Nuvvu Nenu Prema January 21 Today’s Episode: ఈరోజు ఎపిసోడ్లో ఇప్పుడు వద్దు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చి మాట్లాడుతాను మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్పండి అని అంటుంది పద్మావతి. సరే అప్పుడు ఆయన సప్రైజ్ గా ఫీల్ అవుతారు అని అంటుంది అరవింద. ఆ తర్వాత సీన్లో అను చెట్టు దగ్గర ఉండగా ఆర్య అక్కడికి వస్తాడు ఎందుకు ఇక్కడే ఉండమన్నారు అని అను అనగా నీ కోసం కానుక తెచ్చాను.
అను కి కానుక ఇచ్చిన ఆర్య..
మనం ఇద్దరం కలిసి చేసుకుంటున్న మొదటి సంక్రాంతి కదా ఇది అని చెప్పి తనకి గాజులు ఇస్తారు. గాజులు చాలా బాగున్నాయి అని అనగా నా స్వీట్ హార్ట్ కోసం చాలా కష్టపడి వెతికి తెచ్చాను వేసుకోవాలి అనగా నేను వేసుకోను అని అను అంటుంది. ఏమీ అని అడుగుతాడు ఆర్య. మీరే వేయండి అని అనగా ఆర్య అనుకి గాజులు తొడుగుతాడు ఇంతలో ముద్దు పడడానికి వస్తున్నప్పుడు అను ఒక్కడి నుంచి పారిపోతుంది.
ఆ తర్వాత సీన్లో కుటుంబ సభ్యులందరూ మాట్లాడుకుంటూ ఉండగా విక్కి అక్కడికి వస్తాడు. పద్దు వైపు చూస్తాడు కానీ పద్మావతి తన వైపు చూడదు కనుక దగ్గుతున్నట్టు నటిస్తాడు. ఇంతలో ఏమైందిరా తగ్గుతున్నావు అని అడగగా సీజన్ మారింది కదా జలుబు చేసినట్టుంది టాబ్లెట్ ఇస్తాను అని అంటుంది అరవింద. వద్దు తల నొప్పి గా ఉంది
వెళ్లి కాఫీ తే పద్మావతి అని అంటాడు విక్కీ.
పద్మావతికి చీర ఇవ్వాలనుకున్న విక్కి..
నువ్వు వెళ్ళు మాయ అని కుచల అనగా వద్దు పద్మావతికి చెప్పాడు కదా తంతేస్తుందిలెండి అని అంటుంది మాయ. పదువెళ్ళి కాఫీ పెట్టేలోగా విక్కి తన గది దగ్గరకు వచ్చి నువ్వు ఈ మధ్య నాకు కోసం తీసుకుంటున్న కేర్ నాకు బాగా నచ్చింది పద్మావతి. అందుకే నేను నీకు ఒక కానుక కొందాం అనుకున్నాను చాలా కష్టపడి వెతికి ఈ చీర ఎంచాను ఎలాగైనా నీకు ఇవ్వాలి. అందరి మధ్య ఇస్తే మళ్లీ వాళ్ళు నన్ను ఒక ఆట ఆడుకుంటారు అని అనుకుంటాడు.
చీర తనకోసం తెచ్చాడు అనుకున్న మాయ..
ఇంతలో పద్మావతి కాఫీ పట్టుకుని అక్కడికి వస్తుంది నిజానికి నాకు తలనొప్పి లేదు అని అంటాడు విక్కీ. ఇంతలో మాయ అక్కడికి వస్తుంది తలనొప్పి తగ్గిందా అని అంటూ చేతిలో ఉన్న చీరను చూసి చీర చాలా బాగుంది విక్కీ. నా కోసమేనా నువ్వు నాకోసం సర్ప్రైజ్ ఇస్తావని నాకు తెలుసు కానీ అందరిలో ఇవ్వడానికి సిగ్గుపడి పద్మావతి చేతిలోకి ఇద్దాం అనుకున్నావా నేను ఇప్పుడే వెళ్లి అందరికీ చూపిస్తాను అని విక్కీ చంప మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది.
కుచలను ఎర వేస్తున్న కృష్ణ..
పద్మావతి అక్కడ మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో మాయ బయటకు వెళ్లి అందరికీ చీరను చూపిస్తుంది. అందరూ చూసి ఆనందిస్తారు. ఆ తర్వాత సీన్లో కృష్ణ మందు తాగుతూ పండక్కి కొత్త అల్లుళ్లు రావాలి అలాంటప్పుడు పద్మావతి లేకుండా నేను వెళ్తే బాగోదు. ఎలాగైనా పద్మావతిని అక్కడి నుంచి పంపించేయాలి అని అనుకోని కుచల అత్తను నిప్పు వెలిగించమందాము అనుకుని ఫోన్ చేస్తాడు.
మీరు పెద్ద ఇంటి సంబంధాలు తెమ్మంటున్నారు అక్కడ అనుని ఆర్య ని ఒకటి చేస్తున్నారు .ఆ పద్మావతి ఉంటుండగా వాళ్ళు ఎప్పటికీ విడిపోలేరు ముందు వాళ్ళిద్దర్నీ ఇంటి నుంచి బయటకు పంపించే ప్రయత్నం చూడండి అని అంటాడు. దానికి కుచల ఇంకా ఆ పని మీదే ఉంటాను అని అంటుంది. ఆ తర్వాత సీన్లో అను పద్మావతిలు తొక్కుడు బిళ్ళ ఆడుతూ ఉండగా అక్కడికి మాయ, అరవింద వస్తారు.
Nuvvu Nenu Prema January 21 Today’s Episode: తొక్కుడు బిళ్ళ ఆడుకుంటున్న అక్కాచెల్లెలు..
నీకు ఏమైనా కాళ్లు నొప్పి పెడుతుందా అలాగ నడుస్తున్నావు అని మాయ అనగా లేదు ఇది ఆట ఇలాగే ఆడతాము అని అంటాది అరవింద. అప్పుడు పద్మావతి మీరు పట్టణంలో పుట్టి పెరిగారు కదా ఇలాంటి ఆటలు మీకు తెలియదు అని అనగా ఈ ఆట అంత ప్రత్యేకమైనది, ఫేమస్ అయ్యుండదు లెండి అందుకే నాకు తెలియలేదు అని అంటుంది మాయ. దానికి అందరూ ఆశ్చర్యపోయి తెలుగింటి లో తరతరాలుగా వస్తున్న ఆట ఇది.
అందరూ ఆడతారు కావాలంటే నేర్పిస్తాను చాలా సరదాగా ఉంటుంది అని అంటుంది. సరే నేర్పించు అని అంటుంది మాయ. రేపటి ఎపిసోడ్లో అరవింద నూనె మీద జారి పడిపోతుండగా పద్దు వచ్చి పట్టుకుంటుంది. అక్కడ నూనె ఎవరి పోసారు అని విక్కీ కోపంగా అడగగా ఈ అక్కాచెల్లెళ్ళు ఇందాక దీపపుకుందెలను అమరచడం నేను చూశాను అని కుచల అంటుంది.
దీపాన్ని మేము అమర్చాము కానీ నూనె మేము వేయలేదు అని పద్దు అనబోతుండగా ఇదంతా నీ కారణంగానే జరిగింది పద్మావతి అని అరుస్తాడు విక్కీ.