Nuvvu Nenu Prema December 26 Today Episode: ఈరోజు ఎపిసోడ్లో విక్కీ దగ్గరికి వెళ్ళటానికి భయపడిపోతుంది పద్మావతి. గరుడ ఆమెకి ధైర్యం చెప్తాడు. నన్ను తిట్టించాలని చూస్తున్నావు కదా అంటే నన్ను నీ తమ్ముడిలాగా చూస్తున్నావ్ ఎందుకు తిట్టించాలనుకుంటాను చెప్పు అంటే పద్మావతికి ధైర్యం చెబుతుంది ఆమె గరుడ అని పిలుచుకునే బండి.
కోపంతో రెచ్చిపోతున్న విక్రమాదిత్య..
నిజమే భయాలన్నీ పక్కన పెట్టేయాలి ఎలాగైనా విక్రమాదిత్య గారిని పార్టీకి ఒప్పించాలి, ఈ విషయంలో తగ్గేదేలే అంటూ ధైర్యంగా బయలుదేరుతుంది పద్మావతి. మరోవైపు విక్రమాదిత్యకి బర్త్డే విషెస్ చెప్తాడు అతని ఫ్రెండ్. పార్టీ ఎప్పుడు అని అడుగుతాడు అతను. పార్టీ కోసమే ఫోన్ చేసావా నువ్వు అంతా దివాలా తీసే పరిస్థితిలో ఉన్నావా, ఉన్నానంటే చెప్పు మీ కంపెనీని నేనే కొంటాను అంటాడు విక్కి.
ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా అంటాడు అతను. నాకు కాదు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా ఏం పార్టీ ఇస్తేనే బర్త్ డే నా అంటూ అతనికి నానా చివాట్లు పెడతాడు విక్కి. ఇదంతా వింటున్న మాయ ఎవడికో మూడింది, జీవితంలో మళ్లీ ఎప్పుడు పార్టీ అడగడు అనుకుంటుంది. అంతలోనే అక్కడికి వచ్చిన ఆఫీస్ బాయ్ ఈరోజు సార్ బర్త్డే అంట కదా నేను పార్టీ అడుగుతాను అంటాడు. నో వే ఆ మాట అస్సలు అడగొద్దు అంటుంది మాయ.
టెన్షన్లో గొంతుక పోగొట్టుకున్న పద్మావతి..
అదేంటి మేడం అలా అంటున్నారు నేను వెళ్లి అడుగుతాను అంటూ లోపలికి ఆవేశంగా వెళ్లి విక్కిని పార్టీ అడుగుతాడు అతను. వాడ్ని నాన్న చివాట్లు పెట్టి పంపించేస్తాడు విక్కీ. ఇదంతా అప్పుడే అక్కడికి వచ్చిన పద్మావతి చూస్తుంది. టెంపరోడి పోకు మామూలుగా లేదు నేను వెళ్తే నాపని అంతే అంటూ కంగారుగా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. మాయ రూమ్ లోకి వెళ్లి విక్రమాదిత్య గారు ఎందుకలాగా కోపంగా ఉన్నారు.
అయినా ఎవరైనా బర్త్డే విషెస్ చెప్తే సంతోషిస్తారు కానీ, ఈసారి ఏంటి అలా తిడుతున్నారు అంటుంది పద్మావతి. అయినా నీ సడన్ ఎంట్రీ ఏంటి అంటుంది మాయ. పార్టీకి విక్రమాదిత్య గారిని ఒప్పించడానికి కి వచ్చాను అంటుంది కానీ ఆ మాట మాయ కి వినిపించదు. ఏమన్నావని మళ్లీ అడుగుతుంది. పద్మావతి చెప్తుంది కానీ గొంతుకు బయటికి రాదు పద్మావతికి. టెన్షన్ లో నా గొంతుక పోయినట్టుంది అంటూ మంచినీళ్లు తాగుతుంది పద్మావతి.
పద్మావతి చెప్పింది విని పగలబడి నవ్విన మాయ..
ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు అంటుంది మాయ. బర్త్డే సెలబ్రేట్ చేసుకోకుండా సాడ్ గా ఉన్నారని అరవింద మేడం బాధపడుతున్నారు అందుకే విక్రమాదికే గారిని ఎలాగైనా పంపిస్తానని చెప్పి ఎక్కడికి వచ్చాను అంటుంది పద్మావతి. ఆ మాటకి పగలబడిన అవుతుంది మాయ ఇది సాధ్యమయ్యే పనైనా, ఫోన్లో బర్త్డే విషెస్ చెప్తేనే కయ్యమని అరిచాడు, అలాంటిది నువ్వు బర్త్డేకి ఒప్పిస్తానంటే ఊరుకుంటాడా, పులి బోన్ లోకి వెళ్లి దాని తోక పట్టుకుంటానంటే ఎవరు వద్దంటారు కానీ చూసే వాళ్లకు మాత్రం పిచ్చ ఎంటర్టైన్మెంట్.
నువ్వు వెళ్ళు నేను ఇక్కడి నుంచే చూసి ఎంజాయ్ చేస్తాను అంటే పగలబడి నవ్వుతుంది మాయ. అంతలోనే విక్కీ ఫోన్ చేసి మాయని తన క్యాబిన్ కి రమ్మంటాడు. వచ్చేసరికి కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి ఉంచమన్నాను కదా ఏమైంది అని అడుగుతాడు. జస్ట్ సెకండ్ అంటూ ఆ ఫైల్ తీసి ఇస్తుంది మాయ. టేబుల్ మీదే ఉందని చెప్పొచ్చు కదా అంటూ ఇరిటేట్ అవుతాడు విక్కీ. ఆ ఫైల్ ని విసిరేసి నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి అంటూ ఫైర్ అయిపోతాడు. ఇదంతా బయటనుంచి చూస్తున్న అరవింద ఈ టెంపరోడి కోపానికి అంతమే ఉండదా? అంటూ భగవంతుడికి దండం పెట్టుకుంటుంది.
విక్కీ కోపానికి బలైన మాయ..
నువ్వు పద్మావతి చెప్తున్నట్టు ఇంటి పని వంట పని చేయటం కాదు ఆల్రెడీ వచ్చిన ఆఫీస్ పని కూడా చేయాలి నువ్వు పద్మావతి తీస్తే నేను ఇంపార్టెన్స్ ఆఫీస్ పనికి ఇవ్వటం లేదు, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పు ఇంట్లోనే కూర్చొని పద్మావతి తో పాటు ఇంటి పని వంట పని చేసుకుందువు గాని అని అరిస్తాడు. ఇదంతా పైనుంచి చూస్తుంది పద్మావతి. పద్మావతిని చూస్తుంది మాయ. హౌ డేర్ యు నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు దిక్కులు చూస్తున్నావ్ ఏంటి అని అరుస్తాడు విక్కీ, పద్మావతి వచ్చింది విక్కీ అందుకే చూస్తున్నాను అంటుంది మాయ.
తను ఎందుకు వచ్చింది అని విక్కి అడిగితే నీతో ఏదో మాట్లాడాలట తనను పంపించనా అంటుంది మాయ. సరేకానీ ఇకనైనా ఆఫీసు పని శ్రద్ధగా చెయ్ అంటాడు విక్కీ. హమ్మయ్య నేను సేఫ్ అనుకుంటూ బయటికి వచ్చేస్తుంది మాయ. టెంపరడు నన్ను చూసి నానా చివాట్లు పెట్టకముందే ఇకనుంచి వెళ్లిపోవడం మంచిది అనుకుంటుంది. ఆమె చేయి పట్టుకుని ఆపుతుంది మాయ. అయినా మీరేంటి సార్ అన్ని తిట్లు తిట్టినా ఎక్కడో స్పృహతప్పి పడిపోకుండా జాగ్రత్తగా వచ్చేసారు నా ట్రైనింగ్ మహిమ అంటుంది పద్మావతి.
పద్మావతి మీద కేకలు వేస్తున్న విక్కీ..
విక్కీ కోపం ముందు ఆ బేబీ పనిచేయవు గాని నిన్ను వికీపీలు ఇస్తున్నాడు వెళ్ళు అంటుంది మాయ. నేను వెళ్ళను ఇప్పుడు వెళ్తే ఆకలి మీద ఉన్న పులికి మేక దొరికినట్లే అంటుంది పద్మావతి. అంతలోనే విక్కి పద్మావతి మీద అరుస్తాడు నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా అని కేకలు వేస్తాడు. విక్కీ కోపం నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు వెళ్ళు అంటుంది మాయ. ఇప్పుడు ఎలా తప్పించుకోడు అంటూ భయపడుతూ విక్కీ రూమ్ లోకి వెళుతుంది పద్మావతి.
అదంతా బయటినుంచి చూసి ఎంజాయ్ చేస్తుంటారు మాయ, ఆఫీస్ బాయ్. నాకు బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చినట్లుంది తన పని చెప్తాను అనుకుంటాడు విక్కీ. బర్త్డే విషెస్ వెతితే గడిచేలాగా ఉన్నాడు ఎందుకొచ్చావ్ అని అడిగితే ఏం చెప్పాలి, ఇప్పుడు నా పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి లాగా ఉంది అంటూ తనలో తానే కంగారు పడిపోతుంది పద్మావతి. నువ్వేమైనా బొమ్మవా మాట్లాడకుండా ఉండటానికి, నా టైం వేస్ట్ చేయకుండా ఎందుకు వచ్చావు చెప్పు అని అరుస్తాడు విక్కీ.
విక్కీని బ్లాక్ మెయిల్ చేసిన పద్మావతి..
కంగారులో ఏం మాట్లాడుతుందో తెలియకుండానే నేను ఇటువైపు నుంచి వెళ్తున్నాను ఆఫీస్ కి వచ్చి చాలా రోజులైంది అని మిమ్మల్ని పలకరించడానికి వచ్చాను అంటుంది మాయ. ఆ మాటలకి కోపంతో రెచ్చిపోయాను విక్కీ నేనేమైనా మాల్ లో వస్తువును చూసి పోవడానికి అంటే పద్మావతి మీదికి వస్తాడు విక్కి. ఆగండి ఆగండి మేడి మీదకి వస్తున్నారేంటి అవును మిమ్మల్ని చూడటానికి రాలేదు ఏదో చెబుదామని వచ్చాను కానీ మీరు వినే మూడ్ లో లేరు అందుకే వెళ్ళిపోతున్నాను అంటాది పద్మావతి.
అంతా నీ ఇష్టమేనా ముందు నాతో ఏం పని మీద వచ్చావో చెప్పు అంటాడు విక్కి. ఇక్కడ చెప్పను నాతో వస్తే చెప్తాను అంటుంది పద్మావతి. నువ్వు పిలిస్తే నేను రావడం ఏంటి నెంబర్ అంటాడు విక్కీ. పిచ్చి కోపంలో ఉన్నారు ఇంకేం వస్తారు అంటుంది పద్మావతి. నేను కోపంగా ఉన్నానా అంటాడు విక్కీ. మీరు కోపంగా లేరు సార్ నేనే కోపంగా ఉన్నాను, వస్తాను అంటూ వెళ్ళిపోబోతుంది పద్మావతి. మర్యాదగా నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు అంటాడు విక్కీ. ఎక్కడ కాదు నాతో పాటు వస్తేనే చెప్తాను అంటుంది పద్మావతి.
Nuvvu Nenu Prema December 26 Today Episode:
ఆలోచనలో పడ్డ విక్కిని నాకు తెలుసు సార్ మీరు రారని అందుకే నేను పోతాను అంటుంది పద్మావతి. నీకు ఎంత ధైర్యం నన్నే బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తావా అంటాడు విక్కీ. మీరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ మీరు నాతో వస్తేనే చెప్తాను అంటుంది పద్మావతి. తరువాయి భాగంలోలో నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటాడు విక్కీ. అక్కడ ఉన్న పిల్లలు ఈయన ఎవరక్క సినిమా హీరోలాగా ఉన్నారు అంటారు. మీరిద్దరూ ప్రేమికులగా ఉన్నారు అంటాడు ఇంకొక బాబు. ఆ మాటలకి షాక్ అయిపోతుంది పద్మావతి.