Nuvvu Nenu Prema January 23 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మాయ మేడం మీరు బాగా ఆర్డర్ అక్క ఇప్పుడు నీ వంతు అంటూ అనుని ఆడమంటుంది పద్మావతి. ఆడుతూ పడిపోతున్న అనుని పట్టుకుంటాడు ఆర్య. అది చూసి అందరూ నవ్వుకుంటారు. మరోవైపు అక్కడికి వచ్చిన కుచల, కృష్ణ చెప్పింది నిజమే వీడు ఇక్కడ ఉంటే నేను అనుకున్నది జరగదు అంటూ వాళ్ల దగ్గరికి వచ్చి ఆర్యతో అనుని వదలమని చెప్తుంది.
కొడుకుని మందలిస్తున్న కుచల..
ఆడవాళ్ళ ఆటల్లో దూరతావ్ ఏంటి అని కొడుకుని మందలిస్తుంది కుచల. అను పడుకో పోతుంటే పట్టుకున్నాను అంటాడు ఆర్య. వాళ్లు పడుకోరు మిమ్మల్ని పడగొడతారు అయినా మీరు పిక్నిక్ వచ్చారా, పండగకి కి వచ్చారా అంటూ అక్కడున్న అందర్నీ మందలిస్తుంది. వీళ్ళని చూసి మన మాయ కూడా మారిపోతుంది అయినా ఇలాంటివన్నీ విక్కికి ఇష్టం ఉండదు కదా, విక్కీ మాయని కోప్పడితే బాధపడేది మాయనే అంటుంది కుచల. అలా ఏమీ జరగదు అయినా మాయ ఇష్టపడే ఆడుతుంది చాలా సంతోషంగా ఉంది అంటుంది అరవింద.
అవునండి చాలా ఎక్సైటింగ్ గా ఉంది అంటూ ఆనందంగా చెప్తుంది మాయ. సాయంత్రం అమ్మవారికి పూసింది కదా దానికి దీపక్ కుందులు కడిగి శుభ్రం చెయ్యు అంటుంది కుచల అత్తగారు. నాకు వేరే పని ఉంది అంటే పర్వాలేదు బామ్మ గారు నేను, మా అక్క చేస్తాము అంటుంది పద్మావతి.పద్ధతి మర్యాద అంటే ఇది, పెద్దరికం అనేది మాటల్లో కాదు చేసి చూపించే చేతల్లో ఉంటుంది అది నీకు ఎప్పటికి వస్తుందో అర్థం కాదు అంటూ కుచలని మందలిస్తుంది ఆమె అత్తగారు.
ఇల్లరికం కావాలంటున్న పద్మావతి..
ఆ మాటలకి నవ్వుకుంటుంది పద్మావతి. మీరు దీపపు కుందులు రెడీ చేస్తూ ఉండండి, నేను మిమ్మల్ని లగేజీ సర్ది పంపించే ఏర్పాట్లు చేస్తాను అనుకుంటుంది కుచల. మరోవైపు దీపపు కుందులు శుభ్రం చేస్తూ ఈ కుటుంబంతో పండగని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటుంది అను. నాకు కూడా ఆనందంగా ఉంది అంటుంది పద్మావతి. నాయనకి అలా కాకుండా ఉండి ఉంటే ఈ ఆనందాన్ని వాళ్లు కూడా చూసేవారు కదా అంటూ బాధపడుతుంది అను.
నువ్వు ఇక్కడ బాధపడితే అక్కడ వాళ్ళు బాధపడతారు అంటూ అక్కని ఓదార్చుతుంది పద్మావతి. అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండు అని అక్కతో అంటే నువ్వు కూడా నాలాగా మంచి కుటుంబానికి కోడలుగా పోవాలి. నిన్ను అర్థం చేసుకునే వాడే నీకు భర్తగా రావాలి అప్పుడు నేను ఇంకా ఆనందంగా ఉంటాను అంటుంది అను. పెళ్లి చేసుకొని నేను ఫోను ఎంత రాజ కుమారుడైనా ఇల్లరికం రావాల్సిందే అంటుంది పద్మావతి. అది ఎట్లా కుదురుతుంది అను.
నా నిర్ణయం మార్చుకోనంటున్న పద్మావతి..
పద్మావతి ఇక్కడ తగ్గేదే లేదు, ఈ విషయంలో నా నిర్ణయం మార్చుకోను అంటుంది పద్మావతి. అలా అయితే ఇప్పుడు నీ రాకుమారుడు ఎక్కడ ఉన్నాడో అంటుంది అను. టైం వచ్చి నప్పుడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు అంటుంది పద్మావతి. తర్వాత ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడికి వచ్చిన కుశల ఇందాకటి నుంచి వీళ్ళ ఇక ఇకలు,పక పకలు భరించలేకపోతున్నాను నూనె పోసేస్తుంది అను కాలుజారి పడిపోతే తనని ఇక్కడి నుంచి పంపించేస్తారు కదా అనుకుంటుంది.
అని అనుమానపడితే శుభ్రం చేసింది వాళ్లే కాబట్టి నెపం వాళ్ల మీదకే వెళ్ళిపోతుంది అంటూ సంతోషపడుతుంది కుచల. అంతలోనే అటువైపుగా వచ్చిన అనుని ఆర్య పక్కకి తీసుకొని వెళ్ళిపోతాడు. ఏంటి తినగా పక్కకి బ్లాక్ కొచ్చారు నాకు చాలా పనులు ఉన్నాయి అంటుంది అను. నాక్కూడా నీతో చాలా పని ఉంది. ఒక న్యూస్ చెప్తే నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు. మా కుటుంబ గౌరవాన్ని పెంచే ఉత్తమమైన కోడలు అన్నింటికీ మించి అదృష్ట దేవతవి అంటాడు ఆర్య.
నేను అదృష్టవంతురాలని అంటున్న అను..
ఏంటి పొద్దున్నే పొగడ్తలు మొదలుపెట్టారు అని మాయ అంటే ఇది నా మాటలు కాదు మా నాన్న అన్న మాటలు అంటాడు ఆర్య. మావయ్య గారు నా గురించి అంతా గొప్పగా చెప్పారా అంటూ ఆనంద పడిపోతుంది అను మరి నా సెలక్షన్ అంటే ఏమనుకున్నావు వంక పెట్టడానికే లేదు అందుకే నిన్ను వెంటపరిమరీ దక్కించుకున్నాను అంటాడు ఆర్య. అదృష్టం నీది కాదు నాది ప్రేమగా చూసుకునే మీరు, కూతురి లాగా అభిమానించే మావయ్య గారు, అర్థం చేసుకునే మంచి కుటుంబం ఇంతకంటే నాకు ఏం కావాలి అంటుంది అను. మనం కొంచెం అడ్జస్ట్ అయ్యి ఉండే పాపను బాబును అనేసి మా నాన్నకి ఇచ్చేస్తే అయినా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటాడు ఆర్య.
అన్నీ పెళ్లయిన తర్వాతే అంటుంది అను. మావయ్య సంగతి సరే కానీ అత్తయ్య గారి పరిస్థితి ఏంటి, తనకి నేనంటే ఇష్టం లేదు కదా మన విషయంలో తను ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అను. అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు బాధ పడొద్దు, అందరి గురించి ఆలోచిస్తున్నా కానీ నా గురించి ఆలోచించట్లేదు అంటాడు ఆర్య. మరోవైపు మాట్లాడుకుంటూ నూనె మీద కాలు వేసి పడిపోతున్న అరవింద ని అక్క, చెల్లెలు ఇద్దరు పట్టుకుంటారు.
కోపంతో రగిలిపోతున్న విక్కీ..
అది చూసిన కుచల అయ్యో అరవింద పడిపోయింది నేను ఒకటంటే ఇంకొకటి జరిగింది అయినా పర్వాలేదు ఇప్పుడు ఒకే దెబ్బకి రెండు పెట్టను అనుకుంటే అరవింద దగ్గరికి వస్తుంది. ఇంతలో కుటుంబ సభ్యులందరూ వచ్చి ఏం జరిగింది అని అడుగుతారు. ఏమీ లేదు నూనె మీద కాలు వేసి పడిపోబోయేను అంటుంది అరవింద. అంత సింపుల్గా అంటావేంటి కాలుజారి నీకేమీ కాలేదు కాబట్టి సరిపోయింది, అదే జరగడానికి ఏమైనా జరిగి మీ ప్రాణానికి ఏమైనా అయి ఉంటే అని కుచల అంటుండు గానే ఆమె మీద పెద్దగా కేకలు వేస్తాడు విక్కీ.
ఆ అశుభం మాటలు ఏంటి అంటుంది కుచల అత్తగారు. అసలు ఇక్కడ ఆయిల్ ఎవరికోసారు అంటాడు విక్కీ. శుభ్రం చేస్తూ ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరే నూనె పోసారు కుందుల్ల మానేసి కింద పోసారేమో అంటూ వెటకారంగా అంటుంది కుచల. మేము నూనె పోయలేదు అని పద్మావతి అంటే మేమే కావాలని పోసామంటావా అంటుంది కుచల. సంజాయిషీ తెచ్చుకోబోతున్న పద్మావతి మీద కేకలు వేస్తాడు విక్కీ. నువ్వే అంటే నీ వల్లే తప్పు జరిగింది నీ వల్లే మా అక్కకి ప్రమాదం జరగబోయేది.
బాధతో కన్నీరు పెట్టుకున్న పద్మావతి..
తనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను, నాకు మా అక్క అంటే ప్రాణం అలాంటిది ఈరోజు మీ నెగ్లెజెన్సీ వల్ల ప్రమాదం జరగబోయింది అవునా కాదా మాట్లాడు అంటూ కేకలు వేస్తాడు. నాకేమీ కాలేదు కదా ఎందుకంత కోపం అంటుంది అరవింద. ఏమి కాలేదు కాబట్టే పద్మావతి ఇంకా నా ఎదురుగుండా నిలబడి మాట్లాడుతుంది. అదే ఏదైనా జరిగి ఉంటే తనని ఏం చేసే వాడినో నాకే తెలియదు.
పద్మావతి చెప్తున్నది వినిపించుకోకుండా ఇది ముమ్మాటికీ నీ తప్పే నన్ను కన్విన్స్ చేయాలని చూడొద్దు, అసలు నీకు చేతకాని పనిని నువ్వెందుకు చేయాలని చూస్తున్నావు, నువ్వు ఏ పని చేసినా దానివల్ల ఎదుటి వాళ్ళు సఫర్ అవ్వాల్సిందే అంటాడు. తప్పొప్పులు తెలుసుకోకుండా మాట్లాడడం సరైనది కాదు అంటాడు విక్కీ వాళ్ళ బాబాయ్. మీరు తనని వెలగేసుకోరా వద్దు తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు అంటాడు విక్కీ.మీకు ఏం తెలుసు తెలిస్తే ఇలాగా మాట్లాడరు అంటుంది పద్మావతి.
Nuvvu Nenu Prema January 23 Today Episode
నువ్వే కదా మరి ఎందుకు ఆర్గు్ చేస్తున్నావు, నీకు బాధ ఇష్టం తప్పితే ఎదుటి వాళ్ళ బాధతో నీకు సంబంధం లేదు అంటూ ఆవేశ పడతాడు. ఎందుకు అంత ఆవేశపడతావు ఏదో పొరపాటుగా జరిగి ఉంటుంది అంటాడు ఆర్య. పొరపాటున అయినా కూడా అక్కకి ఏమైనా అయితే పరిస్థితి ఏంటి? మళ్లీ మళ్లీ ఈ తప్పు జరగదని గ్యారెంటీ ఏంటి? అంటూ ఆవేశపడతాడు విక్కీ. తరువాయి భాగంలో ఇంటికి వెళ్ళిపోతున్న పద్మావతి వాళ్ళని దారిలో అడ్డగించి పద్మావతికి సారీ చెప్తాడు విక్కీ.