Nuvvu Nenu Prema January 12 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మీ వాళ్ళు ఏమి పెట్టొద్దు అన్నారు కానీ మీరు ఏంటి దుడ్లు గురించి మాట్లాడుతున్నారు అంటుంది పద్మావతి వాళ్ళ అత్త. మీరు చనివిస్తే చంక నెక్కేస్తారని వాళ్ళకి తెలీదు కానీ నేను అలా కాదు చెప్పిన దానికి ఏ ఒక్కటి తగ్గినా మీ అమ్మాయి కాపురం కి మీ ఇంటికి వస్తుంది జాగ్రత్త మన మధ్యనే ఉండాలి తెలుసు కదా అంటూ హెచ్చరిస్తుంది కుచల.
స్పెషల్ స్వీట్ కావాలంటున్న ఆర్య..
ఇవన్నీ పక్క నుంచి వింటున్న కృష్ణ పర్వాలేదు మన మాటల ప్రభావం అత్తయ్య మీద బాగానే పడ్డాయి అని నవ్వుకుంటాడు. మరోవైపు కింద సిగ్గుపడతారని పైకి పంపిస్తే ఇక్కడ కూడా సిగ్గుపడతారేంటి అంటుంది పద్మావతి. సరే నేను ఇక్కడ ఉండి ఎవరైనా వస్తే సిగ్నల్ ఇస్తాను మీరు మాట్లాడుకోండి అని పక్కకి వెళ్ళిపోతుంది పద్మవతి. నీతో మాట్లాడడానికి రిస్క్ చేసి వచ్చాను స్పెషల్ స్వీట్ ఏమి లేదా అంటాడు ఆర్య.
అవునా తెస్తాను ఉండండి అని పద్మావతి దగ్గరికి వెళ్లి విషయం చెప్తుంది అను. స్పెషల్ స్వీట్ ఏంటబ్బా అని ఆలోచించిన పద్మావతి ఉండు నేను తెస్తాను అని కిందికి వెళ్తుంది. బెల్లం ముక్క తెచ్చిన పద్మావతి ఇదిగో స్పెషల్ స్వీట్ అంటుంది. బెల్లాన్ని తెచ్చి స్పెషల్ స్వీట్ అంటావేంటి అంటుంది అను. ఇది ఎందుకు స్వీట్ కాదు అని చెప్పి తనతో ఏదో చెప్తుంది పద్మావతి. అను, ఆర్య దగ్గరకు వెళ్లి కళ్ళు మూసుకోమని చెప్పి నోట్లో బెల్లం ముక్క పెడుతుంది.
మళ్లీ గొడవపడిన విక్కీ, పద్మావతి..
ఎలా ఉంది అని అడుగుతుంది అను. చాలా బాగుంది అంటే అది కేవలం బెల్లం ముక్క అంటుంది. అందుకే చాలా బాగుంది అంటాడు ఆర్య. మీరు దొరకడం నిజంగా నా అదృష్టం ఉంటుంది అను. ఇంతలోనే విక్కి ఆర్య కి ఫోన్ చేసి త్వరగా ఆఫీస్కి రమ్మని చెప్పాను కదా అంటాడు. పద్మావతి వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని ఆర్య అంటే ఆఫీసులో అంత పని పెట్టుకొని అక్కడేం పని రా అంటాడు. ఎవరి దగ్గర నుంచో ఫోన్ అనుకోని నేను ఫోన్ మేనేజ్ చేస్తాను మీరు హ్యాపీ తో మాట్లాడండి అని ఆ ఫోన్ పట్టుకుపోతుంది పద్మావతి.
ఫోన్లో విక్కీ గొంతుకుని షాక్ అవుతుంది పద్మావతి. నేను మేనేజ్ చేస్తానని చెప్పి ఇలా బుక్ అయ్యాను ఏంటి అనుకుంటుంది. ఆర్యతోనే మాట్లాడుతున్నాను అనుకొని పద్మావతిని తిట్టేస్తుంటాడు విక్కీ. ఏంటి ఇందాకటి నుంచి నన్ను తెగ తిడుతున్నారు అంటుంది పద్మావతి. నువ్వా అని విక్కీ అంటే నేనే ఏంటి మీ తమ్ముడుతో లేనిపోనివని చెప్తున్నారు అంటుంది పద్మావతి. నేను నిజాన్ని చెప్తున్నాను అయినా వాడి ఫోను నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటాడు విక్కి.
కన్ఫ్యూజన్లో ఉన్న పద్మావతి, విక్కీ..
మీకు నా మీద ప్రేమ ఎంత ఉందో తెలుసుకుందామని మరి లేకపోతే ఏంటి ఒక మంచి గురించి పూర్తిగా తెలుసుకోకుండా అలా ఎలా మాట్లాడేస్తారు అంటుంది పద్మావతి. ఇద్దరూ వాదులాడుకొని ఫోన్లో పెట్టేస్తారు. నాకే ఎందుకు ఫీల్ ఆఫ్ జరుగుతుంది అని ఇద్దరూ కన్ఫ్యూజన్లో పడతారు. అదే సమయంలో నేను చెప్పింది ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి అంటుంది కుచల.
నా కొడుక్కి షూ కొనడానికి వీళ్ళకి గతి లేదు ఇంక నా కోరికలు ఏం తీరుస్తారు. మీ అంతట మీరే డ్రాప్ అయ్యేలాగా చేస్తాను అనుకుంటుంది కుచల. అంతలోనే అక్కడికి వచ్చిన ఆర్య తో వచ్చిన పని అయిపోయింది కదా ఇక వెళ్దాం పద అంటుంది కుచల. దారిలో ఎదురుపడ్డ పద్మావతిని కోపంగా చూస్తుంది కుచల. అది గమనించిన ఆర్య ఆమెని అక్కడి నుంచి తీసుకుపోతాడు. తల్లి దగ్గరికి వచ్చినా పద్మావతి ఎందుకు డల్ గా ఉన్నారు ఆవిడ ఏమైనా అన్నారా అంటుంది.
ప్లాన్ ఫెయిల్ అయినందుకు బాధపడుతున్న కృష్ణ..
వాళ్ల అత్త ఏదో ఒక చెప్పబోతే అడ్డుకొని పక్కకి తీసుకొని వెళ్ళిపోతుంది పార్వతి. అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ ఫోన్ మాట్లాడుకుని ఉండిపోయాను షో కి వెళ్దాం పదండి అంటాడు. షో స్టార్ట్ అయిపోయి చాలా టైం అయిపోయి ఉంటుంది వెళ్లినా వేస్ట్ ఉంటుంది పద్మావతి. కష్టపడి వేసిన ప్లాన్ ఇలా ఫ్లాప్ అయిపోయింది అని బాధపడతాడు కృష్ణ. మరోవైపు విక్కీ మాయల పెళ్లి విషయం మాట్లాడటం కోసం వాళ్ళ ఇంటికి వస్తాడు మాయ వాళ్ళ నాన్న.
నాకు తెలిసిన సిద్ధాంతి గారికి మూర్తులు చూడమని చెప్పాను నీకు ఏది కన్వినెంట్ అయితే అదే ఓకే చేద్దాం అంటాడు మాయ వాళ్ళ నాన్న. అంతలోనే అక్కడికి వచ్చిన విక్కీ వాళ్ళని పలకరిస్తాడు. పెళ్లి ముహూర్తాలు కోసం వచ్చారని తెలుసుకొని షాక్ అవుతాడు. డాడీ వాళ్లకి ఏ డేట్ అయినా ఓకే కానీ నీ డెసిషన్ ఫైనల్ అంటుంది మాయ. విక్రమాదిత్య పెళ్లి అంటే విఐపి లు చాలా మంది వస్తారు కదా ఏర్పాట్లు అవి చేసుకోవాలి అందుకే అందుకే మీరు డేట్ ఏదో ఫిక్స్ చేస్తే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం అంటాడు మాయ తండ్రి.
విక్కీ ప్రవర్తనకి బాధపడిన మాయ తండ్రి..
అంతలోనే ఫోన్ రావటంతో వెళ్ళిపోతాడు విక్కీ. ఏదో అర్జెంట్ ఫోన్ అయి ఉంటుంది అని విక్కీ ని కవర్ చేస్తుంది మాయ. నేను మాట్లాడి మీకు ఏ విషయము చెప్తాను మావయ్య అని అరవింద అంటుంది అప్పుడు మాయ వాళ్ళ తండ్రి అక్కడి నుంచి పనున్నది అంటూ వెళ్ళిపోతాడు. కోపంతో గదిలోకి వచ్చిన విక్కి నా జీవితం ఎందుకు ఇలాగున్నది నా ప్రమేయం లేకుండా పనులు ఎందుకు ఇలా అవుతున్నాయి.
నా మనసులో ఏమున్నదో ఎవరో ఎందుకు అర్థం చేసుకోవడం లేదు నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తే నాతో పాటు మాయ కూడా సఫర్ అవుతుంది. దీనికి శాశ్వత పరిష్కారమే లేదా ఇదంతా పద్మావతి వల్లే వచ్చింది దాంతోనే తేల్చాలి అని అనుకుంటాడు విక్కీ ఆ తర్వాత సీన్లో పార్వతి అన్నం వండుతూ కిందటిసారి అను పెళ్లి దొడ్లు లేవని ఆగిపోయింది ఇప్పుడు కూడా దొడ్లు కావాలంటున్నారు అసలు ఏమవుతాడో అని బాధపడుతుంది.
Nuvvu Nenu Prema January 12 Today Episode
అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆర్య సార్ అక్క సరి జోడి కదా ఇద్దరికిద్దరూ బలే ఉంటారు అక్కని బాగా అర్థం చేసుకుంటారు ఆర్య సారులాంటి మనిషి రావడం అక్క అదృష్టం అని అంటుంది. తరువాయి భాగంలో పద్మావతి విక్కీ వాళ్ళ ఇంటికి వస్తుంది ఈయనకు కనిపించక ముందే ఆర్య సార్ దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్పాలి అనుకుంటుంది పద్మావతి. పద్మావతిని గమనించిన విక్కీ ఆమెని ఆపి మంచినీరిచ్చి ఇక నీతో అసల విషయం మాట్లాడుతాను అంటాడు.