Malli: ప్రేమించి పెళ్లి చేసుకున్న స్త్రీకి బలవంతంగా తన జీవితంలోకి వచ్చిన స్త్రీకి మధ్యలో నలిగిపోతున్న ఓ యువకుని కధ మల్లి. ఈవారం ఏం జరిగిందో చూద్దాం.
తనని బస్సు ఎక్కించడానికి వచ్చిన మల్లికి ఎన్నో జాగ్రత్తలు చెప్తాడు అరవింద్. భవిష్యత్తులో మీ పేరు ధ్రువతార లాగా వెలిగిపోవాలి ఎన్ని సమస్యలు వచ్చినా చదువుని పక్కన పెట్టొద్దు అంటాడు. నీకు ఏదైనా సమస్య వస్తే నాకు ఒక ఫోన్ కొట్టు చాలు అంటూ వెళ్ళలేక, వెళ్ళలేక వెళ్ళిపోతాడు అరవింద్. బస్సులో వెళ్తున్న కూడా మల్లి ఆలోచనలే వెంటాడతాయి. మరోవైపు మల్లి కూడా అరవింద్ వెళ్లడం భరించలేక పోతుంది.
అలా అని నిందించదు ఎన్ని జన్మలకైనా అతనే నా భర్త కావాలి కానీ అప్పుడు మాత్రం ఆయన ప్రేమ మొత్తం నేనే పొందాలి అని దేవుడ్ని కోరుకుంటుంది. శరత్ చంద్ర ఊరు వెళ్లి వచ్చిన తర్వాత డల్ గా ఉంటాడు. ఎందుకు అలా అనుభవంగా ఉన్నావు అని తల్లి అడిగితే ఊర్లో జరిగిందంతా చెప్తాడు. వసుంధర కి మెసేజ్ పెట్టిన విషయం కూడా చెప్పి ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నించటం జరిగిందంతా చెప్పడానికి భార్య దగ్గరికి వెళ్తాడు. సీరియస్ గా ఉన్న భార్య దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్పబోయేంతలో పాడైపోయిన ఫోన్ ని రిపేర్ చేసుకొని తీసుకువస్తాడు మెకానిక్.
అంటే నేను పంపించిన మెసేజ్ తను చదవలేదు అనమాట అని రిలాక్స్ ఫీల్ అయ్యి అసలు విషయం చెప్పకుండా అబద్ధం చెప్పేస్తాడు శరత్ చంద్ర. ఆ మాటలు విన్న వసుంధర నేను మీ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ మీ కూతురికి మాత్రం అరవింద్ గురించి కాకుండా తన ఆరోగ్యం గురించి ఆలోచించమని చెప్పండి నేను ఎంత చెప్పినా వినట్లేదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఇంటికి వచ్చిన అరవింద్ ని ఎవరు పలకరించరు, కనీసం ఎక్స్ప్లనేషన్ కూడా అడగరు.
పని వాడిని మాలిని కనిపించడం లేదేమిటి అని అడిగితే మీరు లేని ఇంట్లో ఉండలేనని బట్టలు సర్దుకుని వెళ్లిపోయారని చెప్తాడు పనివాడు. ఆలోచిస్తే కొట్టిన అరవింద్ దగ్గరికి వచ్చి ఇప్పుడు మాలిని కోసం ఆలోచిస్తున్నావా అంతా పిచ్చిగా ప్రేమించే భార్యని వదిలేసి ఎలా వెళ్ళిపోయావు, తనతో అబద్ధం చెప్పాలని ఎలా అనిపించింది అని కొడుకుని నిలదీస్తుంది అనుపమ. అబద్ధం చెప్పి వెళ్ళవలసిన అంత అవసరం వచ్చింది అంటుంది అనుపమ.
తల్లికి సారీ చెప్తే నాకు సారీ వొద్దు, నువ్వు నన్ను ఆదర్శవంతమైన తల్లిగా కాకుండా మామూలు తల్లిగా మిగిల్చేశావు అంటూ కొడుకుని అసహ్యించుకుంటుంది. మరోవైపు నీరసంగా ఉన్న మాలిని కళ్ళు తిరిగి పడిపోతుంది. కంగారుపడిన ఆమె తండ్రి తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లి ఆమెకి సపర్యలు చేస్తాడు. కూతుర్ని అలా చూసి తట్టుకోలేని వసుంధర అల్లుడ్ని తిడుతుంది. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన ఆ ఇంటికి మరి పంపించను అంటుంది. ఆవేశంలో ఏ నిర్ణయము తీసుకోకు అయినా ముందు పిల్ల గురించి ఆలోచించు అంటుంది ఆమె అత్తగారు.
అంతలోనే అక్కడికి వచ్చిన అరవింద్ ని గుమ్మంలోనే నిలదీస్తుంది. అత్తయ్య అని పిలిస్తే నీ నోటితో అలా పిలవద్దు అంటుంది. మిస్సెస్ శరత్ చంద్ర నా భార్య ఎక్కడ అని అడుగుతాడు అరవింద్. నిన్నే తలుచుకుంటూ చావు అంచల వరకు వెళ్లి వచ్చింది అని ఏడుస్తూ చెప్తుంది వసుంధర. కంగారుగా మాలిని రూమ్ కి పరిగెడితే నీరసంగా ఉన్న మాలిని పరిగెత్తుకుంటూ వచ్చి అరవింద్ అని హత్తుకుంటుంది. ఆమెని తీసుకొని వెళ్ళి మంచం మీద పడుకోబెడతాడు అరవింద్. నిన్ను తలుచుకునే ఇలా అయిపోయింది అసలు ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు శరత్ చంద్ర.
వచ్చేసారు కదా డాడీ ఇంకేమీ అడక్కండి అంటుంది మాలిని. ఇంటికి వెళ్దాం కదా అని అరవింద్ అంటే మళ్ళీ నా కూతుర్ని అక్కడికి పంపించను అంటుంది వసుంధర. నేను ఇక్కడ ఉంటే ఎందుకు అరవిందులో మార్పు వచ్చిందో తెలుసుకోలేను నేను అక్కడికే వెళ్లాలి వెళ్లి నా ప్రేమని దక్కించుకోవాలని అనుకుంటుంది మాలిని. తల్లికి నేను అరవింద్ తో వెళ్ళిపోతాను అని చెప్తుంది. ఆమె పిచ్చితనాన్ని తిట్టుకుంటూ ఏమీ చేయలేక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసుంధర.
మరోవైపు బాధపడుతున్న మల్లిని అల్లుడు గారి కోసమే కదా బాధపడుతున్నావ్ అంత బాధపడటం ఎందుకు ఫోన్ చెయ్యు అంటుంది మీరా. ఫోన్ చేయడానికి ఇబ్బంది పడుతున్న మల్లి ని అనుమానిస్తాడు ప్రకాష్. నాకు నిజం చెప్పకపోయినా పర్వాలేదు నేను నువ్వు మోసం చేసుకోవద్దు అంటాడు. అతని బాధ భరించలేక ఫోన్ చేస్తుంది మల్లి. మాలిని హడావుడిలో ఉన్న అరవింద్ ఆ ఫోను ని లిఫ్ట్ చేయడు. అరవింద్ బాబు మాలిని అక్కతో సంతోషంగా ఉండి ఉంటారు అందుకే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటుంది మల్లి.
అయినా నేను బాబు గారి కోసం ఆలోచించడం ఎందుకు నా చదివి మీద దృష్టి పెట్టాలి అనుకుంటుంది. మాలిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు అరవింద్. మాలి నేను చూసిన అరవింద్ కుటుంబ సభ్యులు ఆమెని సాదరంగా ఆహ్వానిస్తారు. వాళ్ళందరూ అరవింద్ చేత మాలినికి సారీ చెప్పిస్తారు. నేను ఆయన్ని క్షమించేసాను నాకు ఎలాంటి సారీలు వద్దు అంటుంది మాలిని. నువ్వు వదిలిపెట్టినా మేము వదిలిపెట్టం అంటారు వాళ్ళు.
ఆయన్ని ఏమీ అనొద్దు అంటే కోడలి మంచితనానికి మురిసిపోతుంది అనుపమ. రూప ఆమెను తీసుకొని గదిలోకి వెళ్తుంది. రెండు రోజులు లేకపోతేనే మాలిని కోసం ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు కంగారు పడుతున్నారు మల్లి వెళ్లి ఇన్ని రోజులు అయింది కానీ ఎవరు తలుచుకోవట్లేదు అందరూ ఆమెని మరిచిపోయారు అనుకుంటాడు అరవింద్. ముభావంగా ఉన్న అరవింద్ ను చూసి ఈ అరవింద్ నేను ప్రేమించిన అరవింద్ కాదు, మా ఇద్దరి మధ్య దూరానికి కారణం తెలుసుకోవాలి ఆ ప్రేమని ఎలాగైనా సాధించుకోవాలి అనుకుంటుంది మాలిని.
మంచం మీద ఉన్న మాలిని కి టాబ్లెట్స్ ఇస్తుంటాడు అరవింద్. ఎప్పుడూ నా కోసమే ఆలోచిస్తావా నీకోసం ఆలోచించవా అని అడిగితే నాకు నువ్వే ప్రపంచం అరవింద్ అంటుంది మాలిని. అంతలోనే అన్నోన్ నెంబర్ తో ఫోన్ వస్తుంది అరవింద్ కి. ఇప్పటికే మూడుసార్లు చేశారు ఎవరో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అరవింద్. అవతల నుంచి మల్లి గొంతుక వినిపించడంతో లో గొంతుకతో మాట్లాడుతాడు అరవింద్. నేను ఫోన్ చేయటం ఇష్టం లేదేమో అందుకే అలా మాట్లాడుతున్నారు కానీ మీరు క్షేమంగా వెళ్లారో లేదో తెలుసుకుందామని ఫోన్ చేశాను ఇకపై చెయ్యను అంటుంది మల్లి.
పక్కన మాలిని ఉంది అందుకే అలా మాట్లాడుతున్నాను అని మనసులోనే అనుకుంటాడు అరవింద్. అన్నోన్ నెంబర్తో ఎంతసేపు ఇంత మొహమాటంగా మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుమాన పడుతుంది మాలిని. ఈ హడావుడిలో టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోతాడు అరవింద్. అదే విషయాన్ని గుర్తు చేస్తుంది మాలిని. మళ్లీ ఇవ్వబోతే వద్దులే నా కేరింగ్ నేనే తీసుకుంటాను అంటుంది. ఒకవైపు మల్లి, మరోవైపు మాలినీల స్వచ్ఛమైన ప్రేమకు సంతోషించాలో, మరోవైపు నిజం తెలిస్తే మాలిని ఏమైపోతుందో అని భయపడాలో అరవింద్.
మరోవైపు అల్లుడు గారితో మాట్లాడావా అని మీరే అడిగితే మాట్లాడాను నేను కూడా రేపే వచ్చేస్తానని చెప్పాను అని మల్లి అంటే రేపే వెళ్ళటం ఏంటి ఏదో పరీక్షలు అన్నావు కదా అంటుంది. పరీక్షలు అక్కడ కూడా రాసుకోవచ్చు కదా అని మళ్లీ అంటే అలాగే చేయు అంటుంది మీరా. నేను ఇక్కడ ఉంటే వీళ్ళకి ఇబ్బంది అక్కడికి వెళ్తే బాబు గారికి ఇబ్బంది అందుకే హాస్టల్లో ఉండి చదువుకుంటాను అని మనసులోనే అనుకుంటుంది మల్లి. మరోవైపు అరవింద్ ఆలోచనలతో ఎంతకీ నిద్ర పట్టదు మాలినికి.
ఫోన్ చేసింది ఎవరో అని ఆలోచిస్తుంది. అరవింద పడుకున్నాక ఆ ఫోన్ బయటికి తీసుకువచ్చి నెంబర్ కి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ ప్రకాష్ లిఫ్ట్ చేసి మీరెవరు అని అడుగుతాడు. నేను మాలిని అరవింద్ భార్యని అంటుంది. ఆ మాటలకి బుర్ర తిరిగిపోతుంది ప్రకాష్ కి. ఫోన్ చేయి జారిపోతుంది. అంతలోనే అక్కడికి వచ్చిన మల్లి ఏమైంది బాబు గారు ఫోన్ చేస్తారు ఫోను నా దగ్గర ఉంచమన్నాను కదా అని ఆ ఫోన్ తీసుకొని వెళ్ళిపోబోతుంది.
ప్రకాష్ అనుమానంగా నీకు మీ ఆయనకి ఎలాంటి దూరం లేదు కదా అని అడుగుతాడు. అలాంటి పిచ్చి మాటలు అడగొద్దని ఎన్నిసార్లు చెప్పాలి అంటుంది మల్లి. మరి మాలిని ఎవరు అని అడుగుతాడు ప్రకాష్. ఆ మాటకి షాక్ అవుతుంది మల్లి. నువ్వు నాకు నిజం చెప్పకపోతే నేను వెళ్లి బాబుతో అని చెప్పేస్తాను అంటాడు ప్రకాష్. చెప్పొద్దు అంటూ జరిగిందంతా చెప్తుంది మల్లి. జరిగిందంతా విని అరవింద్ మీద కోపంతో ఊగిపోతాడు ప్రకాష్. నీకు ఇంత అన్యాయం చేసిన వాడిని వదిలిపెట్టను అంటాడు.
అలా జరిగితే నేను ప్రాణాలతో ఉండను అంటుంది మల్లి. నా జీవితం ఇలా కావడానికి ఎవరి ప్రమేయం లేదు అందరూ మంచివాళ్లే, నా జీవితం ఇలా అయిందంటే అందుకు కారణం కేవలం విధి మాత్రమే. ఇదంతా ఎవరికీ చెప్పొద్దు అంటూ ఓట్టేయించుకుంటుంది మల్లి. అయినా ఇకపై నేను బాబు గారిని ఇబ్బంది పెట్టను. పట్నం వెళ్లి చదువుకుంటాను అంటుంది మల్లి. పట్నం వెళ్లి ఎక్కడ ఉంటావు నేను చెప్పిన మాట విను నేనే నిన్ను హాస్టల్లో జాయిన్ చేసి వస్తాను అంటాడు ప్రకాష్.
ఫోన్ లిఫ్ట్ చేసింది మగ వ్యక్తి అవ్వటంతో రిలాక్స్ ఫీల్ అవుతుంది మాలిని. పడుకున్నా అరవింద్ ని నిన్ను అనుమానించాలని కాదు అరవింద్ కానీ మన మధ్య ఉన్న గ్యాప్ ఏంటో నువ్వు చెప్తావని చూస్తున్నాను కానీ నువ్వు చెప్పడం లేదు. నేనైనా తెలుసుకుందామని నా ప్రయత్నం. సమస్య తెలిస్తేనే కదా పరిష్కారం దొరుకుతుంది అందుకే తప్పని తెలిసిన నీ ఫోన్ తీశాను అంటూ నిద్రపోతున్న అరవింద్ కి సారీ చెప్తుంది.మరోవైపు నిద్ర పట్టక మల్లి కోసమే ఆలోచిస్తూ ఉంటాడు శరత్ చంద్ర.
మీరా తన నోటితో తను ఎప్పటికీ చెప్పదు ఇక ఎప్పటికీ మల్లి చేత నాన్న అని పిలిపించుకోలేను. నాలాంటి పరిస్థితి ఏ కన్నతండ్రి కి రాకూడదు అని బాధపడతాడు. ఏమైంది ఎందుకు ఇంకా పడుకోలేదని వసుంధర అంటే ఏం లేదు పీడకల వచ్చింది నేను తర్వాత పడుకుంటానులే నువ్వు పడుకో అని భార్యకి చెప్తాడు శరత్ చంద్ర. మరోవైపు పట్నానికి బయలుదేరుతున్న మల్లికి అన్ని జాగ్రత్తలు చెప్తుంది మీరా. మీ అత్తగారు చనువు ఇచ్చారని నువ్వు అల్లరి చేయొద్దు.
Malli: కథలో మలుపులు లేకపోవడంతో బోర్ ఫీల్ అవుతున్న ప్రేక్షకులు..
తప్పు నీ వైపు లేకపోయినా తప్పు కాయాల్సి వస్తుంది జాగ్రత్త అంటుంది. ఇప్పటివరకు నేను మీ అత్తగారిని కలవనే లేదు వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడుతుంది మీరా. ఏమి అనుకోరులే నేను చెప్తానులే అంటూ తల్లిని పట్టుకొని ఏడ్చేస్తుంది. పట్నం వెళ్లిన మల్లి అరవింద్ ని కలుస్తుందా? మాలిని అసలు నిజాన్ని తెలుసుకుంటుందా? నిజాన్ని తెలుసుకున్న ప్రకాష్ ఏం చేస్తాడు? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.