Nuvvu Nenu Prema December 30 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో తను తెచ్చిన డ్రెస్ వద్దన్నందుకు బాధపడుతుంది మాయ. నీ బర్త్డే నాక్కూడా స్పెషలే విక్కీ అంటుంది మాయ. నాది కూడా మిస్టేక్ ఉంది నిన్ను అడిగి తీసుకోవాల్సింది అంటుంది మాయ. అంతలోనే పక్క వాళ్ళు సంతోషం కోసం బ్రతకాలి అన్న పద్మావతి మాటలు గుర్తొచ్చి ఏదో ఆలోచనలో ఉండి తీసుకోలేదు ఇలా ఇవ్వు అని ఆ డ్రెస్ తీసుకుంటాడు విక్కీ.
తన ప్రవర్తన మార్చుకున్న విక్కి..
చాలా సంతోష పడిపోతూ ఈ డ్రెస్ వేసుకొని రా నేను కింద వెయిట్ చేస్తాను అంటూ కిందకి వచ్చేస్తుంది మాయ. ఇదేనా పక్క వాళ్ల సంతోషం కోసం బ్రతకడం అంటే అనుకుంటాడు విక్కీ. మరోవైపు పార్టీకి వచ్చిన పద్మావతి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు అరవింద వాళ్ళు. పార్టీకి పిలవగానే వచ్చినందుకు థాంక్స్ అంటుంది అరవింద. అంతలోనే అక్కడికి వచ్చిన ఆర్య , అనుని విష్ చేస్తూ ఆమె దగ్గరికి వెళ్ళబోతాడు.
అరవింద ఆపుతుంది. బావగారు ఇది మీ అన్నయ్య బర్త్ డే పార్టీ మీ పెళ్లి రిసెప్షన్ కాదు అంటూ బావగారిని ఆట పట్టిస్తుంది పద్మావతి. అందుకు సిగ్గుపడుతున్న ఆర్య అని సిగ్గు నీకు సూట్ అవ్వదు రా అంటుంది అరవింద. అంతలోనే అక్కడికి మాయ వచ్చి నేను తెచ్చిన డ్రెస్ విక్కి తీసుకున్నాడు అని చెప్తుంది. మీరు సూపర్ మేడం అంటుంది పద్మావతి. అంతలోనే క్యాటరింగ్ వాళ్ళు వచ్చి అరవిందని పిలుస్తారు.
సరదాలు కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయాయంటున్న ఆర్య..
మాయ, పద్మావతి తో చాలా చెప్పాలని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆర్య కామ్ గా అనుని తీసుకొని తన రూమ్ కి వెళ్ళిపోతాడు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంటుంది అను. నువ్వు ఎప్పుడూ నా రూమ్ చూడలేదు కదా అందుకే తీసుకొచ్చాను అంటాడు ఆర్య. ఎప్పుడు నీతో ఏకాంతంగా మాట్లాడాలన్నా మీ చెల్లి అడ్డు వస్తుంది. నా సరదాలు కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయాయి అవి తీర్చుకునే నిన్ను పంపిస్తాను అంటాడు ఆర్య.
కంగారు పడుతున్న అనుని మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా ఎందుకు భయం అంటాడు. మరోవైపు డ్రెస్స పైన వికీ ఈ డ్రెస్ సెలక్షన్ మాయాది లాగా లేదు పద్మావతిది లాగా అనిపిస్తుంది అనుకుంటాడు. అంతలోనే అక్కడికి వచ్చిన పద్మావతి మీరు రాజకుమారూడిలాగా కనిపిస్తున్నారు అంటుంది. మీకు మాయా మేడమ్ ఏంటి ఎవరైనా పడిపోతారు అంటూ దిష్టి చుక్క పెడుతుంది. మీరు రెడీయే కదా అంటుంది పద్మావతి.
ఎనిమిదో వింత చూస్తున్న పద్మావతి..
ఏం అలా కనిపించట్లేదా అంటాడు విక్కీ. అయితే కిందకి రండి మీకోసం అందరూ చాలా సంతోషంగా ఎదురుచూస్తున్నారు. వాళ్ళందరూ అంత సంతోషంగా ఉండడానికి కారణం నేనేనని తెగ పొగిడేస్తున్నారు అంటూ తెగ ఆనంద పడిపోతుంది పద్మావతి. అరవింద గారిని హ్యాపీగా ఉంచుతానని మాట ఇచ్చాను అలాగే ఉంచాను అదే ఈ పద్మావతి అంటే అంటుంది పద్మావతి.
కోపంగా చూస్తున్న విక్కీని అంటే మీరు కూడా గ్రేట్ ఏందండి మీ బర్త్డే ఒప్పుకోవటానికి ఒప్పుకోకపోతే వీళ్ళందరూ ఇంత హ్యాపీగా ఉండేవారు కాదు కదా అంటుంది పద్మావతి. ఆ మాటలకి నవ్వుతాడు విక్కీ. విక్కిని చూసి ఆశ్చర్యపోయి అతన్ని గిల్లుతుంది పద్మావతి. మెంటల్ ఎందుకలా గిల్లేవు అని విక్కీ అడిగితే మీరు నవ్వటం ఎనిమిదో వింత అది కళ్ళారా చూస్తున్నాను అంటుంది పద్మావతి. ఆ మాటలకి ఇద్దరూ నవ్వుకుంటారు. అరవింద దగ్గరికి వచ్చిన పద్మావతి మీరు ఒక్కరే కనిపిస్తున్నారు.
అరవింద కి సలహా ఇస్తున్న పద్మావతి..
మీ ఆయన ఏరి ఎప్పటిలాగా పని పడిందని బయటికి వెళ్లిపోలేదు కదా అంటుంది. అయినా ఎక్కడికి వెళ్ళలేదు పైనే ఉన్నారు రెడీ అవుతున్నారు అంటుంది. నేను ఏ ఫంక్షన్ లో కూడా ఆయన్ని చూడలేదు. ఏదో ఫోన్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోతే మీరు బాధపడతారు ఈసారి అలా కాకుండా చూసుకోండి. మీ తమ్ముడి బర్త్డే పార్టీ కదా మీరిద్దరూ కలిసి నీ తమ్ముడితో ఉంటే చూసే మాకు కూడా చాలా ఆనందం అంటుంది పద్మావతి.
మేకప్ వేసుకుంటున్న కుచల దగ్గరికి వచ్చి అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు నువ్వు ఏదో ఒక పని చేయొచ్చు కదా అంటాడు. ఇంకా ఆపు ఎంతసేపు పేడ పూసినట్టు పూస్తావ్ అంటాడు ఆమె భర్త. అంతలోనే అక్కడికి వచ్చిన అను అత్తమామల్ని పలకరిస్తుంది. కుచల కాళ్ళకి దండం పెడుతుంటే దీనికి ఏమి తక్కువ లేదు అంటుంది. ఆ అమ్మాయి మీ ఇంటికి కాబోయే కోడలు నోరు మూసుకొని దీవించు అంటాడు కుచల భర్త.
పెళ్లికి ముందే కోడల్ని సాధిస్తున్న కుచల..
అనుకున్నది సాధించావు కదా ఇంకా నన్ను సాధించాలన్న కాళ్లు పట్టుకున్నావ్ లే అంటూ కసురుకుంటుంది. నువ్వు ఏంటి కోడలివి ఇంటికి వచ్చిన అందర్నీ పలకరించు ఏ ఇబ్బంది వచ్చినా నాకు చెప్పు అని అనుకి చెప్పి, ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నీ భార్యని పరిచయం చేయు అని ఆర్య కి చెప్తాడు వాళ్ళ నాన్న. వాళ్లకి ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసు అందుకే ఈ ఇంటి కోడలు అవుతుంది అంటుంది కుచల. అంతలోనే అక్కడికి వచ్చిన ఆమె అత్తగారు అను అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి తను ఏం చేసినా నీకు నచ్చటం లేదు, ముందు ఆ భావాన్ని మనసులోంచి తీసేయ్ ప్రశాంతంగా ఉంటుంది అంటూ అనుని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతుంది ఆవిడ.
మరోవైపు తన గదిలో కంగారుపడుతూ ఉంటాడు కృష్ణ. బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి అను వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు. ఇప్పుడు నేను బయటికి అడుగుపెడితే శాశ్వతంగా ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టాలి. ఏదో ఒకటి చేసే ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి అనుకుంటాడు. అంతలోనే కిందటిసారిలాగా మీ నాన్నగారికి బాగోలేదు నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు అని చెప్పినట్లుగా ఇప్పుడు కూడా చెప్పాలి అని అనుకుంటాడు.
Nuvvu Nenu Prema December 30 Today Episode ఇరకాటంలో పడ్డ కృష్ణ..
ఫోన్ డయల్ చేసి మాట్లాడే లోపు అరవింద అక్కడికి వస్తుంది. సడన్గా అరవింద్ అని చూసి కంగారు పడిపోతాడు కృష్ణ. ఆ ఫోన్ ఇలా ఇవ్వండి అంటే పద్మావతికి దయచేసి మాట్లాడుతుందో ఏంటో అని భయపడిపోతాడు .భర్త చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. అలాగే కార్ కీస్ కూడా అతని దగ్గర నుంచి తీసేసుకుంటుంది. విక్కీ బర్త్ డే పార్టీ అయిపోయేంతవరకు ఈ రెండు నా దగ్గరే ఉంటాయి.
లేకపోతే ఏదో ఒకటి చెప్పి బయటికి వెళ్లిపోతారు. మీ పనులు ఎప్పుడూ ఉంటాయి కానీ విక్కీ చాలా సంవత్సరాల తర్వాత బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. సమయానికి మీరు లేకపోతే తను ఫీల్ అవుతాడు అది నాకు ఇష్టం లేదు అందుకే మీరు నాతోనే ఉండాలి. మనిద్దరం కలిసి తమ్ముని ఆశీర్వదించాలి త్వరగా రెడీ అవ్వండి అంటుంది అరవింద. తరువాయి భాగంలో బర్త్డే పార్టీలో పాట పాడుతున్న పద్మావతిని అందరి ముందు హాగ్ చేసుకుంటాడు విక్రమాదిత్య.