది అందరూ దండం పెట్టుకోండి అని చెప్తారు గురువుగారు. మాలిని జాతకం చూసిన గురువుగారు నీ ప్రేమే నీ బలము బలహీనత నువ్వు బాగా ఇష్టపడిన వాళ్లే నీ కన్నీటికి కారణం అవుతారు, మీది అనుకున్నది మీకు దక్కనప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి.

నా మాటలకి కంగారు పడకు మీ జీవితం కాలం నిర్ణయించినట్లే ముందుకు వెళుతుంది. నీలో మార్పు వస్తే అది నీకే మంచిది కాదు అంటారు గురువుగారు. మీ మాటలు నాకు అర్థం కావటం లేదు నా కూతురు జీవితం లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతుంది వసుంధర. గుజరాత్ లో ఎవరూ పూర్తిగా అంచనా వేయలేరు అంటారు గురువుగారు. అంతిమంగా ఎప్పుడు ప్రేమే గెలుస్తుంది మాలినికి అదే శ్రీరామరక్ష అంటారు గురువుగారు.

Malli January 16 Today Episode: అసలు నిజం చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన గురువుగారు..

అరవింద్ జాతకం చూసిన గురువుగారు షాక్ అవుతారు. మాలిని నేను చెప్పేది నీ మనసుకి బాధ కలిగించే విషయం, నేను చెప్పే మాట వల్ల నీకు నీ భర్తకు మధ్య దూరం పెరగవచ్చు. కానీ నేను చెప్పేది అక్షర సత్యం అంటారు గురువుగారు. ఆ మాటకి కుటుంబ సభ్యులందరూ షాక్ అయిపోతారు.

అరవింద్ జీవితంలో నీతో పాటు మరొక అమ్మాయి కూడా స్థానం ఉంది అని చెప్తాడు. తరువాయి భాగంలో వసుంధర కోపంతో నా కూతురి మీద ప్రేమని మరొకటితో పంచడం మొదలు పెట్టాడు మాలిని అడుగు నీ భర్తని అంటుంది వసుంధర. అందరి మధ్యలోనే మా మామ్ భయాన్ని పోగొట్టాలి అనుకుంటున్నాను నా మీద ఒట్టేసి నీ జీవితంలో ఇంకొకరు లేరని చెప్పు అంటుంది మాలిని.