Nuvvu Nenu Prema: అక్క సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే ఒక చెల్లెలి కథ ఈ నువ్వు నేను ప్రేమ.
భోజనానికి పిలిచిన అక్కతో నాకు ఆకలిగా లేదు నేను రాను అంటుంది పద్మావతి. ఎందుకు అని అడిగితే విక్రమార్ తీ గారితో గొడవపడ్డాను అని తెలిస్తే బాధపడుతుందని అబద్ధం చెప్పేస్తుంది పద్మావతి. నువ్వు నా కోసమే బాధపడుతున్నావు, నువ్వు బయటపడుతున్నావు నేను బయటపడలేక పోతున్నాను అసలు నాకు ఈ పెళ్లి వద్దు అంటుంది అను. అలా అనుకో ఒకసారి నీ పెళ్లి అయిపోయి ఇంట్లో అందరూ ఇబ్బంది పడ్డారు.
ఇప్పుడు మళ్లీ ఆగిపోతే ఎవరూ బ్రతకరు అని చెప్పి ఒప్పిస్తుంది పద్మావతి. రెండు రోజుల నుంచి పద్మావతి రాకపోవడంతో ఏం జరిగిందో అని పద్మావతి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఆమెని తన ఇంటికి రమ్మని చెప్తుంది అరవింద. పార్వతి పద్మావతిని విక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళమంటే నేను వెళ్ళను అంటుంది. పెళ్లి విషయం మాట్లాడడానికి అయి ఉంటుంది, మనం ఆడపిల్ల తరుపు ఒక మెట్టు దిగి ఉండాలి, మనం చేసే ఏ పని అయినా మీ అక్క జీవితానికి ముడిపడి ఉంటుంది అని పద్మావతిని ఒప్పిస్తుంది పార్వతి.
భయపడుకుంటూనే విక్కీ వాళ్ళ ఇంటికి వెళ్లిన పద్మావతిని సిగ్గు లేకుండా ఎందుకొచ్చావ్ అని అడుగుతాడు విక్కీ. అరవింద్ గారు ఫోన్ చేస్తే వచ్చాను అయినా నేను ఏ తప్పు చేయలేదు అందుకే తల ఎగరేసుకొని తిరుగుతున్నాను అంటుంది పద్మావతి. ఎందుకు రెండు రోజుల నుంచి ఇంటికి రాలేదు అని అరవింద్ అడిగితే నిజం చెప్పలేక తలనొప్పి అనేస్తుంది.
నువ్వే అందరికీ తలనొప్పి నీకు తలనొప్పా అని వెటకారంగా అంటుంది కుచల. మరోవైపు పూజ చేయించిన అనువల్ల నానమ్మ ప్రసాదాన్ని పద్మావతి వాళ్ళకి ఇమ్మంటుంది. అరవింద ఆర్యని పిలిచి ఆ పని అతనికి అప్పజెప్తుంది. అది ఇష్టలేని కుశల తను కూడా కొడుకు వెంట బయలుదేరుతుంది. ఇంటికి వచ్చిన పద్మావతిని ఎందుకు రమ్మన్నారు అంటే నన్ను చూడాలనిపించింది అంట అందుకే రమ్మన్నారు అంటుంది పద్మావతి.
ఆ మాటలు నమ్మని వాళ్ళ అత్త నిజం చెప్పమంటే నిజమే చెబుతున్నాను అందుకే పిలిచారు అంటుంది. అందులోనే వచ్చిన కృష్ణ సినిమాకి వెళ్దాం రమ్మంటాడు. అత్త బలవంతం మీద సినిమాకి వెళ్లడానికి ఒప్పుకుంటుంది పద్మావతి. అంతలోనే ఆర్య వాళ్ళు రావడం గమనించి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు కృష్ణ. ఇంటికి వచ్చి ఆర్యతో అను మాట్లాడే విధంగా డాబా మీద ఏర్పాటు చేస్తుంది పద్మావతి. కాసేపు తర్వాత తను కూడా వెళ్తుంది.
కింద కుచల మాత్రం మా వాళ్ళు వెర్రి వాళ్ళు, మీరు చనువు ఇస్తే చంకనెక్కుతారని వాళ్ళకి తెలీదు అందుకే మా స్థాయికి తగ్గట్టుగా మీరు పెళ్లి చేయాలి లేకపోతే మీ కూతురు మీ ఇంటికే కాపురానికి వస్తుంది అని బెదిరిస్తుంది. డాబా మీద ఆర్య,అను మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో విక్కీ ఫోన్ చేస్తాడు. మీరు ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటే మీరిద్దరూ ఎప్పుడు మాట్లాడుకుంటారు ఆ ఫోన్ నాకు ఇవ్వండి అని చెప్పి తను మాట్లాడుతుంది పద్మావతి.
అయితే తనకి ఆ ఫోన్ విక్కీ చేశాడని తెలియదు. ఆర్యా ఏ మాట్లాడుతున్నాడు అనుకోని వికీ పద్మావతిని తిడుతుంటాడు. నన్ను ఎందుకు తిడుతున్నావు అని పద్మావతి కూడా విక్కిని తిడుతుంది. ఎందుకు వచ్చిన తర్వాత అమ్మ మధ్యాహ్నం గా ఉండడాన్ని గమనించిన పద్మావతి ఏం జరిగింది అని అడుగుతుంది. విషయం చెప్పబోతున్న పద్మావతి వాళ్ళ అత్తని ఆపేస్తుంది పార్వతి.
మరోవైపు ఆర్య కి డబ్బున్న సంబంధం కాకుండా మామూలు సంబంధం చూసినందుకు అత్తగారిని, అరవింద్ని నిష్ఠూరం ఆడుతుంది కుచల. అను లాంటి భార్య దొరకడం వారి అదృష్టం అని అరవింద అంటే కాదు మాయా లాంటి పిల్ల దొరకడం అదృష్టం కావాలంటే చూడండి పెళ్లికి ముందే కాబోయే భర్తకి ఎంత సేవ చేస్తుందో అంటుంది కుచల. మరోవైపు మాయ విక్కీకి జ్యూస్ తీసుకుని వెళ్లి ఇస్తుంది. అప్పటికే ఫ్రస్టేషన్లో ఉన్న విక్కీ నన్ను అడగకుండా మ్యారేజ్ ఎందుకు అనౌన్స్ చేశారు అంటూ మాయ మీద విరుచుకుపడతాడు.
Nuvvu Nenu Prema:
నువ్వు మారిపోయావు అని మాయ అంటే, మారింది నేను కాదు విక్కీ నువ్వే నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటూ ఏడుస్తుంది మాయ. తనని కన్విన్స్ చేసి ఆమె తెచ్చిన జ్యూస్ తాగుతాడు విక్కీ. నా ద్వారా చెప్తే తను తట్టుకోలేదు అందుకే ఎలాగైనా పద్మావతి ద్వారా చెప్పించాలి అని అనుకుంటాడు విక్కి. మరోవైపు కుచల అక్క పెళ్లి కోసం ఎక్కువగా డబ్బు డిమాండ్ చేసినట్లు అత్త, అమ్మ మాట్లాడుకుంటుంటే విని తెలుసుకుంటుంది పద్మావతి.
కాన్సెప్ట్ బాగున్నా కధ ముందుకు వెళ్ళటం లేదు అంటున్న ప్రేక్షకులు..
ఈ విషయం ఎలాగైనా ఆర్య
గారితో మాట్లాడాలని వాళ్ళ ఇంటికి వెళుతుంది. పద్మావతి తన పరిస్థితిని ఆర్యతో చెప్తుందా?విక్కి తను అనుకున్నది పద్మావతి చేత చేయించగలడా? మధ్యలో మాయా పరిస్థితి ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.