Nuvvu Nenu Prema December 28 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో బావ బావ అంటున్న పిల్లల్ని తను నాకు బాగా అవుతారు కానీ మీరు అనుకుంటున్న బావ కాదు అంటుంది పద్మావతి. బావ ఎలాగైనా బావే అంటూ అతన్ని తీసుకొని లోపలికి వెళ్లిపోతారు పిల్లలు. పిల్లలందరికీ వడ్డిస్తున్న పద్మావతిని చూస్తూ ఉండిపోతాడు అరవింద్. అలా నిలిచింది పోయావే నువ్వు కూడా వచ్చి కూర్చో అని విక్కిని కూర్చోమంటారు పిల్లలు.
విక్కీని రిక్వెస్ట్ చేస్తున్న పద్మావతి..
అక్క చేసిన వంట తింటే వదిలిపెట్టరు. రండి అంటారు వాళ్లు. మనం చెప్తే వినరు రా అక్క చెప్తేనే బావ వింటాడు అంటూ పద్మావతి తో అక్క నువ్వు చెప్పు అక్క అంటారు వాళ్ళు. మీ అల్లరి ఆపండ్రా అంటూ విక్కీ దగ్గరికి వెళ్లి మీరు వీళ్ళతో భోజనం చేస్తే వాళ్లు కూడా చాలా సంతోషిస్తారు, కాదనొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది పద్మావతి. పద్మావతిని అలానే చూస్తూ ఉండిపోయిన విక్కీని అక్కని చూసింది చాలు కూర్చో అంటాడు ఒక పిల్లోడు.
త్వరగా వడ్డించక్క నీ చేతి వంట తిని చాలా రోజులైంది అంటారు ఆ పిల్లలు. అన్నం తినేముందు దేవుడికి దండం పెట్టుకోమంటుంది పద్మావతి. అదంతా కొత్తగా చూస్తాడు విక్కీ. అలా చూస్తారు ఏంటి సార్ అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ అదృష్టం మన కంచంలోకి వస్తుంది అలాంటి అన్నానికి దండం పెట్టడంలో తప్పులేదు అంటే పిల్లల్ని స్టార్ట్ చేయమంటుంది పద్మావతి.
పద్మావతి చెప్పింది విని షాకైన విక్కీ..
వాళ్లు ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు తినండి కొంచెం కూడా వదలకుండా నిదానంగా తినండి పద్మావతి. నీ వంట సూపర్ గా ఉంది అక్క అన్ని చాలా బాగున్నాయి అంటారు పిల్లలు. మంచి భోజనం పెట్టారు అక్క థాంక్స్ అంటారు ఆ పిల్లలు. థాంక్స్ నాకు కాదు తనకి చెప్పండి అంటూ విక్కీని చూపిస్తుంది పద్మావతి. వాళ్లందరూ విక్కీకి థాంక్స్ చెప్తారు. నాకెందుకు థాంక్స్ అని అడిగితే మీ పేరు మీదే వీళ్ళకి భోజనం పెట్టాను అంటుంది పద్మావతి. నా పేరు మీద ఎందుకు అని అడుగుతాడు విక్కీ. మీ మాట కఠినమైన మీ మనసు చాలా మంచిది.
కష్టాల్లో ఉన్న చాలామందిని ఆదుకున్నారు అందులో నేను కూడా ఉన్నాను. మీలాంటి మంచోళ్ళు ఎప్పుడు బాగుండాలి అందుకే ఈ పసి మనసుల దీవెనలు మీకు అందాలని ఇలా చేశాను అంటుంది పద్మావతి. ఆ మాటలకి సంతోషిస్తాడు విక్కీ. చెయ్యి కడుక్కుంటున్న విక్కీ గడ్డానికి అన్నం అంటుకుంటే చేత్తో తుడుస్తుంది పద్మావతి. నేను ఎక్కడికి అని అడిగినా చెప్పకుండా ఈ బ్యూటిఫుల్ ప్లేస్ కి తీసుకు వచ్చినందుకు థాంక్స్.ఈ మూమెంట్స్ ని నేను లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను అంటాడు విక్కీ.
విక్కీ తో కన్నీరు పెట్టించిన పద్మావతి..
ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది విక్కీ. అప్పుడే ఏం చూసారు ఇంకా చాలా ఉంది అంటుంది పద్మావతి. ఇంకానా ఏంటది అంటాడు విక్కి. అతని కోపాన్ని చూసిన పద్మావతి ఏం లేదు అనేస్తుంది. అంతలోనే అక్కడికి వచ్చిన ఒక బాబు ఈరోజు ఎవరిదో బర్త్డే అన్నావు కదా ఎవరిది అంటాడు ఒక బాబు. విక్కిని చూపిస్తుంది పద్మావతి. ఒరేయ్ ఈరోజు బావ పుట్టినరోజు ఏంట్రా అంటాడు ఆ బాబు. మిగతా పిల్లలందరూ వచ్చి మీ పుట్టినరోజు గ్రాండ్గా చేస్తాం రా బావ అని లోపలికి తీసుకువెళ్తారు.
లోపలికి వెళ్లేసరికి పూలతో పువ్వులతో హ్యాపీ బర్త్డే అని రాసి ఉంటుంది. దానికి చాలా హ్యాపీ ఫీలవుతాడు విక్కీ. హ్యాపీ బర్త్డే బావగారు అంటూ ఒక్కొక్క పాప వచ్చి విషెస్ చెప్తుంటే కన్నీరు పెట్టుకుంటాడు విక్కీ. మీ కళ్ళల్లో కోపం కాకుండా ఇలాంటి ఆనందం చూడాలని ఇక్కడికి తీసుకువచ్చాను. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ హ్యాపీ బర్త్డే చెప్తుంది పద్మావతి. ఇప్పటికే ఈ టైం చాలా వేస్ట్ చేసినందుకు సారీ ఇంకా పదండి వెళ్దాం అంటుంది పద్మావతి.
పద్మావతి కి థాంక్స్ చెప్పిన విక్కీ..
అప్పుడే వెళ్ళిపోతావా అక్క, బావ గారితో కలిసి కాసేపు ఉండొచ్చు కదా అంటారు పిల్లలు. నేను ఎక్కడికి వెళ్తాను నాకు కావలసినప్పుడు వస్తాను అంటుంది పద్మావతి. తను ఎక్కడికి వెళ్తుంది రెండు రోజులకు ఒకసారి వచ్చి మీకు కావాల్సినవన్నీ ఇచ్చి వెళ్తుంది తను మీకు దేవుడిచ్చిన అక్క అంటుంది వార్డెన్. అప్పుడు పిల్లలందరూ వాళ్ళిద్దరికీ సెండ్ఆఫ్ ఇచ్చి పంపిస్తారు.
కారు దగ్గరికి వచ్చిన విక్కీ పద్మావతికి థాంక్స్ చెప్పి మర్చిపోవాలనుకుంటున్న పుట్టినరోజుని నాకే కొత్తగా ఎప్పటికీ మర్చిపోలేనంత ఆనందంగా గుర్తుపెట్టుకునేలాగా చేసావు అంటాడు. నా ఆనందానికి కారణం నువ్వే నీతో పాటు రాకపోయి ఉంటే నేను ఈ ఆనందాన్ని పొందలేకపోయేవాడిని. నీ అల్లరి వెనుక ఇంత మంచితనం ఉందని ఇప్పుడే అర్థమైంది. నువ్వు ఇవన్నీ ఎలాగా చేయగలుగుతున్నావ్ అంటాడు విక్కీ.
ఆలోచనలలో పడ్డ విక్రమాదిత్య..
డబ్బులు పంచితే కరిగిపోతాయి కానీ ప్రేమని పంచితే అది తిరిగి మన దగ్గరికి వస్తుంది అంటుంది పద్మావతి. అంటే అర్థం కాలేదు అంటాడు విక్కీ. ఏమీ లేదు సార్ మీరు ఎవరికైతే సంతోషాన్ని ఇస్తారో వాళ్లే మళ్ళీ మీకు తిరిగి సంతోషాన్ని ఇస్తారు. ఇప్పుడు వీళ్ళనే చూడండి మీకు ఏమీ కానీ ఈ పిల్లలు మీ బర్త్డే సెలబ్రేట్ చేసి ఎంత ఆనంద పడుతున్నారో అలాంటిది మీ వాళ్ళతో నీ బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ల ఆనందానికి హద్దులు ఉంటాయా చెప్పండి.
ఎదుటి వాళ్ళ కోసం బ్రతకడంలోనే అసలైన అర్థం ఉంది. మీరు ఇంకా పాత విషయాల్ని మనసులో పెట్టుకొని, కోపాన్ని అడ్డం పెట్టుకొని మీరు బాధపడుతున్నదే కాకుండా మీ వాళ్లను కూడా బాధ పెడుతున్నారు దేనికో చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడ పొందిన సంతోషాన్ని వాళ్లతో కూడా పంచుకుంటే అప్పుడు సంతోషం వెలకట్టలేనిది దాన్ని అనుభవించి తీరాలి అంతే అంటుంది పద్మావతి. ఆ మాటలకి ఆలోచనలో పడిపోతాడు విక్కీ.
విక్కీలో మార్పు రాదంటున్న అరవింద..
సీన్ కట్ చేస్తే మాయ కి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్లో మాట్లాడుతూ ఏమి వద్దు బర్త్డే పార్టీ క్యాన్సిల్ అయింది మనీ ఎంత అయిందో చెప్తే ఫార్వర్డ్ చేస్తాను అంటుంది మాయ. విక్కీ బర్త్ డే ని సెలబ్రేట్ చేయాలని ఏవేవో ప్లాన్ చేశాను కానీ అన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి అంటుంది మాయ. నీకు ఇది ఫస్ట్ ఏమేమో కానీ మాకు ఎవ్రీ ఇయర్ ఇది అలవాటే రాను రాను నీకు కూడా అలవాటైపోతుందిలే అంటుంది కుచల. వాడు ఎప్పటికప్పుడు మారుతాడు అనుకున్నా వాడిలో మార్పు రావడం లేదు అంటుంది అరవింద.
ఎంత మారదామనుకున్నా గతం వాడిని మారనివ్వటం లేదు అది తెలిసి కూడా నువ్వు బాధ పడితే ఎలా అంటూ అరవింద్ అని ఓదారుస్తాడు వాళ్ళ బాబాయ్.రోజు మొత్తం ఆలోచిస్తూ కూర్చున్న నో యూస్ నా మాట విని లైట్ తీసుకో అంటుంది కుచల. వాడి సంతోషాన్ని చూడలేకపోతున్నానని బాధగా ఉంది అంటుంది అరవింద. అప్పుడే అక్కడికి వచ్చిన పద్మావతి ఇంకా ఎవరు బాధపడక్కర్లేదు ఎవరెవరు ఎలాంటి అరేంజ్మెంట్ చేయాలనుకుంటున్నారు అన్నీ చేయండి అంటుంది.
Nuvvu Nenu Prema December 28 Today Episode:
ఏం మాట్లాడుతున్నావ్ పద్మావతి అంటుంది మాయ. మీరు ఏంటెంటి అయితే ప్లాన్ చేశారో అవన్నీ చేసేయండి అంటుంది పద్మావతి. తరువాయి భాగంలో ఏర్పాట్లు అన్ని పూర్తి అయిపోయాయి బర్త్డే స్టార్ట్ చేసేద్దామా అంటాడు అరవింద వాళ్ళ బాబాయ్. అందరూ ఒకే బర్త్ డే బాయ్ ఏడి అంటుంది అరవింద. అప్పుడే పద్మావతి మాలినీలతో కలిసి మెట్లు దిగుతున్న అరవింద్ చూపించి ఆదుకో నారి నారి నడుమ మురారి అని నవ్వుతుంది కుచల.