Nuvvu Nenu Prema December 27 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మీరు నాతో వస్తేనే చెప్తాను అంటుంది పద్మావతి. తను నా దగ్గర ఏదో దాస్తుంది తనతో వెళ్తేనే తెలుస్తుంది అనుకుంటాడు విక్కీ. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని విక్కీ అంటే మీరు ఏమైనా అనుకోండి అంటుంది పద్మావతి. సరే వెళ్దాం కదా అని విక్కీ అంటే మొదటి స్టెప్ లోనే విజయం సాధించావు అని తనని తానే పొగుడుకుంటుంది పద్మావతి.
పద్మావతి మేడం సూపర్ అంటున్న అటెండర్..
వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోతుంటే చూసి ఆశ్చర్యపోతారు మాయ, అటెండర్. పద్మావతి మేడం చూడ్డానికి తింగరిదాని లాగా కనిపిస్తుంది కానీ సార్ నే మేనేజ్ చేసిందంటే గ్రేట్ కదా ఆయన్ని మేనేజ్ చేయడం తెలియక మనం తిట్లు తిన్నాం అంటాడు ఆ అటెండర్. సార్ ని హ్యాండిల్ చేయాలంటే పద్మావతి మేడమే కరెక్ట్ అని అటెండర్ అంటే కోపంగా చూస్తుంది మాయ. మరోవైపు కారులో వెళ్తున్న ఆర్య మీ చెల్లికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా అని అనుని అడుగుతాడు. లేదు అని అను అంటే తన కూడా పెళ్లి వచ్చింది కదా అంటాడు ఆర్య.
తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట అంటుంది అను. జోక్ చేస్తున్నావా అంటాడు ఆర్య. లేదండి మాపాటికి మేము పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మా అమ్మానాన్నని చూసుకోవడానికి ఎవరు ఉండరని తను ఈ నిర్ణయం తీసుకుంది అంటుంది అను. ఇప్పుడు మా విక్కీ పరిస్థితి ఏంటో అంటాడు ఆర్య. ఆ మాటకి షాక్ అయిన అను ఏమన్నారు అంటుంది. నువ్వు హ్యాపీగా ఉండాలని మీ చెల్లి అనుకున్నట్టు తను హ్యాపీగా ఉండాలని నువ్వు కూడా అనుకోవాలి కదా తనని బలవంతంగా నైనా ఒప్పించి అత్తారింటికి పంపించాలి కదా అంటాడు ఆర్య.
ఆర్య మీద కేకలు వేస్తున్న అను..
నిజమే కానీ తను కొన్ని కండిషన్స్ పెట్టింది అంటుంది అను. ఏంటవి అంటాడు ఆర్య. ఒకవేళ తన పెళ్లి చేసుకుంటే వచ్చినవాడు తనతోనే ఉండి మా అమ్మానాన్నలని ప్రేమగా చూసుకోవాలి అనుకుంటుంది అంటుంది అను. అయితే విక్కీ చస్తే ఈ పెళ్లి ఒప్పుకోడు అనుకుంటాడు ఆర్య. ఈ రోజుల్లో ఇద్దరు వేరు కాపరమైన పెడుతున్నారు కానీ ఇల్లరికానికి ఒప్పుకోరు అంటాడు ఆర్య. ఏం ఎందుకు జరగదు ఎప్పుడు మేమే అత్తారింటికి రావాలా మీరు ఇల్లరికానికి రాకూడదా అంటూ కోపంగా మాట్లాడుతుంది అను.
వాళ్ళిద్దర్నీ కలుపుదాం చూస్తే మా ఇద్దరికీ చెడే లాగా ఉంది అంటూ టాపిక్ మార్చేస్తాడు ఆర్య . తను నాకన్నా మా అమ్మానాన్నల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది అందుకే తనంటే మా అందరికీ చాలా ఇష్టం. నిజానికి మా పద్మావతిని పెళ్లి చేసుకోవాలంటే అతని పెట్టి ఉండాలి అంటుంది. ఎన్ని జన్మలకైనా పద్మావతి నా చెల్లిగా ఉండాలని కోరుకుంటాను. సీన్ కట్ చేస్తే ఈ కుచల అన్ని బ్రాండెడ్ వే వాడుతుంది అంచేత అంతా బ్రాండెడ్ మేకప్ కిట్టే పంపించు అంటూ ఫోన్ పెట్టేస్తుంది కుచల.
పద్మావతికి ఈరోజే ఆఖరి రోజు అంటున్న కుచల..
అంతలోనే అక్కడికి వచ్చిన మాయని అప్పుడే ఆఫీసు నుంచి వచ్చేసావేం అంటుంది కుచల. ఆఫీసులో జరిగిందంతా చెప్తుంది మాయ. ఏమి పర్వాలేదులే పద్మావతి ఎవరేం చెప్పినా వినదు కదా, విక్కీ కోపాన్ని తను కూడా ఫేస్ చేయని అప్పుడు తెలుస్తుంది, నాకు తెలిసి పద్మావతికి ఇదే ఆఖరి రోజు అంటూ నవ్వుతుంది కుచల. కారులో వెళ్తున్న పద్మావతి ఈ సైలెన్స్, వైయలెన్స్ కన్నా ఘోరంగా ఉంది అంటూ కారులో పాటలు పెడుతుంది పద్మావతి.
ఇప్పుడు అవసరమా అని విక్కీ అడిగితే కామ్ గా ఉండడం నావల్ల కాదు సార్, కనీసం పాటలైనా విన్నివ్వండి అంటుంది పద్మావతి. నన్ను ఇరిటేట్ చేస్తూనే ఉంటావు ఇంకా పాటలు విన్నిస్తావా అంటాడు విక్కీ. నాకు తెలియక అడుగుతాను మనిషికి కోపం ఎందుకు వస్తుంది అంటుంది పద్మవతి. దానికి కోపంగా చూస్తాడు విక్కీ. అంటే మిమ్మల్ని కాదు మామూలుగా అడుగుతున్నాను అంటుంది పద్మావతి.
పద్మావతి మాటలకి ఆలోచనలో పడ్డ విక్కీ..
తనకి ఇష్టం లేని పని చేస్తే కోపం ఏంటి, కొట్టాలన్నంత కలిసి కూడా వస్తుంది అంటాడు విక్కీ. ఇప్పుడు కారాపు కొడతాడా ఏంటి పని కంగారుపడుతుంది పద్మావతి. కానీ మనిషిలో నవరసాలు ఉండాలి కదా మీకు మాత్రం కోపమే ఎక్కువ వస్తుంది ఎందుకు అంటుంది పద్మావతి. నీ మాటలకి చేష్టలకి ఎవరికైనా కోపం వస్తుంది అంటాడు విక్కీ. నేను అందరికీ పనికొచ్చే పనిలే చేస్తాను కానీ కోపం తెప్పించే పనులు చేయను అంటూ పడిపోతున్న బ్యాగ్ ని పట్టుకోబోతుంది పద్మావతి.
దానికి డ్రైవింగ్ వీల్ స్లిప్ అయ్యి కార్ని పక్కనే ఆపేస్తాడు విక్కి. పద్మావతి వైపు కోపంగా చూస్తుంటే కాస్త చూసుకొని నడపండి సార్ మీకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత అంటూ అట్మాస్పియర్ ని కూల్ చేసేస్తుంది పద్మావతి. మనుషులకి కోపం రావడం సహజమే కానీ ఆ కోపాన్ని ఎదుటి వాళ్ళు మీరు చూపించినప్పుడు వాళ్ళు ఎంత బాధ పడతారో తెలుసా, ఒక్కొక్కసారి అది బాధ పెట్టడాన్నే కాదు ఆ బంధాన్ని కూడా తెంచేస్తుంది. అందుకే నలుగురితో మాట్లాడేటప్పుడు సంతోషంగా మాట్లాడాలి బాధపడేటప్పుడు ఒంటరిగా బాధపడాలి అంటుంది పద్మావతి.ఆ మాటలకి ఆలోచనలో పడతాడు విక్కీ.
తమ్ముడు కోసం బాధపడుతున్న అరవింద..
సీన్ కట్ చేస్తే ముభావంగా ఉన్న భార్యతో కోర్టుకు వెళ్లి వస్తానని చెప్తాడు కృష్ణ. తను పలకక పోవడంతో ఎం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. విక్కీ గురించి అంటుంది అరవింద. తనకే బానే ఉన్నాడు కదా అంటాడు కృష్ణ. బానే ఉన్నట్లు కనిపిస్తాడు కానీ గతం నుంచి బయటకు రాలేకపోతున్నాడు జరిగిందాన్ని తలుచుకుని బాధపడుతున్నాడు. మా అమ్మ దూరమైన దగ్గర్నుంచి వాడికి అక్కలా కాకుండా అమ్మలాగా అయ్యి అన్ని చేశాను.
కానీ వాడు నా సంతోషం కోసం ఏమైనా చేయాలని చూస్తున్నాడు కానీ వాడి సంతోషాన్ని మనతో పొందలేకపోతున్నాడు. చిన్న చిన్న ఆనందాన్ని కూడా దూరం చేసుకుంటున్నాడు అంటూ బాధపడుతుంది అరవింద. మళ్లీ విక్కీ మామూలు మనిషి ప్రశాంతంగా ఉంటే చూడాలని ఉంది అంటుంది అరవింద. ఆ కోరిక నీకే కాదు నాకు ఉంది అంటుంది వాళ్ళ నానమ్మ. వాడిలో మార్పు రావాలంటే ఒక అద్భుతం జరగాలి, అది ఎప్పుడు ఎవరివల్ల జరుగుతుందో ఆ భగవంతుడే నిర్ణయించాలి అంటూ బాధపడుతుంది విక్కీ వాళ్ళ నాన్నమ్మ.
విక్కీని అనాధాశ్రమానికి తీసుకువెళ్లిన పద్మావతి..
సీన్ కట్ చేస్తే అనాధాశ్రమానికి వస్తుంది పద్మావతి. క్రిస్మస్ తాతయ్య వేషంలో పిల్లలందరికీ గిఫ్టులు పంచుతుంది. అక్కడికి వచ్చిన విక్కీ అదంతా చూస్తాడు. మాకోసం ఇన్ని గిఫ్ట్లు తెచ్చారు థాంక్యూ అంటుంది ఒక పాప. ప్రేమతో తెస్తే థాంక్యూ చెప్పకూడదు పద్మావతి. తెలిసిన గొంతుకు లాగా ఉంది ఒకసారి నిన్ను చూస్తాం అంటే మేకప్ అంతా తీసేస్తుంది పద్మావతి. అక్క నువ్వా అంటూ సంబరపడిపోతారు పిల్లలు.
ఏ అనాధ పిల్లలకి ఎప్పుడూ ఏం కావాలన్నా అమ్మ లాగా దగ్గరుండి తీరుస్తావ్,నీది మంచి మనసు అంటుంది ఆ వార్డెన్. అదంతా చూస్తున్న విక్కీ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్ అని అడుగుతాడు. మనం వెళ్లే దారిలోనే ఈ అనాధాశ్రమం ఉంది కదా, నేను ఇట్లాంటి అనాధాశ్రమం నుంచి వచ్చిన దాన్నే కదా అందుకే ఈ ఆశ్రమం అన్న ఈ పిల్లలన్న నాకు చాలా ఇష్టం. నాకు సంతోషం వచ్చినా బాధ వచ్చిన కాసేపు వీళ్ళతో ఉంటాను అంటుంది పద్మావతి.
పద్మావతి రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన విక్కీ..
ఈరోజు కూడా వీళ్ళతో 10 నిమిషాలు ఉండాలని వచ్చాను కాసేపు ఉండిపోదాం కాదనొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది పద్మావతి. దానికి యాక్సెప్ట్ చేస్తాడు విక్కీ. చూడ్డానికి సినిమా హీరో లాగా ఉన్నాడు ఎవరు ఈ అంకుల్ అని అడుగుతుంది ఒక పాప. ఈ అంకుల్ ఎవరంటే అంటూ ఏదో చెప్పబోతుంది పద్మావతి. ఓయ్ నువ్వు కూడా అంకుల్ అంటున్నావ్ ఏంటి? నీక్కూడా అంత ఏజ్డ్ పర్సన్ గా కనిపిస్తున్నానా అంటాడు విక్కీ.
Nuvvu Nenu Prema December 27 Today Episode:
కోప్పడకండి సార్ వెళ్లలేదు తెలియక అన్నారు నేను చెప్తాను కదా అంటుంది పద్మావతి. నువ్వేమీ చెప్పక్కర్లేదు మీరు లవర్స్ అని అర్థమవుతుంది అంటాడు ఒక బాబు. ఆ మాటలకి షాక్ అయిపోతుంది పద్మావతి. మీ ఇద్దరి జోడి సూపర్ అని వాళ్ళు అంటే విక్కీ ఎక్కడ కోప్పడతాడు అని కంగారు పడిపోతుంది పద్మావతి. ఈ హీరో మనకి అంకుల్ కాదు బావ అవుతాడు అన్నమాట అంటారు ఆ పిల్లలు.
కంగారుపడుతూ అందరినీ ఆపమంటుంది పద్మావతి. ఈయన బాగా అవుతారు కానీ మీరు అనుకునేటట్లు కాదు అంటుంది పద్మావతి. బావ ఎలాగైనా బావే అంటారు పిల్లలు. తరువాయి భాగంలో పార్టీలో అందరూ ఉంటారు ఇంకా విక్కీ రాకపోవడంతో బర్త్ డే బాయ్ ఏడి అని అడుగుతాడు వాళ్ళ బాబాయ్. అదిగో వస్తున్నాడు అంటూ మెట్లు దిగుతున్న విక్కిని చూపిస్తుంది కుచల.