Malli December 30 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో బట్టలు ఉతుకుతున్న మల్లిని చూసి బాధపడతాడు అరవింద్. మల్లి, మాలిని ల జీవితాల్లో ఎంత తేడా? దానికి కారణం అప్పుడు మావయ్య గారైతే ఇప్పుడు నేను అని మనసులో అరవింద్. మల్లిని పిలుస్తాడు అరవింద్. ఆ మాటకి ఆశ్చర్యపోయి చూస్తుంది మల్లి. నేను ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది అంటుంది మల్లి.
అరవింద్ ని చూసి ఆశ్చర్యపోయిన మల్లి..
నిన్ను,నన్ను కలిపినా సీతారాములే నీ జాడ నాకు చూపించాడు. నాకు మొదటినుంచి అర్థం కానిది ఇదే ఎంత దూరంగా ఉందాం అని ప్రయత్నించినా ఉండలేకపోతున్నాం మన బంధం విడదీయలేనిది అంటాడు అరవింద్. అందరి బట్టలు నువ్వు ఉతకడం ఏంటి అంటాడు అరవింద్. మీకు ఎలా తెలుసు అంటే మీ వార్డెన్ ని అడిగితే చెప్పింది అంటాడు అరవింద్.
నీకు మేమందరమే ఉన్నాం కదా నాతో పాటు వచ్చేయ్ అంటాడు అరవింద్. నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే ఎప్పుడు చదువుకుంటావు, నాకోసం కాకపోయినా నీ చదువుకోసమైనా నాతో పాటు రా అంటాడు అరవింద్. నేను ఏ పని చేసినా నా చదివినప్పుడు చేయలేదు బాబు అది మా ఊర్లో అయినా,ఇక్కడైనా. నేను ఇక్కడ ఆనందంగా ఉన్నాను మీరు వెళ్ళండి అంటుంది మల్లి.
అరవింద్ ని తన దగ్గరికి రావద్దన్న మల్లి..
నేను వస్తే మీకు మాలిని అక్కకి మధ్య గొడవలు వస్తాయి మీరు బాధపడితే నేను చూడలేను. ఇంకొకసారి మీరు రమ్మని అడిగితే నేను ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాను అంటుంది మల్లి. సరే ఇక్కడే ఉండు కానీ ఇలాంటి పనులు చేయకు, నేను హాస్టల్ ఫీజు కడతాను నువ్వు బాగా చదువుకో అంటాడు అరవింద్. అలా అయితే నేను మీకు రుణపడి పోతాను. ఒకప్పుడు మీ ఇంట్లో పని చేసేదాన్ని కాబట్టి రుణం తీర్చేసుకునే దాన్ని ఇప్పుడు ఆ అవకాశం లేదు దయచేసి మీరు నాకు గాని నా మనసుకు గాని దగ్గరగా రాకండి.
దయచేసి ఇకనుంచి వెళ్లిపోండి ఉంటుంది మల్లి. మన మధ్య ఎలాంటి బంధం లేదా అంటాడు అరవింద్. ఉన్న బయటికి చెప్పుకోలేం కదా బాబు అంటుంది మల్లి. బాధతో వెనక్కి వెళ్ళిపోతాడు అరవింద్. మరోవైపు భోజనాలకి ప్రిపేర్ చేసి అందర్నీ భోజనానికి పిలుస్తుంది మాలిని. ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నావు ఏంటి కారణం అంటుంది సుమిత్ర. ఈరోజు అరవింద్ నన్ను కాలేజీలో డ్రాప్ చేశాడు అంటుంది మాలిని.
పట్టలేని సంతోషంలో మాలిని..
ఇంత చిన్న విషయానికే అంత సంతోషమా అంటుంది రూప. అరవింద్ ఊరు వెళ్ళినప్పుడు నా కొలీగ్స్ నన్ను బాధపెట్టేలాగా మాట్లాడారు. అరవిందు తిరిగి వచ్చాక వాళ్ళకి గుణపాఠం చెప్పాలని అనుకున్నాను. ఈరోజు అరవింద్ వచ్చాడు కదా, పది రోజులు కాదు పది సంవత్సరాలు పోయాక వచ్చినా కూడా మా ఇద్దరి మధ్య దూరం పెరగదు మా మధ్యలో ఎవరు రారు అంటూ క్లియర్ గా చెప్పేశాను అంటుంది మాలిని.
మాలిని ని చూసి అందరూ ఎమోషనల్ అవుతారు. ఎందుకు అందరూ ఎమోషన్ అవుతారు రండి భోంచేద్దాం అంటూ అందరినీ భోజనానికి తీసుకెళ్లి దగ్గరుండి వడ్డిస్తుంది మాలిని. వాళ్ళందరూ భోజనం చేస్తుంటే తృప్తిగా చూస్తుంది మాలిని. మనందరం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని నా కోరిక అరవింద్ అనుకుంటుంది మాలిని. ప్రకాష్ ఫోన్ చేస్తాడు అరవింద్ కి. ఈ టైంలో తను ఎందుకు ఫోన్ చేసాడు అనుకుంటూ లిఫ్ట్ చేయడానికి ఆలోచిస్తాడు అరవింద్.
నాకు అంతా తెలుసన్న మాలిని..
ఏదో ఇంపార్టెంట్ కాల్ లాగా ఉంది లిఫ్ట్ చేయండి అంటుంది మాలిని. ఫోన్ ఎత్తితే అట్నుంచి మీరా మాట్లాడుతుంది. తన గొంతుక విని కంగారు పడతాడు అరవింద్. అక్కడ మాట్లాడలేక కిందకు వచ్చి మాట్లాడుతాడు అరవింద్. తను భోజనం మధ్యలోంచి వెళ్ళిపోవటాన్ని చాలా బాధపడుతుంది మాలిని. మీరా మల్లి ని గురించి అడుగుతుంది. తను లేదు పడుకుండి పోయింది అని చెప్తాడు. ప్రకాష్ ని ఏమడిగినా చిరాకు పడిపోతున్నాడు అందుకే ఈ టైంలో ఫోన్ చేయవలసి వచ్చింది ఏమి అనుకోవద్దు అంటూ ఫోన్ పెట్టేస్తుంది మల్లి.
వెనక్కి తిరిగేసరికి మాలిని కనిపిస్తుంది. తను అడగకముందే నేను నిజం చెప్పేయాలని అనుకుంటాడు అరవింద్. నేను నీకు ఒక విషయం ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నాను అంటూ ఏదో చెప్పబోతాడు అరవింద్. నువ్వు ఫోన్లో మాట్లాడిన దాని గురించేనా నాకు అంత తెలుసు అరవింద్ నేను ప్రకాష్ తో మాట్లాడాను అంటుంది మాలిని. ఆ మాటలకి షాక్ అవుతాడు అరవింద్. అవును అరవింద్ నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా నేను నిన్ను అనుమానించాను.
Malli December 30 Today Episode నేను నిజాయితీగా లేనన్న అరవింద్..
నిన్న నీ ఫోన్ తీసుకొని మాట్లాడాను నన్ను క్షమించు ఇకమీదట నీకన్నా నిజాయితీగా ఉంటాను అంటూ అరవింద్ హత్తుకుంటుంది మాలిని. ఆమె పిచ్చి ప్రేమకి కరిగిపోతాడు అరవింద్. నేను నిజాయితీగా లేను మాలిని, నీ దగ్గర నిజం చెప్పలేక రోజు చస్తూ బ్రతుకుతున్నాను అనుకుంటాడు అరవింద్. సరేగాని ప్రకాష్ ఎవరు సీక్రెట్ ఇన్ ఫార్మర్ అని నవ్వుతూ అడుగుతుంది మాలిని.
తరువాయి భాగంలో శరత్ చంద్రని రహస్యంగా కలుసుకుంటాడు అరవింద్. మళ్లీ ఇదే ఊర్లో ఉంది తనని ఎలాగైనా మా ఇంటికి తీసుకొని రండి ఎందుకంటే తండ్రిగా అది మీ బాధ్యత అంటాడు. ఆ మాటలకి షాక్ అయిపోతాడు శరత్ చంద్ర.