Nuvvu Nenu Prema December 31 Today Episode: ఈరోజు ఎపిసోడ్లో భర్త దగ్గర నుంచి ఫోను,కార్ కీస్ తీసుకుంటుంది అరవింద. నా తమ్ముడి బర్త్డే చాలా గ్రాండ్ గా జరుగుతుంది మనం పక్కనుండి ఆశీర్వదించాలి లేకపోతే చేస్తాను చాలా బాధపడతాడు రెడీ అయి రండి అంటూ తను వెళ్ళిపోతుంది అరవింద. నన్ను ఇలా ఇరికించేసిందేంటి అనుకుంటాడు కృష్ణ. పార్టీకి వస్తున్న అందర్నీ రిసీవ్ చేసుకుంటారు కుటుంబ సభ్యులు. అందరూ వచ్చేసారు విక్కీ ఎక్కడ అని అడుగుతాడు వాళ్ళ బాబాయ్.
విక్కీని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటున్న ఆర్య..
బర్త్డే బాయ్ ఎక్కడ అని అడుగుతుంది అరవింద. పెళ్ళికొడుకు ఎక్కడా అని అడిగాక ఇప్పుడు విక్కీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటాడు ఆర్య. అంతలోనే విక్కీ పద్మావతి మాయ కలిసి మెట్లు దిగుతూ ఉంటారు. అదిగో నారీ నారీ నడుమ మురారి వస్తున్నాడు. అంటుంది కుచల. పద్మావతిని విక్కీని పక్క పక్కన చూసి జంట ఎంత బాగుందో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటాడు ఆర్య. మాయని, విక్కీని చూసి పక్కన అరవింద లేకపోతే బాగుండు అనుకుంటుంది కుచల.
అక్క నువ్వు హ్యాపీయేనా నువ్వు హ్యాపీగా ఉండాలని నేను ఈ బర్త్ డే కి ఒప్పుకున్నాను అంటాడు విక్కి. నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే అంటుంది అరవింద. ఈరోజు మీ సంతోషాన్ని చూసి పైనున్న అమ్మ కూడా సంతోష్ పడుతుంది. నువ్వు ఎప్పుడు బాధపడకూడదు అంటుంది అరవింద. నీకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అంటుంది అరవింద. ఈ మాటలే వద్దనేది మీ ఆనందానికి కారణం మీ అనుబంధం అంటుంది పద్మావతి.
మాయని తిట్టుకుంటున్న కుచల..
నువ్వు ఎన్నన్నా ఇప్పుడు ఈ సంతోషానికి కారణం నువ్వే అంటారు విక్కి కుటుంబ సభ్యులు. పద్మావతిని మనసులోనే తిట్టుకుంటుంది కుచల. పద్మావతిని మాయ కూడా పొగుడుతుంటే ఇదొక పిచ్చిమాలోకం పద్మావతిని గుడ్డిగా నమ్ముతుంది ముందు దీనికి జ్ఞాన దయ్యం చేయాలి అనుకుంటుంది కుచల. విక్కీని కేక్ కట్ చేయడానికి పిలుస్తుంది అరవింద. కుచల మాయని పక్కకు తీసుకొని వెళ్ళి పద్మావతిని తెగ పొగుడుతున్నావు కదా చాలదేమో డప్పు కొట్టి చెప్పు అందరికీ తెలుస్తుంది అంటుంది కుచల.
నిజమే ఆంటీ నాకు ఈ ఐడియా రాలేదు అంటుంది మాయ. అందుకే నిన్ను తింగరబుచ్చి అనేది అంటుంది కుచల. విక్కీ బర్త్డే చేసుకోవట్లేదు అని బాధపడేది అరవింద తనని సంతోషపెట్టాలని ఒప్పుకున్నది విక్కి మధ్యలో పద్మావతి ఏం చేసింది, నిజానికి హాట్ క్రెడిట్ నీది నువ్వు కూడా దాన్నే పొగుడుతున్నావు అంటుంది కుచల. కానీ నిజంగానే పద్మావతి రిస్క్ చేసిందాంటి అంటుంది మాయ. అసలు విక్కీకి కాబోయే భారీ నువ్వా? పద్మావతా?అంటుంది. ఆ మాటకి నవ్వుతుంది మాయ.
కుచల మాటలకి నవ్వుతున్న మాయ..
విక్కీ ప్రేమించింది నన్ను ఆ పద్మావతిని కనీసం చూడనైనా చూడడు. నన్ను కాకుండా పద్మావతిని కిందికి పెళ్లి చేసుకుంటాడు అంటుంది మాయ. అలాగే నవ్వు, నవ్వి నవ్వి అందరి ముందు నువ్వే నవ్వుల పాలు అయిపోతావ్ అంటుంది. ఏమంటున్నారంటే అంటుంది మాయ. నేను నీలాగే డబ్బు లేని అను నా ఇంటి కోడలు ఏంటి అని నవ్వుకున్నాను కానీ ఇప్పుడేమైంది పద్మావతి కావాలని వాళ్ళ అక్కని మా వాడికి తగిలించింది. నువ్వు కూడా నాలాగే నెగ్లెక్ట్ చేస్తే ఆ పద్మావతి వచ్చి విక్కీని తగులుకుంటుంది అంటూ హితబోధ చేస్తుంది కుచల.
అక్కడ నుంచి నేరుగా అను దగ్గరికి వెళుతుంది. ఆమెని చూసిన అను లేచి నిలబడుతుంది. పర్వాలేదు భయం ఉన్నట్టు బాగానే నటిస్తున్నావు అయినా ఈ ఇంటి కోడల్ని అయిపోయాను అనుకుంటున్నావా అంత దర్జాగా కూర్చున్నావు అంటుంది కుచల. లేదండి చెదిరిపోయిన ఫ్లవర్స్ ని సర్దుతున్నాను అంటుంది అను. ఐస్ చేసేలా మాట్లాడడం మీకు అలవాటే ఇలా మాట్లాడే మా వాడిని బుట్టలో వేసుకున్నావ్ అంటుంది కుచల.
కాబోయే కోడల్ని అవమానించిన కుచల..
ఇలాంటి రిచ్ పార్టీకి ఇలా సింపుల్ గా ఉంటే నిన్ను ఎవరు గెస్ట్ అనుకోరు సరేలే జ్యూస్ తీసుకో అంటుంది కుచల. అప్పటికే బాధలో ఉన్న అను జ్యూస్ తీసుకోవటానికి ఇష్టపడదు. నేను చెప్పిన తీసుకోవా తీసుకో అంటూ ఆర్డర్ వేస్తుంది కుచల. జ్యూస్ తీసుకోబోతున్న అను మీద తను కూడా జ్యూస్ తీసుకుంటున్నట్టుగా తీసుకొని ఆమె మీద ఒంపేస్తుంది కుచల. అయ్యో నీ డ్రెస్ పాడైపోయింది ఎలా? ఇలా ఉంటే నీ పరువు కాదు మా పరువు పోతుంది డ్రైవర్ ని పంపిస్తాను ఇంటికి వెళ్ళు అంటుంది కుచల.
ఆమె మాటలకి భయపడి వెళ్లబోతుంది అను. అంతలోనే అక్కడికి వచ్చిన ఆర్య మిషిన్ తెలుసుకొని ఈ మాత్రానికే ఇంటికి వెళ్లిపోవడం ఎందుకు నాతో రా అంటూ ఆమె చేయి పట్టుకుంటాడు. అందుకు షాక్ అయినా కుచల గెస్ట్ ల ముందు ఇలా తిరిగితే బాగోదు ఆమెని పంపించేయ్ అంటుంది. తన సంగతి నేను చూసుకుంటాను నువ్వేమీ బాధపడకు అంటూ అను తీసుకుని వెళ్ళిపోతాడు ఆర్య. నాకు శత్రువులు ఎక్కడో లేరు అంటూ కొడుకుని తిట్టుకుంటుంది కుచల.
ఆర్య ప్రేమకి కరిగిపోయిన అను..
ఏడుస్తున్న అనుని కూర్చోబెట్టి ఎందుకు ఏడుస్తావు మరకై కదా పడింది అంటాడు ఆర్య. మీరు మరక గురించి ఆలోచిస్తున్నారు, నేను మీ అమ్మగారికి నా మీద ఉన్న కోపం గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటుంది అను. ఇప్పుడు ఈ డ్రెస్ లో పార్టీలో ఉంటే బాగోదు నేను వెళ్తాను అంటుంది అను. ఇప్పుడు ఈ డ్రెస్ మార్చేయాలి అంతే కదా అంటాడు ఆర్య. పోయి నాకోసం డ్రెస్ తీసుకొస్తారా వద్దు అంటుంది అను. నువ్వు మా అమ్మ తిడుతుందని భయపడుతున్నావా నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు.
అన్ని నీకోసమే తీసుకొని వచ్చాను నీకు నచ్చింది వేసుకో అంటూ తన వార్డ్ రోబ్ ఓపెన్ చేస్తాడు ఆర్య. అందులో ఉన్న బట్టలు,నగలు చూసి షాక్ అయిపోతుంది అను. అన్ని నీకోసమే కొన్నాను నీకు ఏది నచ్చితే అది వేసుకో అంటాడు ఆర్య. నన్ను ఇంతలా ప్రేమిస్తున్నారు అందుకే మీ ప్రేమ కోసం నేను ఎంత బాధనైనా భరిస్తాను అనుకుంటుంది అను. నీకు నచ్చింది కట్టుకొని త్వరగా రెడీ అవ్వు ఆర్య. అంది అందని అందం మీ ఆడవాళ్ళకే సొంతం ఏం చేస్తాం వెయిట్ చేస్తాం అనుకుంటాడు ఆర్య.
విక్కీ మాటలు అర్థం చేసుకోలేకపోతున్న పద్మావతి..
పని వాళ్ళకి పనులు చెబుతూ తెగ హడావిడి పడిపోతుంది పద్మావతి. టెంపరోడ్ని బర్త్డేకి ఒప్పిస్తే చాలు అనుకున్నాను అంతేకానీ ఇంత పని ఉంటుంది అనుకోలేదు అంటూ నీరస పడిపోతుంది పద్మావతి. అంతలోనే వికీ జ్యూస్ ఇస్తే ఎవరో ఇస్తున్నారు అనుకొని నేను జ్యూస్ తాగడం చూస్తే టెంపరోడు కోప్పడతాడు అనుకుంటూ విక్కీని చూసి కంగారు పడిపోతుంది పద్మావతి. నీ డ్రామాలు ఆపు అని విక్కీ అంటే నేను నిజంగానే పనిచేస్తున్నాను సార్, అంటుంది పద్మావతి.
పనిచేసి అలుపు వచ్చింది అన్నావు కదా ఈ జ్యూస్ తాగు అంటాడు విక్కీ. మిమ్మల్ని చూసినా కంగారులో అలుపు ఆయాసం ఎగిరిపోయాయి అంటుంది పద్మావతి. తాగమన్నాను కదా తాగు అంటూ ఆర్డర్ వేస్తాడు విక్కీ. జ్యూస్ తాగిన తర్వాత అన్ని పనులు చేస్తున్నావ్ కానీ నేను చెప్పిన పని చేసావా అని అడుగుతాడు విక్కీ. తను చేసిన పనులన్నీ చెప్తుంది పద్మావతి అయ్యన్నీ కాదు నేను చెప్పిన అతి ముఖ్యమైన పని అంటాడు విక్కి.
Nuvvu Nenu Prema December 31 Today Episode: విక్కీ మాటలకి తల పట్టుకున్న పద్మావతి..
అదేంటో అర్థం కాదు పద్మావతికి. సరే నేనే చెప్తాను మాయ అంటే నాకు ఇష్టం లేదని చెప్పమన్నాను కదా చెప్పావా లేదా అంటాడు విక్కి. మాటలకి కంగారుపడిన పద్మావతి గొణుగుతుంది. నువ్వు చెప్పలేదని నాకు అర్థమైంది ఈ పార్టీ అయ్యే లోపల నువ్వు ఈ విషయం మాయకు చెప్పాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్కి. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ తల పట్టు కూర్చుంటుంది పద్మావతి.
పంతులు మాయ పేరెంట్స్ కూడా పార్టీకి వస్తారు. వాళ్లని విక్కీ వాళ్ళ ఇంట్లో వాళ్లకి పరిచయం చేస్తుంది మాయ. తరువాయి భాగంలో పాట పాడుతున్న పద్మావతిని చూసి పార్టీలో అందరి ముందు ఆమెని హగ్ చేసుకుంటాడు విక్కీ.