Nuvvu Nenu Prema February 4 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మనం కూడా డాన్స్ చేద్దాం రా పద్మావతిని తీసుకొని డాన్స్ చేయటానికి స్టేజి మీదకి వెళ్తాడు విక్కీ. పద్మావతి కూడా మైకంలో ఉన్నట్లుగా అతనితో డాన్స్ చేస్తుంది. సడన్ గా వాళ్ళిద్దర్నీ చూసిన కృష్ణ అదేంటి పద్మావతి ఆఫీస్ కి వెళ్తానని చెప్పి ఇక్కడికి వచ్చింది.

కోపంతో రగిలిపోతున్న కృష్ణ..

తను కూడా విక్కీతో ప్రేమలో పడిపోతుందా ఏదో ఒకటి చేయాలి వీళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచాలి అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డాన్స్ పూర్తవడంతో అందరూ క్లాప్స్ కొడతారు. మైకం నుంచి బయటికి వచ్చినట్లుగా అనిపించిన పద్మావతి ఇదేంటి నేను ఇలాగ బిహేవ్ చేశాను అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటుంది. ఇప్పటివరకు బానే ఉన్నావు కదా ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటాడు విక్కీ.

నా ప్రవర్తన కాదు నీ ప్రవర్తనే ఏదో తేడాగా ఉంది అనుకొని విక్కీ పిలిచిన వినిపించుకోకుండా బయటికి వచ్చేస్తుంది. నేను పోవాలి సర్ అంటుంది పద్మావతి. ఎక్కడికి వెళ్తావో చెప్పు నేను డ్రాప్ చేస్తాను అంటాడు విక్కీ. వద్దు అని పద్మావతి అంటే నిన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది నేను డ్రాప్ చేయవలసింది కూడా నేనే అంటాడు విక్కీ. మీ ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది ఇది ఎటు పోయి ఎటు వస్తుందో పని కంగారుపడిన పద్మావతి అటుగా వస్తున్న ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది.

పూర్తిగా విక్కీ మాయలో పడిపోయిన పద్మావతి..

ఆటో లో కూర్చున్న పద్మావతి,విక్కీ ఆలోచనలో మునిగిపోతుంది. శ్రీనివాస నాకు ఎందుకు ఇలాంటి ఆలోచనలు కలిగిస్తున్నావు నేను ఎప్పటికీ నాలాగే ఉండాలి ఆ టెంపరోడు గురించిన ఆలోచనలు నాకు రాకూడదు అంటూ దేవుడికి దండం పెట్టుకుంటుంది. టెంపరోడు అంటున్నారు నన్నేనా అంటాడు విక్కీ. సడన్గా ఆటో డ్రైవర్ ప్లేస్ లో విక్కీని చూసి షాక్ అవుతుంది పద్మావతి.

ఇప్పుడే కదా కారు తోలుతున్నారు అప్పుడే అది అమ్మేసి ఇది ఎలా కొన్నారు అంటుంది పద్మావతి. ఆటో ఆపిన విక్కీ నేనేం అడుగుతున్నాను, మీరేం చెప్తున్నారు? మీ ఏరియా వచ్చింది నాకు డబ్బులు ఇచ్చి కిందికి దిగండి అంటాడు. మీరు డబ్బులకి ఆటో నడపడం ఏంటి అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది పద్మావతి. ఇందాకట్నుంచి టెంపరోడు, టెంపరోడు అంటున్నారు ఏమైంది పొద్దున్నే భలే బేరం దొరికింది అని పద్మావతిని తిట్టుకుంటాడు ఆ డ్రైవర్.

ఆనందంతో గంతులు వేస్తున్న విక్కీ..

ఆటో లో ఉన్నది డ్రైవర్ అని టెంపరోడు కాదని అర్థమవుతుంది పద్మావతికి. అలాగే నడుచుకుని వస్తున్న పద్మావతికి పళ్ళు అమ్ముకునేవాడు, ఇస్త్రీ బండి వాడు కూడా విక్కి లాగే కనిపిస్తారు. ఇదంతా గమనిస్తున్న అను ఏం జరిగింది అని అడుగుతుంది. నాకు ఎవరిని చూసినా బాగా తెలిసిన ఒక వ్యక్తి లాగా కనబడుతున్నారు ఎందుకో అర్థం కావడం లేదు అంటూ అయోమయంగా చెప్తుంది.

నువ్వు ఎవరితోనైనా ప్రేమలో పడ్డావా అని అడుగుతుంది అను. అదేంటి అంత మాట నేసావు అని పద్మావతి అంటే మనకి ఎవరి మీద అయినా ఎక్కువగా ప్రేమ ఉన్న ఎక్కువగా కోపం ఉన్నా అలాగే జరుగుతుంది. నాక్కూడా ఆర్య గారు అలాగే కనిపించేవారు అంటుంది అను. ఇంటికి వచ్చిన విక్కీ ఆనందంతో డాన్స్ చేస్తూ అరవింద చేత కూడా డాన్స్ చేయిస్తాడు. ఏమైందిరా అంత ఆనందంగా ఉన్నావు అరవింద అంటే చాలా రోజుల నుంచి నన్ను వేధిస్తున్న సమస్యకి సమాధానం దొరికింది అంటూ డాన్స్ చేస్తూనే మాట్లాడుతాడు విక్కి.

ఏదో జరుగుతుంది అని అనుమాన పడుతున్న కుచల..

జాగ్రత్త అక్క పడిపోతుంది అని కుచల కంటే నువ్వు కూడా డాన్స్ చేద్దువు గానివి రా పిన్ని అంటూ తన చేతికి కూడా డాన్స్ చేపిస్తాడు. ఏమైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చిందా అంటుంది వాళ్ళ నాన్నమ్మ. అంతకన్నా కూడా చాలా ఆనందంగా ఉంది నానమ్మ అంటూ ఆమె చేత కూడా డాన్స్ వేయిస్తాడు విక్కి. నేనే దొరికేనా డాన్స్ వేయించడానికి అంటూ నవ్వుతుంది వాళ్ళ నానమ్మ. ఇంతలోనే ఫోన్ రావడంతో అక్కడినుంచి వెళ్ళిపోతాడు విక్కీ.

తనని ఇంత ఆనందంగా చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాము అంటుంది వాళ్ళ నాన్నమ్మ. గతాన్ని తలుచుకొని ఎక్కడ బాధలో ఉండిపోతాడో అనుకున్నాను కానీ కొత్త విక్కి లాగా కనిపిస్తున్నాడు అంటూ ఆనందపడుతుంది అరవింద. అంతా బానే ఉంది కానీ మాయా సంగతి ఏంటి ఇద్దరూ కలిసే కదా ఆఫీస్ కి వెళ్ళారు కానీ ఒక్కడే తిరిగి వచ్చాడేంటి ఏదో జరుగుతుంది అని అనుమాన పడుతుంది కుచల.

Nuvvu Nenu Prema February 4 Today Episode:పూర్తి క్లారిటీ వచ్చింది అనుకుంటున్న విక్కీ..

మరోవైపు ఆలోచనలో ఉన్న పద్మావతి అక్క అన్నట్లుగా నేను నాకు తెలియకుండానే ప్రేమలో పడిపోతున్నానా?తనని దూరంగా ఉంచాలి అనుకుంటూనే దగ్గరవుతున్నాను. అసలు నా మనసులో ఏముంది నాకే అర్థం కావట్లేదు. ఈ కన్ఫ్యూషన్ కి ఎలా క్లారిటీ తెచ్చుకోవాలో ఏంటో అంటూ పరిష్కారం చూపించమని దేవునికి దండం పెట్టుకుంటుంది పద్మావతి. అదే సమయంలో చంద్రుడిలో పద్మావతి కనిపిస్తుంది విక్కీకి.

మన మనసులో ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉన్నారో చందమామలో కనిపిస్తారు అని అక్క చెప్పింది. కానీ పక్క ఏమో నా మనసులో ఉన్నది మాయ అని చెప్పింది. ఆ సమయంలో నాకు క్లారిటీ లేదు కాబట్టి నా మనసులో ఉన్న విషయం తెలుసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు పూర్తిగా నా మనసులో ఉన్నది నువ్వే అని అర్థమైంది అని అనుకుంటాడు విక్కీ. ఇద్దరూ ఒకరి గురించిన ఆలోచనల్లో ఒకరు ఉంటూ గులాబీ రేకులతో ఒకరి పేరు ఒకరు రాసుకుంటారు.

నన్ను నేనే మర్చిపోయాంతగా మార్చేసావు పద్మావతి అనుకుంటాడు విక్కి. తరువాయి భాగంలో ఆఫీస్ కి రావా అని మాయని అడుగుతాడు విక్కి. పద్మావతిని తీసుకొని షాపింగ్ కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను అంటుంది మాయ. నేను ఆఫీస్ కి వెళ్ళిపోతే పద్మావతిని చూడటం అవ్వదు అనుకుంటాడు విక్కీ. ఆలోచనలో ఉన్న విక్కీని ఏం జరిగింది అని మాయ అడిగితే కొంచెం హెడేక్ గా ఉంది అని చెప్తాడు. విక్కీ రూమ్ కి వచ్చిన పద్మావతి, విక్కిని చూసి నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే మంచిది అనుకుంటుంది.