Malli January 9 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మల్లి తో సహా వచ్చిన అరవింద్ ను చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఇంట్లోకి వస్తున్న అరవింద్ ని అక్కడే ఆగమంటుంది వసుంధర. మాలినిని వెళ్లి హారతి తీసుకొని రమ్మంటుంది. అయోమయంలో ఉన్న మాలిని ఎందుకు మామ్ అని అడుగుతుంది. వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి లోపలికి తీసుకొని రా అంటుంది వసుంధర. నేనెందుకు వాళ్లకి హారతి ఇవ్వాలి అని అడుతుంది మాలిని.
అయోమయంలో మాలిని..
వాళ్ళిద్దరూ కుడి కాలు పెట్టి లోపలికి రావటం ఏమిటి అని అడుగుతుంది మాలిని. జంట చూడు ఎంత చూడముచ్చటగా ఉందో అంటూ మళ్లీ కూతురిని హారతిమ్మంటుంది వసుంధర. మీ అబ్బాయి మళ్లీ జంట సీతారాముల జంట లాగా ఉంది కదా అంటుంది వసుంధర. కానీ మాలిని హారతి పళ్లెం విసిరేసి అరవింద్ పక్కన ఇంకెవరిని కంపేర్ చేయకు అంటూ తల్లిని మందలిస్తుంది. నామీద అరిచి ఏం ప్రయోజనం మీ వాళ్ళని నిలదీయు అంటుంది వసుంధర.
మీ అధికారాన్ని ప్రదర్శించొద్దు అంటే మల్లిని లోపలికి రమ్మంటాడు అరవింద్. వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అంటుంది వసుంధర. నేనుండగా నిన్ను ఎవరు టచ్ చేయలేదు రా అంటూ గట్టిగా అరుస్తాడు అరవింద్. లోపలికి వచ్చిన మల్లిని కోపంగా చూస్తూ లగేజ్ సర్థుకోమని మాలినీకి చెప్తుంది వసుంధర. ఎందుకు అని అనుపమ అడిగితే ఈ మల్లి ఉన్న దగ్గర నా కూతురు ఉండదు, నాతోపాటు నా కూతుర్ని తీసుకెళ్ళిపోతాను.
అదిరిపోయిన అత్త అల్లుళ్ళ సవాల్..
నా కూతురు ఇక్కడే ఉండాలి అంటే ఈ మల్లి ని పంపించండి అంటుంది వసుంధర. అసలు మీరెవరు ఇలా మాట్లాడడానికి నా పర్మిషన్ లేకుండా మీరు ఎవరు నా భార్యను తీసుకెళ్లడానికి, అలాగే ఇది నా ఇల్లు మల్లి ఎక్కడ ఉండకూడదు అనే హక్కు మీకు లేదు అంటాడు అరవింద్. హక్కుల గురించి మాట్లాడితే మల్లి ఇక్కడ ఏ హక్కుతో ఉంటుంది, నా కూతురు స్థానంలోనా, నీ భార్య స్థానంలోనా అంటూ నిలదీస్తుంది వసుంధర.
అలా మాట్లాడుతున్నారు ఏంటి అని సుమిత్ర అంటే కళ్ళముందు కనిపిస్తుంటే మీకు ఏమి అర్థం కావట్లేదా అరవింద్ ని మాట్లాడమనండి అంటుంది వసుంధర. హాస్టల్లో ఉన్న మల్లిని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు అని వసుంధర అడిగితే దానికి కారణం మాలిని అంటూ జరిగింది చెప్తాడు అరవింద్. మాలినిని కాపాడటం కోసం తన ప్రాణాన్ని తెగించి రౌడీ తల పగలగొట్టింది దాంతో పోలీసులు ఈమెని అరెస్ట్ చేశారు.
భర్తను వెనకేసుకొచ్చి తల్లికి షాక్ ఇచ్చిన మాలిని..
ఇప్పుడు తను హాస్టల్ లో ఉండలేని పరిస్థితి. ఇప్పుడు తనని అలా వదిలేయడం మానవత్వం అనిపించుకోదు అంటాడు అరవింద్. వసుంధర చప్పట్లు కొడుతూ నైస్ స్టోరీ అంటుంది. ఇలాగే అంటారు నాకు తెలుసు అంటాడు అరవింద్. ఇప్పుడే నీకు సాక్షాలతో సహా ప్రూవ్ చేస్తాను అంటూ మొత్తం స్టోరీని ల్యాప్టాప్ లో చూపిస్తాడు అరవింద్. నీ తెలివితేటలు కి హ్యాట్సాఫ్ ఇదంతా నువ్వే కావాలని చేయించావు అంటుంది వసుంధర.
మీరు ఆలోచించినంత నీచంగా నేను ఆలోచించలేను అంటాడు అరవింద్. ఇందులో నిజం ఏముంది అంటూ ఏదో మాట్లాడుతున్న వసుంధరని ఆగమని అరవింద్ చెప్పింది నిజం ఎందుకంటే జరిగిందేది నేను అరవింద్ కి చెప్పలేదు. అరవింద్ క్యారెక్టర్ అలాంటిది కాదు అంటూ భర్తని వెనకేసుకొస్తుంది మాలిని. మాలిని చెప్పింది కదా ఇప్పటికైనా నమ్మండి అంటుంది సుమిత్ర.
అవమానంతో బయటికి వెళ్లిపోయిన వసుంధర..
శరత్ చంద్ర కూడా నచ్చచెప్తాడు. ఇంకెప్పుడూ తనని తక్కువ చేసి మాట్లాడొద్దు అంటుంది మాలిని. మావయ్య వాళ్ళు ఎంత రమ్మన్నా రాలేదు ఇప్పుడు తను హాస్టల్లో ఉండలేను పరిస్థితి. తన కల నెరవేర్చుకోవాలంటే తను ఇక్కడే ఉండి తీరాలి అంటుంది మాలిని. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మల్లి ఇక్కడే ఉంటుంది అంటాడు అరవింద్. కోపంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది వసుంధర.
మల్లి ఇక్కడే ఉంటుంది కానీ ఇంతకు ముందులాగా ఇంట్లో పని లేదు కేవలం చదువుకుంటుంది అంతే అంటూ ఇంట్లో అందరికీ చెప్తాడు అరవింద్. కరెక్టే కానీ మల్లి ఏ పని చేయకుండా ఉండలేదు కదా అంటుంది అనుపమ. మరోవైపు బయటకు వచ్చిన శరత్ చంద్ర అల్లుడిని హత్తుకుని చాలా మంచి పని చేశావు మల్లికి కొత్త జీవితాన్ని ఇచ్చావు అంటాడు.
Malli January 9 Today Episode: అడ్డంగా బుక్ అయిన శరత్చంద్ర..
ఇదంతా చూసిన వసుంధర షాక్ అవుతుంది.ఇంటికి వచ్చిన వసుంధర భర్తని నిలదీస్తుంది. మల్లిని అరవింద్ ఇంటికి తీసుకు రావడం చూసి నీ మొహం వెలిగిపోయింది, ఆరోజు హాస్టల్ దగ్గర ఉన్నది ఈ మల్లి కోసమే కదా అంటుంది. మాటలకి షాక్ అవుతాడు శరత్ చంద్ర. తరువాయి భాగంలో డ్రాయింగ్ వేసి దాచుకుంటుంది మల్లి. అదే నా డ్రాయింగ్ బుక్ అని పింకీ తీసుకొని వెళ్లి శరత్ చంద్ర కి చూపిస్తుంది.