Malli January 3 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మల్లిని తీసుకొచ్చిన వార్డెన్ శరత్చంద్ర ని చూపించి ఇతను నిజంగానే మీ నాన్న అని అంటుంది. శరత్ చంద్రుని చూసిన షాక్ లో ఏమీ మాట్లాడలేక పోతుంది మల్లి. తడబడుతూ అవును మేడం అంటుంది. సరే త్వరగా మాట్లాడి రా అంటూ వెళ్ళిపోతుంది వార్డెన్. నేను అబద్ధం చెప్పానని అనుకుంటున్నావా కానీ నేను చెప్పింది నిజం నాకు నిన్ను చూస్తుంటే నా కూతురనే అనిపిస్తుంది.

మల్లి ని క్షమించమన్న శరత్ చంద్ర..

అందుకే మీ వార్డెన్ పదేపదే మీరు ఏమవుతారు అని అడిగితే వెంటనే అవుతాను అని చెప్పాను ఒకవేళ తప్పయితే క్షమించు అంటాడు శరత్ చంద్ర. అంత మాట అనకండి అయ్యగారు కన్నతండ్రి ప్రేమ ఎలా ఉంటుందో మిమ్మల్ని చూసాకే తెలిసింది. నాలాంటి పేద ఇంటి అమ్మాయిని పలకరించడానికి ఎవరు ఇష్టపడరు అలాంటిది మీరు నన్ను నాన్న అని పిలవమంటున్నారు అది మీ గొప్పతనం అంటుంది మల్లి.

గొప్పతనం కాదు చేతకానితనం అనుకుంటాడు శరత్ చంద్ర. నేను ఇక్కడ ఉన్నానని అరవింద్ బాబు చెప్పారా అంటుంది మల్లి. అవును, అయినా నువ్వు ఎక్కడ ఉన్నావు ఎందుకు, అరవింద్ వల్ల ఇంట్లో ఉంటే వాళ్ళందరూ నిన్ను ఇంట్లో మనిషి లాగా చూసుకుంటారు. నీ చదువుకి భార్గవ్ గారు అరవింద్ మాలిని అందరూ హెల్ప్ చేస్తారు కదా అంటాడు శరత్ చంద్ర. నిజమే కానీ నేను అక్కడ ఉండలేను బాబు అంటుంది మల్లి.

కూతురికి బ్రెయిన్ వాష్ చేస్తున్న వసుంధర..

ఎందుకు అని అడుగుతాడు శరత్ చంద్ర. అరవింద్ బాబు, మాలిని అక్క ల మధ్య నేను అడ్డుగోడుగా ఉండలేను బాబు అని మనసులోనే అనుకుంటుంది మల్లి. మరోవైపు కార్లో ఉన్న వసుంధర మగవాళ్ళందరూ ఒకటే, వీళ్ళకి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చేతకాదు కాని బయట వాళ్ళని ఉద్ధరించడానికి బయలుదేరుతారు. మీ నాన్న అరవింద్ ఇద్దరూ ఒకే లాంటి మనుషులు. నీ జీవితం నా జీవితంలో కాకూడదని నీకు చెప్తున్నాను అంటుంది వసుంధర.

నాకు ఒక అనుమానం మీ ఆయనకి ఆ మళ్ళీ ఫోన్ చేసిందేమో తనని కలవడానికి వెళ్ళాడేమో అంటుంది వసుంధర. అలానే అనుకుందాం అయినా నాకు చెప్పకుండా వెళ్ళవలసిన అవసరం ఏముంది అంటుంది మాలిని. అదే మగబుద్ధి అంటుంది వసుంధర. ప్లీజ్ ఇంకేమీ మాట్లాడకు నా మైండ్ సెట్ మారిపోతుంది అంటుంది మాలిని. మరోవైపు మల్లిని తన రూమ్మేట్ ఫాస్ట్ గా వచ్చి ఐరన్ చెయ్యు నేను బయటికి వెళ్ళాలి అంటుంది.

నిజం తెలుసుకొని షాక్ అయిన శరత్ చంద్ర..

తను ఐరన్ చేయడమేంటి అంటే మేము డబ్బులు ఇస్తున్నాము తను ఐరన్ చేస్తుంది ఐరన్ తో పాటు ఇంకా చాలా పనులు చేస్తుంది అంటారు వాళ్ళు.ఆ మాటలు విని షాక్ అవుతాడు శరత్ చంద్ర. అప్పుడు మీ అమ్మకి అన్యాయం చేశాను ఇప్పుడు నీకు న్యాయం చేయలేకపోతున్నాను నన్ను క్షమించు అని మనసులో అనుకుంటాడు శరత్ చంద్ర. బయటికి మాత్రం ఏంటి మల్లి ఇదంతా, చదువుకోడానికి వచ్చాను అన్నావు ఈ పనులేంటి అని అడుగుతాడు.

నాకు డబ్బులు ఇచ్చి చదువుకోమని చెప్పే తండ్రి లేడు, నన్ను చదివించే స్తోమత అమ్మకి లేదు, చదువు కోసం అమ్మ డబ్బులు అడిగితే నకిలీ చంపేస్తుంది అందుకే నా చదువు కోసం నేనే డబ్బులు సంపాదించుకుంటున్నాను అంటుంది మల్లి. అరవింద్ డబ్బులు ఇస్తానంటే ఎందుకు తీసుకోలేదు అని అడుగుతాడు. ఆయనకి నాకు ఏం సంబంధం ఉంది అందుకే తీసుకోలేదు అంటుంది మల్లి. అంతలోనే అటువైపుగా వచ్చిన వసుంధర వాళ్ళు శరత్ చంద్ర కారును చూసి వాళ్ల కారుని ఆపుతారు.

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన శరత్ చంద్ర..

కారు దిగి చుట్టూ చూస్తే లేడీస్ హాస్టల్ దగ్గర శరత్ చంద్ర కనబడతాడు. అదే సమయంలో శరత్ చంద్ర కూడా భార్యని కూతురిని చూసి షాక్ అవుతాడు. తను ఎక్కడికి ఎందుకు వచ్చింది మల్లి ఇక్కడ ఉన్నట్టు వసుకి తెలుసా అని అనుకుంటాడు. భర్త దగ్గరికి వచ్చిన వసుంధర అని నువ్వేంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. మేము అడగవలసిన ప్రశ్నని మీరే ముందు అడుగుతున్నారు చాలా తెలివైన వాళ్ళు అంటుంది. మీకు ఇక్కడేం పని అంటుంది వసుంధర.

మా ఫ్రెండ్ కూతురు ఎక్కడ చదువుతుంది డబ్బు ఇచ్చి రమ్మంటే ఇక్కడికి వచ్చాను అంటాడు శరత్ చంద్ర. నిజం చెప్తున్నారా నాకెందుకు అనుమానంగా ఉంది అంటూ చుట్టుపక్కల పరిశీలిస్తుంది. వసుంధరిని చూసిన మల్లి ఆమెకి కనబడకుండా దాక్కుంటుంది. మామ్ ఇక్కడ అనవసరంగా గొడవ పెట్టుకునే లాగా ఉంది అంటూ తల్లిని వెనక్కి పిలిచి నాకు కాలేజీకి టైం అవుతుంది త్వరగా రమ్మంటుంది మాలిని. వేరే దారి లేక వెనక్కి వచ్చేస్తుంది వసుంధర.

తన నిర్ణయాన్ని చెప్పి తండ్రికి షాక్ ఇచ్చిన మల్లి..

వాళ్లు వెళ్లిపోవడం చూసిన మల్లి చూశారా నావల్ల అందరికీ సమస్యలే, అందుకే ఎక్కడికి ఎప్పుడు రావద్దు అంటూ చేతులు జోడిస్తుంది. నేను ఇక్కడే ఉంటాను ఎవరు పిలిచినా రాను అంటూ కచ్చితంగా చెప్తుంది. ఈ డబ్బు ఉంచుకో అంటూ కొంత డబ్బు ఇస్తాడు శరత్ చంద్ర. కానీ మల్లి తీసుకోవటానికి ఇష్టపడకపోతే వార్డెన్ ని పిలిచి ఆ డబ్బు ఆమెకి ఇచ్చి తనకి ఏ లోటు లేకుండా చూసుకోండి ఎవరీ మంత్ ఫీజు నేనే పే చేస్తాను అని చెప్తాడు.

అతను చూపిస్తున్న ప్రేమకి ఏడ్చేస్తుంది మల్లి. మరోవైపు ఆ మాలిని వల్ల మూడు నెలలు నేను జైల్లో చెప్పకూడదు తినాల్సి వచ్చింది. నేను ఈరోజు చేసే పనికి అది పక్క వాళ్ళ విషయాల్లో అనవసరంగా తల దూర్చుటమే కాదు అసలు ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టలేదు అంటాడు ఒక వ్యక్తి. అసలు ఏం జరిగింది అంటాడు మరో వ్యక్తి. అప్పుడు జరిగింది చెప్తాడు మొదటి వ్యక్తి. తను ఒక వ్యక్తిని ఇవ్విటీజింగ్ చేయబోతుంటే మాలిని అతన్ని పోలీసులకు పట్టిస్తుంది.

మాలినికి పొంచి ఉన్న ప్రమాదం..

కోపంతో రగిలిపోయిన వ్యక్తి మాలినీకి నన్నే పోలీసులకి పట్టిస్తావా నీ సంగతి చూస్తాను అంటాడు. నా ముందే వార్నింగ్ ఇస్తావా నీకు పోలీసులంటే ఏంటో చూపిస్తాను అంటాడు ఎస్ఐ. ఇంకొక మూడు నెలలు ఈ అమ్మాయికి స్టడీ స్ఫూర్తి అవుతుంది అప్పటివరకు వీడిని బయటికి రాకుండా చూసుకోండి అంటుంది మాలిని. ఇదంతా చెప్పిన వ్యక్తి ఎప్పుడు నేను జైల్లో నుంచి బయటకు వస్తాను ఎప్పుడు మాలిని అంతు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను.

అది ఒంటరిగా దొరకాలి దానికి జీవితమే లేకుండా చేస్తాను అంటాడు ఆ వ్యక్తి. అంతలోనే కారులోంచి దిగిన మాలిని చూసి అదే మాలిని అంటే అంటూ పక్కనున్న వ్యక్తి చూపిస్తాడు. సూపర్ ఫిగర్ అంటాడు రెండో వ్యక్తి. కాలేజీలోకి వెళ్ళబోతున్న మాలిని వెనక్కి పిలిచి నిన్ను కాలేజీలో వదిలే టైం మీ ఆయనకి లేదు అందుకే నీకోసం ఒక కారు తీసుకుంటాను అంటుంది వసుంధర. అలా తీసుకోడు అరవింద్ కి ఇష్టం ఉండదు ఏమీ అనుకోకు అంటూ ఆ ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తుంది మాలిని.

Malli January 3 Today Episode:  సత్య కోసం ఎదురుచూస్తున్న మీరా..

లోపలికి వెళ్ళిపోయిన మాలిని చూసి ఛాన్స్ మిస్ అయింది అనుకుంటాడు మొదటి వ్యక్తి. వచ్చేటప్పుడు దొరుకుతుంది కదా అప్పుడు దాని సంగతి చూద్దాం, అప్పుడు నేను కూడా ఒక చెయ్యి వేస్తాను అంటాడు రెండో వ్యక్తి. మరోవైపు సత్య కోసం ఎదురుచూస్తున్న మీరా, సత్యాన్ని తీసుకొస్తానని ప్రకాష్ పొద్దున్న అనగా వెళ్ళాడు ఇప్పుడు వచ్చి రాలేదు అంటే సత్యకి ఇంకా నామీద కోపం పోలేదా అని అనుకుంటుంది.

అంతలోనే వచ్చిన ప్రకాష్ ని సత్య రాలేదా అని అడుగుతుంది. లేదు ఏదో పని ఉందట అంటాడు ప్రకాష్. పని ఉంది కాదు నామీద కోపం అంటుంది మీరా. సత్య నాకు నా బిడ్డకి చాలా అండగా నిలబడ్డాడు, తన జీవితాన్ని మా కోసం వదులుకున్నాడు అలాంటి సత్యం మీద చేయి చేసుకోవడం నేను చేసిన తప్పే అంటుంది మీరా. తరువాయి భాగంలో మల్లి, మాలిని ఇద్దరు ఒక తండ్రి పిల్లలు వాళ్ళిద్దర్నీ నా జీవితంలోకి ఎందుకు ప్రవేశపెట్టారు అంటూ దేవుడి దగ్గర ఏడుస్తాడు అరవింద్.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 3, 2023 at 11:25 ఉద.