Nuvvu Nenu Prema January 17 Today Episode: ఈరోజు ఎపిసోడ్లో మీరు పెళ్లి వద్దంటే అందరూ బాధపడతారు కానీ మాయ మేడం జీవితం ఏమైపోతుందో చెప్పండి. తనకి న్యాయం చేయవలసిన మీరే అన్యాయం చేస్తే ఎలా ఉంటుంది పద్మావతి. వింటున్నాను కదా అంటూ లెక్చర్స్ ఇవ్వాలని చూడొద్దు అంటూ కేకలు వేస్తాడు విక్కీ.

విక్కీకి కండిషన్ పెట్టిన పద్మావతి..

ఫైనల్ గా నేను చెప్పింది చేస్తావా చేయవా అంటూ డిమాండ్ చేస్తాడు. కూల్ అవ్వండి సార్ ముందు నేను చెప్పేది వినండి. మీరు చెప్పింది నేను వినాలి అంటే నేను చెప్పింది మీరు చేయాలి అంటుంది పద్మావతి. ఏం చేయాలి అని విక్కి అడిగితే మాయ మేడంతో క్లోజ్ గా మూవ్ అవ్వాలి దాని మీద చిరాకు పడకూడదు,కోప్పడకూడదు. అలా కలిసి మెలిసి కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత అప్పుడు కూడా మీకు మాయ మేడం మీద ఇంట్రెస్ట్ లేకపోతే అప్పుడు నేను మీకు మాయ మేడమ్ తో పెళ్లి జరగకుండా చేస్తాను.

ఒకవేళ ఇద్దరూ కలిసి మెలిసిపోయారు అనుకోండి వెంటనే మీ ఇద్దరి పెళ్లి నేనే చేస్తాను అంటుంది పద్మావతి. మాయ విషయంలో నాకు క్లారిటీ రావాలంటే పద్మావతి చెప్పినట్టు చేయటమే బెటర్ అనుకుంటాడు విక్కి. సరే అని విక్కీ అంటే మీరు ఎక్కడ నో అంటారు అని చాలా టెన్షన్ పడ్డాను. ఇంకా తొందర్లోనే మీరు మాయ మేడం మనసు ఏంటో తెలుసుకుంటారని నమ్మకం నాకు వచ్చింది. తనమీద కోప్పడకూడదు చిరాకు పడకూడదు కలిసిమెలిసి ఉండాలి ఓకేనా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మావతి.

నాకు పెళ్లొద్దు అంటూ షాక్ ఇచ్చిన అను..

టెంపరోడు, మాయా మేడమ్ ని పెళ్లి చేసుకుని లాగా చూడు అంటూ దేవుడికి దండం పెట్టుకుంటుంది. మరోవైపు అత్త తల్లి మాట్లాడుకోవడం వింటుంది అను. తలా తాకట్టు పెట్టైనా ఈ పెళ్లి జరిపించాలి కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఈ పెళ్లి చేయగలమా అంటూ భయం వేస్తుంది అంటుంది పార్వతి. కానీ అను సంతోషం కోసం తప్పదు కదా ఆ శ్రీనివాసడే దారి చూపిస్తాడు అంటుంది అనువాళ్ళ అత్త. నా సంతోషం కోసం అమ్మ వాళ్ళు బాధపడకూడదు అనుకుంటూ తల్లి దగ్గరికి వచ్చి నాకు ఈ పెళ్లి వద్దు అంటుంది అను.

ఆ మాటలకి షాక్ అయినా పార్వతి ఏమైంది అని అడుగుతుంది. అయిపోయిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు మన పరువు ఏమవుతుంది అంటుంది వాళ్ళ అత్త. ఒకసారి మా తొందరపాటు వల్ల నీ పెళ్లి ఆగిపోయింది ఇప్పుడు శ్రీనివాసుడి దయవల్ల నిన్ను గుండెల్లో పెట్టి చూసుకునే భర్త దొరికాడు. ఇలాంటి సంతోష సమయంలో అలా ఎలా మాట్లాడగలిగావు అని పార్వతీ అంటే ఒక్కసారిగా మీ అందరిని వదిలి వెళ్లాలంటే ఏదోలాగా ఉంది. అందుకే నేను పెళ్లి మానేసి ఇక్కడే ఉండిపోతాను అని అను అంటుంది.

అక్కకి సర్ది చెబుతున్న పద్మావతి..

అప్పుడు మేము ఇంకా బాధపడతాం ఒకసారి పెళ్లి ఆకపోయినందుకే మా ప్రాణం పోయింది అలాంటిది ఇప్పుడు ఈ పెళ్లి వద్దు అంటే మేము నిజంగానే తట్టుకోలేము అంటుంది పద్మావతి. నీ సంతోషమే మా సంతోషమని బ్రతుకుతున్నాం నువ్వు ఇలా మాట్లాడటం న్యాయమేనా, అయినా నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళేది అత్తారింటికి కాదు ఒక దేవాలయం అక్కడ నిన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాన్న కోరిక కూడా అదే కదా అంటుంది పద్మావతి.

ఆ మాటలకి గరిగిపోయిన అను చెల్లెలి హత్తుకుని ఏడుస్తుంది. నువ్వు నీ పెళ్లి చేసుకుంటేనే మేమందరమే సంతోషంగా ఉంటాము అంటుంది పద్మావతి. మీ సంతోషం కంటే మాకు ఏది ముఖ్యం కాదు అంటుంది పార్వతి. మా అక్కని పెళ్లికూతురు లాగా కాదు రాకుమారు లాగా తయారు చేస్తాను ఎందుకంటే వచ్చేది రాకుమారుడు కదా అంటూ అక్కని ఆటపట్టిస్తుంది పద్మావతి. మరోవైపు బయటికి వెళ్తున్న విక్కీని ఆపీ కొత్త ప్రాజెక్టు డీటెయిల్స్ అన్నీ నీకు పంపిస్తే నువ్వు కనీసం దాన్ని చూడలేదు.

విక్కీ ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న ఆర్య,మాయ..

మనతో డీల్ మాట్లాడ్డానికి వచ్చిన ఫైనాన్స్ వాళ్లతో సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదంట ఏంటిది అంటూ నిలదీస్తాడు ఆర్య. ఇవ్వని కాదు ఆర్య ఆఫీస్ విషయాల్లో కూడా ఏ విషయంలోనూ కాన్సెంట్రేట్ చేయట్లేదు దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అంటుంది మాయ. నేను నెగ్లిజెన్సీ వల్ల మన కంపెనీకి బ్యాడ్ నేమ్ రావటమే కాదు, కంపెనీ డెప్యుటేషన్ కూడా పడిపోతుంది ఇప్పుడైనా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయు అంటుంది మాయ. స్టాప్ ఇట్ మాయ నాకే సజెషన్ ఇస్తారా అంటూ కోప్పడతాడు.

మళ్లీ పద్మావతి అన్న మాటలు తలుచుకొని మాయా కి సారీ చెప్పి ఏదో వర్క్ ప్రెజర్ లో అలా అన్నాను. నా మిస్టేక్స్ ని నేను సరిదిద్దుకుంటాను. మళ్లీ ఇలాంటివి రిపీట్ కానివ్వను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్కీ. విక్కీ ప్రవర్తనకి ఆశ్చర్యపోతారు మాయ, ఆర్య. విక్కీ లో ఈ ప్రవర్తన కొత్తగా ఉంది అని మాయ అంటుంది. విక్కీకి పర్సనల్గా ఏదో జరిగింది అనుకుంటాడు ఆర్య. తనని వేధించే విషయం ఏదో ఉంది అంటూ అనుమాన పడుతుంది మాయ.

పద్మావతి కి అదిరిపోయే సలహా ఇచ్చిన గరుడ..

మరోవైపు ప్రశాంతంగా నిద్ర పట్టక కొట్టుకుంటూ ఉంటారు విక్కి, పద్మావతి. కాస్త చల్లగాలికి పోతే అయినా బాగుంటుందేమో అనుకొని వాకిట్లోకి వస్తుంది పద్మావతి. రాత్రి నిద్ర పోనివ్వకుండా పద్మావతి నన్ను తెగ డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటాడు విక్కీ. ఏమి ఇంకా నిద్ర పోలేదు అని గరుడ అడుగుతాడు. నన్ను ఆ టెంపరడు తిట్టినా తిట్లే గుర్తొస్తున్నాయి ప్రశాంతంగా నిద్ర రావట్లేదు అంటుంది పద్మావతి.

నీకు నిద్ర రాకుండా డిస్టర్బ్ చేస్తున్న టెంపర్ వాడికి ఫోన్ చేసి నువ్వు డిస్టర్బ్ చెయ్యు లేకపోతే సరిపోద్ది అంటాడు గరుడ. నన్ను ఇంత డిస్టర్బ్ చేసిన టెంపరడు హాయిగా పడుకొని ఉంటాడు. ఎలా పడుకుంటాడో నేను చూస్తాను అంటూ అతనికి ఫోన్ చేస్తుంది పద్మావతి. ఈ టైం లో ఎందుకు ఫోన్ చేస్తుంది అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు విక్కి. ఎలా ఉన్నారు అని పద్మావతి అడిగితే ఈద అడగడానికి ఫోన్ చేసావా అని అడుగుతాడు విక్కి.

నీ ఆలోచనలే డిస్టర్బ్ చేస్తున్నాయి అనుకుంటున్న విక్కీ..

మీరు పడుకుంటారో లేదో కనుక్కుందామని ఫోన్ చేశాను. మీరు పడుకున్నారా అని అడుగుతుంది పద్మావతి. పడుకున్నాను లేదో అని చెక్ చేయడానికి ఫోన్ చేసావా అంటూ చిరాకు పడతాడు విక్కీ. మీరు నా ఫోన్ వెంటనే ఎత్తారు అంటే మీకు కూడా నిద్ర రావట్లేదా అంటుంది పద్మావతి. అవును అని విక్కీ అంటే దేనికోసమేనా ఆలోచిస్తున్నారా అంటుంది పద్మావతి. నీకోసమే ఆలోచిస్తున్నాను అందుకే డిస్టర్బ్ ఫీల్ అవుతున్నాను అని మనసులో అనుకుంటాడు విక్కీ.

దేని గురించి ఆలోచించట్లేదు అని ఫోన్ పెట్టబోతుంటే ఎందుకంత కోపం అంటుంది పద్మావతి. నాకేమీ కోపం లేదు అంటూ కోపంగా అంటాడు విక్కి. కోపం లేదంటూ అంత కోపంగా చెప్పక్కర్లేదు సార్ అయినా మీకు ఎదుటి వాళ్ళకి సాయం చేసే మంచి గుణం ఉంది కానీ వీటన్నిటినీ డామినేట్ చేస్తూ కాస్త కోపమే ఎక్కువగా ఉంది. అందుకే మీరు టెంపరోడు అయి ఉన్నారు అంటుంది పద్మావతి. మీ టెంపర్ తగ్గించుకుంటే చాలా బాగుంటారు ఒకసారి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి నవ్వితే ఎంత బాగుంటారో మీకే తెలుస్తుంది అంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema January 17 Today Episode: పద్మావతి మాటలకు ఇంప్రెస్ అవుతున్న విక్కీ..

అలా మాట్లాడుతూ ఉండగానే అద్దం ముందుకు వెళ్లి చెక్ చేసుకుంటాడు విక్కి. కోపంతో చేయలేని చాలా పనులు ఒక్క చిరునవ్వుతో చెయ్యొచ్చు. నువ్వు నలుగురితో బంధాన్ని ఏర్పరుస్తుంది. నీ మొహం లో నవ్వుని ఆనందాన్ని చూడాలని కదా అరవింద గారు ఎంతో బాధ పడుతున్నారు. ఆనందం మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటుంది పద్మావతి. ఆ మాటలకి ఇంప్రెస్ అయిపోయిన విక్కి ఏమి మాట్లాడకుండా తన మాటల్ని వింటూ ఉంటాడు.

విక్కీ ఏమీ మాట్లాడకపోవటంతో కొంపదీసి పడుకుండిపోయారా అంటుంది పద్మావతి. తరువాయి భాగంలో అందరూ భోగిమంటల ముందు డాన్స్ వేస్తూ ఉంటారు. అందంగా ముస్తాబయి వచ్చిన పద్మావతిని తన్మయత్వంతో చూస్తూ ఉండిపోతాడు విక్కి.