Nuvvu Nenu Prema February 11 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఎక్కడున్నావ్ త్వరగా రా పద్మావతి విడిగా ఉన్న మనల్ని ఒకటి చేయాలని ఈ ఉంగరాలు ఎదురుచూస్తున్నాయి అనుకుంటాడు కృష్ణ. ఇంతలో అరవింద ఫోన్ చేయడంతో ఎంతైనా మొదటి భార్య కదా ఈ ఉంగరానికి తనే డబ్బు ఇచ్చింది అనుకుంటూ లిఫ్ట్ చేస్తాడు కృష్ణ. ఎక్కడ ఉన్నారు అని అరవింద అడిగితే కోర్టులో ఉన్నాను అంటాడు కృష్ణ.
భర్తని గుడ్డిగా నమ్ముతున్న అరవింద..
కోర్టు టైమ్ అయి చాలా సేపు అయింది ఇప్పుడు నిజం చెప్పండి అంటుంది అరవింద. నేను నా రెండో భార్య ఇంట్లో ఉంటున్నాను అంటే శ్రీరామచంద్రుడు లాంటివారు మీకు అబద్ధం సెట్ కాదు అంటుంది అరవింద. నువ్వు ఇలా నమ్మటమే నాకు కావలసింది అనుకుంటాడు అరవింద్. ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి ఒక పెద్ద మనిషి దగ్గరికి వచ్చాను ఇది గాని సక్సెస్ అయితే నేను కోరుకున్న వ్యక్తి నా సొంతమవుతుంది, కోరుకున్నది జరగాలని నాకు ఆల్ ద బెస్ట్ చెప్పు అంటాడు కృష్ణ.
మీరు అనుకున్నది ఏదైనా జరిగితే రాలేని మీ భార్యగా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఆల్ ద బెస్ట్ చెప్తుంది అరవింద. ఫోన్ పెట్టేసిన కృష్ణ నీ పెర్ఫార్మన్స్ కి మెచ్చుకోవాలి మీ రెండో భార్యతో ఎంగేజ్మెంట్ కోసం నీ మొదటి భార్య చేత విషెస్ చెప్పించుకున్నావు అని నవ్వుకుంటాడు కృష్ణ. మరోవైపు నాకే ఎదుటి చెప్తున్నావా నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు అంటూ ఆమె చేయిని గట్టిగా పట్టుకుంటాడు విక్కి. గుడిలో అందరూ వాళ్ళని వింతగా చూస్తుంటారు.
పద్మావతిని కోపంతో తోసేసిన విక్కీ..
అందరూ చూస్తున్నారు వదలండి అంటుంది పద్మావతి. నేను తగ్గాననే కదా నీ తల పొగరు అంటూ ఆమెని తోసేస్తాడు విక్కీ. ఆ ఊపికి కింద పడి గాజులు బద్దలైపోయి రక్తం కారుతుంది. అది చూసిన విక్కీ కంగారుగా ఆమె చేతిని తీసుకొని ఇలా జరుగుతుందనుకోలేదు సారీ అంటాడు. కంగారుగా పరిగెత్తుకొని వెళ్లి పసుపు గుడ్డ తెచ్చి వేలికి కడతాడు. వద్దని చెప్తున్న ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు నామీద ఏం అధికారం ఉందని ఇలా చేస్తున్నారు అంటూ గట్టిగా మాట్లాడుతుంది పద్మావతి.
నీకు నిజంగా తెలీదా నీకు అన్నీ తెలిసే ఇలా చేస్తున్నావు నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు విక్కీ. మీరే నా ప్రాబ్లమ్ నా పరిస్థితి ఇది అని చెప్తున్నా కూడా మీరు అర్థం చేసుకోవట్లేదు అంటే నేను ఏమనుకోవాలి, అయినా మీరు చెప్పినట్లుగా నేనెందుకు వినాలి నేనేమీ మీ దగ్గర పని చేయట్లేదు కదా మీ జీవితం మీది నా జీవితం నాది. ఇవాళ జీవితంలోకి పిలవకుండా రావడం తప్పు అవుతుంది అంటుంది పద్మావతి. ఆ మాటలకి కోపంతో చెయ్యెత్తుతాడు విక్కి.
అహంకారంతో మాట్లాడుతున్న విక్రమాదిత్య..
వింటున్నాను కదా అని లెక్చర్స్ ఇవ్వకు అసలు నువ్వు ఎవరు నాకు చెప్పటానికి, నాతో మాట్లాడే అర్హత కూడా లేదు నీకు నీ స్థాయి ఏంటో తెలిసి కూడా తగ్గించుకోవడం నేను చేసిన తప్పే, నీ వెంట పడుతున్న నే కదా నీ పొగరు ఈరోజు నుంచి నీ మొహం కూడా చూడను ఇంకెప్పుడూ నాకు ఎదురు పడకు అంటూ కోపంగా అంటాడు విక్కీ. మీకు అహంకారం ఎంతుందో నాకు ఆత్మ అభిమానం అంత ఉంది దాన్ని చంపుకొని బ్రతకలేను ఇంకెప్పుడు మీకు ఎదురుపడను అంటూ కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోతుంది పద్మావతి.
మరోవైపు ఇంటికి వచ్చిన పద్మావతిని చూసి ఇంకాసేపట్లో నా దానివి కాబోతున్నావు అంటూ ఆనందపడతాడు కృష్ణ. గదిలోకి వెళ్ళిపోబోతున్న పద్మావతిని ఆపి ఈరోజు మంచి రోజంట నీకు మురళి బాబుకి నిశ్చితార్థం చేద్దామనుకుంటున్నాము అంటుంది వాళ్ళ అత్త. ఆ మాటకి షాక్ అయినా పద్మావతి ఏం మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. ఇంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే ఎలాగా ఈ దివ్యమైన ముహూర్తంలో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగితే కలకాలం కలిసి మెలిసి ఉంటారు అంటుంది పద్మావతి వాళ్ళ అత్త.
తన నిర్ణయాన్ని కచ్చితంగా చెప్పిన పద్మావతి..
అసలు ఎవరిని అడిగి ఇదంతా చేస్తున్నావు, మీలో మీరు అనుకుంటే సరిపోతుందా నాతో ఒక మాట చెప్పరా అంటుంది పద్మావతి. సరేలే ఇప్పుడు చెప్పాం కదా వెళ్లి రెడీ అయ్యారా అంటుంది వాళ్ళ అత్త. నాకు ఇప్పుడు నిశ్చితార్థం చేసుకునే ఆలోచన లేదు అంటూ కచ్చితంగా చెప్తుంది పద్మావతి. పెద్దవాళ్లమే చెప్తున్న వినట్లేదు అంటే నీ గురించి మేము ఏమనుకోవాలి ఈ ముహూర్తం పోతే ఇలాంటి మంచి ముహూర్తం మళ్ళీ దొరకదు అంటూ తల్లి, అత్త బ్రతిమాలుతారు.
నిశ్చితార్థం చేసుకోవడానికి కావలసింది ముహూర్తం కాదు నిశ్చితార్థం చేసుకునే వాళ్ళు కూడా దానికి కొట్టుకొని ఉండాలి నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా అయినా ఎందుకు బలవంత పెడుతున్నారు నాకు ఇష్టం లేదు అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుందిపద్మవతి. వదిలేయండి తనకి ఆ ఉద్దేశం లేదని అంటుంది కదా అని బయటికి అన్నా లోపలికి మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లోని వదులుకోను అనుకుంటాడు కృష్ణ. తండ్రి దగ్గరికి వెళ్లి తన గోడు ని వెళ్లబోసుకుంటుంది పద్మావతి.
తండ్రితో తన బాధ చెప్పుకుంటున్న పద్మావతి..
జీవితానికి సంబంధించి ఒకటికి పది సార్లు ఆలోచించుకోమని అమ్మ అత్త ఇప్పుడు నన్ను బలవంతం చేస్తున్నారు, నాతో ఒక్క మాట కూడా చెప్పకపోతే నేను ఎలా తట్టుకుంటాను అంటుంది. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితి వేరు నేనేంటో నాకు అర్థం కావడం లేదు మాయ మేడం తో ఆ విక్రమాదిత్య గారి పెళ్లి జరగాలి అని నేను అనుకుంటుంటే హాయ్ నేను ఇప్పుడు నాతో కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అంటూ తండ్రికి చెప్పుకుంటుంది. తను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తన మనసులో ఏముందో కూడా తెలియటం లేదు ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావు అంటూ ఏడుస్తుంది.
ఇష్టం లేని పని చేసే కష్టపడుద్దని నువ్వే కదా చెప్పావు మరి ఇష్టం లేని పని నేను ఎలా చేసేది నువ్వు బాగుండి ఉండి ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదు, నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటుంది. నువ్వు చేసింది మంచి పని వాడు మంచివాడు కాదు దుర్మార్గుడు అంటూ మనసులోనే బాధపడతాడు పద్మావతి తండ్రి. తండ్రి బాధని అర్థం చేసుకున్న పద్మావతి తండ్రిని ఓదారుస్తుంది. ఇదంతా గమనిస్తున్న కృష్ణ చూస్తుంటే విక్రమాదిత్య వల్ల పద్మావతి డిస్టబైనట్లుగా ఉంది ఇలాగే వదిలేస్తే ఈ నిశ్చితార్థం విక్రమాదిత్యతో జరుగుతుంది.
Nuvvu Nenu Prema February 11 Today Episode:ప్రాణాలతో చెలగాటమాడుతున్న కృష్ణ..
ఎలాగైనా ఈరోజు నిశ్చితార్థం జరిగి తీరాలి అనుకుంటాడు కృష్ణ. మరోవైపు ఇంటికి వచ్చిన విక్కీని ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది మాయ. అప్పటికే కోపంలో ఉన్న విక్రమాదిత్య నేను ఎక్కడికి వెళ్లాలో మీకు చెప్పాలా అయినా నువ్వెందుకు నా పర్సనల్ విషయంలో దూరుతున్నావు డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను ఏమన్నానని ఇస్తాను నామీద కేకలు వేస్తున్నాడు వెళ్లేటప్పుడు బాగానే వెళ్లి కదా వచ్చేటప్పుడు ఇలా కోపంగా ఉన్నాడు అంటే ఏదో జరిగింది అని అనుకుంటుంది మాయ.
మరోవైపు పద్మావతి తండ్రి ఒంటరిగా ఉండడం చూసి అక్కడికి వస్తాడు కృష్ణ. నేను అనుకున్నది జరగలేదని నువ్వు ఆనందంగా ఉన్నావా నువ్వు ఆనందంగా ఉండకూడదని నేను వచ్చాను. పద్మావతి తో నా పెళ్లి అవ్వలేదు అన్నప్పుడు నిన్ను చంపేటానికే చూశాను అలాంటిది పద్మావతి తో నా ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది అంటే చూస్తూ ఊరుకుంటానా అందుకే నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయను చూస్తుంటే పద్మావతి నా చేయి దాటిపోయేలాగా ఉంది తనను దక్కించుకోవాలంటే నువ్వు ప్రాణాలు వదిలేయాలి అంటూ స్లో పాయిజన్ ఇంజక్షన్ చేయటానికి ప్రయత్నిస్తాడు.
భయపడుతున్న అతని చూసి భయంగా ఉందా ఏమీ పరవాలేదు నొప్పి లేకుండానే ప్రాణం పోతుంది పోతున్న నీ ప్రాణాన్ని అడ్డుపెట్టుకొని నేను పద్మావతిని ఎంగేజ్మెంట్ చేసుకుంటాను అంటాడు కృష్ణ. తరువాయి భాగంలో బాధతో విలవిలలాడుతున్న అతని దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు కుటుంబ సభ్యులు. ఇలాంటి సమయంలో వాళ్లు అనుకున్నది జరిగితే మళ్ళీ మామూలు మనుషులు అవుతారంట అని కృష్ణ చెప్తే బలవంతంగా ఒప్పుకుంటుంది పద్మావతి. కృష్ణ ఆమె చేతికి రింగ్ తొడుగుతాడు.