Malli January 5 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఏడుస్తూ ఇంటికి వచ్చిన మాలినిని చూసి భయపడుతుంది అనుపమ. ఏమైంది అంటూ కంగారుగా అడుగుతుంది. ఈలోగా రూప ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తుంది. కుటుంబ సభ్యులందరూ హాల్లోకి వస్తారు. అరవింద్ ని పట్టుకొని ఏడుస్తుంది మాలిని. మాలిని ని అలా చూసి అరవింద్ కూడా కంగారు పడిపోయి ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు జరిగిన గొడవ గురించి చెప్తుంది మాలిని.

ఇంట్లో వాళ్ళని బ్రతిమాలుతున్న మాలిని..

ఇంటికి వచ్చేసావు కదా భయపడకు అంటూ ధైర్యం చెప్తాడు అరవింద్. వాళ్లని మళ్లీ చూస్తే గుర్తుపడతావు కదా అంటాడు అరవింద్. గుర్తుపడతాను అంటుంది మాలిని. సరే నేను చూసుకుంటాను అంటాడు అరవింద్. ఇంట్లో వాళ్ళందరూ కూడా రౌడీలని వదిలిపెట్టొద్దు అంటూ అరవింద్ కి చెప్తారు. సరే పైకి వెళ్లి రెస్ట్ తీసుకో ఈ లోపు అరవింద్ పోలీసులతో మాట్లాడుతాడు అంటుంది సుమిత్ర. ఈ విషయం వసుంధర గారికి కూడా చెబుదాం అంటుంది అనుపమ.

వద్దు కంగారు పడతారు అని మాలిని అంటే రేపు ఎప్పుడైనా తెలిస్తే మీ అమ్మగారు నన్ను తిడతారు అంటుంది అనుపమ. మనలో ఎవరైనా చెప్తేనే కదా తెలుస్తుంది, చెప్పొద్దయ్య అంటూ రిక్వెస్ట్ చేస్తుంది మాలిని. మరోవైపు పోలీస్ జీప్ లో వచ్చిన మల్లిని చూసి వార్డెన్ కంగారు పడుతుంది. ఇదేంటి పోలీస్ జీప్ లో వచ్చింది ఏం పని చేసిందో ఏంటో అంటూ కంగారు పడుతుంది.

మల్లి డీటెయిల్స్ అడుగుతున్న ఎస్ఐ..

హాస్టల్ వార్డెన్ తో మల్లిని చూపించి ఈ అమ్మాయి మీకు తెలుసా అని అడుగుతాడు పోలీస్. తెలుసు సార్ ఏమైంది అని అడుగుతుంది వార్డెన్. ఈ అమ్మాయి నడిరోడ్డు మీద ఒక వ్యక్తి తల పగలగొట్టింది, ఈ అమ్మాయి డీటెయిల్స్ ఇవ్వండి అంటాడు పోలీసు. ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏవి లేవు సార్ అంటుంది వార్డెన్. ఏ డీటెయిల్స్ లేకుండా ఎలా జాయిన్ చేసుకున్నారు ముందు మిమ్మల్ని లాక్ అప్ లో వేయాలి అంటాడు పోలీస్.

తన దగ్గర ఏ డీటెయిల్స్ లేవని బ్రతిమిలాడింది సార్ జాలి అనిపించి జాయిన్ చేసుకున్నాను మళ్లీ వచ్చేటప్పుడు డీటెయిల్స్ అన్ని తీసుకొని రమ్మని చెప్పాను అంటుంది వార్డెన్. ఈ అమ్మాయి కోసం ఎవరు రాలేదా అంటాడు పోలీసు. జాయిన్ చేసినప్పుడు మాకు అతను మధ్యలో మరొక అతను నిన్ననే తండ్రి అంటూ ఇంకెవరో వచ్చారు అంటుంది వార్డెన్. మరి ఎవరు లేరని చెప్పింది అంటాడు ఎస్ఐ. వాళ్ళు ఎవరో చెప్పు అంటూ నిలదీస్తుంది వార్డెన్.

వార్డెన్ ని హెచ్చరించిన ఎస్సై..

ఇప్పుడు వాళ్లలో ఎవరి సంగతి చెప్పిన నేను అరవింద్ బాబు దాచిన నిజం బయటపడిపోతుంది వాళ్ళు ఎవరు సంగతి బయట పెట్టకూడదు అంటూ వాళ్ల డీటెయిల్స్ చెప్పటానికి ఇష్టపడదు మల్లి. నువ్వు విడుదల అవ్వాలంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలి లేకపోతే బయటపడలేవు అంటాడు పోలీసు. మళ్ళీ ఇలాంటి వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేసుకుంటే మిమ్మల్ని లాక్ అప్ లో వేస్తాను అంటూ బెదిరిస్తాడు ఎస్ఐ.

ఇలాంటి వాళ్ళని కాదు సార్ అసలు ఈ అమ్మాయినే మళ్లీ హాస్టల్ లోకి రానివ్వను అంటూ తన బట్టలు మూట బయటికి విసిరేస్తుంది వార్డెన్. మరోవైపు కాలేజీ నుంచి మాలిని వచ్చేసి ఉంటుంది బుక్కు చదవడంలో టైం చూసుకోలేదు ఎలా వచ్చిందో ఏంటో అంటూ మాలిని కి ఫోన్ చేస్తుంది వసుంధర. కాలేజీ నుంచి ఎలా వచ్చావు అరవింద్ తీసుకొని వచ్చాడా అంటుంది వసుంధర. లేదు మా నేను క్యాబ్ లో వచ్చాను అంటుంది మాలిని.

చీకట్లో బాణం వేసిన వసుంధర..

నీ గొంతు ఎందుకు అలా ఉంది అంటే ఏం లేదు అనేస్తుంది మాలిని. జరిగిన విషయం నాకు తెలుసు అంటూ చీకట్లో రాయి వేస్తుంది వసుంధర. నీకెలా తెలుసు అంటూ బయటపడిపోతుంది మాలిని. అప్పుడు తెలీదు కానీ ఇప్పుడు నిజం చెప్పు ఏం జరిగింది అంటే జరిగిందంతా చెప్తుంది మాలిని. కంగారుపడిన వసుంధర ఎంత జరిగినా అమ్మకి చెప్పాలనిపించలేదా అంటుంది వసుంధర. నువ్వు కంగారు పడతావు అని చెప్పలేదు అంటుంది మాలిని.

వసుంధర కంగారుని చూసి ఏమైందని అడుగుతారు శరత్ చంద్ర, వాళ్ళమ్మ. నేను మాలి దగ్గరికి వెళ్తున్నాను అంటే నేను కూడా వస్తాను అంటాడు శరత్ చంద్ర. ఇద్దరూ మాలిని ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు మల్లిని పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ చేస్తూ ఉంటారు పోలీసులు. తల్లి పేరు ఊరు పేరు నేను హాస్టల్లో జాయిన్ చేసింది ఎవరు అంటూ అడ్డమైన ప్రశ్నలు వేస్తారు. కానీ ఎవరి పేరు చెప్పినా ప్రమాదమే అనుకుంటూ ఎవరి పేరు చెప్పడానికి ఇష్టపడదు మల్లి.

మల్లిని ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు..

ఎస్ఐ గారు అన్ని ప్రశ్నలు అడుగుతున్నా దేనికి సమాధానం చెప్పవేంటి అంటూ ఆమె దగ్గర ఉన్న బట్టలు మూట లాక్ ఉంటుంది కానిస్టేబుల్. ఆ ఊపు కి ఆమె మెడలో తాళి బయటపడుతుంది. నీకు పెళ్లి అయ్యిందా మరి ఆ సంగతి చెప్పవేమి మా సహనాన్ని పరీక్షిస్తున్నావా అంటూ మల్లిని మందలిస్తుంది కానిస్టేబుల్. మరోవైపు భయంతో అరవింద్ ని హత్తుకుంటుంది మాలిని. భయపడకు ఇకపై కాలేజీకి రోజు నేను డ్రాప్ చేస్తానులే అంటాడు అరవింద్.

మధ్యాహ్నం ఏమైనా తిన్నావా అంటే ఏమీ తినలేదు అంటుంది మాలిని. ఏమైనా తిను అంటే నాకు ఇప్పుడు ఏమీ తినాలనిపించట్లేదు అంటుంది మాలిని. నేను తినిపించినా కూడా తినవా నీకు సెట్ దోశ చేసి తీసుకొని వస్తాను అంటూ కిచెన్ వైపు వెళ్తాడు. ఆ మాత్రానికి పొంగిపోతుంది మాలిని. మాత్రం కేరింగ్ చూపిస్తే చాలు నీకు బానిసగా బ్రతికేస్తాను అనుకుంటుంది. అంతలోని దోశ చేసి తీసుకొచ్చిన అరవింద్ ఇప్పుడు చెప్పు ఆకలి వేస్తుందా లేదా అని అడుగుతాడు.

అరవింద్ ప్రవర్తనకి బాధపడుతున్న మాలిని..

నువ్వు తినిపిస్తాననేసరికి ఆకలి పుట్టేసింది అరవింద్ మాలిని. కానీ ముందు నేనే తినిపిస్తాను,నీకు తినిపించి చాలా రోజులైంది అంటూ అరవింద్ కి తినిపిస్తుంది మాలిని. అరవింద్ మాలినికి తినిపించే లోపు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. ఆ పోలీస్ అరేంజ్కి జరిగిందంతా చెప్పటంతో కంగారుపడిన అరవింద్ మాలినికి తినిపించకుండానే పోలీస్ స్టేషనన్ కి పరిగెడతాడు. అరవింద్ ప్రవర్తనికి మాలిని చాలా బాధపడుతుంది.

మరోవైపు మల్లి నన్ను క్షమించండి మీ పేరు బయట పెట్టకూడదు అనుకున్నాను కానీ తప్పలేదు అనుకుంటుంది. పోలీస్ స్టేషన్ కు వచ్చిన అరవింద్ మల్లిని చూసి షాక్ అవుతాడు. ఎస్సైని డీటెయిల్స్ అడుగుతాడు అరవింద్. తను ఒక వ్యక్తి తల బద్దలు కొట్టింది అతను అవుట్ ఆఫ్ డేంజర్, అది ఆమె అదృష్టం. ఈమె డీటెయిల్స్ హాస్టల్ వద్దని అడిగితే తనకి ఏమీ తెలియదు తనకి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి అని చెప్పింది. మేము ఎంక్వయిరీ చేసినా చాలా సేపు ఎవరి డీటెయిల్స్ చెప్పలేదు.

Malli January 5 Today Episode:

ఎంతో ఎంక్వయిరీ చేస్తే మీ నంబర్ ఇచ్చింది అంటాడు ఎస్ఐ. ఇప్పటివరకు నేను చెప్పాను ఇకపై మీరు చెప్పండి ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా అంటాడు ఎస్సై. ఆమె చెప్పింది నిజమే ఆమె నా భార్య అంటాడు అరవింద్. తరువాయి భాగంలో మీ అబ్బాయితో ఈరోజు తాడోపేడో తెలుసుకొని ఇంటికి వెళ్తాను అంటూ భీష్ముంచుకొని కూర్చుంటుంది వసుంధర. అంతలోనే మల్లిని తీసుకొని ఇంటికి వస్తాడు అరవింద్. వాళ్ళిద్దర్నీ చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 5, 2023 at 10:06 ఉద.